రావిచెట్టు - మనిషి
అథ పంచదశోధ్యాయః
పురుషోత్తమప్రాప్తియోగః
రావిచెట్టు - మనిషి
శ్రీభగవానువాచ:--
ఊర్ధ్వమూలమథః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ 15 - 1
శ్రీభగవానుడు చెప్పెను:-
ఓఅర్జునా, దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో, అట్టిసంసారమను రావిచెట్టును పైన వ్రేళ్ళుగలదిగను, క్రింద కొమ్మలుగలదిగను, జ్ఞాన ప్రాప్తిపర్యంతము నాశములేనిదిగను విజ్ఞులు చెప్పుదురు. దానినెవడు తెలిసికొనుచున్నాడో, అతడు వేదార్థము తెలిసినవాడగుచున్నాడు.
మనిషి తలలోని జుట్టు రావిచెట్టువ్రేళ్ళలాగా బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రము మెడుల్లాద్వారా పరమాత్మ చేతనను గ్రహించి, జంక్షన్ బాక్స్(Junction Boxes) లలాంటి తక్కిన ఆరుచక్రములద్వారా శరీరములోని నరకేంద్రములకు, అక్కడినుండి నరములద్వారా ఊపిరితిత్తులు, హృదయము, మూత్రపిండముల లాంటి అవయములకు ఆ చేతన అందించబడుతుంది. అందువలన మనిషిని రావిచెట్టుతో పోలుస్తారు.
Comments
Post a Comment