Posts

Showing posts from August, 2020

3. అరణ్యకాండ -- రామాయణము

  3.    అరణ్యకాండ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతముగా దండకారణ్య మహారణ్యమును ప్రవేశించెను. అటుపిమ్మట పెక్కు ఆశ్రమములను దర్శించెను. పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః తద్ బ్రహ్మ భవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితం                           1 నియమితమగు ఆహారము తీసుకొనువారును, పవిత్రులైన మహర్షులయొక్క సుశోభితములు, సుందరములు అయిన వారి వారి ఆశ్రమములు బ్రహ్మదేవుని నివాసమువలె తెజోవంతములు, వేదధ్వనితో ప్రతిధ్వనించునవియు అయి యున్నవి.   అత్యంతప్రియుడయిన శ్రీరామ సీత లక్మణులను ఆహ్వానించి తమ తమ పర్ణశాలలకు ఋషులు తీసికొని వెళ్ళిరి. ఆ ఋషులకు జరిగిన విషయము అంతా శ్రీరామ సీత లక్మణులు చెప్పిరి. దానికి ఆ ఋషులు యిట్లనిరి: శ్రీరామా, మేము క్రోధమును వదిలివేసితిమి. రాజు ధర్మమును పరిపాలించువాడును, యశస్వియును, ప్రజలకు శరణ్యుడును, పూజనీయుడును, మాన్యుడును, అందరికీ గురుసమానుడును, అయి ఉండవలయును. మేము   ఇంద్రియములను జయించితిమి. ఇప్పుడు తపస్సే మా ధనము. తమరు మమ్ములను రక్షించవలయును. వారివద్ద సెలవు తీసుకొని మరునాడు ఉదయమే బయల్దేరి ఆ వనమందు ముందుకు సాగిపోయిరి. మార్గమధ్యమములో అక్కడ వారికి ఒక భయంకరమైన రాక్షసుడు తారసపడె