షోడశసంస్కారములు
షోడశసంస్కారములు
భారతీయ సనాతనధర్మముల్లో ప్రతి వ్యక్తీ జీవితమూ వివిధ సంస్కారాలతో కూడిఉంటుంది.
ఈ సంస్కారముల వెనక ఎంతో విజ్ఞానము ఉన్నది. ఈ సంస్కారములు ప్రతి ఒక్కరి జీవిత ప్రారంభము
ముందు నుంచి మరణానంతము వరకు జరపబడుతాయి. ఈ సంస్కారములు మొత్తము 16. వీటినే సంస్కారములు అని వ్యవహరిస్తారు. వీటిని తిరిగి రెండు భాగములుగా విభజించడం
జరిగింది. జననపూర్వక సంస్కారములు, మరియు జననాంతర సంస్కారములు అని .
గర్భాదానం — పుంసవనం — సీమంతం — జాతకర్మ — నామకరణం — నిష్క్రమణం —అన్నప్రాసనం — చూడాకరణ — కర్ణవేధ — అక్షరాభ్యాసం — ఉపనయనం — వేదారంభం — కేశాంత — సమావర్తనం — వివాహం — అంత్యేష్ఠి
1)గర్భాదానం — వివాహం తర్వాతా సత్ సంతానాన్ని
ఆశించి మంత్రం పూర్వకముగా జరిపేసంస్కారము
ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్
సంతానాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తాయి.
2)పుంసవనం — ఆరొగ్యమయిన సత్సంతానముకోసము, గర్భారక్షణ కోసము చేసే మొదటి
సంస్కారము ఇది. గర్భిణీ స్త్రీకి 3వ మాసములో మొదటి 10 రోజులలో చేస్తారు.
మొలకెత్తిన మర్రివిత్తనములను నూరి ఆ రసాన్ని ‘హిరణ్యగర్భ’ మంత్రాలు చదువుతూ ఆ స్త్రీయొక్క కుడుముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో
ఉన్నప్పుడు చేయడం వలన దృఢకాయుడు, ఆరోగ్యవంతుడు అయిన పురుషుడు పుడతాడని విశ్వాసం. మర్రి పండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణీ స్త్రీకి వాసన
చూపించడం వలన యోని దోషములు తొలగి గర్భ రక్షణ శక్తి కలుగుతుందని ఆయుర్వేద
శాస్త్రములోను, సుశ్రుతములోను చెప్పబడినది.
మోక్షమునకు ఉపయోగబడే ఉత్తమ స్థూల శరీరమును పొందే
లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయింపబడినది.
3) సీమంతోన్నయనం — పుట్టబోయే బిడ్డకి దీర్ఘాయువుకోరుతూ చేసే సంస్కారము ఇది. ఈ గర్భిణీ స్త్రీకి 7
నుండి 9వ నెల వరకు కూటస్థము నుండి బ్రహ్మరంధ్రము వరకు పాపిడి తీయాలి. ఆ
బ్రహ్మరంధ్రము నుండి గర్భములోని ఆ శిశువుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఒక నమ్మకం.
సాధనకొరకు జీవితమూ అనే ఉద్దేశ్యముతో చేయునది ఈ సంస్కారము. పుట్టబోయే శిశువుకు మానసిక ఉల్లాసం అత్యంత
అవసరం. దానికి పాటించవలసిన నియమాలు ఈ సంస్కారములో నిక్షిప్తమయి ఉంటాయి.
4) జాతకర్మ — పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు
కోస్స్తారు. కోసేముందర తీసుకునే తంతులు వీటిలో ఉంటాయి.
*మేథాజననం — బలానికి, మరియు తెలివితేటలకు నెయ్యి, తేనెలు ప్రతీకలు. బంగారు ఉంగరంతో
శిశువు నోటికి అందిస్తారు.
* శిశువు దీర్ఘాయువు కోసరం ఋషులు, పితృదేవతలు అగ్ని సోములను ఆవాహన చేసే మంత్రములను శిశువు ముందు చదువుతారు.
* తండ్రి ‘శతమానం భవతి’ అని బిడ్డ చెవిలో చెప్తాడు. అప్పుడు బొడ్డుతాడు కోస్తారు. శిశువును శుభ్రం
చేస్తారు. చనుబాలు పట్టిస్తారు.
5)నామకరణం — పుట్టినబిడ్డకు పేరు పెట్టడం. ఈ పేర్లకు సంబంధించిన నియమములు పరాశర గృహ్యసూత్రాలులో పొందుపరచి
ఉన్నవి.
6) నిష్క్రమణ — శిశువును మొదటిసారిగా ఇంట్లోనుండి బయటకు తెస్తున్నప్పుడు దానికి ముందు
నిర్వహించే సంస్కారమే నిష్క్రమణ. ఆ
బిడ్డను బలమయిన దుష్టశక్తులనుండి కాపాడుటకు ఆదిభౌతిక, ఆధ్యాత్మిక శక్తుల పరమయిన
జాగ్రత్తలు తీసికోవాలి.
7) అన్నప్రాసనం — శిశువుకు మొట్టమొదటి సారి ఘనాహారం తినిపించే సంస్కారము. శిశువుకు భౌతిక అవసరాలను తీర్చడానికి
అవసరమయ్యే ప్రక్రియ ఇది. వేదమంత్రోచ్చారణలతో పరిశుభ్రమయిన పాత్రలో పెడతారు.
తద్వారా సత్వగుణము పెంపొందుతుంది.
8) చూడాకరణ — పుట్టు వెంట్రుకలు తీయడం అనే సంస్కారము..
9) కర్ణవేధ — చెవులు కుట్టించడం అనే సంస్కారము. 5 సంవత్సరములలోపు చేయవలసిన సంస్కారము.
10) అక్షరాభ్యాసం — శిశువు మనస్సు తగినంతగా పరిపక్వత చెందాలి. నూతన విషయములు నేర్చుకొనవలయును. 5
సంవత్సరములో చేస్తారు. దీనిని విశ్వామిత్రుడు 7 వ ఏట వరకు పొడిగించాడు. ప్రస్తుత
కాలమానము ప్రకారం 3 వ ఏటనే చేస్తునారు.
11) ఉపనయనం — అక్షరాభ్యాసం లాంఛనం. గురువు వద్దకు
పంపెముందర చేసేది ఉపనయన సంస్కారము.
గాయత్రీ మంత్రం ఉపదేశము చేస్తారు.
12) వేదారంభం — ఉపనయన సంస్కారము అయిన తదుపరి వేదారంభ
సంస్కారము మెదలవుతుంది.
13) కేశాంత — చూడాకరణ తరువాత మొదటి సారిగా చేసే క్షవర సంస్కారము ఇది. 16 సంవత్సరముల వయస్సు
వచ్చిన వారికి చేసే సంస్కారము ఇది. యౌవన చాపల్యములకు లొంగకుండా బ్రహ్మచర్య
ప్రాధాన్యతను తెలియజేసే సంస్కారము ఇది. ఇది జరిగాక తన గురువుకు ఆవును దానముగా
ఇస్తాదు శిష్యుడు.
14) సమావర్తనం/స్నాతకం — విద్యాభ్యాసం ముగించుకొని విద్యార్థి గురుకులాన్ని వదిలిపెడతాడు. అప్పుడు ఈ
సంస్కారాన్ని నిర్వహిస్తారు. గురుకులంలో
క్రమశిక్షణతో మెలిగి విద్యార్ధనలో ఉత్తీర్ణుడైన విద్యార్ధిని ‘స్నాతకుడు’ అంటారు. ‘స్నాతకుడు’ వివాహముచేసికొని గృహస్థ జీవితమూ గడపకానికి లేదా తానూ గడించిన విజ్ఞానముతో
భౌతిక, మరియు మానసిక బంధాలకు దూరముగా జీవితమూ గడపతానికైనా సిద్ధముగా ఉంటాడు. వీరిని
ఉపకుర్వనులు అని, మరియు నైష్ఠికులని అంటారు.
15) వివాహం — సంస్కారములలో అతిముఖ్యమయినది. వధువుకు తగిన వరుడిని, వరుడికి తగిన వధువును ఎంపికం చేయడం
వివాహములో అతిముఖ్యమయిన ఘట్టం. సపిండీకుల మధ్య వివాహములు నిషేధము. స్త్రీ పురుషుల
మధ్య ప్రక్రుతి సిద్ధముగా ఉండే ఆకర్షణను వివాహబంధ రూపములో వేదమంత్రముల సాక్షిలో
చేయటమే పెళ్లి.
16) అంత్యేష్ఠి — ఇది చివరి సంస్కారం. భౌతిక దేహమును
విడిచిపెట్టిన జీవాత్మ కర్మానుసారముగా భగవంతునిలో అయిక్యమగుటకు నిర్వహించే
సంస్కారము ఇది. ధర్మబద్ధ జీవనం చేసిన
వ్యక్తికి ముక్తి పొందుటకు జరిపే సంస్కారం ఇది.
Comments
Post a Comment