Kriya 2 Omkaara kriya in Telugu
ఓం శ్రీ యోగానంద గురు పరబ్రహ్మణేనమః
గమనిక: గురుముఖతః ఇది నేర్చుకొనుట అతిఉత్తమము.
క్రియ 2 ఓంకారక్రియ:
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను
నిఠారుగా
ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో,
జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ
వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి
వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. దీనినిఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును.ఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును.
మూలాధారచక్రము మీద
ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మూలాధారచక్రము మీద ఉంచాలి. రెండు చెవుల రంధ్రములు
రెండు బొటనవ్రేళ్ళతో మూసుకొనవలయును. నేత్రములు
మూసుకొనవలయును. కనుకొనలను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నొక్కివుంచవలయును. మిగిలిన వ్రేళ్ళను
నుదురుమీద ఉంచవలయును. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నాలుగు
పర్యాయములు క్లాక్ వైజ్(clockwise) గా ‘ఓం’ అని
మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.
ఇప్పుడు స్వాధిష్ఠానచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి స్వాధిష్ఠానచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఆరు

ఇప్పుడు మణిపురచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మణిపురచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పది

ఇప్పుడు అనాహతచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి అనాహతచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పన్నెండు

ఇప్పుడు విశుద్ధచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి విశుద్ధచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదహారు

ఇప్పుడు ఆజ్ఞా నెగటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదునెనిమిది

ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఇరువది పర్యాయములు
క్లాక్ వైజ్(clockwise) గా ‘ఓం’ అని మనస్సులో
అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.
ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు అర్థవృత్తము అయినది.
ఇప్పుడు మిగిలిన అర్థవృత్తము ఆజ్ఞా
పాజిటివ్ చక్రమునుండి మొదలు అయినది.

ఇప్పుడు మూలాధారచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మూలాధారచక్రము మీద ఉంచాలి. రెండు
నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నాలుగు పర్యాయములు క్లాక్ వైజ్(clockwise) గా ‘ఓం’ అని మనస్సులో
అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.
ఇప్పుడు మొత్తము వృత్తము పూర్తిఅయినది.
తిరిగి మూలాధారచక్రమునుండి ప్రారంభము చేయవలయును. ఇలా అయిదువృత్తములు మూలాధారచక్రముతో పూర్తిచేయవలయును. ఇప్పుడు ఆరవచక్రము అర్థవృత్తము ఆజ్ఞా పాజిటివ్
చక్రముతో పూర్తి చేయవలయును. ఇప్పడు ఆ ఆజ్ఞా పాజిటివ్ చక్రము అనగా కూటస్థము మీద మనస్సు దృష్టి ఉంచి తీవ్ర ధ్యానము
చేయవలయును.
Comments
Post a Comment