గ్రంధి—క్షేత్రము—శాంతి


గ్రంధిక్షేత్రముశాంతి
క్రియల అనుష్ఠానము
మేరుదండములో కుండలినీశక్తిని ఆనుకొనియున్నదే మూలాధార చక్రము లేక  సహదేవచక్రము.
మేరుదండములో రెండున్నర (చూపుడువ్రేలు మొదటి కణుపు) కణుపులపైన మేరుదండములో ఉన్నది  స్వాధిష్ఠానచక్రము లేక  నకులచక్రము, 
నాభి వెనకాల మేరుదండములోనున్నది మణిపురచక్రము అర్జున చక్రము.
హృదయము వెనకాలనున్నది అనాహతచక్రము, భీమచక్రము.  గొంతులోనున్నది విశుద్ధచక్రము, ధర్మరాజచక్రము.
రెండు కనుబొమ్మలమధ్య కూటస్థములోనున్నది ఆజ్ఞాచక్రము శ్రీకృష్ణ చక్రము.
తలకాయమధ్యలో బ్రహ్మరంధ్రముక్రిందనున్నది  సహస్రారచక్రము, పరమాత్మచక్రము. .
ప్రతిమనిషిలోను మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార అని కారణ చేతనకు నిలయములయిన ఆధ్యాత్మిక మేరుదండ సంబంధిత చక్రములు ఉంటాయి. వీటిలో మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనే మొదటిమూడు సంసారచక్రములు. దీనిని కురుక్షేత్రము అంటారు. మణిపుర, అనాహత, విశుద్ధ అనే చక్రములను కురుక్షేత్ర ధర్మక్షేత్రము అంటారు. విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రములను ధర్మక్షేత్రము అంటారు.
శరీరములో ముడ్డి వద్ద  నున్న మూలాధారచక్రము నుండి ఈ మూడు నాడులు బయలుదేరి కనుబొమ్మల మధ్య వరకు కలిసి ప్రయాణిస్తాయి. ఇక్కడ ఇడా, పింగళ ఆగిపోతాయి. అక్కడినుండి ఒక్క సుషుమ్నానాడి మాత్రమె బ్రహ్మరంధ్రము క్రిందనున్న సహస్రార చక్రము వరకు ప్రయాణము చేయును.
మూలాధార చక్రమును ఆనుకొనిఉన్న కుండలినీ(ద్రౌపది) శక్తిని సాధన ద్వారా ఇడా, పింగళల మధ్యనున్న సుషుమ్నద్వారా మేరు దండములోని  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రములను దాటించి  ధర్మ క్షేత్రమైన సహస్రార చక్రమును ఆనుకొనియున్న బ్రహ్మరంధ్రమును చేర్చటమే సాధకుని గమ్యము. ఈ సాధనలోని అనుకూల మరియు ప్రతికూల స్థూల సూక్ష్మ కారణ శరీర శక్తుల అవరోధము/సంఘర్షణలే మహాభారత యుద్ధము. కుండలినీ(ద్రౌపది) మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధచక్రములను దాటటమే పంచపాండవులను వివాహమాడుట.
సాధకుడు మూడు నాడులను ఛేదించవలయును.
అందు మొదటిది బ్రహ్మగ్రంధి. ఇది  కురుక్షేత్రము లోని మూలాధార మునుండి మణిపూరకమువరకు వ్యాపించియున్నది. ఈ బ్రహ్మగ్రంధి   మానవచైతన్యమునకు సంబంధించినది.  భౌతికవిషయాసక్తియందు నిమగ్నమై సాధనలో ఏదో ఒక శారీరకబాధ కలగజేసి ముందుకు సాగనీయదు. ఆదినుండియున్న భౌతికశరీరమునకు శారీరకబాధ లుండటము సహజధర్మము. అందువలననే ఆదిభౌతిక శాంతి అనుటకు కారణము. ఇట్టి ఆదిభౌతిక శాంతికి ఆసనసిద్ధి అవసరము.
దీని తరువాతది మణిపురమునుండి పిట్యుటరీగ్రంథి వరకు వ్యాపించి యున్న కురుక్షేత్ర ధర్మక్షేత్రములోని రుద్రగ్రంధి. ఇది  మనస్సు అనగా సూక్ష్మశరీరమును ఆలోచనలవయిపు మళ్లించి  పూర్తిగా సాధన  చేయనీయదు. ఆదినుండియున్న సూక్ష్మశరీరమునకు ఆలోచనలబాధ లుండటము సహజధర్మము. అందువలననే ఆదిదైవిక శాంతి అనుటకు కారణము. ఇట్టి ఆదిభౌతిక శాంతికి ధారణసిద్ధి అవసరము.
దీని తరువాతది పిట్యుటరీగ్రంథినుండి సహస్రారము వరకు వ్యాపించి యున్న ధర్మక్షేత్రములోని విష్ణుగ్రంధి. ఇది  కారణశరీరమును ఆధ్యాత్మికతనుండి  మళ్లించి  పూర్తిగా సాధన  చేయనీయదు. ఆదినుండియున్నకారణశరీరమునకు ఈ బాధలుండటము సహజ ధర్మము. అందువలననే ఆదిదైవిక శాంతి అనుటకు కారణము. ఇట్టి ఆధ్యాత్మిక  శాంతికి ధ్యానసిద్ధి అవసరము.
మూలాధార చక్రమును వ్యష్ఠిలో పాతాళ లోకము,  సమిష్ఠిలో భూలోకము  
స్వాధిస్ఠాన చక్రమును వ్యష్ఠిలో మహాతల లోకము సమిష్ఠిలో భువర్లోకము  
మణిపుర చక్రమును వ్యష్ఠిలో తలాతల లోకము సమిష్ఠిలో స్వర్లోకము
అనాహత చక్రమును వ్యష్ఠిలో రసా తల లోకము సమిష్ఠిలో మహర్లోకము
విశుద్ధ చక్రమును వ్యష్ఠిలో సుతల లోకము సమిష్ఠిలో జన లోకము  
ఆజ్ఞా చక్రమును వ్యష్ఠిలో వితల లోకము సమిష్ఠిలో తపోలోకము అందురు.
సహస్రార చక్రమును వ్యష్ఠిలో అతల లోకము సమిష్ఠిలో సత్యలోకము



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana