శ్రీ విద్య ఉపాసన
శ్రీ విద్య
ఉపాసన
పరాపశ్యంతి ప్రియా వైఖరీశశికళా శ్రీమంజులా
మధ్యమా కరుణాకటాక్ష లహరీ కాత్యాయనీ భారతీ
దుర్గాంబా నవకోటిమూర్తి సహితా మాంపాహి మాహేశ్వరీ
వేదాంతము
యొక్క సత్యము లేదా గూడార్థము లేక పరమార్థమే అద్వైత సిద్ధాంతము. ప్రతి ఆలోచన వెనకాల ఉన్న ప్రణవ నాదమయిన ఓంకారము మరియు బీజాక్షరములు దీనిని
సమర్థిస్తాయి.
వేదాంతము
యొక్క ప్రణవనాదము ఓం.
హ్రీం, మరియు అహం అనేవి శక్తి మరియు శివ బీజాక్షరములు.
ప్రణవము
యొక్క అంతము బిందు అనగా శక్తి.
అన్నింటికీ
ద్రవ్య కారణము (material cause) బిందు అనగా శక్తి.
నియమరహితమయిన, మరియు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మన్ లేదా పరమసత్యము
నుండే నియమసహితమయిన సత్యములు (entities) అన్నీ ఏర్పడతాయి. కనబడుతున్న చరాచర ప్రపంచము
అంతయూ ఈ అనంత మయిన పరాబిందులోని భాగమే.
శక్తి, శివుడి లోని భాగమే సృష్టి, మరియు లయలు. వైభవము, కృప, మరియు సౌందర్యములతో కూడిన ఈ ఆదిశక్తి నిత్యసంతోషి.
ప్రతి మనిషి తెలిసో తెలియకో కోరుకునేది ఆనందమే. ఇదే సనాతన వైదీక ధర్మ సారము.
అన్యదేవ
తద్విదితాదథో అవిదితాదథి
ఇతి శుశృమ
పూర్వేషాం యేనస్తద్వ్యాచ చక్షిరే ....కేన 4.1
పరబ్రహ్మము
నిశ్చయముగా తెలిసినదానికంటే భిన్నమయినది. తెలియని దానికంటే అతీతమయినది.
మహాత్రిపుర సుందరీ దేవి అతి
సౌందర్యవతి మరియు జ్ఞానవతి. సృష్టి, స్థితి, మరియు లయకారిణి. వ్యక్తీకరణకు కారణమయిన త్రిగుణములు, మరియు పృథ్వీ, ఆపః, తేజో, వాయు, మరియు ఆకాశము అనే పంచ భూతములకు
అధికారిణి.
స్థూలరూపములో ప్రార్థించే
వారికి త్రిపురభైరవిగా దర్శనమిస్తుంది ఆ అమ్మ. ఆమె నిజమయిన రూపము ఆ అనంతమయిన
పరమాత్మే.
మంత్రధ్యానముద్వారా ఆ అమ్మను
క్రియాశక్తి రూపమయిన శ్రీదేవిగా దర్శించుకొనవచ్చు. దీనిని అనవోపాయ మార్గము అనగా కాంతి మార్గము అంటారు. ఈ ధ్యానమును క్రియ అంటారు. దీనిలో మంత్రమును పునః పునః
బయటికి వినబడునట్లుగా ఉచ్ఛరించుతూ ఉంటారు. శ్రీదేవి శరీరము మంత్రము.
విమర్శనా శక్తి అనేది
ఆత్మావబోధ. దానిద్వారా అమ్మ శరీరమును వర్ణిస్తుంది. సాధకుడి సాధనఫలించి ఆ దేవతా చేతన
లభ్యము అయినప్పుడు దానిని శ్రీవిద్య
అందురు.
ఆ శ్రీవిద్య యొక్క వాచికోచ్చారణ పంచదశిమంత్ర ఉచ్చారణము. దానిని దర్శించుకోవటము అనేది
శ్రీచక్రము.
శ్రేష్ఠతరము, దానికి
సాటులేనిది, అద్భుతము, చేతనా స్వరూపము, మరియు స్వయంప్రకాశీ అయిన అమ్మయే ఆ మహాత్రిపుర సుందరీదేవి. తన చేతనతో ఆ అమ్మ మూడు లోకాలను అనగా కారణ, సూక్ష్మ, మరియు భౌతిక
లోకాలను లోపల బయట ఆక్రమించినది.
ఆ అమ్మయే పరాశక్తి, పరమ శివ, మరియు పరబ్రహ్మ. తీవ్ర, మరియు నిశ్చల సాధనద్వారా ఆ అమ్మ దయతో సాధకుడు
అపరిమితమయిన ఆనందం మరియు ఆఖరి సత్యము తెలుసుకుంటాడు.
పరబ్రహ్మ అనగా పరమాత్మ చైతన్యము
శివ మరియు శక్తి స్వరూపము. అదే ప్రకాశము
మరియు మార్పిడి. శివ మరియు శక్తి
చూడాటానికి రెండు. నిజానికి ఒకే పరమాత్మ
చైతన్యముయొక్క రెండు ముఖములు. ఆత్మ స్వయం ప్రకాశమయినది. దానిలో శివ భావము
అత్యధికముగా ఉండును. దానిలోని రెండవ
భావమయిన స్పందనా భావమే విమర్శన, క్రియ లేక శక్తి. ఈ శక్తిభావము శివభావమునకు లోబడే పనిచేస్తుంది. దీనిలో భౌతిక
మయిన ప్రక్రియ ఉండదు. మానసికమయిన ప్రక్రియదే ప్రధాన పాత్ర.
వ్యర్థమయిన ఆలోచనలనుండి మనకు
మనమే పూర్తిగా ఉపసంహరించు
కొనవలయును. తన మనస్సును తనే చూస్తుండవలయును. దీనినే సహజ సమాధి అందురు. ఇది
క్రియాయోగాములోని హాం సా క్రియయే. ప్రకాశము తెలియజేయడమును శివభావము అంటారు. ఈ
శివభావమే శబ్దము లేక శక్తి భావమును కలగచేయును. మరియు చైతన్యమును కలగచేయును.
పరాశక్తియే అన్ని శక్తులకు
మూలకారణమయిన ప్రప్రథమ శక్తి.
కారణ, సూక్ష్మ, మరియు భౌతిక మూడు పురములకు వలసిన శక్తిని ఒసగు నది, మరియు కారణమయినది కావున
దీనిని త్రిపుర అందురు. బాల అనగా యౌవనము. అది శక్తివంతము. శక్తివలననే సుందరత ప్రకటితమగును గాన దీనిని బాలాత్రిపురసుందరి
అందురు.
కారణ శక్తిని సరస్వతిమాత అని, సూక్ష్మ శక్తిని లక్ష్మి మాత అని, మరియు భౌతికశక్తిని కాళీమాత అని పిలుచు కోవటము పరిపాటి.
సూర్యుడు, మరియు సూర్యకాంతి వేరు వేరు కాదు. అటులనే శివుడు వేరు, ఆయన శక్తి అనగా పరాశక్తి వేరు కాదు. పారిభాషికముగా మనము అర్థము చేసికొనుటకై వేరు వేరుగా చెప్పుకుంటాము.
కారణ, సూక్ష్మ, మరియు భౌతిక మూడు పురములను ప్రకాశించునదే ఈ పరాశక్తి. కారణపురమును గాఢనిద్రావస్థ అని, సూక్ష్మపురమును స్వప్నావస్థ అని, మరియు భౌతిక పురమును జాగ్రతావస్థ అని పేర్కొంటారు.
వ్యష్టిలో భౌతికపురమును
పాతాళలోకము, సమిష్టిలో భూ అనగా
భూలోకము అంటారు.
వ్యష్టిలో సూక్ష్మపురమును
మహాతలలోకము, సమిష్టిలో భువర్ అనగా భువర్లోకము అని,
వ్యష్టిలో కారణపురమును తలాతల, సమిష్టిలో స్వ లోకము అని
పేర్కొంటారు.
ఈ పరాశక్తి పరమాత్మయొక్క మెరుపు
అంటారు. ఇది మానవ శరీరములోని మూడు ప్రదేశములలో అనగా లలాటము, శిరస్సు, మరియు హృదయము లలో జ్ఞానము, క్రియ, మరియు ఇచ్ఛాశక్తులుగాను, ప్రదర్శించ
బడుతుంది. ఆ విధముగా ధ్యానములో తెలియబడుతుంది. ఈ అంతర్గతముగానున్న శక్తులు పూజాసంకేతము, చక్రసంకేతము, మరియు మంత్రసంకేతము, అని మూడు విధములు.
పూజాసంకేతము:
బాలాత్రిపురసుందరి మహావిద్య
యొక్క మొదటి బీజము. అమ్మ తన లలాటములో శోభ, మరియు జ్ఞానశక్తి రూపములో ప్రదర్శిస్తుంది. దానినే సృజనాత్మకశక్తి, లేదా సృష్టి లోని భిన్న రూపములు. ఈ లలాటమునే ఆజ్ఞాచక్రము అందురు. ఈ
ఆజ్ఞాచక్రమును ఇంద్రుని వజ్రాయుధము అందురు. ఇక్కడే మనస్సును దృష్టిని
ఏకాగ్రతచేయవలయును. పరాశక్తి తన ప్రకటత్వమును జ్ఞానముద్వారా తెలియజేయును. పరాశక్తి వ్యక్తీకరించుట అనునది ఒక శబ్ద రూపములో
తెలియబరచును. ఈ నిరంతర అనాహత నాదము శబ్దరూపములో ప్రకటితమగును. ఆ నిరంతర అనాహత నాద శబ్దమునుండి అన్నివిధములయిన
దైనందిన కార్యకలాపాలు ప్రారంభమగును.
ప్రతివ్యక్తియొక్క లలాటము
జ్ఞానము యొక్క సింహాసనమే. స్థూలముగా వ్యక్తియొక్క లలాటము పరిశీలించినయడల ఆ
వ్యక్తియొక్క హావ భావము లను, ఉద్దేశ్యములను, మరియు ప్రవర్తనను గ్రహించుటకు
వీలుబడును. జ్ఞానము అనేది ఆలోచనకు రంగుపులుమును. జ్ఞానశక్తి తనను తను భిన్న
రూపములో వ్యక్తము చేయును. దానికి ప్రతీకయే ఇంద్రధనుస్సు.
మంత్రసంకేతము:
మంత్రసంకేతము యొక్క మార్మికమయిన
(Mystic) బీజముద్వారా దాని ఉద్దేశ్యము
లేదా సంకల్పము తెలియబరచును. విశ్వవ్యాప్తశబ్దబ్రహ్మ నాదము ద్వారా ప్రప్రథమమయిన జ్ఞానము తెలియ చేయును. ఈ
నాదము స్థూలముగా అయ్యి మూడువేదములద్వారా వినబడుతుంది.
ఋగ్వేదములోని ప్రథమ మంత్రము ‘అ’ అక్షరముతో
ప్రారంభమగును.
యజుర్వేదములోని ప్రథమ మంత్రము ‘ఇ’ అక్షరముతో
ప్రారంభమగును.
సామావేదము లోని ప్రథమ మంత్రము ‘అయి’ అక్షరముతో
ప్రారంభమగును.
ఇది స్థితి – జ్ఞానము – ఆనందము అనే బ్రహ్మముయొక్క అంశములను తెలియబరుస్తుంది. అనగా మూడువేదముల సారము
అద్వైతమే.
‘అయి’ అక్షరముతో బిందును కలిసి ‘అయిం’ అవుతుంది. అది
వివిధ రకముల శబ్దములను శాసిస్తుంది. కనుక తనకు సాటిరాని అద్వైతశక్తి తన జ్ఞానముతో ‘అయిం’ మంత్రములో నిక్షిప్తమయిఉంటుంది. ఇదియే సరస్వతీ
జ్ఞానదేవత యొక్క బీజమంత్రము.
వాక్కుయొక్క ప్రథమ రూపము ‘పశ్యంతి’. ఏకాగ్రత అనగా ఆజ్ఞాచక్రము మీద మనస్సు దృష్టి ఉంచాలి.
క్రియాశీల వ్యక్తీకరణకు
సిద్ధమయిన ‘కుండలినీ’ యొక్క ప్రదేశము భౌతిక శరీరములో పొత్తికడుపు, నాభి క్రింద శరీరము. దీనినే
అథోకుండలినీ అంటారు. ముఖ్యమయిన ఇడా, పింగళ, మరియు సుషుమ్న సూక్ష్మనాడులు ఇక్కడే ప్రారంభమవుతాయి.
అవి ప్రారంభమయ్యే ప్రదేశమును యుక్తత్రివేణి అంటారు.
మార్మిక(mystic)నిద్రనుండి జాగృతి చెందిన కుండలినీ సహస్రార వరకు మెరుపులాగా చేరుతుంది.
అప్పుడు దానిని ఊర్ధ్వ కుండలిని అంటారు. ఈ ఊర్ధ్వ కుండలినిని ముక్త త్రివేణి
అంటారు.
కుండలినీ అన్ని రకముల శక్తులకు
మూల యోని. అది సూక్ష్మమయిన కందర్పవాయు, ప్రాణవాయువు కాదు. ఆ కందర్పవాయువు నివాసము మూలాధారచక్రములోని త్రిభుజము. ఇది
ఇచ్ఛాశక్తి, జ్ఞానము, మరియు క్రియాశీలతకు ముఖ్యముగా జ్ఞానమునకు స్థానము. పైన బిందువుతో ఇది
శక్తివంతమయిన బీజమంత్రము. ఈ ‘అయిం’ బీజమంత్రమును పునః పునః ఒక పధ్ధతి ప్రకారము ఉచ్ఛారణ
చేయుటవలన కుండలినీ జాగృతి చెందును.
పూజాసంకేతము ప్రకారము బాల
మహావిద్య యొక్క రెండవ బీజమంత్రము శిరస్సు నుండి అన్ని ప్రక్కలకు వ్యాప్తిచెందు
చంద్రుడి లాంటి స్వచ్ఛమైన, మరియు ధవళ కాంతితో కూడిన క్రియాయాశీలకశక్తి. ఆ
అమ్మని శాంతి, మరియు ప్రేమలతో సంయుక్తమయిన జగన్మాతగా కొలుస్తారు.
శిరస్సు నుండే క్రియాశీలకశక్తి
పనిచేస్తుంది. జ్ఞానమునకు మూలము
ఆలోచన. ఆలోచననుండే క్రియాశీలక శక్తి పనిచేస్తుంది. జ్ఞానము మరియు ఆలోచన రెండూ కలిసి క్రియాశీలకతకు కారణము అగును. క్రియాశక్తి జ్ఞానశక్తిని (predominates) అధిగమిస్తుంది. స్వచ్ఛమైన, మరియు ధవళ కాంతితో
కూడిన చంద్రకాంతి సహస్రారచక్రములోని స్వచ్ఛమైన జ్ఞానమునకు ప్రతీక. ఇక్కడినుండి
క్రియాయాశీలకత సమంగా ఫలీకృతముగా నిర్వర్తించ బడుతుంది. వ్యక్తియొక్క శిరస్సు కాంతికి స్థానము.
శిరస్సులో ఊహ జనితమయినప్పుడే
కార్యాచరణ(Activity) మొదలగును. జ్ఞానమును వృద్ధిచేయును. దాన్ని బలపరచును. సఫలీకృతమయిన సాధనకు దారితీయును. అది ముక్తికి (emancipation) దారితీస్తుంది.
మంత్రసంకేతము ప్రకారము
బీజమంత్రము ‘క్లీం’ యొక్క వివరణ ఇక్కడ చెప్పుకోవాలి. పరమాత్మ జ్ఞానము అవ్యక్తమయిన శబ్దబ్రహ్మ
రూపములో వ్యక్తీకరించుతుంది. దానిని అనాహత నాదము అంటారు.
‘అ’ నుండి ‘అం’ వరకు ఉన్న అక్షరములను అచ్చులు అంటారు.
‘క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య
ర ఱ ల’, అను హల్లులు ఈ అచ్చులతో కలిసినప్పుడు విశిష్టమయిన శబ్దము వ్యక్తీకరిస్తుంది. ‘క్ల’ అను శబ్దము
సృష్టికి సంకేతము. అది పరిరక్షణమునకు
దారితీయును. జ్ఞానము
క్రియాశీలతకు దోహదపడును.
‘ఐ’ అనునది స్వచ్చమైన భావనకు సంకేతము. అది కేవలము భావనాశక్తి యొక్క పరివర్తనే.
బిందు అనునది ద్వైత లేదా వేరొక
భావనలేని అద్వైత పరాశక్తి
భావనకు సార్వత్రిక(universal) వ్యక్తీకరణకు సంకేతము. అది ఒక కూడలి(junction). ఇక్కడ అన్ని
కోరికలు లేక కామకోటి సఫలీక్రుతము అవుతాయి. అది ఒక చల్లని కాంతి. ఇక్కడ బీజమును మహాలక్ష్మి లేదా లలితా బీజము అంటారు.
అది కాళి మరియు లక్ష్మి అని రెండు విధములుగా ఉంటుంది.
కాళిగా దూషణ రూపము దాల్చి
పిరికి మరియు నిర్లక్ష్యపు(unwary) హృదయములలో భయము
మరియు ఆందోళన(fear and panic)లను పోగొడుతుంది. లక్ష్మిగా నిరపాయమయిన (benign) రూపము దాల్చి తెలుసుకొనే మరియు పట్టుదలగల సాధకులను పెంపుడు (foster) తల్లిగా సాకుతుంది. ఈ విధముగా ‘క్లీం’ అనేది
పరాశక్తియొక్క క్రియాశక్తికి ప్రతీక. దీనిని వాక్కు యొక్క రెండవమెట్టు ‘మధ్యమ’ అంటారు. దీని ఉచ్ఛారణ శిరస్సులో జరుగుతుంది. అచ్చులు
హల్లులకు తోడ్పడి సరియిన సంయుక్తాక్షర శబ్దమును దొర్లించును. భావనలు (ideas) శబ్దరూపము (words) దాల్చును.
ఇచ్చ్చాశక్తి(power of will or
volition)యొక్కస్థానము హృదయము. పూజా సంకేతము ప్రకారము త్రిపుర విద్య అనగా మహా త్రిపురసుందరి యొక్క మూడవ బీజము
హృదయమునుండి ఉత్పన్నమగును. అనాహత చక్రము స్థానము హృదయము. ఇచ్ఛాశక్తియే జ్ఞానము
మరియు కార్యాచరణమునకు మూలకారణము. సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు, ఇచ్ఛాశక్తి
జ్ఞానాంధకారము ను పోగొట్టును. హృదయముయొక్క కేంద్రము నిత్య నూతనముగా ఉండును. కార్యాచరణమునకు కంటే జ్ఞానము అధికమయినప్పుడు, ముక్తి మరియు ఆనందమునకు మార్గము సుగమము అవును. అప్పుడు ఆలోచనా శక్తి, ఇచ్ఛాశక్తి పనిలోకి దుముకును. దీని స్థానము హృదయము.
పరిపూర్ణముగా అర్థముచేసికొనుటకు హృదయము ప్రతీక. మంచి చెడు సంస్కారములన్నియు
(అలవాట్లు) తగలబడిన తదుపరి హృదయము ప్రకాశించును. ప్రశాంతత (serenity)కు దారితీయును.
అయం నిజః పరోవేతి గణనా
లఘుచేతసాం
ఉదారచరితానాంసు వశుధైక కుటుంబకం
జ్ఞానము లభ్యమయిన తదుపరి, వాడు వేరు, వీడు వేరు, నేను వేరు అనే భేదము వదిలి వేస్తాడు సాధకుడు. ప్రపంచమే ఒక కుటుంబం అని
పరిపూర్ణముగా అర్థముచేసికుంటాడు. దీనినే పరమాత్మ చైతన్యము అంటారు. ఇక్కడ అధిష్టాన
దేవత గౌరి. ఆ అమ్మనే
మహాత్రిపురసుందరి అంటారు. ఇక్కడ మార్మిక అక్షరము ‘సౌ’. ‘సౌ’ అక్షరము ఇచ్ఛాశక్తికి ప్రతీక. ఇచ్ఛాశక్తినే విసర్గశక్తి అనికూడా అంటారు.
విసర్గశక్తి అనగా వదిలిన శక్తి. కురుస్తున్న ధారామృతమును లేదా సాటిలేని సుఖమును విసర్గ అంటారు.
ప్రపంచము మూడువిధములు మాత మేయ
మాన అని. ఈ మూడు ఒకటి అవటమును సత్తాయొక్క
సామాన్య అవస్థ అంటారు. అప్పుడు ద్వైతము నుండి మానవుడు విడివడుతాడు. వ్యక్త మరియు అవ్యక్త జగత్తు రెండింటిలోను, ఆధ్యాత్మిక కాంతి
వ్యాపిస్తుంది. దీని స్థానము హృదయము.
‘స’ అనగా ‘తో’ లేక ‘కూడా’ అని, ‘ఔ’ అనగా ‘నిశ్చయము లేక నిర్ణయం, మరియు ‘విసర్గ’ అనగా ‘విముక్తిని’ అని అర్థము. కనుక నిర్ణయముతో ఈ బీజము అన్ని బంధములనుండి విముక్తిని
ప్రసాదించును. ఈ బీజమును పరా బీజము అని కూడా అంటారు. మహాత్రిపురసుందరి తనను తాను
సాధకుని ఆత్మే అని తెలియబరచటమే సఫలీకృతమునకు గుర్తు. అంతియేగాదు, జీవుడు పృథ్వీ
నుండి మాయవరకు 31 తత్వాలతో ‘స’ అనే బీజాక్షరము ప్రాతినిథ్యము వహిస్తుంది. త్రిపురభైరవి యొక్క శుద్ధవిద్యయే సదాశివ, మరియు ఈశ్వర తత్వములు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, మరియు క్రియాశక్తి లకు ‘ఔ’ ప్రతీక.
‘విసర్గ’ శివస్వరూపములో నిబిడియున్న ‘శక్తి’ స్వరూపమునకు ప్రతీక.
జాగృతి చెందిన సాధకునకు
కుండలినీ శక్తి అంతర్గతమయిన కాంతితో వెలుగొందు చుండును. జ్ఞానముద్రలో ఈ ‘సౌ’ మంత్రమును తీవ్ర ఏకాగ్రతతో జపించిన ‘ఇచ్ఛాశక్తి’ నిర్ణయాశక్తిగా మారును. సాధకుడు విషయవాంఛలలో నుండి బయటపడును. అది ముక్తికి
దారితీయును. దీనినే వాడవ మంత్రము అనికూడా అంటారు.
శ్రుష్టి కర్మ లో ఈ
వ్యక్తీకరణను ‘వైఖరీ’ అంటారు. ‘మల’ దోషము అనేది అజ్ఞానం వలన జనించును. అందువలన తన అంతర్గత అజ్ఞానం వలన తగులము ఏర్పడును. ఇది మొదటి ‘అపూర్ణత్వ’ పరిమితి. ‘అపూర్ణత్వ’
ఆనవమల అనగా అపూర్ణత్వమానవం
నుండి తీసుకొనిరాబడుతుంది. విశ్వచేతన నుండి వ్యష్టి పరిమితి చేతనవరకు అనగా అణుత్వము వరకు తీసుకొనిరాబడుతుంది.
పరమాత్మయొక్క చేతన ఆఖరికి పరిమితి
చెందుతుంది.
ఆనవమల రెండు విధములు. అవి: పౌరుష అజ్ఞాన మరియు బౌద్ధఅజ్ఞాన.
1. పౌరుష అజ్ఞాన: మూర్తీభవించిన అజ్ఞానము.
2. బౌద్ధఅజ్ఞాన: బుద్ధిలో
అంతర్గతముగానున్న అజ్ఞానము. ఈ మలిన దోషము వలన వ్యక్తి తనను ప్రత్యేకమయిన జీవి అని
తలపోస్తాడు. విశ్వచైతన్యం నుండి తన చైతన్యం వేరు అనుకుంటాడు. ఇది అత్యంత
సూక్ష్మమయిన మలినము. ఇది కాక సూక్ష్మము, మరియు స్థూల సూక్ష్మము అని ఇంకా రెండు రకముల సూక్ష్మము మలినములు ఉంటాయి.
అశుద్ధ మార్గముతో సంపర్కము కలిగిన మానవుడు లేక జీవుడ్ని మయ్యామల మరియు కర్మమలములు
ఇంకా నీచస్థితికి దిగజార్చుతాయి.
మయ్యామలము భిన్నమయిన చేతనా
బేధమును కలుగజేయును. (భిన్న వేద్య ప్రథాత్వం మయ్యం). పరిమితితోకూడిన శరీరముయొక్క భిన్నమయిన అంగములవలన కలిగే సంయోగమే
దీనికి కారణము. దీనివలన
జ్ఞానశక్తికి విఘాతమేర్పడి పరిమితిచెందినదిగా అవుతుంది. అంతేకాదు, వాసనలవలన (శుభాశుభ వాసనామయత్వం కర్మాం) మిగిలిన పాత జన్మలలోని తీరని కోరికలవలన
కలిగే సంచిత కర్మ అవశేషాలు ఈ పరిమితిని అధికము చేస్తాయి.
దీనిని కర్మమలము అంటారు.
జనన – మరణ – జనన వృత్తములో కొట్టుమిట్టాడు మనిషికి రకరకాలయిన తగులములు పీడుస్తూ ఉంటాయి.
ఆత్మసాక్షాత్కారమునకు పిమ్మట పరమాత్మతో అయిక్యమగుటకు ఈ సంచితకర్మలను దగ్ధముచేయుట
ఆవశ్యకము. (సక్రిద్విభాతో అయం
ఆత్మా--ఛాందోగ్యోపనిషద్ 8.4.2).
మహాత్రిపురసుందరి మీద ధ్యానము
చేసిన అమ్మ దయ ఆశ్చర్యకరముగా మరియు యాదృచ్ఛికముగా కానవస్తుంది.
జగత్తు యొక్క ఉపరితలములోని మూడు
గుణములు సమానముగా కలిసినప్పుడు మూడు దివ్యమయిన మార్మిక రూపములుగా దర్శనమిస్తుంది.
అప్పుడు దివ్యమాత
వ్యక్తీకరించును. మూడు మార్మిక రూపములు కలిసిన రీతిగా దర్శనమిచ్చును. ఆ దివ్యమాత మూడు మార్మిక రూపములకు అతీతురాలు. ఆ
నాలుగవది, మరియు అన్నిటికీ అతీతమయిన ఆ అమ్మ మానవ గ్రహింపుకు, మరియు భావనకు, అతీతురాలు. ఆ అమ్మ రూప రహితురాలు. అన్నిటికీ
అతీతురాలు ఆ అమ్మ.
‘అయిం’ మంత్రమును లలాటములో పరిపూర్ణమయిన ఏకాగ్రతతో స్థిరముగా ఉచ్చారణ చేయవలయును.
దానివలన ఆ అమ్మ మహాత్రిపుర సుందరి అపారదయతో దర్శనము ఇస్తుంది. ఆ అమ్మ ప్రకాశరూప
దర్శనము దానికి నిదర్శనము.
మంత్రోద్ధార విధిలోని తంత్ర
పధ్ధతి ప్రకారము (మంత్రోద్ధార విధిర్విశేషసహితా సత్సంప్రదాయాన్వితః) ఉచ్ఛరించుట
చేస్తాడు సాధకుడు. అమ్మ శ్రీదేవి
ద్వైతమునుండి సాధకుడ్ని విముక్తి చేస్తుంది. సృష్టి, స్థితి, మరియు లయ మూడూ ఒకటే అయిన రూపముగా సాధకుడు దర్శనము
ఇస్తాడు. సాధికారత, సాక్ష్యం, మరియు సిద్ధాంతము –ద్వైతముయొక్క వివిధ కోణములు. ఈ మూడు కోణములు పరబ్రహ్మ పరమశివలో కరిగిపోతాయి.
శ్రేష్ఠతమ సౌందర్యముయొక్క నిత్యస్థితి ఇదియే. ఇది శ్రీదేవి మాత యొక్క దయతోనే
సాధ్యము.
సాధకుని ఆత్మయే శివ. అది
శక్తిద్వారా గుర్తించబడుతుంది. (శైవముఖమిహోచ్యతే – విజ్ఞానభైరవ 20).
‘య ర ల వ’ అను అక్షరములను అంతస్థ అంటారు. ఇవి సాధనను ఉన్నత స్థానమునకు తీసికెల్తాయి.
‘శ ష స హ’ అక్షరములను యుష్మా అక్షరములు అంటారు. వీటిని శక్తివంతముగా ఉచ్ఛారణ చేయవలయును. ఇవి ఉష్ణము మరియు ఆత్రత కలుగచేయునవి.
‘హ’ అక్షరము
నిశ్చయమునకు ప్రతీక. ‘అ’ శివకు, ‘హ’ శక్తికి ప్రతీక.
‘అ’ మరియు ‘హ’ కు బిందువు జోడిస్తే ‘అహం’ అగును. పరబ్రహ్మకు మరియు పరాశక్తికి ప్రతీక. ‘అహం బ్రహ్మాస్మి, శివోహం, అహం బ్రహ్మస్వరూపి ని’– ఈ మహావాక్యములు నేనే పరమాత్మను అనే విషయమును సూచిస్తాయి. ఈ వాక్యము(లే)
నిత్యసత్యములు.
పరమాత్మ (పరా) యొక్క వికసించే మొదటి బీజము(sprouting seed) పశ్యంతి. స్వయంప్రకాశమయిన
సదాశివతత్వములో, అమ్మ జ్ఞానము ద్వారా వ్యాప్తిచెందుతుంది. అమ్మ అతి సూక్ష్మమయినది. అతి దయాళు. ‘అయిం’
అక్షరం దీనికి ప్రతీక. త్రపుసి మొక్క అంకురము యొక్క
కాండము కుండలినీ మాదిరి అతి సూక్ష్మము. యునాని వైద్యుడు కొన్ని రుగ్మతలకు ఈ మూలిక(herb) ను ఉపయోగిస్తారు. కాశ్మీర్ వాతావరణములో ఈ మూలిక ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ కుండలినీని ఊర్ధ్వ
కుండలినీ అంటారు. శరీరమునకు కావలసిన ప్రాణశక్తికి మూలకారణము కనుక దీనినే ప్రాణ
కుండలినీ అనికూడా అంటారు. ఇక్కడ కుండలినీ స్థూల అవస్థలో పనిచేస్తుంది. తద్వారా
సాధారణ జీవనమును స్థితివంతము(maintaining normal life) చేయుటకు శరీరమునకు కావలసిన ప్రాణశక్తిని ఇది కలగజేస్తుంది. కుండలినీ జాగృతి
చెందినప్పుడు శరీరము ప్రకాశవంతమవుతుంది. అది సాధకునియొక్క లలాటములో తెలుస్తుంది. ఎంత
ఎక్కువగాజాగృతిచెందుతే అంత ఎక్కువగా సాధకుని లలాటము తేజోవంతమవుతుంది, మరియు అంత ఎక్కువగా శక్తితో శరీరము విరాజిల్లుతుంది. ఈ రహస్యం తెలిసిన సాధకుడు
జన్మ- మరణం – జన్మ వృత్తములో పడడు.
సాధకులకు తీవ్రమయిన సాధన
చేసినయడల కుండలినీ జ్ఞానముగురించి తెలుసుకోగలుగుతారు. కుండలినీ జ్ఞానముగురించి
కొంతమంది మాత్రమె తెలుసుకోగలుగుతారు. అందువలన దానిని రహస్యం అంటారు. మోక్షము అనేది భోగఫలము. జీవన్ముక్తులు మాత్రమె
మోక్షముయొక్క భోగఫలమును అనుభవిస్తారు. కాని ఈ స్థితి చాలా కష్టముగానే
లభ్యమవుతుంది. ఎన్నిజన్మలు ఎత్తినా శ్రీ పరాభట్టారిక దయలేనిది మోక్షము లభ్యమవదు.
ఒక్కొక్కప్పుడు ఆ అమ్మ దయ
హఠాత్తుగా లభిస్తుంది. గొప్ప గురువులు అటువంటి సందర్భములను అనుభవించారు.
సంచిత కర్మలకి ప్రారబ్ధ కర్మలకి
సంతులనం ఏర్పడినప్పుడు అమ్మ దయ హఠాత్తుగా లభిస్తుంది. దీనినే కర్మసామ్య అంటారు.
అమ్మదయ సాధారణ వ్యక్తులకుకూడా
లభ్యమగును ఒక్కొక్కప్పుడు. అది ఒక అద్భుతము.
అది మన తార్కికతకు అతీతము. అమ్మ మహా త్రిపుర సుందరి దయ అనేది నియమములకు అతీతము. ఏ మానవశక్తి అమ్మ దయ ముందర సూరీడిముందర దీపము మాదిరి దిగదిడుపే. (నత్వత్రకో ఆపి
అత్మియోపురుషాకారః –ఈశ్వర ప్రత్యభిజ్ఞ
వృత్తి VI.7).
బిందు అనగా చుక్క. దీనినే అనుస్వరం అంటారు. ఈ మంత్రము అయినా
బిందువులేకుండా ఉచ్చారణ చేయకూడదు. అట్లా చేసినయడల మంత్రము యొక్క శక్తి విహీనమవుతుంది. బీజాక్షరము చివర బిందువును చేర్చి ఉచ్చారణ చేసినయడల
అద్వైత పరబ్రహ్మమును సూచిస్తుంది. సాధనలో మంత్రజపం మరియు బీజాక్షరజపం
అతిముఖ్యమయినది. దానిద్వారానే అమ్మ దర్శనము సాధ్యము.
ఇక్కడ పరాశక్తి యొక్క దయగురించి
ఒక కథ చెప్పుకుందాము. ఉతత్య అని ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు. వాడు చదువురాని
మొద్దు(dunce). వాడికి ఏ మంత్రము సాధనా తెలియదు. తల్లిదండ్రులు
వాడిని ఎప్పుడూ హేళన చెస్తూఉండేవారు. ఆ హేళన భరించలేక ఊరికి, మరియు తల్లిదండ్రులకు దూరముగా గంగానదీ తీరమున పవిత్రముగా సదా సత్యము పలుకుతూ ఒక గుడిసెలో జీవిస్తూ ఉండేవాడు.
అందువలన ఆయనని సత్యవ్రతుడు అని పిలిచేవారు. ఒక రోజున బాణములతో గాయపడిన అడవిపంది
ఆయన గుడిసె వెనకాల చెట్లల్లో దాక్కున్నది. భయముతో సత్యవ్రతుడు ‘అయి అయి’ అని అరిచాడు. ఇంతలోకే దాన్ని
తరుముకుంటూ వెనకాల వచ్చిన ఒక వేటగాడు ‘అడవిపంది’ జాడ చెప్పమని అడుగుతాడు. ‘అయి అయి’ లో బిందువుతో లేకపోయినప్పటికీ అమ్మ ఆయన మీద దయ చూపించింది. ఆయనలో తెలివితేటలు పొడసూపినవి. ‘హింస’తో కూడినది ‘సత్యము’ కాదు, ‘దయ’తో కూడిన ‘అసత్యమేధర్మము ’ అని తెలిసి సత్యవ్రతుడు ‘ఓ వేటగాడా, ‘చూసే కళ్ళు
మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు’. దానికి ఆ వేటగాడు వీడెవడో పిచ్చివాడిలాగా ఉన్నాడని వెళ్లిపోతాడు.
సత్యం న సత్యం ఖలు యత్రా హింసా
దయాన్వితం చాన్రితమేవ సత్యం
హితం నరాణాం భవైత్య యేన తదేవ సత్యం న తథాన్యథైవ
(దేవీ భాగవతం3.11.36)
నిప్పును తెలిసి ముట్టుకున్నా, తెలయక ముట్టుకున్నా కాలుతుంది.
అనిచ్ఛయఅపిసంస్పృష్తో దహత్యేవ చ
పావకః (అష్టావక్రగీత XVIII.37).
అమ్మ భూత వర్తమాన మరియు
భవిష్యత్ కాలాలకు అతీతురాలు. అందువలన అమ్మ నిత్యం.
ప్రమాత, ప్రమాణ, ప్రమేయరూపా సృష్టిః.
పరమాత్మ చేతన ఏ విధముగానూ
ప్రభావితము అవ్వదు. పరాశక్తి హఠాత్తుగా వేలకొద్ది మనుష్యులలో ఒక్కడికి అమ్మ
దర్శనము ఇస్తుంది. అది కేవలము అమ్మ దయ మాత్రమె. దీనినే శక్తిపాతము అంటారు. అది
సత్యవ్రతుడికి శక్తిపాతము రూపములో హఠాత్తుగా అమ్మ దర్శనము లభ్యమయినది.
ఓం అనేది ప్రణవ నాదము. అది
పరమాత్మను గుర్తించుటకు ఏర్పడినడి. అందువలన ప్రణవ నాదము నమస్కారము లేదా గౌరవమునకు అర్హత పొందదగినది. అదే నమ్మకముతో ‘క్లీం’ అనే మంత్రమును
విజ్ఞలు ధ్యానిస్తారు. ఏ పూజ అయినను భక్తితో శ్రద్ధతోను ఓం శబ్దముతోనే మొదలు
అవ్వుతుంది, ఓం శబ్దము తోనే సమాప్తి అవ్వుతుంది. ఈ ప్రణవ నాదము
యెంతో పవిత్రమయినది. సాధకుడికి ఈ పవిత్ర శబ్ద ఉచ్ఛారణములే శ్వాస నిశ్వాసములు, శక్తిపాతము కలుగజేస్తుంది. పరమాత్మకి శ్రద్ధతో తనను తాను అర్పించుకొన్న
సాధకునికి మనస్సు స్థిరము అవుతుంది.
ఆశయరహితము, మరియు అహంకారరహితములేని భక్తి వ్యర్థము. మన మనస్సు
సగుణ లేదా రూపసహిత దేవుడ్ని గుర్తించగలదు. భగవద్భక్తి సాధకుడి అహంకారరహితుడ్ని చేసి సమాజసేవను వృద్ధి చేస్తుంది.
ఈశ్వరుడు సర్వజగత్తుకు నాయకుడు. మనము ప్రకృతి దాటి వెళ్తేకాని పరమాత్మ అర్థము కాడు(దు).
కార్యకలాపాలు, మరియు ఇచ్ఛాశక్తితో కలిసిన జ్ఞానదేవత సరస్వతి. ఆ అమ్మ
దయ చూపించినప్పుడు, శాంతి, ప్రశాంతత, మరియు పరిపూర్ణతతో కూడిన ముక్తియొక్క ఆనందమును
అనుభవిస్తాడు సాధకుడు. దివ్యత్వము పొందిన విజ్ఞులయిన సాధకులు దానిని తమ కవిత
ద్వారా ఆమె దయ ఇత్యాది గుణములను ఆనందముగా తెలియబరుస్తారు.
శ్రేష్టమయిన మూడు బీజాక్షరములు
కలిసిన మంత్రము నిర్గుణసమాధి కొరకై ఉచ్ఛరించవలయును. అదే ఆ + ఉ + మ్ = ఓం. ఈ ‘ఓం ‘ ఉచ్ఛారణ సాధనకు
పరిపూర్ణతను ఇస్తుంది. కార్యకలాపాలు, మరియు ఇచ్ఛాశక్తిని అధిగమించి, జ్ఞానము శ్రేష్టము అని సాధకుడు తెలిసి కుంటాడు. ఈ జ్ఞానము పరమాత్మతో తనను కలుపుతుంది అని అర్థము
చేసికుంటాడు సాధకుడు.
(జ్ఞానాత్ ఏవతు కైవల్యం).
ఏ సాధనా పద్ధతులు
అనుసరిస్తున్నవాడు అయినప్పటికీ, సాధకుడు ఈ క్రింది బీజాక్షరములను శ్రద్ధతో ఉచ్ఛారణ చేసిన లాభము చేకూరును.
1. అయిం సౌ
2. అయి ఇ ఔ
3. సౌ క్లీం అయిం
4. అయిం క్లీం సౌ
అమ్మ శ్రీదేవియే ప్రణాళికలను
అమలుపరచి మనలను ఆనంద పరచేది. శ్రీదేవియే శక్తి. అమ్మయే పరమాత్ముడైన శివునియొక్క విడదీయలేని శక్తి. ఆ అమ్మయే ఈ కనబడు జగత్తుకు
ఆనంద కారణము. చిత్శక్తి తన తెరమీద జగత్తును తన ఇచ్ఛాశక్తితో ఆవిష్కరిస్తుంది.
(స్వీచయా స్వభిత్తౌ విశ్వమున్మిల్యతి). అమ్మ తన భక్తుని న్యాయపూరితమయిన కోరికలన్నీ తీరుస్తుంది. ఆగమాలలో చెప్పిన కొన్ని పద్ధతులను ఇక్కడ చూద్దాము.
అవి:
1)అంగ, కర న్యాసములు చేయటము మరియు ఋషిని అనుసరించటము
2) శ్రీ గురు పాదుకలను జ్ఞాపకము
చేసికోవటము,
3) వెతుక్కోకుండానే వచ్చేది.
వీటినే అనవోపాయ, శాక్తోపాయ, మరియు శాంభవోపాయ అంటారు.
అమ్మయొక్క స్వభావసిద్ధమయిన
స్వరూప స్థితిని
పరాభట్టారిక మహాత్రిపుర సుందరి
అంటారు. అవి: 1) సకల, 2)నిష్కల, మరియు 3) నిష్కల సకల.
స్వయం ప్రకాశితురాలయిన అమ్మను
పరాశక్తి అంటారు. (అంబ తే పరిపూర్ణ్యం స్వాత్మస్ఫురత్తయా విశ్వం పరామ్రిషత్యాంబా).
అమ్మయే సృష్టికర్త.
అమ్మ బాలను శారద, వాగేశ్వరి, మహావిద్య, బ్రహ్మి, సరస్వతి, మరియు శ్రీదేవి, అనే వివిధ మయిన నామములతో ఆరాధిస్తారు.
అమ్మ మూడురకములయిన మలదోషములను
నివారిస్తుంది. శబ్దబ్రహ్మ రూపిణి అమ్మ అన్ని అక్షరములకు అధికారిణి. ‘అ’ నుండి ‘క్ష’ వరకు ఉన్న
అక్షరములను అక్షమాల లేక
అక్షరమాల లేక అక్షమాల అంటారు. అమ్మ అక్షమాలను ధరిస్తుంది. ఈ అక్షమాలనే మాతృకచక్ర అనికూడా అంటారు. జపము మరియు సాధనకు ఉపయోగించే ఈ మాతృకమాలను గురించి వివరముగా కాళీతంత్ర మరియు
శ్రీకులార్ణవలో వివరించారు.
పరిపూర్ణతతో కూడిన భక్తిభావము
వెలువడినప్పుడే శక్తి పాతము( transfer of energy) అనగా శక్తి అమ్మనుండి బేషరతుగా
సాధకునికి చేరుతుంది.
శక్తి పాతము( transfer of energy) తొమ్మిది విధములు
అని తంత్రలోకములో చెప్పబడినది. పరాశక్తి పరమ దయాళు. ఆవిడ నాలుగు చేతులు ఆవిడ
అనంతమయిన శక్తిని తెలియబరుస్తుంది.
పరమానందం అనగా ఆత్మ మరియు
పరమాత్మల కలయిక. ఇది ‘సౌ’ ను అనుసరించే ‘క్లీం’ బీజ మంత్రములను ఏకాగ్రతతోకూడిన శ్రద్ధాసహితముగా చేసే
ఉచ్ఛారణద్వారా ఆత్మ మరియు పరమాత్మల కలయిక సాధ్య పడును. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, మరియు జ్ఞానశక్తి, మూడింటి కలయిక ఈ బీజమంత్ర ములు సాధ్యము చేయును.
దీనినే మంత్రసిద్ధి అంటారు. మొక్కుబడిగా, యాంత్రికముగా, మరియు శ్రద్ధారహితముగా చేసే ఉచ్ఛారణ ద్వారా ఇది
దుస్సాధ్యము. పరమాత్మను వదలి
వివిధములయిన దేవతలను కొలవటము వృధా ప్రయాస. ప్రత్యాహారముద్వారా ఇంద్రియములనుండి
శ్వాసను ఉప సంహరించ వలయును. ప్రాణాయామము ద్వారా చిత్త ఏకాగ్రత (one
pointedness) తో ధారణ చేయ వలయును. దానిని
ధ్యానము అందురు. అట్టి ధ్యానము ఒక్క
క్షణమైనను సంతృప్తిని, మరియు దివ్యానుభవమును ఇచ్చును.
కోరికలు లేని సింహములాంటి అట్టి
సాధకుడిని, ఏనుగులలాంటి ఇంద్రియ లక్ష్యములు చేతనారహితమవుతాయి.
పారిపోతాయి. (నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్ణిం విషయ దంతినః పలాయంతే న శక్తాస్తే
సేవంతె కృతచాతవః --- XVIII).
పరమాత్మనే కోరుకో, ఆయనలోనే హృదయపూర్వకముగా లీనమవ్వు, అదే పరిపూర్ణ ఇంద్రియనిగ్రహము.
మనస్సునుండి మొదలుపెట్టి
ఇంద్రియములవరకు అన్నీ పరమచంచల మైనవే. ధ్యానముచేయని మనస్సు మరియు ఇంద్రియములు అత్యంత చంచలమయినవి. కాని
ఎప్పుడయితే సాధకుడు పరమాత్మమీద పరిపూర్ణ దృష్టి పెడతాడో అప్పుడు పరమచంచలమయిన అవే మనస్సు మరియు ఇంద్రియ ములు మహా నిశ్చలమయినవిగా
సాధకునికి తోడ్పడుతాయి. అందమయిన స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ పరస్పర ఆరాధనగా
మారుతుంది.
ఏకాగ్రతతో అమ్మ లేదా అంబను
ధ్యానించ వలయును. సువర్ణ బంగారు చెవ్వు ఆభరణము, చేతి గాజులు, మరియు వడ్డాణము ధరించిన అమ్మ రూపము
మీద, ఇంద్రియ వృత్తుల మీదను, కొంచెము సమయము అయినను, ధ్యానము చేసినట్టి సాధకుడు, శీఘ్రమే విశ్వచేతనలోకి వెళ్ళగలుగుతాడు. చెవ్వు ఆభరణము ‘అయిం’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ జ్ఞానశక్తికి ప్రతీక. చేతిగాజులు ‘క్లీం’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ క్రియాశక్తికి ప్రతీక. వడ్డాణము ‘సౌ’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ ఇచ్ఛాశక్తికి ప్రతీక.
శాస్త్రములు అమ్మ సాక్షాత్కారము
కొరకై ఇంకను కొన్ని పద్ధతులనుకూడా సూచిస్తాయి. ఆమె రూపమును ధ్యానించటము, నెలవంక చంద్రునితో కూడిన అమ్మ కురులను ధ్యానించటము, నడుముకు రక్తవర్ణపు వస్త్రము ధరించి పుర్రెలు నెక్లస్ గా ధరించిన మెడను, వెల్లకిలా పడుకొనిఉన్న శివుడిమీద అమ్మ కాళీ కాళ్ళు పెట్టి నుంచోవటము, అంతేకాదు, నాలుగు చేతులు, మూడు కన్నులు, ఎత్తైన స్థనములు, కొంచెము వంచిన నడుము ఉన్న అమ్మను, అనగా మహాత్రిపుర సుందరిని, ధ్యానించటము, మొదలగునవి.
రక్తవర్ణపు వస్త్రము మహాత్రిపుర
సుందరియొక్క సృష్టి శక్తిని, మరియుపుర్రెలు
నెక్లస్ గా ధరించిన మెడ అహంకారరహిత అక్షరముల మాలను సూచిస్తాయి.
సృతి ప్రకారము ప్రకాశము అంటే
బ్రహ్మ అని అర్థము. అది వివిధ రకములుగా ప్రకాశిస్తుంది. (తమేవ భాంతం అనుభాతి
సర్వం---కఠ ఉపనిషద్ II.ii.15).
విమర్శ అనేది బ్రహ్మకు
వివిధములయిన అంతర్గత ప్రకాశము ద్వారా స్వభావ సిద్ధము. (తస్య భాషా సర్వమిదం
విభాతి).
ఆగమాల ప్రకారం జ్ఞానము మరియు
క్రియల మేళవింపే చేతన (సంవిత్, చిత్ లేక పరమశివ).
జ్ఞానము మరియు క్రియ, శివ మరియు శక్తి, మరియు ప్రకాశము
క్రియ విమర్శ అనేది ఒక్కటే. అందువలన కాంతి మరియు మెరుపు రెండూ అమ్మే. మంత్రము శివ శక్త్యాత్మిక అనేది శ్రీవిద్య అమ్మవారి
మంత్రము. మరియొక మంత్రము
పరమశివ కామేశ్వర అని శ్రీవిద్య అమ్మవారి మంత్రము ఉచ్ఛరించవలసిన అవసరము లేదు.
ఎందుకంటే శ్రీవిద్య అమ్మవారు శివ మరియు శక్తి స్వరూపిణి అగుటయే దీనికి కారణము. అమ్మ శ్రీవిద్య స్థితి సదాశివ లేక అర్ధనారీశ్వర
స్థితికి అతీతమయినది.
శివుడు శక్తి రెండు ఒక్కటే.
శక్తి తనయొక్క క్రియాశీలకత తెలుస్తుంది, మరియు తెలియ బరుస్తుంది. శివ ఒక్క ఆకారములో మాత్రమె ఉండి తన
క్రియాశీలకత తెలియబర్చడు. శివ సూక్ష్మ
చైతన్యరూపములో ఉంటాడు.
నిత్యమయిన శక్తి రూపసహితము
అవుతుంది. వివిధరూపములను తీసికుంటుంది.
శివుడు క్రింద వెల్లికిలా పడుకొని
ఉన్నట్లుగాను, ఆయనమీద కాళ్ళుబెట్టి కాళికా దేవి రూపములో
నుంచున్నట్లుగా చూపించటము వెనకాల ఉన్న ఆంతర్యము అమ్మ తనయొక్క శక్తిని
ప్రదర్శించటమే. నిద్రాణమై ఉన్న
సదాశివునిలోనుంచి శ్రీ మహాత్రిపురసుందరి బ్రహ్మ, విష్ణు, రుద్రా, మరియు ఈశ్వర అనే తన నలుగురు దేవతలతోను ఉద్భవించింది. ఆవిడ నాలుగు భుజములు/చేతులు నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, మరియు శాంత అనే సృజనాత్మకశక్తికి ప్రతీక. అమ్మ నేత్రములు సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్నికి. ఇవి జ్ఞానము (ప్రమాణ), జ్ఞేయము(ప్రమేయము), మరియు అనుభావిక
ప్రయోగం/జ్ఞాత (ప్రమత)లకు ప్రతీకలు. అమ్మ స్థనములు అవగాహనా హెచ్చరికలకు ప్రతీకలయిన కాంతి మరియు శబ్దము లేదా ప్రకాశ
మరియు విమర్శ. ఆవిడ వంగిన
కటిప్రదేశము వ్యక్తీకరణకు గుర్తు. వీటిని మనము ఈ గుర్తులను అర్థము(decode )చేసికుంటే మనకు శ్రీ చక్రము యొక్క ఆవరణలు (enclosures) అర్థము అవుతాయి. అవి:
1.వలీత్రయా నికితాతనమ్ – మూలాదారచక్ర – భూపుర త్రైలోక్యమోహనచక్ర
2. మధ్యే నిమ్న – స్వాధిష్ఠానచక్ర – షోడశదళ పద్మ – సర్వశపరిపూరకచక్ర
3. ఆపినోట్టు –నిగాస్తినం – మణిపూరచక్ర – అష్టదల పద్మ- సర్వసంక్షోభణచక్ర
4.త్రినయనం – అనహతచక్ర- చతుర్దశర – సర్వసౌభాగ్యదాయకచక్ర
5. చతుర్భుజం – విశుద్ధచక్ర – బహిర్దశర సర్వార్ధసాధకచక్ర
6. ప్రేతాసనధ్యాసినీం – ఆజ్ఞాచక్ర – అంతర్దశర – సర్వరక్షాకరచక్ర
7. బందూకప్రసవారుణాంబరధరాం – మానసచక్ర – అష్ట సర్వరోగహరచక్ర
8.న్రిమున్దస్రజం – సోమచక్ర – త్రికోణ సర్వసిద్ధిప్రదచక్ర
9. శశిఖండమందితజటాజుతాం – సహస్రా – బిందు సర్వానందమయచక్ర
దీనిని దక్షిణామ్మూర్తి
సంప్రదాయము ప్రకారము సంహారక్రమము అంటారు.
శక్తిపాతము ఇచ్చుటకు షరతులు
ఉండవు. శ్రీ సంవిదాంబ తన
భక్తులయడల ఎల్లప్పుడూ దయగలదే. ఆ అమ్మ కి బీదా బిక్కీ అనే తారతమ్యము లేదు.
భక్తిహీనులయడల ఆ అమ్మ, శ్రీ లలితా మహాత్రిపురసుందరి, దయచూపదు.
అజ్ఞానములో కూరుకొనిపోయిన
ప్రజలు మాత్రమె ఈ మాయ లోకముయొక్క బాధ సంతోషములకు లోనవుతారు. ఈ అనంతమయిన లోకము ఎక్కడి నుండి వ్యక్తీకరిస్తున్నది? అమ్మ ఎవరు? అనే ఇంగితజ్ఞానము కొరకై తరచి చూచుటకు వారికి సమయము లేదు. అంతర్గత
అవయవముల (అంతఃకరణ) శుద్దీకరణ అసలు సత్యము ఏమిటో తెలియ బరుస్తుంది. ఆవిడ భక్తుడు/ భక్తురాలు ఆవిడ దయవలన ఆవిడే అవుతుంది.
త్రిపుర, శ్రీదేవి అమ్మయొక్క అద్భుతమయిన నామము. ఆ నామము గురించి చాలా చర్చించాము. ఆ వ్యష్టిలోని మూడు
పురములకు, (భూః - భూమి, భువః – ఆకాశము, స్వః – అంతరిక్షము), ఆవిడయే రాణి. వీటినే
విశ్వ – విరాట్,
తైజస – హిరణ్యగర్భ,
ప్రాజ్ఞ – ఈశ్వర అంటారు వేదాంతములో. శ్రీదేవిని, అపారమయిన తురీయ అంటారు. అది
నాలుగవ స్థితి.
మూడు వేదములు ఉన్నవి. ప్రాథమికముగా
మూడు గుణములు ఉన్నవి. అవి సత్వ రజో మరియు తమో గుణములు. ఆ గుణముల ప్రకారమే వారి
భక్తిభావములు, ప్రార్థనలు, ధ్యానములు ఉండును. శ్రీ భగవద్గీతలో కూడా ఇదే పొందుపరచబడినది. ఆర్తుడు, జిజ్ఞాసువు, మరియు ధనాపేక్ష గలవాడు అని. వీరు ముగ్గిరికీ అతీతముగా ఉన్న నాలుగవవాడు జ్ఞాని. వాడు శ్రీదేవి అమ్మకు తన నిత్యమయిన నమ్మకమయిన ఒకే
విధము అయిన భక్తిని ప్రదర్శిస్తాడు.
నవారణపూజలో బ్రాహ్మణుడు పాలు బెల్లములతో
మాత్రమె తొమ్మిది ఆవరణలకు తర్పణములను ఇవ్వాలి. మిగిలిన దినుసులతో ఇవ్వకూడదని ఆగమశాస్త్రములు చెప్తున్నాయి. నెయ్యి, మరియు తేనె మిగిలిన రెండు వర్గములవారికి చెప్పబడినవి. దీపకనాథ సిద్ధ తన ‘శ్రీవిద్యా సుద్ధోదయ’ ఈ విషయమై ఇంకా
విపులముగా తెలియబరచారు. శుభాగామ పంచకం లోకూడా దీని ప్రస్తావన ఉన్నది.
పాలు, నెయ్యి, మరియు మధు సత్వగుణముకోవకు చెందినవారు.
రజో మరియు తమో గుణముల కోవకు
చెందినవారల చైతన్య స్థాయిలు వేరే ఇదిగా ఉండును.
అమ్మవారికిచ్చే నైవేద్యములు
లేదా పూజాపద్ధతులలో ఫలాపేక్ష ఉండకూడదు. ప్రతి కార్యబీజము తగిన ఫలితమును తప్పక ఇచ్చును. కనుక ఫలితము
ఆశించకూడదు. దాని ప్రభావము తగ్గుతుంది. ఫలితము ఆశించి చేసిన పనులు ఫలితమునివ్వకపోవడము
లేదా పూర్ణఫలితమును ఇవ్వకపోవడము జరుగును.
మనము చేసేపనులు, పూజలు, ధ్యానము అసహనముగా
చేయకూడదు. అప్పుడు ఎకువెక్కువ పనిచేయ లేము. అందుకనే భగవంతుడు అర్జునుడితో
నిష్కామకర్మను అనుసరించమన్నాడు. అది మనస్సుకు స్వచ్ఛతను ఇస్తుంది. అది
ఆత్మస్వతంత్రతకు, మరియు సరియిన ప్రార్థనకు దారితీస్తుంది.
పూజ నామ న పుష్పాద్యైర్య మతిః
క్రియతే ద్రుధా
నిర్వికల్పే మహావ్యోమ్ని సా
పూజా హ్యాదరాళ్యః
పూజ అనగా కేవలము పుష్పములు
అర్పించుటయేగాదు. పూజ అనగా తన
హృదయమును ఆలోచనారహితముగా భగవంతునికి అర్పితము చేయటము. అది తీవ్ర ఆవేదనతో తననుతాను
భగవంతునికి అర్పించుకోవటమే.
నిశ్చితమయిన మనస్సులోని కోరిక
ప్రారబ్ధకర్మనుకూడా దూరము చేయ గలదు. ఇది శూన్యమయిన అనుభవములకంటే శ్రేష్టమయినది. ఆ
కోరిక తన అసలు రూపమును అనగా సత్య స్వరూపమును తెలిసికోవటము, లేదా పరి పూర్ణతకు, అటుపిమ్మట అది శరీరబానిసత్వమునుండి విముక్తికి
దారితీస్తుంది. ఆ కోరిక ఆత్మను మరియు ప్రపంచమును ఉన్నతస్థితి చేరుటకు
తోడ్పడుతుంది. శుద్ధబుద్ధి ఉన్న వ్యక్తి మాత్రమె ఈ స్థితిని చేరగలడు.
యం యం లోకం మనసా సంవిభాతి
విశుద్ధసత్వః కామయతే
యామ్శ్చ కామాన్ తం తం లోకం జాయతే తామ్శ్చ కామాన్
ముండక – ఉపనిషద్ III-1-30.
శుద్ధమనస్సుగల వ్యక్తి తను
మానసికముగా అభిలషించిన న్యాయపూరిత మయిన కోరుకున్న వస్తువులను పొందగలడు.
మాతృక శక్తి నుండి ఉదయించిన
కార్య కారణ సంబంధముతో కూడినదే ఈ జగత్తు. ఇది పరావాక్ యొక్క విస్తరణయే. ఈ విస్తరణ షఢధ్వ అనే ఆరు మార్గముల ద్వారా జరుగుతుంది. వీటిలో మూడు వాచ్యము వైపు, మిగిలిన మూడు వాచకము వైపు ఉంటాయి.
వాచకము వైపు ఉన్న త్రయమును
కళధ్వ లేదా లౌకిక క్రమము
అని, వాచ్యము వైపు ఉన్న
త్రయమును దేశధ్వ లేదా ప్రాదేశిక క్రమము అని అంటారు.
ప్రతి సమూహములోని (group) మూడు అధ్వలు కూడా పరాదశ (అత్యుత్తమ మైన దివ్యశక్తి) లోని పశ్యంతి, మధ్యమ, మరియు వైఖరీ స్థితులుగా అర్థము చేసికొనవలయును.
శుద్ధసృష్టి లోని శబ్దముయొక్క
అయిదు వర్గములు (categories) అయిదు దశలుగా అర్థము చేసికొనవలయును. మొదటిది పర, సూక్ష్మము మరియు అత్యుత్తమము. రెండవది పశ్యంతి, తక్కువ సూక్ష్మము కాని ఇంకా వేరుచేయ బడలేదు(undifferentiated) లేదా వ్యక్తీకరించలేదు. మూడవది మధ్యమ, స్థూలము మరియు వేరుపరచబడినది కాని ఇంకా స్పష్ఠత చేకూర్చుకోలేదు. స్పష్ఠత చేకూర్చుకున్న శబ్దము వైఖరీ. ఇది సూక్ష్మము మరియు
స్థూలము అని రెండు రకములు.
వైఖరీనుండే వర్ణములు మరియు సంయుక్తాక్షరములు
లేక పదములు మరియు వాక్యములు వ్యక్తీకరించినవి.
పర అనేది శివ తత్వములో ఉండును.
అది శబ్దమునకు మొట్టమొదటి ఉద్యమము. దీనిని నాద తత్వము అంటారు.
పశ్యంతి శక్తితత్వమునకు ప్రతీక.
దీనిని బిందు తత్వము అంటారు. సృష్టి యొక్క అత్యద్భుత శక్తి ఇదే.
ఈ మూడింటినుండి త్రిబిందు
ఉద్భవించినది. అదే అన్ని మంత్రములకు మూలము. సూక్ష్మమయిన మరియు గూఢమయిన కామకళ
కారకము, సమర్ధమయిన దేశికనుండి నేర్చుకోవలయును.
అమ్మలగన్న అమ్మ తనను తాను
ప్రకాశమురూపముగా దర్శనము ఇచ్చినప్పుడు ప్రతి జీవుడి లోని ద్వంద్వమునకు హేతువు తన
ఉనికిని పోగొట్టుకుంటుంది. దేశములోని మరియు మనలోని ప్రతిఒక్కరము ఆ మంత్రశక్తి
యొక్క రూపాంతరముగా అవుతాము. మనలోని శ్వాస నిశ్చలము
అగును. మనస్సు మరియు
ఇంద్రియములు అంతర్ముఖము అగును. మన శరీర చేతన ఉండదు. ద్వైతరహితులము అవుతాము. సర్వమానవ సౌభ్రాతృ త్వమును స్వాదిస్తాము.
అప్పుడు శివ-శక్తిలతో ఐక్యభావము చెందుతాము. ఈ ఐక్యభావమే పరబ్రహ్మన్ అని మహాత్రిపురసుందరి
అని గ్రహిస్తాము.
షఢధ్వములు మూడు స్థితులలో వాటి
పేర్లు ఈ క్రింద విధముగా ఉండును. అవి:
వాచకధ్వ (శబ్ద) > వాచ్యధ్వ (అర్థ) > వాటికి సంబంధించిన
మూడు స్థితులలో నామములు:
వర్ణధ్వ అనగా అక్షరముల మార్గము.
కళాధ్వ అనగా అయిదు సరిహద్దులతో
కూడుకొనియున్నది. అవి - శంత్యతిత కళ (శివతత్వ), శంతకళ (శక్తి లేక శుద్ధ విద్య), విద్యాకళ (మాయ - పురుషుడు), ప్రతిష్ఠాకళ
(ప్రకృతి - జల), మరియు నివృత్తికళ (పరా మరియు పశ్యంతి--పృథ్వీ) .
పదాధ్వ అనగా పదములు మరియు
అక్షరములతో కూడుకొనియున్నది.
తత్వధ్వ (36 తత్వములతో
కూడుకొనియున్న పరిపూర్ణ వ్యవస్థ) —పరాపర లేక మధ్యమ.
మంత్రాధ్వ అనగా మంత్రములతో లేక
మహావాక్యములతో కూడుకొని యున్నది.
భువనాధ్వ అనగా తంత్రశాస్త్రము
ప్రకారము 118 కూడుకొని యున్నది—అపరా లేక స్థూల వైఖరి.
పరా వాక్, శబ్ద లేక పదము, మరియు అర్థము అనేవి విడదీయలేని ఒక బంధము. వ్యక్తీకరణ జరిగినప్పుడు ఇవి వేరుబడటము ప్రారంభము
అవుతాయి. ఈ సృజనాత్మక సంతతి(descent)లో ధృవణత (polarity) ఉంటుంది. అనగా విషయము మరియు
వస్తువు ఉంటాయి. విషయము అనగా చేసే వ్యక్తి(subject), వస్తువు అనగా లక్ష్యము(object).
ఉదా: రాముడు వేదము చదివెను.
ఇక్కడ రాముడు వ్యక్తి, వేదము చదివెను అనేది లక్ష్యము. ఈ సృజనాత్మకలో ఉత్కృష్టమైన అనగా అత్యంత సూక్ష్మ మయినది పరా. అది స్థూలమయిన వైఖరీకి
దారితీస్తుంది.
శబ్దాధ్వ అనగా ఆఖరికి పరా లేక పరాశక్తి స్థితిలోకి చేరటము, తద్వారా అమ్మ
దయతో ఆమెని పొందటము. లేనియడల తిరిగి సంసారబంధములో చిక్కు
కుంటాము. భైరవ శ్రీదేవి సంభాషణలో ఇది తేటతెల్లము
అవుతుంది.
నహి వర్ణవిభేదేన దేహభేదేన వా
భవేత్
పరత్వం నిష్కళత్వేన సకళత్వేన
తద్భవేత్
కళాధ్వ లేక దేశధ్వలతో పరాస్థితి స్థిరముగా ఉండదు. పరాస్థితి అనేది
అబేధస్థితి. ఆ అబేధస్థితి సకల లేక మిశ్రమ స్థితులతో కలిసి ఉండలేదు.
కనుక అనేకమును (కళాధ్వ లేక
పురుష మరియు దేశధ్వ లేక శక్తి) ఒక్కటి అనగా పరాశక్తి లేక పరబ్రహ్మంగా చేసికోవటములోనే ఈ బంధమునుండి విముక్తి కలుగును.
త్రైపుర సిద్ధాంతములో, ముఖ్య శక్తి మూడుగా అనగా
వ్యష్టి (విభావ)వ్యక్తీకరణ
సమిష్టి (ప్రభావ)వ్యక్తీకరణ, మరియు
ఒప్పుకోలు(అనుభవ)వ్యక్తీకరణగా
మారుతుంది.
త్రిపురములలో నివసించేదే
ముఖ్యశక్తి లేక పరాశక్తి. దానినే శ్రీ త్రిపుర అంటారు. శ్రీ త్రిపుర లేక శ్రీ
త్రిపురసుందరి అమ్మ
బ్రహ్మ విష్ణు రుద్ర లేక అగ్ని వాయు సూర్య లేక వసు రుద్ర ఆదిత్య లకి అతీతమయినది.
ఆహావనీయాగ్ని అనగా యాగాగ్ని,
గార్హపత్యాగ్ని అనగా గృహము లోని
అగ్ని,
దక్షిణాగ్ని అనగా శరీర దహనాగ్ని,
అనే మూడు అగ్నిలు వ్యక్తి
జీవితములో, జననము నుండి మరణము వరకు, ముఖ్యమయినవి.
యోగి జీవితములో ఆహావనీయాగ్ని
హృదయమునకు సంబంధించినది. గార్హపత్యాగ్ని ఫాలభాగమునకు (కూటస్థము) సంబంధించినది.
దక్షిణాగ్ని శిరస్సునకు
సంబంధించినది.
మూడు శక్తులు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, మరియు జ్ఞానశక్తి.
ఇవి నిజానికి బ్రాహ్మి, రౌద్రి, మరియు వైష్ణవి శక్తులు. ఇవ్వి శ్రీదేవి యొక్క మూడు
ముఖ్య శక్తులు. ఇవ్వి ఈ జగత్తు యొక్క వ్యక్తీకరణకు తోడ్పడుతవి. ప్రతి అణువులోను ఈ
మూడు ముఖ్య శక్తులున్ను పనిచేస్తూ ఉంటాయి.
మూడు స్వరములు:
ఉదాత్త—అనుదాత్త—స్వరిత అనేవి
వేదిక మంత్రము(ల) ఉచ్ఛారణ పద్ధతులు.
హ్రస్వ, దీర్ఘ, మరియు ప్లుత అనే అకార – ఉకార – మకార ఓంకార ఉచ్ఛారణా పద్ధతులు.
మూడు కూటములు (గాయత్రి, బాల, లేక పంచదశి లేక షోడసి).
అవి: వాగ్భావ, కామరాజ, మరియు శక్తి కూటములు.
మూడు లోకములు: అవ్వి--
భూ – పృథ్వీ, భువః – ఆకాశము, మరియు స్వః – స్వర్గము.
మూడు చక్రములు: మూలాధార – అనాహత – ఆజ్ఞా
విజ్ఞులు ఈ మూడింటి మీద
ఆధారపడుతారు. ప్రమాత (అధికారత), ప్రమాణ (సాక్ష్యము), మరియు ప్రమేయ (సిద్ధాంతము).
మూడు పీఠములు: జలంధర, కామరూప, మరియు పూర్ణగిరి
మూడు పవిత్ర తీర్థములు: నాసిక్, పుష్కర, మరియు ప్రయాగ.
జగత్తును శాసించే శక్తులు:
ఓం – తత్ – సత్ -- వేదముల ప్రకారము
నర – శివ – శక్తి --- తంత్ర ప్రకారము
జీవ – జగత్ – ఈశ్వర – వేదాంతం ప్రకారము
ఇడ – సుషుమ్న – పింగళ – కుండలినీ యోగము ప్రకారము
భూత – వర్తమానము – భవిష్యత్ — మూడు కాలములు
హృదయ – వ్యోమ – బ్రహ్మరంధ్ర — మూడు రంధ్రములు
బ్రహ్మ – క్షత్రియ – వైశ్య అని మూడు వర్ణములు.
ఋగ్ – యజుస్ – సామ అని మూడు వేదములు.
అంబ మనకు అనేక రూపములలోను, మరియు వ్యక్తీకరణలలోను దర్శనము ఇస్తుంది.
ఆవిడను శ్రీలక్ష్మి రూపములో
దర్శిస్తే మనము భౌగోళికము అయిన కష్టములను అధిగమించవచ్చు.
ఆవిడను జయదుర్గ రూపములో
దర్శిస్తే మనము విజయము సాధించవచ్చు. కష్టతరమయిన మరియు ప్రమాదకర మయిన భౌగోళికము అయిన
ప్రయాణము తలపెట్టేముందర ఆవిడను క్షేమాంకరి రూపములో దర్శిస్తే ప్రమాదములను
అధిగమించవచ్చు.
ఆవిడను మహాభైరవి రూపములో
దర్శిస్తే భూత ప్రేత పిశాచములనుండి విముక్తి పొంద వచ్చు.
ఆవిడను తార రూపములో దర్శిస్తే
వరదలు, భూకంపములు, మరియు నుండి నుండి విముక్తి పొంద వచ్చు.
నిజానికి ఆ అమ్మ సంసారము అనే
నీటిలో మునిగిపోవు జీవుడికి చేయూతనిచ్చును అని అర్థము.
ఆవిడను త్రిపుర రూపములో
దర్శిస్తే జనన – మరణ – జనన వృత్తము నుండి విముక్తి పొంద వచ్చు.
శక్తోపాయ అనగా సత్యాన్వేషణ.
దీనిలో ప్రతిబింబించుట అనగా మనస్సును లక్ష్యముమీదనే ఆలోచన, మరియు ఏకాగ్రత పరచుట.
సత్యాన్వేషణకి ఆచరణకై జ్ఞానమును సమాయత్త పరచవలయును. కనుక
శక్తోపాయమునకు జ్ఞానశక్తి ముఖ్యము. దీనినే జ్ఞానోపాయ అనికూడా అందురు.
సత్యమయిన జ్ఞానోపార్జనకు
మార్గము మూలము మరియు ప్రతిబింబం లేదా బింబ - ప్రతిబింబ వాదము. అనగా ఉత్కృష్ట
స్థితిలోనున్నదే క్రింద స్థితిలో ఉన్నదానికి మూలము. పశ్యంతి, మధ్యమ, మరియు వైఖరీల వ్యక్తీకరణకు మూలము ఉత్కృష్ట
స్థితిలోనున్న ‘పరా’ యే.
ఆగమ సిద్ధాంతం ప్రకారము అంబ లేక
అమ్మ రెండు పాదములు శివ మరియు శక్తి. అవి జ్ఞాన మరియు క్రియాశక్తికి ప్రతీకలు. ఈ తత్వమును
అర్ధనారీశ్వర లేక అర్ధనారీశ్వరి తత్వము అంటారు.
అంబ యొక్క సువర్ణరంగులోయున్న ఒక
కుండ మాదిరియున్న స్థనము ఆనందమునకు ప్రతీక. ఆ ఆనందపు అమృతమువంటి క్షీరము త్రాగుటకు
కుమారస్వామి మరియు గణేశుడు పోటీ పడుతూ ఉంటారని అభియుక్తుడు అంటారు.
ఎత్తుగాయున్న చరణమును నిర్వాణచరణము
అంటారు. అది శక్తియొక్క మూలమునకు ప్రతీక. అది బంధమును ఛేదించుటకు వలసిన దివ్యమయిన జ్ఞానమునకు ప్రతీక. యోగదృష్టిలో ప్రాణ మరియు అపాన కలిసి సుషుమ్నా
సూక్ష్మనాడిలోకి ఎక్కడ ప్రవేశిస్తాయో అది బిందువునకు ప్రతీక. అది ఒక్క గురువు ద్వారానే
సాధ్యము. ఆయన ద్వారా నేర్చుకున్న జ్ఞానభిక్షే శివం అనే ముఖద్వారము (gateway) ను తెరవగలదు. అదే విశ్వమానవ సౌభ్రాతృత్వ మునకు, మనమంతా భగవంతును బిడ్డలము, మరియు పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్వేషణా జ్ఞానమునకు
దారితీయగలదు. అది అమ్మ పరాశక్తి
సరి అయిన సమయములో సద్గురువు ద్వారా శక్తిపాతము లభ్యము అయి నప్పుడు మాత్రమె సాధ్యమగును. అప్పుడు అహంకారము
మొత్తము సమూలముగా నాశనమగును. ఇక తిరిగి చిగురించదు.
మూడు ఉపాయములు:
అనవ, శక్త, మరియు శాంభవ. అవి ఆత్మసాక్షాత్కారమునకు తోడ్పడుతవి. వాటి కలయిక నిజానికి అనుత్తరకు దారి
తీస్తుంది. దానిని జగదానందస్థితి అంటారు. దానిలో జగత్తు అంతా దివ్యముగా మారి
పరమాత్మతో ఒక్కటిగా రూపు దిద్దు కుంటుంది. ఆస్థితిలో అన్ని సమయములలోనూ, ఎక్కడ చూసినా అనగా అంతటా సర్వములోనూ ఆనందమే ఆనందము. భేదభావము లేకుండా అభిన్న
భావము అన్నివైపులా లోపలా బయటా పొడసూపుతుంది. చైతన్యమే తనను తాను జ్ఞాత, జ్ఞేయము, మరియు జ్ఞానము క్రింద అనుభవము చెందుతుంది. అది
ధ్యానమునకు కూర్చోనకపోయినాను పరిపూర్ణ అమృత ఆనంద సార్వభౌమత్వతీవ్రత వృద్ధి చెందుతూ ఉంటుంది. నిత్యఅవగాహనా జగదానందస్థితి అటువంటిది. ఇది ఆరు విధములయిన ఆనందములకు
అతీతమయిన స్థితి. ఆ ఆరు విధములు:
1.నిజానంద– మనస్సు కేవలము అనుభవముమీదనే ప్రతిష్ఠితమై ఉండటము (ప్రమాత).
2.నిరానంద – మనస్సు అనుభవమునకు రాని/కాని విషయములపై దృష్టి పెట్టటము.
3. పరానంద – మనస్సు ప్రాణ అపాన వాయువుల కలయిక బిందువు మీద దృష్టి పెట్టటము.
4. బ్రహ్మానంద – మనస్సు సమానవాయువు మీద దృష్టి పెట్టటము. అది
వివిధములయిన అనుభవైకవేద్యములయిన విషయములను ఒక్కటిగా చేస్తుంది.
5. మహానంద – మనస్సు ఉదానవాయువు మీద స్థిరపడటము. అది సర్వ
జ్ఞానమును మరియు అనుభవైకవేద్యములయిన విషయములను ఆత్మలో మమైకం చేస్తుంది.
6. చిదానంద– మనస్సు వ్యానవాయువు మీద స్థిర పడటము.
అయిదువిధములయిన పరాంబ మహత్యము ఈ
క్రింద చెప్పటమయినది. అవి: సృష్టి, స్థితి, సంహార, తిరోధానం లేక విళయం, మరియు అనుగ్రహం.
సృష్టి: సృష్టి పని.
స్థితి: వ్యక్తీకరణను రక్షించే
విధము.
సంహార: వ్యక్తీకరణను
ఉపసంహరించుకునే విధము.
తిరోధానం లేక విళయం: ఆత్మను
కప్పి ఉంచుట లేక ఆచ్ఛాదనం చేయుట.
అనుగ్రహం: దయ లేక స్వీయ ప్రకటన.
ఈ అయిదు వ్యష్టిలోని జీవుడుకూడా
సాధించవచ్చు.
1. దేవతల ద్వారా లేదా గ్రహింపు ద్వారా కనపడేదాన్ని ఆభాసన లేక సృష్టి అంటారు.
2. ఆఖరి వరకు అనుభవాన్ని ఆస్వాదించు అనే దేవతను రక్తి లేక స్థితి అంటారు.
3. ఒక వస్తువునుండి తనను తాను విమర్శ సమయములో ఉపసంహరించు కొను తెలివిని సంహార అంటారు.
4. వివిధములయిన అనుభవముల ఉపసంహరణ
అనేది సందేహములతో కూడిన సంస్కారములు లేక గుర్తులకు దారితీయును. అవి ఆఖరికి అంతర్గత
సందేహము అనే పురుగును పుట్టిస్తుంది. ఆ పురుగు మాటి మాటికి తొలుస్తూ ఉంటుంది. అది
ఆత్మ యొక్క నిజప్రకృతిని మరుగున పరుస్తుంది లేదా కప్పిపెడుతుంది. దీనిని విళయ లేదా
బీజావస్థాపన స్థితి అంటారు.
5. సాధకునిలోని సందేహము మరియు అనుభవము రెండూను చైతన్యము అనే నిప్పులో
కాలిపోయినప్పుడు, ఆ సాధకుడు అమ్మ
దయకు పాత్రుడవుతాడు. అప్పుడు అతని సత్యస్వరూపము బయట పడుతుంది. దీనిని హఠపాకను
అనుసరించి అనుగ్రహము లేక విలాపన అంటారు.
హఠపాకను అనుసరించి యోగి అమ్మ దయస్థితిలోకి
ప్రవేశిస్తాడు. దీనిని అలంగ్రాస లేక ఆత్మసాక్షాత్కారము అంటారు. ఈ స్థితిలో
సంస్కారములు లేదా సంసారబీజము వ్యక్తిచైతన్యమునుండి సమూలముగా నాశనము అవుతాయి. అమ్మదయ నియమరహితమయినది. అది పరాశక్తియొక్క ఉచిత మరియు సార్వభౌమ అభిమతము. నిరహంకారరహితమయిన
సాధకునిమీద అమ్మ అపారమయిన దయచూపుతుంది.
కుండలినీ యోగములో
కుండలినీశక్తియొక్క కేంద్రము హృదయము. అది వ్యక్తి శరీరములో కంఠ మూలములోని
విశుద్ధిచక్రమే స్థానము. పురోగతి ప్రాణము సుషుమ్న సూక్ష్మనాడిద్వారా మెరుస్తూ ఉండే
ఆనందము కలుగ చేసే లంబిక (చతుష్పథ)చతురస్రము లోనికి దారితీస్తుంది. దీనిని
క్రియాయోగములో ఊర్ధ్వరేచకము అంటారు. సిద్ధగురువు దయతో సాధకుడు ప్రాణశక్తిని
నియంత్రిం చ గలుగుతాడు. దీనిని గురుయుక్తి అంటారు. అప్పుడు తనలో దాగియున్న శక్తి
మేల్కొంటుంది.
సాధకుడు అమ్మ దయతో
కుండలినీప్రాణశక్తిని సుషుమ్న సూక్ష్మనాడిద్వారా హృదయమునకు పంపిస్తాడు.
మూలధారమునుండి అమిత శక్తి మరియు తాపముతో వచ్చే ఈ శక్తిని వహ్నికుండలినీ అంటారు. ఈ
విధముగా సాధకుడు తన శ్వాస, మనస్సు, మరియు శుక్లములను నియంత్రించగలుగుతాడు. ఈ మేల్కొన్న కుండలినీప్రాణశక్తి బ్రహ్మనాడిలోకి ప్రవేశిస్తుంది. దీనిని మధ్య మార్గము
అంటారు. ఈ బ్రహ్మనాడిమార్గము అత్యంత సూక్ష్మము. ఈ శక్తి
సింధూర వర్ణములో ఉంటుంది. అమ్మయొక్క క్రియాశక్తి పధ్ధతి ఈ విధముగానే ఉంటుంది.
అమ్మ నిష్కల. మహాత్రిపుర సుందరి, మరియు కుండలినీప్రాణశక్తి రెండూ ఒక్కటే. ఆరు చక్రములలో మేల్కొన్న కుండలినీ
ప్రాణశక్తి లేక మహాత్రిపుర సుందరి సహస్రార చక్రములో పుష్పిస్తుంది. దీనిని షట్
చక్ర భేదన అంటారు.
పరభట్టారకుడి ఇచ్చాశక్తి
ప్రధానముగా ప్రస్ఫుటమైనప్పుడు, అది శక్తిబాల యొక్క
కన్యాతనమును బయలుపరుస్తుంది. ఇచ్చాశక్తి స్పష్టముగా ప్రవహిస్తుంది. జ్ఞానశక్తిని
అధిగమిస్తుంది. జగత్తు యొక్క వ్యక్తీకరణకు దారి తీస్తుంది. వ్యక్తీకరణకు దారితీయు
పరిణామములో మహామాయ అనేది ఆరవ మెట్టు.
అభేదము తొలగిపోయి భేదము చోటుచేసి కుంటుంది. సృష్టి పరిణామములో మహామాయ తన
మనోహరశక్తిని ప్రదర్శిస్తుంది. పరాశక్తి సాధకుడిపై దయచూపించే సరళిలో ఇంద్రియములతో కలవరపెట్టనీయదు. దానికి
బదులుగా సాధకుడిని ఇంద్రియములద్వారా మహోన్నతమయిన ఐక్యతను అర్థము చేసికునేటట్లుగా
చేస్తుంది. పరాశక్తి అనైక్యతనుండి ఐక్యతకు దారితీస్తుంది, తీసేటట్లు చేస్తుంది, తీయిస్తుంది. అందువలననే ఆవిడను మహాశక్తి లేదా
ఆశ్చర్యకరమయినశక్తి అంటారు. దానిని ఆ
అమ్మ తన అటువంటి శక్తిని భిన్నత్వములోను, మరియు ఏకత్వము (evolution and involution) రెండింటిలోను ప్రదర్శిస్తుంది. ఆ అమ్మ మచ్చలేని మహత్యము అన్నిచోట్లా, అన్నివైపులా ప్రకాశిస్తూనే ఉంటుంది.
మానవ ప్రయత్నము లేకుండగనే
అప్రయత్న(involutionary) పూరక మయిన పద్ధతిలో ఆ అమ్మ
యొక్క మహోన్నతమయిన సత్యమును గ్రహించుటకు, ఆ అమ్మయొక్క దివ్యమయిన సార్వభౌమత్వమయిన మహా మాయ, సాధకునికి తనకుతానే వరముగా ప్రసాదిస్తుంది. ఈ ఆత్మసాక్షాత్కార మార్గమునే శాంభవోపాయ అంటారు. ఈ సత్యము పైకి కనబడదు. అమ్మ దయతో ఇది కొందరికి గోచరము అగును అనేది
సత్యము. తంత్ర శాస్త్రములో
దీనిని ఇచ్ఛా యోగము అని కూడా అంటారు. ఇది ప్రకృతిలో అంతర్ దృష్టి అంటారు. కేవలము
అమ్మ దయా వీక్షణములతోనే మహోన్నతమయిన యోగార్తులకే లేదా యోగ సాధకులకే ఇటువంటి అంతర్ దృష్టి సాధ్యము. మానసిక వీక్షణ
(క్రియోపాయ) మరియు జ్ఞాన వీక్షణ (జ్ఞానోపాయ) అనేవి వెనక్కి నెట్టబడుతాయి.
ఆత్మసాక్షాత్కార మార్గమునకు అనుకూలముగా సాధన చేయనీ లేదా చేయకపోనీ, నిజమయిన సత్యాణ్వేషికి శాంభవోపాయ మార్గము ద్వారా ఇది సుసాధ్యము. సాధకుని మనో ప్రవృత్తి నిష్కళంకముగా ఉన్నప్పుడు
ఇచ్ఛాశక్తి ప్రస్ఫుటముగా ప్రకాశిస్తుంది. అన్నిటిలోను లోపల బయట చొచ్చుకొనిపోగల
లేదా వ్యాపించగల దివ్యమయిన స్థిరమయిన ఆత్మ జ్ఞానమును శాంభవోపాయ అంటారు. అది
శక్తిపాతము యొక్క పరాకాష్ట.
పరమేశ్వరునియొక్క అనేకమయిన
అపారమయిన శక్తులు అమ్మ దయ చూపినప్పుడు యోగికి చేకూరుతాయి. సాధకుడు తన ఏకాగ్రతను పెంపొందిం చుకో గలుగుతాడు.
తద్వారా సమతుల్యతతోకూడిన ఆధ్యాత్మిక ఆనందము పొందగలుగుతాడు. సాధకునికి నాలుగు
విధములయిన సంప్రజ్ఞాత సమాధులు ఏర్పడుతాయి లేదా చవిచూస్తాడు. తద్వారా యోగినీశక్తులు
సాధకునికి సహాయ భూతమవుతాయి. అవి:
1. సవితర్కసమాధి: యోగినీశక్తులు సాధకుని నిరంతరమూ చూచుటకు ఇష్ట పడుట లేదా యోగికి ఆలోచించే ఏకాగ్రత అనుభవముచెందుట.
2. నిర్వితర్కసమాధి: యోగినీశక్తులు సాధకునిలో మమైకమగుట లేదా మహోన్నతమయిన ఆలోచించే
ఏకాగ్రతను యోగి పొందుట.
3. సవిచారసమాధి: సాధకుడు యోగినిలో మమైకమగుట లేదా యోగి యొక్క ప్రతిబింబతను
యోగిని పొందుట.
4. నిర్విచారసమాధి: యోగి మరియు యోగిని ఒక్కటి అగుట. లేదా మహోన్నతమయిన యోగిని
యొక్క ప్రతిబింబతను యోగి
పొందుట.
ఈ నాలుగు సమాధులను సమతుల్యమయిన
సబీజ సమాధి లేక బహిర్వస్తు బీజసమాధి అంటారు. దీనిలో ఇంకా కొన్ని మూలములు సాధకుని
మనస్సులో మిగిలి ఉంటాయి. దీని తరువాత అన్నిటికంటే అతి శ్రేష్ఠమైన
నిర్వికల్పసమాధిని పొందుతాడు సాధకుడు. దీనిలో లేక దీనితో మనస్సులోని సందేహములు లేక
మూలములు సమూలముగా నాశనమగును. సాధకునిలో అంతర్గత మయిన సమతుల్యమయిన నిశ్శబ్దత
చేకూరును.
అమ్మకు సాధకుడు 12 రకములుగా
తనను తాను లొంగిపోతాడు. ఆ యమ్మ తన ఇచ్ఛా, జ్ఞాన, మరియు క్రియా
శక్తులద్వారా ఈ జగత్తు అంతా వ్యాపించి యున్నది. ఆ యమ్మ ఈ శక్తుల ద్వారా వ్యక్తి మరియు సమిష్టి శరీరము/ జగత్తులలో వ్యాపించియున్నది.
ఆ యమ్మను మనసా వాచా కర్మణా ప్రేమించిన వ్యక్తులను బంధము(ల)నుండి విముక్తులను
చేయును.
ఆ 12 విధములు ఇవ్వి:
1. అంబయే నా నిజమయిన స్వరూపము అని అంబపై ధ్యానము చేయుట.( ధ్యానము)
2. అంబ యొక్క దయను పొందుటకు కృషిచేయుట. (వేత్తి)
3. అంబ యొక్క మంత్రములు నామములు జపించుట (జపతి)
4. అంబను అన్నివైపుల దర్శించుట (ఆలోకయతి)
5. సర్వవేళలా అంబగురించే చింతించుట (చింతయతి)
6. అంబకు విధేయతను ప్రదర్శించుట (అన్వేతి)
7. అంబకు లొంగిపోవుట (ప్రతిపాదయతే)
8. అంబను అర్థముచేసికొనుట (కలయతి)
9. అంబను స్తుతించుట (స్తుతి)
10.అంబను
ఆశ్రయించుట (ఆశ్రయతి)
11. అంబను ఆరాధించుట (అర్చయతి)
12.అంబ గుణములను శ్రద్ధగా వినుట
(గుణానాకమయతి)
జీవిత పరమార్థ సత్యము
తెలిసుకొనుటకు ఈ పై 12 విధముల ధ్యాన పద్ధతులు ప్రణవముయొక్క 12 మాత్రలు. వీటినే అ, ఉ, మ, అర్థ చంద్ర, బిందు, నిరోధిక, నాద, నాదాంత, శక్తి, వ్యాపిని, సమన, మరియు ఉన్మన. పన్నెండవ మాత్ర అయిన ఉన్మన అత్యంత గౌరవనీయమైన అతీతమయిన
అన్నింటినీ మించిన పర యొక్క ఆసనము లేక పీఠం. యోగి ఈ దివ్యమైన వర్ణనాతీతమయిన ధర్మములను (attributes) యదేచ్ఛమైన(spontaneous) శ్రద్ధతో ఆలకిస్తూ
పరమానందముతో తరించిపోతాడు.
కుండలినీ అనేది చిత్ శక్తి, ప్రాణశక్తి, లేక చైతన్యశక్తి. విద్యుత్ శక్తికి మూలము కేవలము ఇదే, వేరొకటి కానేకాదు.
తంత్రము లేదా తాంత్రిక కుండలినీ యోగము యొక్క ఉద్దేశ్యము లేక సంకల్పము ఈ కుండలినీ
శక్తిని నియంత్రించుట. నియంత్రించిన ఈ శక్తిని ఉత్కృష్టమైన, మహత్తైన లేక ఘనమైన మార్గములకు మళ్ళించుట. ఈ కుండలినీశక్తిని
సరియిన మార్గములకు మళ్ళించుటను నిరోధించునది ముఖ్యముగా అహంకారమే. ఈ నిరోధనద్వారా
వ్యక్తి తన పరమానందము, సౌందర్య నిత్యత, శాంతి, అమిత మయిన సర్వోపన్నమయిన ఆనందము పోగొట్టుకుంటాడు. కుండలినీ యోగి యొక్క నాడీవ్యవస్థ
ద్వారా తనను తానూ వ్యక్తీకరింపచేస్తుంది. సాధారణ జీవితము గడిపే ప్రతి వ్యక్తిలోను ఇది సగం మేల్కొని ఉంటుంది. ఇది ఎంత జాగృతి చెందుతే అంత అందము, అంత ఆనందము, అంత జీవితము.
ప్రాణ కుండలినీ అనేది స్థూల లేక
భౌతిక స్థితిలో పని చేస్తుంది.
నాద కుండలినీ అనేది మానసిక లేక
సూక్ష్మ స్థితిలో పని
చేస్తుంది.
బోధ లేక జ్ఞాన కుండలినీ అనేది
ఆధ్యాత్మిక స్థితిలో పని చేస్తుంది.
కుండలినీ అనేది శరీరములో అది
ఉండే స్థలమును బట్టి విభజించబడుతుంది.
1. అర్ధకుండలినీ: అది మూలాధార వద్ద
నిద్రాణమయి ఉంటుంది.
2. ఊర్ధ్వకుండలినీ: రెండు కనుబొమ్మల
మధ్య భాగమును ఆజ్ఞా పాజిటివ్ చక్రము లేదా కూటస్థము అంటారు. బ్రహ్మరంధ్రము లోనికి
ప్రవేశించు కుండలినీ శక్తిని ఊర్ధ్వకుండలినీ అంటారు.
3. పరాకుండలినీ: పరమశివుని సర్వోత్కృష్టమైన స్థితిని పరాకుండలినీస్థితి అంటారు.
సహస్రార మరియు దానికి అతీతముగనున్న ప్రదేశమును కైలాస పర్వతము అంటారు.
మేచకాభ తంత్రములో ఈ ఆరు
చక్రములకు ఇంకా అర్థవంతమయిన నామములతో పిలుస్తారు. మూలధారములో నాదచక్రము, నాభిస్థానములో మాయాచక్రము, హృదయములో యోగాచక్రము, గొంతులో లేదా లంబికలో భేదనచక్రము, అని పిలుస్తారు. ఈ భేదనచక్రమును లంబికాయోగములో తరచుగా
పేర్కొంటారు.
శృంగేరి శ్రీ విద్యాశంకర
మహాస్వామి ఈ లంబికాయోగసమాధిలో నిత్యమూ చతుర్మూర్తీస్వర
శివలింగ రూపములో మునిగిఉండేవారు, ఈ రోజుకూ మునిగిఉన్నారు. దానిమీదనే విద్యాశంకర మందిరము అనే సుందరమయిన
శివమందిరము నిర్మించారు. ఆ గొప్పగురువు దయవలన ఈ పవిత్ర మందిర ములో సాధనచేయు సాధకుల
సందేహములు తీరిపోవటము గమనార్హము.
కూటస్థములోనిది దీప్తిచక్రము
అంటారు.
బ్రహ్మరంధ్రము లోనిది
శాంతిచక్రము అంటారు.
వీటిలో ఆరవది అయిన శాంతిచక్రము
అతి ముఖ్యమయినది. దీనిని స్వాధిష్ఠానము అని తప్పుగా పొరబడుతుంటారు. శక్తపద్ధతులలో నిష్ణాతుడు అయిన గురువు దగ్గిర ఈ
శ్రీచక్రము లోని లోపలి వైపుని అర్థము చేసికొనవలయును. ఆరు దళముల ఈ శ్రీచక్రము సుషుమ్న యొక్క నిగూఢమయిన శరీర
శాస్త్రమును తెలుపుతుంది. మూలాధారములో శివ
త్రికోణము ఇంకొక శక్తి త్రికోణముతో కలిసియుంటుంది. త్రికోణములు రెండూ వాటి మొనలు
ఒకదానికొకటి ఎదురెదురు(opposite)గా ఉండేటట్లుగా
కలిసి ఉంటాయి. యోగశాస్త్రానుసారము భౌతికశరీరములో దీని స్థానము ఆజ్ఞా చక్రము. శివ
మరియు శక్తి విడివిడిగా త్రికోణాకృతిలో ఉన్నప్పటికీ, వాటి కలయిక షట్కోణాకృతి. శివత్రికోణము (బిందు) శక్తి త్రికోణము (యోని).
రెండింటి కలయికను షట్కోణముద్ర లేక శాంభవీ ముద్ర అంటారు. దీనిని ఓంకార పీఠము అంటారు. బీజ మంత్రము యొక్క
ఆసనస్థానము.
తరువాతది హృత్ కర్ణిక లేదా
ముఖముద్ర. ఇది హృదయము పద్మము యొక్క కేంద్రము. ఈ హృదయ పద్మము మీదనే సాధకుడు ధ్యానము చేయవలయును. హృదయ పద్మమును అమృత బీజము
అంటారు. ఇది సాధకుడిని జగదానంద స్థితికి తీసికెల్తుంది.
స్వామీ లక్ష్మణజు
ప్రకారము పరిణితి చెందిన సాధకులు కుండలినీని మూడు స్థితులలో అనుభూతి చెందుతారు.
మొదటిది మత్తు లేక మైకము స్థితి. జాగృతిచెందిన కుండలినీ మూలాధారమునకు పరిమితమై ఉంటుంది. దీనిని అర్ధకుండలినీ
స్థితి అంటారు.
అటు పిమ్మట కుండలినీ సుషుమ్నా
నుండి బ్రహ్మరంధ్రము వరకు ఉన్న మార్గములో ఒక మెరుపు మాదిరి మెరుస్తుంది. దానిని ఊర్ధ్వకుండలినీ స్థితి అంటారు.
ఈ రెండు ప్రదేశములలోను, అర్ధకుండలినీ స్థితి, మరియు ఊర్ధ్వకుండలినీ స్థితి, ధ్యానము చేయుటను పరాత్రింశికలో చక్కగా విశదీకరించారు. ఆదికోటి అనగా
బహిర్ద్వాశాంత మరియు అంతకోటి అంతర్వాదశాంత, వీటినే అర్ధ మరియు ఊర్ధ్వ కుండలినీ అంటారు. వీటి కలయికను
షట్కోణ ముద్ర లేక షట్పాత్ర కమలము అంటారు.
ఆది అనంతము లేని ఒక బిందువు మీద
యోగి ధ్యానము చెయ్యాలి. 15 అచ్చుల పైనను, అటుపిమ్మట 16వది అయిన శివ హృదయ కమలము మీద యోగి ధ్యానము చెయ్యాలి. 17 వ కళ సందిగ్ధరహిత మయిన బిందుకళ
అంటారు. అక్కడ ప్రాణ మరియు అపాన రెండూ ఉండవు. దీనిని సోమాంశం అంటారు. మహాసప్తదశి
నిత్య తర్పణము వెనకాలున్న ప్రాముఖ్యత ఇదే. నిత్యకళార్చనం ఆచారము లో ఇది షోడశి
నిత్య కంటే అతీతమయినది. ఇది తురీయాతీత మరియు తురీయకు సంబంధించినది.
దీర్ఘ సాధనద్వారా సాధకుడు తన
ప్రాణశక్తిమీద పట్టు సాధిస్తాడు. ఈ నేర్పరి తనము ద్వారా ఇంకా ముందుకు వెళ్లి
ఊర్ధ్వకుంభకము సాధిస్తాడు. ముఖ్యప్రాణము యొక్క ఉఛ్వాస నిస్వాసలను రెండు విధములుగా
ఉపయోగించుకుంటాడు సాధకుడు. ప్రాణమును అపానములోను, అపానమును ప్రాణము లోను, మమైకము చేస్తాడు.
సిద్ధ సంప్రదాయము ప్రకారము
ఆధ్యాత్మికముగా ఇవి 14వ మరియు 15వ క్రియలను సంబంధించినవి. శ్రీ లాహిరీ మహాశయ ఎనిమిది క్రియల గురింఛి సాధకులకు
తెలియజెప్పారు. 72 క్రియలవరకు ఉన్నాయి. వీటిలో 25 వరకు కొంతమందికి తెలుసు. ఈ 25
క్రియలలో ఆఖరి రెండుగురించి మాట్లాడుదాము. అవి, 1) సంహారక్రియ: దీని వలన యోగి బ్రహ్మరంధ్ర ద్వారా బయలు వెడలుతాడు. 2)
బ్రహ్మమేలన క్రియ. దీనినే ఆనంద క్రియ అని, మహాక్రియ అని, సమాధిక్రియ అని, కులామ్రితక్రియ అని, మరియు నిరాలంబక్రియ అని, కూడా అంటారు. ఈ రెండు మార్గములను దేవయాన లేక ఉత్తర మార్గము, మరియు పితృయాణ లేక దక్షిణ మార్గము అంటారు. వీటికి మించిన మార్గము ఇంకొకటి యున్నది. దీనిని భైరవి
స్థితి అంటారు. అది క్రియా శూన్యతకి దారి తీస్తుంది.
యాన అనగా వాహనము లేక రథము.
యోగాలో దీనిని సుషుమ్న లోకి దారితీయటము అంటారు. అనేక విధములుగా అనేక పద్ధతులలో ఈ
సుషుమ్న రాజమార్గాము లోనికి ప్రవేశించవచ్చు.
దేవయాన మార్గములో అనవోపాయ
పద్ధతిలో ప్రాణవాయువు లోపలికి ప్రవేశిస్తుంది. సక్తోపాయ పద్ధతిలో సాధకుడు
ఆత్మజ్ఞానముతో విలసిల్లిపోతాడు.
పితృయాణ లేక దక్షిణ మార్గము
అనవోపాయ పద్ధతిలో అపాన వాయువు లోపలికి ప్రవేశిస్తుంది. సక్తోపాయ పద్ధతిలో సాధకుడు క్రియాజ్ఞానముతో
విలసిల్లిపోతాడు. అన్నిటికీ మించినది శాంభవోపాయ మార్గము. ప్రకాశ మరియు విమర్శ అనగా
శివ – శక్తి అనే
దివ్యత్వముతో నిరంతర స్థిరత్వముతో ప్రయాణము అవుతూ ఉంటాడు.
షోడశసంస్కారములు
భారతీయ సనాతనధర్మముల్లో ప్రతి
వ్యక్తీ జీవితమూ వివిధ సంస్కారాలతో కూడిఉంటుంది. ఈ సంస్కారముల వెనక ఎంతో విజ్ఞానము
ఉన్నది. ఈ సంస్కారములు ప్రతి ఒక్కరి జీవిత ప్రారంభము ముందు నుంచి మరణానంతము వరకు
జరపబడుతాయి. ఈ సంస్కారములు మొత్తము 16. వీటినే సంస్కారములు అని వ్యవహరిస్తారు. వీటిని తిరిగి రెండు భాగములుగా విభజించడం జరిగింది. జననపూర్వక సంస్కారములు, మరియు జననాంతర సంస్కారములు అని .
గర్భాదానం — పుంసవనం — సీమంతం — జాతకర్మ — నామకరణం — నిష్క్రమణం —అన్నప్రాసనం — చూడాకరణ — కర్ణవేధ — అక్షరాభ్యాసం — ఉపనయనం — వేదారంభం — కేశాంత — సమావర్తనం — వివాహం — అంత్యేష్ఠి
1)గర్భాదానం — వివాహం తర్వాత సత్ సంతానాన్ని ఆశించి మంత్రం
పూర్వకముగా జరిపేసంస్కారము
ఇది. ఈ సందర్భములో చదివే
మంత్రాలు సత్ సంతానాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తాయి.
2)పుంసవనం — ఆరొగ్యమయిన సత్సంతానముకోసము, గర్భారక్షణ కోసము చేసే మొదటి సంస్కారము ఇది. గర్భిణీ స్త్రీకి 3వ మాసములో
మొదటి 10 రోజుల లోపల చేస్తారు. మొలకెత్తిన మర్రివిత్తనములను నూరి ఆ రసాన్ని ‘హిరణ్యగర్భ’ మంత్రాలు చదువుతూ ఆ స్త్రీయొక్క కుడుముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో
ఉన్నప్పుడు చేయడం వలన దృఢకాయుడు, ఆరోగ్యవంతుడు అయిన పురుషుడు పుడతాడని విశ్వాసం. మర్రి
పండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణీ స్త్రీకి వాసన చూపించడం వలన యోని
దోషములు తొలగి గర్భ రక్షణ శక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రములోను, సుశృతములోను చెప్పబడినది.
మోక్షమునకు ఉపయోగబడే ఉత్తమ స్థూల శరీరమును పొందే లక్ష్యముతోనే ఈ
పుంసవన సంస్కారము నిర్ణయింపబడినది.
3) సీమంతోన్నయనం — పుట్టబోయే బిడ్డకి దీర్ఘాయువుకోరుతూ చేసే సంస్కారము
ఇది. ఈ గర్భిణీ స్త్రీకి 7 నుండి 9వ నెల వరకు కూటస్థము నుండి బ్రహ్మరంధ్రము వరకు
పాపిడి తీయాలి. ఆ బ్రహ్మరంధ్రము నుండి గర్భములోని ఆ శిశువుకు ఆత్మజ్ఞానం
కలుగుతుంది అని ఒక నమ్మకం. సాధనకొరకు జీవితమూ అనే ఉద్దేశ్యముతో చేయునది ఈ
సంస్కారము. పుట్టబోయే శిశువుకు
మానసిక ఉల్లాసం అత్యంత అవసరం. దానికి పాటించవలసిన నియమాలు ఈ సంస్కారములో
నిక్షిప్తమయి ఉంటాయి.
4) జాతకర్మ — పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కోస్స్తారు. కోసేముందర తీసుకునే తంతులు వీటిలో ఉంటాయి.
*మేథాజననం — బలానికి, మరియు తెలివితేటలకు నెయ్యి, తేనెలు ప్రతీకలు. బంగారు ఉంగరంతో శిశువు నోటికి అందిస్తారు.
* శిశువు దీర్ఘాయువు కోసరం
ఋషులు, పితృదేవతలు అగ్ని సోములను ఆవాహన చేసే మంత్రములను
శిశువు ముందు చదువుతారు.
* తండ్రి ‘శతమానం భవతి’ అని బిడ్డ చెవిలో చెప్తాడు. అప్పుడు బొడ్డుతాడు కోస్తారు. శిశువును శుభ్రం
చేస్తారు. చనుబాలు పట్టిస్తారు.
5)నామకరణం — పుట్టినబిడ్డకు పేరు పెట్టడం. ఈ పేర్లకు సంబంధించిన నియమములు పరాశర గృహ్యసూత్రాలులో పొందుపరచి ఉన్నవి.
6) నిష్క్రమణ — శిశువును మొదటిసారిగా ఇంట్లోనుండి బయటకు తెస్తున్నప్పుడు
దానికి ముందు నిర్వహించే సంస్కారమే నిష్క్రమణ. ఆ బిడ్డను బలమయిన దుష్టశక్తులనుండి కాపాడుటకు ఆదిభౌతిక, ఆధ్యాత్మిక శక్తుల పరమయిన జాగ్రత్తలు తీసికోవాలి.
7) అన్నప్రాసనం — శిశువుకు మొట్టమొదటి సారి ఘనాహారం తినిపించే
సంస్కారము. శిశువుకు భౌతిక అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ప్రక్రియ ఇది.
వేదమంత్రోచ్చారణలతో పరిశుభ్రమయిన పాత్రలో బిడ్డ నోటికి పెడతారు. తద్వారా సత్వగుణము
పెంపొందుతుంది.
8) చూడాకరణ — పుట్టు వెంట్రుకలు తీయడం అనే సంస్కారము..
9) కర్ణవేధ — చెవులు కుట్టించడం అనే సంస్కారము. 5 సంవత్సరములలోపు
చేయవలసిన సంస్కారము.
10) అక్షరాభ్యాసం — శిశువు మనస్సు తగినంతగా పరిపక్వత చెందాలి. నూతన
విషయములు నేర్చుకొనవలయును. 5 సంవత్సరములో చేస్తారు. దీనిని విశ్వామిత్రుడు 7 వ ఏట
వరకు పొడిగించాడు. ప్రస్తుత కాలమానము ప్రకారం 3 వ ఏటనే చేస్తునారు.
11) ఉపనయనం — అక్షరాభ్యాసం
లాంఛనం. గురువు వద్దకు పంపెముందర చేసేది ఉపనయన సంస్కారము. గాయత్రీ మంత్రం ఉపదేశము చేస్తారు.
12) వేదారంభం — ఉపనయన సంస్కారము అయిన తదుపరి వేదారంభ సంస్కారము మెదలవుతుంది.
13) కేశాంత — చూడాకరణ తరువాత మొదటి సారిగా చేసే క్షవర సంస్కారము
ఇది. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన వారికి చేసే సంస్కారము ఇది. యౌవన చాపల్యములకు
లొంగకుండా బ్రహ్మచర్య ప్రాధాన్యతను తెలియజేసే సంస్కారము ఇది. ఇది జరిగాక తన
గురువుకు ఆవును దానముగా ఇస్తాదు శిష్యుడు.
14) సమావర్తనం/స్నాతకం — విద్యాభ్యాసం ముగించుకొని విద్యార్థి గురుకులాన్ని
వదిలిపెడతాడు. అప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. గురుకులంలో క్రమశిక్షణతో మెలిగి విద్యార్ధనలో
ఉత్తీర్ణుడైన విద్యార్ధిని ‘స్నాతకుడు’ అంటారు. ‘స్నాతకుడు’ వివాహముచేసికొని గృహస్థ జీవితము గడపటకానికి లేదా తానూ గడించిన విజ్ఞానముతో
భౌతిక, మరియు మానసిక బంధాలకు దూరముగా జీవితమూ గడపటానికైనా
సిద్ధముగా ఉంటాడు. వీరిని ఉపకుర్వనులు అని, మరియు నైష్ఠికులని అంటారు.
15) వివాహం — సంస్కారములలో అతిముఖ్యమయినది. వధువుకు తగిన వరుడిని, వరుడికి తగిన వధువును ఎంపికం చేసికోవడం వివాహములో
అతిముఖ్యమయిన ఘట్టం. సపిండీకుల మధ్య వివాహములు నిషేధము. స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి
సిద్ధముగా ఉండే ఆకర్షణను వివాహబంధ రూపములో వేదమంత్రముల సాక్షిగా చేయటమే పెళ్లి.
16) అంత్యేష్ఠి — ఇది చివరి
సంస్కారం. భౌతిక దేహమును విడిచిపెట్టిన జీవాత్మ కర్మానుసారముగా భగవంతునిలో
అయిక్యమగుటకు నిర్వహించే సంస్కారము ఇది. ధర్మబద్ధ జీవనం చేసిన వ్యక్తి ముక్తి పొందుటకు జరిపే సంస్కారం ఇది.
Comments
Post a Comment