Posts

Showing posts from February, 2019

శ్రీ విద్య ఉపాసన

శ్రీ విద్య ఉపాసన పరాపశ్యంతి   ప్రియా   వైఖరీ శశికళా   శ్రీమంజులా   మధ్యమా   కరుణాకటాక్ష   లహరీ   కాత్యాయనీ   భారతీ దుర్గాంబా   నవకోటిమూర్తి   సహితా   మాంపాహి   మాహేశ్వరీ    వేదాంతము యొక్క సత్యము లేదా గూడార్థము లేక పరమార్థమే అద్వైత సిద్ధాంతము.    ప్రతి ఆలోచన వెనకాల ఉన్న ప్రణవ నాదమయిన ఓంకారము మరియు బీజాక్షరములు దీనిని సమర్థిస్తాయి. వేదాంతము యొక్క ప్రణవనాదము ఓం.   హ్రీం , మరియు అహం అనేవి శక్తి మరియు శివ బీజాక్షరములు. ప్రణవము యొక్క అంతము బిందు అనగా శక్తి. అన్నింటికీ ద్రవ్య కారణము ( material cause)  బిందు అనగా శక్తి. నియమరహితమయిన , మరియు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మన్ లేదా పరమసత్యము నుండే నియమసహితమయిన సత్యములు ( entities) అన్నీ ఏర్పడతాయి.    కనబడుతున్న చరాచర ప్రపంచము అంతయూ   ఈ అనంత మయిన పరాబిందులోని భాగమే. శక్తి ,  శివుడి లోని భాగమే సృష్టి ,  మరియు లయలు.   వైభవము ,   కృప , మరియు సౌందర్యములతో కూడిన ఈ ఆదిశక్తి నిత్యసంతోషి. ప్రతి మనిషి తెలిసో తెలియకో కోరుకునేది ఆనందమే.    ఇదే సనాతన వైదీక ధర్మ సారము. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి ఇతి శుశృమ పూర్వేషాం యేనస్తద్వ్య