క్రియాయోగము వివరణ

 

టకా ధర్మః టకా కర్మః టకాహి పరమం పదం

యస్య గృహే టకానాస్తి టకాటక టకాయతే

ధనమే ధర్మం, ధనమే కర్మం, ధనమే మోక్షము. ఎఅని ఇంట్లో ధనము ఉండదో వాడు ఎందుకూ పనికిరాదు, వాడి పరిస్థితి కటకటే.

క్రియాయోగము:

ఆదిపురుషుడు పరమాత్మే. దానిలోనిదే  పరాప్రకృతి అనగా ప్రప్రధమ శక్తి. ఆ పరా ప్రకృతియే రాధ. ప్రతి ఆత్మను ప్రత్యగాత్మా అంటారు. ప్రత్యగాత్మలో ఉండేది పరమాత్మయే. 

సత్ అనగా నిత్యమూ ఉండేది, చిత్ అనగా నిత్యమూ చైతన్యములో ఉండేది, మరియు ఆనంద అనగా నిత్యమూ ఆనందముగా ఉండేది.

జన్మ మన కర్మవలననే వస్తుంది. గ్రహాలూ మనమన కర్మల వలననే వాటి వాటి స్థలములో ఉపస్థితమై ఉంటాయి.  వాడి/దాని కర్మ ప్రకారమే వాడి/దాని సూక్ష్మ శరీరము ఆడదాని యోనిలోకి ప్రవేశిస్తుంది. అది భౌతికశరీరమునకు మూలకారణము. మరణము అనగా ఈ జన్మకు సరిపడా ప్రారబ్దకర్మపూర్తి అయిన తదుపరి, కారణశరీరము కలిసిన సూక్ష్మశరీరము నుండి భౌతికశరీరము వేరు పడటమే. ప్రారబ్దకర్మమే జన్మకి మూలకారణము.

మనిషి తన చేతనాపూర్వకముగా తన ఆత్మను భౌతికశరీరమునుండి వేరుచేయగలిగితే, అప్పుడు ఆ పురుషుడు/ స్త్రీ  ని మరణము బాధ దుంఖము కలిగించదు. కాని ఈ స్థితిని కీవలము క్రమశిక్షణతో కూడిన క్రియాయోగ సాధనయే కలిగిస్తుంది. సద్గురువు దయ వలన క్రమశిక్షణతో కూడిన క్రియాయోగ సాధనతో తన మేరుదందములోని చక్రములను సాధకుడు శుభ్రపరచుకుంటాడు. తద్వారాతనలోని కుండలినీశక్తిని వశపరచుకుంటాడు, జాగృతిపరుస్తాడు.  జగత్తు అంతటా ఉన్నది మాయ. ఇదియే mathematics లోని integration. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది కుండలినీ. ఇదియే differention. 

కుండలినీశక్తిని జాగృతిపరుస్తే, అది 1) ఓంకారము వినబడుట, 2) మూడవ నేత్రము లేదా జ్యోతి దర్శనము అగుట, మరియు 3)సమాధి.

జాగృతిచెందిన కుండలినీశక్తి చక్రాలను స్పందింప చేయును. కపాళమును చేరును. సాధకుడు దివ్యుడు అగును.   

క్రియాయోగములో మహాముద్ర, జ్యోతిముద్ర, హాం సా పద్ధతులు ఉండును.

మహాముద్ర మేరుదండమును పెద్దదిగాచేయును. మేరుదండమును సరిచేయును.

నియమితాహారము, శరీరమును ఆరోగ్యముగా ఉంచుటవలననూ, సాధకుడు ఒక సంవత్సరములో పొందే శక్తి, మానసిక మార్పులు, పరిణితిచెందిన మనస్సు, అనేవి కేవలము 42 సెకన్లలో పొందవచ్చు. దానికై ప్రాణశక్తిని మేరుదండములో మూలాధార చక్రమునుండి ఆజ్ఞా పాజిటివ్ చక్రమువరకు, తిరిగి ఆజ్ఞా పాజిటివ్ చక్రము నుండి మూలా ధారచక్రము వరకు త్రిప్పవలయును.  దానికి ఖేచరీ ముద్రవేసి త్రిప్పవలయును. ఇట్లా చేయుటను క్రియా అందురు.

జ్యోతిముద్ర మూడవనేత్రము తెరుచుకొనుటకు ఉపయోగించును. దీనినే జ్యోతి దర్శనము అందురు. దీనికి కూటస్థములో మనస్సును దృష్టిని కేంద్రీకరించవలయును.

ఇద పింగళ నాడుల కలయికే హఠయోగము అందురు. దీనినే ప్రాణ మరియు అపానవాయువుల కలయిక అందురు.

దీనికై ప్రాణాయామ techniques, ఆసనములు, బంధములు, ముద్రలు ఉండే హఠయోగము శరీరమును ఆరోగ్యముగా ఉంచును. 

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, మరియు సమాధి లను కలిపి అష్టాంగయోగము అంటారు. దీనివలన క్రమశిక్షణ, హృదయస్పందన, నరాల స్పందనలు, మనస్సు, ప్రాణశక్తి – ఇవి automatic గా control అవుతాయి. 

మంత్రయోగములోని శబ్దములు లేక నాదముల యొక్క ఉపాసనలు ఆత్మ పరమాత్మల కలయికకు దోహదపడును. 

ఒకేదానిమీద మనస్సును ఏకాగ్రతనుంచుట లయయోగము అంటారు. 

ఓం technique లో మనస్సు ఓం శబ్దముమీద  ఏకాగ్రత చెంది లయమగును. 

జపము లేక మంత్రనాదముచేయుట కూడా క్రియాయోగములోని భాగమే.

అన్ని యోగముల కలయికే క్రియాయోగము.  క్రియాయోగములో హఠయోగములోని శారీరక అభ్యాసములు, ప్రాణాయామ పద్ధతులు, రాజయోగ సాధనా పద్ధతులు, మరియు లయయోగ జపయోగ సారములు ఉండును.

 క్రియాయోగము – ప్రాముఖ్యత:

క్రియాయోగము హృదయము లోని Thymus gland ని activate చేస్తుంది. క్రియాయోగము Blood circulation  improve చేస్తుంది. క్రియాయోగము వలన ప్రతి cell కూడా oxygen పొందుతుంది. అప్పుడు sympathetic, and para sympathetic nerves రెండూ కలిసి పనిచేస్తాయి.

మెదడు అనగా Brain లోని మూడు neuro hormones అనేవి వాత అనగా వాయువు, పిత్త (ఉష్ణ), మరియు శ్లేష్మము లకు బాధ్యతా కారకములు. సరి అయిన ఆరోగ్యమునకు ఇవి అనగావాత అనగా వాయువు, పిత్త (ఉష్ణ), మరియు శ్లేష్మములు balanced గా ఉండుట ఆవశ్యకము. సరి అయిన ఆరోగ్యమునకు strong immune system అత్యవసరము. ప్రతి cell లో ఉండే Mitochondria  అనేది ఒక power generator.   దీనికి cells లోని Mitochondria ని improve తప్పనిసరిగా చేయాలి.   

శ్వాసక్రియ improper గా ఉంటె రక్తము లోని carbon తీసివేసి, oxygen ని కలపాలి. లేనియడల lungs దెబ్బతింటాయి. ఇట్లా carbon తీసివేసి, oxygen ని blood లో కలుపుటను oxygenating blood అంటారు.

హార్ట్ నుండి వచ్చే పోయే రక్తమార్గము నిజానికి చాలా క్లిష్ట మార్గము.  Deoxygenated blood కుడి atrium లోకి superior మరియు inferior vane cava ద్వారా  ప్రవేశించును. అక్కడినుండి కుడి ventricles లోనికి ప్రవేశిస్తుంది. ఇది కుడి atrium ముడుచుకోవటము అనగా contraction వలన  tricuspid valves ద్వారా  కుడి ventricles లోనికి ప్రవేశిస్తుంది.  అప్పుడు deoxygenated blood lungs లోకి oxygenation కోసరము pulmonary artery ద్వారా ప్రవేశిస్తుంది. oxygenation అయిన తదుపరి oxygenated blood left atrium లోనికి  pulmonary veins గుండా ప్రవేశిస్తుంది. 
L
eft atrium ముడుచుకున్న తదుపరి blood left ventricle లోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు arrota ద్వారా oxygenated blood శరీరములోని వివిధ భాగములకు veins మరియు capillaries ద్వారా ప్రవేశిస్తుంది. ఎ  పధ్ధతి మరల మరల జరుగుతూ ఉంటుంది. 

ఒక unit time అనగా ఇక్కడ మనము minute ని unit time గా తీసుకుంటాము. అందువలన హృదయము rate ని beats per minute (bpm)లో వ్యక్తపరుస్తాము.  

Ideal heart rate ని 60—100 beats per minute (bpm) గా నిర్ణయించాము. అందువలన beats per minute (bpm)  100 కంటే ఎక్కువగా ఉంటె దానిని tachycardia అంటారు.  

Heart rate  60 beats per minute (bpm) కంటే తక్కువగా ఉంటె దానిని bradycardia అంటారు.  

రక్తము శరీరము లో ప్రవహిస్తున్నప్పుడు, అది blood vessels walls కి కొట్టుకుంటుంది. ఆ కొట్టుకోవటమును blood pressure అంటారు.

Diastolic blood pressure అనేది arteries లోని minimum pressure. అది cardiac cycle ప్రారంభము అయినప్పుడు అనగా ventricles లో blood నింపబడుతున్నప్పుడు ఉండే blood pressure.

Systolic blood pressure అనేది arteries లోని peak pressure. అది cardiac cycle end అయినప్పుడు అనగా ventricles కాంట్రాక్టు అనగా ముడుచుకుంటు  న్నప్పుడు ఉండే blood pressure. Normal గా ఆరోగ్యవంతుడి blood pressure is 120/80 గా ఉండాలి. 

70--90 mm Hg Diastolic= Normal,

120--100 mm Hg = Systolic

100 సంవత్సరముల క్రిందట 35% Oxygen ఉండేది. ప్రస్తుతం 19% మాత్రమె ఉన్నది. ఆరోగ్య జీవనానికి Oxygen అక్త్యంత ఆవశ్యకము.  క్రియాయోగి మాత్రమే ఈ deficiency ని  క్రియాయోగ ప్రాణాయామ techniques మరియు proper breathing techniques ద్వారా తట్టుకొని నిలబడగలడు.  ప్రస్తుతము Oxygen ని వ్యాపార సరళిలో Oxygen selling saloons ద్వారా జపాన్ లాంటి దేశాలలో విక్రయిస్తున్నారు. ఈ సందర్భముగా  Microwave towers etc.. నుండి విడుదల అయ్యే Radio waves ప్రదూషణల వలన పక్షులు చాలావరకు కనబడకుండా పోవటము గమనార్హము. 

మనిషి:

మనిషి ఒక hot body ని ముట్టుకుంటే వెంటనే చెయ్యిని వెనక్కు తీసికొంటాము. అనగా చర్మము అనే ఒక  receptor ద్వారా message తీసికొని sensory nerves గుండా Cerebrum కి పంపుతుంది. అప్పుడు Cerebrum motor nerves గుండా ఆ సబంధిత organ కి ఆ చెయ్యిని తీసివెయ్యమని message పంపుతుంది.  అదేప్రకారము, స్పర్శ సందేశమే కాక, మిగిలిన వాసన, చూపు, శబ్దము, రుచి ల  సందేశములు sensory మరియు motor nerves  ద్వారా cerebrum గుండా జరుగుతూ ఉంటుంది.

చాలా సందర్భాలలో మనము సందేశము కొరకు వేచిచూడకుండా action తీసికుంటాము. ఉదాహరణకి: నిప్పును చూడంగానే దానిని ముట్టుకోకుండా దూరంగా జరుగుటాము. పులినిచూడంగానే పారిపోవతము మొదలగునవి. అనగా మనిషికి తప్పనిసరిగా కారణ, సూక్ష్మ, మరియు భౌతిక మనస్సులు ఉన్నాయి అని ఋజువు అవుతున్నది. 

అన్ని ideas/plans cerebrum నుండి వస్తాయి. అందువలన cerebrum కారణ మనస్సుకి అనగా అధిచేతనా మనస్సుకి అనగా super-conscious mind ప్రతీక.

వాటిని అనగా cerebrum యొక్క ideas/plans cerebrum ని execute చేసేది energy mind i.e., cerebellum. అందువలన cerebellum సూక్ష్మ మనస్సుకి అనగా  అవచేతనా మనస్సుకి అనగా sub conscious mind కి ప్రతీక.

Cerebellum యొక్క orders నెరవర్చుటకు,  భౌతికమైన ఒక మనస్సు అవసరము. అదే ఈ భౌతికమైన మనస్సు అనగా  primitive mind అనగా ఈ Brain stem.  Brain stem జాగ్రతా మనస్సుకి అనగా conscious mind కి ప్రతీక.

మనుజులకు Intuition అనేది ఒక ప్రత్యేకమైన అసమానమైన వరము అనగా unique and unparalleled gift/boon. మనము ఈ మానవ జన్మను వృథా చేయరాదు. కనుక మనము ఋషులు ఇచ్చిన క్రియాయోగము అనే అమూల్యమైన శాస్త్రమును నేర్చుకుందాము. పరమానందమును పొందుదాము. పరమాత్మతో కలిసిపోదాము. అదిఏ మన లక్ష్యము. 

 

 

 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana