ఇక్ష్వాకు - మూడవకన్ను
ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్ 4-- 1
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను:-
నేను నిత్యసత్యమయిన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు వైవస్వత మనువునకు చెప్పెను. ఆ మనువు ఇక్ష్వాకునకు బోధించెను.
పరమాత్మ మొదటి వ్యక్తీకరణ పరమాత్మ ప్రకాశము.
పరమాత్మ తన చేతనని సర్వజ్ఞత్వముగల సర్వశక్తివంతమైన శక్తిగా లేక ప్రకాశముగా వ్యక్తీకరించాడు.
దీనినే సూర్యుడు అంటారు.
ఈసర్వశక్తివంతమైన శక్తి లేక ప్రకాశమే మనిషియొక్క కూటస్థము లోని మూడవకన్ను లోని వ్యష్టాత్మ లేక ఆత్మ సూర్యుడు.
సాధకుడు తన తీవ్ర సాధనతో తన మానవచేతనని మరియు తన రెండుకళ్ళలోని ద్వంద్వ విద్యుత్తులను కూటస్థములో కేంద్రీకరించినపుడు ఈమూడవకన్నును చూడగలడు. సర్వ శక్తివంతమైన పరమాత్మ ప్రకాశమును అయిదు భుజములుగల వెండినక్షత్రముగా ఈ మూడవ కన్నులో చూడగలడు.
ఈమూడవకన్నుద్వారానే పరమాత్మచైతన్యము చక్రములద్వారా, నరముల కేంద్రముల లోకి, అక్కడినుండి శరీరములోనికి ప్రవేశిస్తుంది. మానవచేతనగా రూపొందుతుంది.
ఈ మానవచేతన చిత్త(భావనల సరస్సు), అహంకారము(నేను,నాది అనేభావన), నిశ్చయాత్మకమైన బుద్ధి(తెలివి) మరియు మనస్సు (ఇంద్రియవిషయలోలత) లకు కారణ భూతమగును.
స్థూలమనస్సులోని పరిమితమైన మానవచేతన అపరిమితమైన పరమాత్మచేతనని గ్రహించలేదు. క్రియాయోగసాధనతోనే గ్రహించ వీలగును. మనస్సు ఆత్మసూర్యునినుండే వ్యక్తీకరించబడినది. అందువలన ఆత్మసూర్యుని కుమారుడు కారణచేతన అనగా కారణమనస్సు అనగా వైవస్వతుని కుమారుడు వైవస్వత మనువు.
ప్రాణశక్తికి మూలము సూర్యుడు(వైవస్వతుడు) అనగా పరమాత్మ ప్రకాశము. మనస్సు ద్వారానే ఈ ప్రాణశక్తి సూక్ష్మశరీరములో వ్యక్తీకరిస్తుంది. మనిషి శరీరములో ప్రాణశక్తి మరియు మనస్సు ఒకటిలేకపోతే ఇంకొకటి ఉండలేదు. అందుకనే చంచలమనస్సుని స్థిరం చేస్తే చంచల ప్రాణముకూడా స్థిరం అవుతుంది.
పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, మానవచేతన అనగా మానవ మనస్సు మరియు ప్రాణశక్తిగా వ్యక్తీరించుటకు మార్గము కూటస్థములోని మూడవకన్ను.
కారణశరీరము మరియు సూక్ష్మశరీరముల రెండింటి వ్యక్తీకరణకు మార్గము ఈ మూడవకన్నే.
సూక్ష్మశరీరమూడవకన్నుకి కారణమైనది కారణశరీర మూడవకన్ను.
కారణశరీరము మరియు సూక్ష్మశరీరముల రెండింటి వ్యక్తీకరణకు మార్గము ఈ మూడవకన్నే.
సూక్ష్మశరీర మూడవకన్నుకి కారణమైనది కారణశరీర మూడవకన్ను.
కారణశరీరమునకు కారణశరీర మేరుదండము, అలాగే సూక్ష్మశరీర మునకు సూక్ష్మశరీర మేరుదండము ఉంటాయి.
సుషుమ్ననాడి సూక్ష్మశరీర మేరుదండమునకు, దానిలోని వజ్ర, వజ్రలోని చిత్రి, మరియు చిత్రిలోని బ్రహ్మనాడి కారణశరీరమేరు దండమునకు సంబంధించినవి.
పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, రెండూను మొదట కారణశరీర మూడవ కన్ను ద్వారా కారణశరీర మేరుదండములోనికి కారణచేతన మరియు కారణ ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
కారణశరీర మేరుదండముద్వారా సూక్ష్మశరీర మూడవకన్నులోనికి, దాని ద్వారా సూక్ష్మశరీర మేరుదండములోనికి సూక్ష్మచేతన మరియు సూక్ష్మప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
ఈ సూక్ష్మశరీర మూడవకన్నునే ఇక్ష్వాకు అంటారు. ఇక్ష్ అనగా నేత్రము అని అర్థము.
మనువు అనగా కారణ చేతనా మనస్సుయొక్క కొడుకు ఇక్ష్వాకు.
ఇక్ష్వాకుస్థితిలో ఉండే అహంకారము స్థూల ఇంద్రియములనుండి రాదు. ఆత్మనుండి వస్తంది. దీనినే సహజావబోధన అంటారు.
సూక్ష్మశరీర మేరుదండముద్వారా స్థూలశరీర మేరుదండము లోనికి మానవచేతన మరియు ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి. అక్కడినుండి విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలలోనికి ప్రవేశిస్తాయి. విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల స్థితిని రాజర్షిస్థితి అంటారు. ఆ విషయాసక్తిగల స్థితిలో మనిషి యోగము మర్చిపోతాడు, చెయ్యడు.
Comments
Post a Comment