Posts

Showing posts from January, 2019

ఇక్ష్వాకు - మూడవకన్ను

ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్                              4-- 1 శ్రీ భగవానుడు ఇట్లు పలికెను :- నేను నిత్యసత్యమయిన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని . సూర్యుడు వైవస్వత మనువునకు చెప్పెను . ఆ మనువు ఇక్ష్వాకునకు బోధించెను . పరమాత్మ మొదటి వ్యక్తీకరణ పరమాత్మ ప్రకాశము . పరమాత్మ తన చేతనని సర్వజ్ఞత్వముగల సర్వశక్తివంతమైన శక్తిగా లేక ప్రకాశముగా వ్యక్తీకరించాడు .   దీనినే   సూర్యుడు అంటారు . ఈసర్వశక్తివంతమైన శక్తి లేక ప్రకాశమే మనిషియొక్క కూటస్థము లోని మూడవకన్ను లోని   వ్యష్టాత్మ లేక ఆత్మ సూర్యుడు . సాధకుడు తన తీవ్ర సాధనతో తన మానవచేతనని మరియు తన రెండుకళ్ళలోని ద్వంద్వ విద్యుత్తులను కూటస్థములో కేంద్రీకరించినపుడు ఈమూడవకన్నును చూడగలడు . సర్వ శక్తివంతమైన పరమాత్మ ప్రకాశమును అయిదు భుజములుగల వెండినక్షత్రముగా ఈ మూడవ కన్నులో చూడగలడు . ఈమూడవకన్నుద్వారానే పరమాత్మచైతన్యము చక్రములద్వారా , నరముల కేంద్రముల లోకి , అక్కడినుండి శరీరములోనికి ప్రవేశిస్తుంది . మానవచేతనగా రూపొందుతు

షోడశసంస్కారములు

షోడశసంస్కారములు భారతీయ సనాతనధర్మముల్లో ప్రతి వ్యక్తీ జీవితమూ వివిధ సంస్కారాలతో కూడిఉంటుంది. ఈ సంస్కారముల వెనక ఎంతో విజ్ఞానము ఉన్నది. ఈ సంస్కారములు ప్రతి ఒక్కరి జీవిత ప్రారంభము ముందు నుంచి మరణానంతము వరకు జరపబడుతాయి. ఈ సంస్కారములు మొత్తము 16.   వీటినే సంస్కారములు అని వ్యవహరిస్తారు.   వీటిని తిరిగి రెండు భాగములుగా విభజించడం జరిగింది. జననపూర్వక సంస్కారములు , మరియు జననాంతర సంస్కారములు అని . గర్భాదానం —   పుంసవనం — సీమంతం — జాతకర్మ — నామకరణం — నిష్క్రమణం — అన్నప్రాసనం — చూడాకరణ — కర్ణవేధ — అక్షరాభ్యాసం — ఉపనయనం — వేదారంభం — కేశాంత — సమావర్తనం — వివాహం — అంత్యేష్ఠి 1)గర్భాదానం — వివాహం తర్వాతా సత్ సంతానాన్ని ఆశించి మంత్రం పూర్వకముగా   జరిపేసంస్కారము ఇది.   ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్ సంతానాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తాయి. 2)పుంసవనం — ఆరొగ్యమయిన సత్సంతానముకోసము , గర్భారక్షణ కోసము చేసే మొదటి సంస్కారము ఇది. గర్భిణీ స్త్రీకి 3వ మాసములో మొదటి 10 రోజులలో చేస్తారు. మొలకెత్తిన మర్రివిత్తనములను నూరి ఆ రసాన్ని ‘ హిరణ్యగర్భ ’ మంత్రాలు చదువుతూ ఆ స్త్రీయొక్క కుడుముక్కులో వేస్తారు. చంద