సృష్టి జన్మ సాధన Part1 రచన: కౌతా మార్కండేయశాస్త్రి
సృష్టి జన్మ
సాధన
కౌతా
మార్కండెయ శాస్త్రి
K M SASTRY/
K SUBHALAKSHMI/ V SYAMALA
32-80/16/1, PN 42, DN76,
YSS Dhyanamandir,
Devinagar, R K Puram Gate,
HYDERABAD(India) 500056
Ph: 09440364945 09440964947 08500289974
kriyayogasadhana.blogspot.in
ఓం శ్రీ యోగానంద
గురుపరబ్రహ్మణేనమః
ముందుమాట
ఈ పుస్తకము నేను ఎందుకు వ్రాయవలసి
వచ్చినది? సృష్టి – జన్మ – సాధన అనే విషయముపై అనాది కాలంనుండి
ఎన్నో గ్రంధములు వచ్చి ఉన్నవి. ఈ పుస్తకంద్వారా నేను చెప్పదలిచినది ఏమిటంటే
పరమాత్మ పొందు మిథ్య కానేకాదు. పట్టుదలతో సాధించవచ్చు. సాధించాలి. ఈ సాధన సశాస్త్రీయము.ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లేదా ఒక శాస్త్రవేత్త కావలయునన్న 15 – 20 సంవత్సరముల కఠోర పఠనం
అవసరముకదా. అదేవిధముగా ఆధ్యాత్మిక సాధనకి
కూడా కొన్ని సంవత్సరముల కఠోర సాధన అవసరము.ఒక చిన్న రాయి చూపించి దీనిని 10,000 (పదివేలు) మాత్రలు భూతద్దంతో
పెద్దది చేస్తే కొండగా అగుపడుతుంది అంటే విద్యార్థికి అర్థం కాదు. విద్యార్థిని కొండ దగ్గరికి తీసికొని వెళ్ళి
చూపిస్తే సరిగ్గా పరిపూర్ణంగా అర్థంచేసికుంటాడు. అదేవిధముగా ఆధ్యాత్మిక జ్ఞానము
కూడా అంతే. ఈ పుస్తకంలోని విషయములు నా హృదయంలోనుండి వచ్చినవి. సశాస్త్రీయమైన
విషయములు తేలికగా ఉండే ఉదాహరణలతో ఉటంకించబడినవి. పరమాత్మని అర్థం చేసికొనటానికి
అర్థంగాని శ్లోకములు, విజ్ఞాన
లేదా పండిత ప్రకర్ష అవసరములేదు.
శ్ + లోక = శ్లోక. నీలోని లోకములను
నిశ్శబ్ద పఱచు. నీకు పరమాత్మ తప్పక దర్శనం ఇస్తాడు. ఎక్కువెక్కువ పుస్తకాలు
చదివితే నీలోని అహంకారం పెరుగుతుంది. సందేహములు పెరుగును. మామిడిపండు రుచి
పుస్తకంలో చదివితే తెలుస్తుందా? కడుపు నిండుతుందా? తిని అర్థంచేసికో. పరమాత్మ విషయమూ అంతే.
సాధన చెయ్యి. ప్రసన్నం చేసికో. అర్థం చేసికో. ఆఖరిగా అసలు ఈ పుస్తకం వ్రాయించినది
మహావతార్ బాబాజి, నా ప్రియ గురువు
పరమహంస యోగానంద. ఈ పుస్తకం వారికే అంకితం.
కౌత
మార్కండేయ శాస్త్రి
ఓం శ్రీ యోగానందగురవేనమః
సృష్టి ఆరంభం:
ఈ సర్వ సృష్టికి పూర్వముపూర్ణాత్మ
ఒకటిగనె ఉండెడిది. దీనినే బ్రహ్మము,
పరమాత్మ
అని పిలిచెదరు. బ్రహ్మము అవిద్యయందు తన చైతన్యమును వ్యాపింప చేసెను. దాని పరిణామమే
సృష్టి. బ్రహ్మము రెండు విధములుగా తోచును.
1) సృష్టిగా పరిణమించకుండ ఉన్న బ్రహ్మము
2) సృష్టిగా పరిణమించిన బ్రహ్మము.
బ్రహ్మమును నాలుగు పాదములుగా అనుకుంటే
అందులో ఒక పాదము నామ రూపములతో జగత్తుగా రూపొందినది. దీనినే వ్యక్త బ్రహ్మము
లేదా వ్యాకృత బ్రహ్మము అందురు. ఇది ఇంద్రియగోచరము.
అస్తి (ఉనికి), భాతి(ప్రకాశం), ప్రియం(ఆనందం)
లక్షణములు కలిగిన అవ్యక్తమైన లేదా అవ్యాకృతమైన నిరాకారబ్రహ్మము, మూడు పాదముల బ్రహ్మము
సచ్చిదానంద స్వరూపము.
అస్తి, భాతి, ప్రియం, నామ, రూపములతో కూడిన జగత్తు
బ్రహ్మము కంటే వేరు కానేకాదు.
పరమాత్మ నాలుగు భాగములు అనుకుంటే, ఒక భాగమే జగత్తు. మిగిలిన మూడు భాగములు
జగత్తుకి అతీతమైన పరమాత్మ.
ఒక విద్యుత్ పరికరము
పని చేయుటకు దానిలోని విద్యుత్ శక్తి కారణము. అటులనే ఈ శరీరము చైతన్యవంతమగుటకు
మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే కారణము.
కంటికి కనిపించని బ్రహ్మమునుండి
గోచరమగు సృష్టి ఎట్లుఏర్పడినది?
రెండు విరుద్ధమైన కంటికి కనిపించని
వాయువులు ఉదజని (Hydrogen) మరియు ప్రాణ వాయువు (Oxygen) కలిసి కంటికి
కనిపించే నీరు ఏర్పడినట్లుగా, దృశ్య జగత్ యావత్తు
నిరాకార నిర్గుణ పరబ్రహ్మమునుండి ఏర్పడినది. ఈ సకల చరాచర జగత్ యావత్తూ మాయనుండి
ఉద్భవించుచున్నది. సూర్యునియందు తేజస్సు ఇమిడియున్న చందమున, బ్రహ్మమునందు మాయాశక్తి
అంతర్భూతమైయున్నది. జడమైన సీలింగ్ ఫానుకు విద్యుత్ శక్తి ఆధారము ఐనట్లుగా జడమైన
మాయకు పరమాత్మచైతన్యమే ఆధారము. కనుక సృష్టికి కారణము మాయ. మాయకి పరమాత్మచైతన్యమే
అనగా బ్రహ్మమే ఆధారము. సర్వవ్యాపకమైన బ్రహ్మము గుర్తించిన యోగికి మాయ కనపడదు.
అటులనే మాయని గుర్తిస్తున్న వారికి బ్రహ్మము కనపడదు. మాయ త్రిగుణ సహితము. సత్వ, రజో, తమో గుణముల త్రిపుటియే మాయ.
మాయకి తమస్సు అని, అవిద్య అని, నిర్ధారించ వీలుగానిది గాన అవ్యక్తం అని, సృష్టి యందలి సమస్త తత్త్వములు
కల్పించునదియై ప్రకృతి అని, కల్పాంతమున మాయ యందే
సృష్టి విలీనము చెందును గాన ప్రళయము అని, సృష్టికి
ఉపాదాన కారణమైనందున ప్రధానమని, జ్ఞానమైన బ్రహ్మమునకు
వ్యతిరిక్తము గాన అజ్ఞానము అని పిలవబడుతున్నది. వాసనామయము, జడము అయిన మాయయందు బ్రహ్మము
ప్రవేశించినపుడే చైతన్యవంతమగును. అయస్కాంతంవలన అయస్కాంతశక్తి క్షేత్రము ఏర్పడి
అయస్కాంత వస్తువులు ఆకర్షింపబడుతున్నవి. ఇక్కడ అయస్కాంతము సాక్షి లేక
చైతన్యబ్రహ్మము. అయస్కాంతశక్తిక్షేత్రము జడమైన మాయ. చైతన్యవంతమైన బ్రహ్మము అనే
అయస్కాంతము ఉంటేనే జడమైన మాయ అనగా అయస్కాంతశక్తి క్షేత్రము ఏర్పడి తద్వారా
అయస్కాంతవస్తువులు ఆకర్షింపబడుతున్నవి. అనగా జడమైన మాయ సృష్టికి కారణము. నిశ్చలమైన
బ్రహ్మము కాదు. ఈ మాయనే యోగమాయ అందురు.
ఇదే నిశ్చలమైన
బ్రహ్మముయొక్క చిత్ శక్తి, దేవి, ప్రకృతి. మాయకి ఒక ఆకారము కల్పించుకుంటె
దేవి. దేవి జడము. సృష్టి స్థితి లయ
కారణమైన దేవియొక్క నిరాకార స్వరూపము మాయ. ఈ యోగ మాయను మహా మాయ, మూల అజ్ఞానము, మూల ప్రకృతి అని పిలవ బడుతున్నది. సత్వ
గుణ ప్రధానముగా ఉన్న మూల ప్రకృతి మాయ అని పిలవబడుతున్నది. మూడుగుణములు అనగా సత్వ, రజో, తమో గుణములు కలిగి ఉన్న మాయ అవిద్య అని పిలవబడుతున్నది.
సత్వగుణము ప్రధానముగా ఉన్ననూ, మిగిలిన రజో తమో
గుణములు మాయలో నిద్రాణముగా ఉండును.
మూడు
గుణములు అనగా సత్వ రజో తమో గుణములు సంపూర్ణముగా అవిద్యలో అభివృద్ధి చెందియుండును.
భూమి యందలి మెత్తటి మట్టి(బంకమట్టి) మాత్రమే బొమ్మలను చేయుటకు ఉపయోగించెదరు. అటులనే
బ్రహ్మమునందు కొంత ప్రదేశముమాత్రమే సృష్టిగా రూపాంతరము చెందినది. అనగా
త్రిగుణాత్మకమైన మాయ నుండి మాత్రమే సృష్టి ఉద్భవించినది. జడము అనగా స్వభావసిద్ధ
చైతన్యములేనిది. పరమాత్మ తక్క అన్నీ జడములే. అవిద్యవలననే తనలోని చైతన్యవంతమై వెలసియున్న
పరమాత్మని గుర్తించలేకపోవుట జరుగుచున్నది. ప్రళయాంతమున ఈ సృష్టి ఈ మాయలోనే
కలిసిపోవును. నదులు, సముద్రములనుండి
ఆవిరియై పైకి వెళ్ళిన నీరు తిరిగి ఆ నదులు, సముద్రములలోనే కలియును.
పాదోస్యవిశ్వభూతాని
త్రిపాదస్యామృతందివి అని వేదోక్తి.
బ్రహ్మమునందు ఒక
భాగము మాయ. మిగిలిన మూడు భాగములు నిరాకార నిర్గుణ బ్రహ్మము. ప్రాపంచము పంచ
భూతములుతోకూడినది. బ్రహ్మముయొక్క ఈ పాంచభౌతిక ప్రపంచమును సృష్టించగల సత్తానే మాయ
అందురు. ఈ శక్తి పరమాత్మయందే ఉన్నపుడు మాయయందురు. పరమాత్మయందే ఉన్న ఈ మాయ, రజో తమో గుణముల కలయికతో మలినమైన అవిద్య
అని పిలువబడును.
సృష్టి - మానవజన్మ
కారణసృష్టి
త్రిగుణాత్మకమైన
అవిద్య బ్రహ్మచైతన్యంతో సృజనాత్మకశక్తిని పొందినది. కనుక బ్రహ్మముతో చైతన్యవంతమైన
అవిద్యనుండి వరుస క్రమములో ఆకాశం (శబ్దం), ఆకాశం నుండి వాయువు (స్పర్శ), వాయువు నుండి అగ్ని
(రూపం), అగ్ని నుండి జలం (రసము), జలం నుండి భూమి
(గంధం) పుట్టినవి.
ఈ పంచభూతములు
స్వయంప్రకాశం లేనివి. అందువలన బ్రహ్మచైతన్యం క్రమశః ముందుగా ఆకాశం, తరువాత వాయువు, అగ్ని, జలం, భూమిలోనికి వ్యాపించుటవలన
అయస్కాంతక్షేత్రములోని ఇనుప మేకులు ఐస్కాంతీకరణ చెందినట్లుగా ఈ పంచ భూతములు
చైతన్యవంతమైనవి. అవిద్యనుండి ఉద్భవించిన ఈ సూక్ష్మభూతములు చైతన్యవంతమైనవి.
అవిద్యనుండి ఉద్భవించిన ఈ శబ్ద,
స్పర్శ, రూప, రస, గంధములను తన్మాత్రలు అందురు. అవిద్య లేక
మూలప్రకృతి నుండి పుట్టిన మొదటి శబ్దమునే ఓంకారము అందురు. ఈ సృష్టి అంతయు ఆ
ఓంకారము నుండే పుట్టినది. ఈ సూక్ష్మ పంచమహాభూతములు సత్వ, రజో, తమో గుణములు మూడునూ కలిగియుండును. ఈ
త్రిగుణాత్మకమైన మూల అజ్ఞానమును లేదా అవిద్యను కారణసృష్టి అందురు. సూక్ష్మ పంచమహా
భూతములు ఇందులోని భాగమే.
స్థూలసృష్టి – సూక్ష్మ సృష్టి
పంచీకరణము అనగా
పంచతన్మాత్రలు లేక సూక్ష్మ పంచమహా భూతములు వివిధ పాళ్ళలో కలియుటద్వారా
స్థూలసృష్టికి దారితీయుట.
అపంచీకరణము అనగా వేటితోను కలవని, కలపని, సూక్ష్మ పంచమహాభూతములు. దీనినే
సూక్ష్మసృష్టి అందురు.
సత్వగుణ సూక్ష్మ పంచమహాభూతములు
అపంచీకృత సమిష్టి సత్వ
గుణ సూక్ష్మ పంచమహాభూతముల సగ భాగముల నుండి (కేవలము ఊహించు కోవటమే) జ్ఞానేంద్రియములు
అనగా ఆకాశము నుండి శ్రోత్రము, వాయువు నుండి త్వక్, అగ్ని నుండి చక్షు, జలము నుండి రసనము, భూమి నుండి ఘ్రాణము వ్యక్తీకరించినవి.
శ్రవణము అనగా చెవ్వు (వినేశక్తి),
త్వక్
అనగా చర్మము (స్పర్శాశక్తి), చక్షు అనగా కన్ను
(చూచేశక్తి), రసనము అనగా నాలుక (రుచిశక్తి), ఘ్రాణము అనగా ముక్కు (వాసనాశక్తి)
వ్యక్తీకరించినవి. ఇవి కేవలము శక్తులు మాత్రమే, గోచరమగు మాంసమయ అవయములు కావు. అనగా
దిక్కులు అధిదేవతగా గల శ్రవణేంద్రియము అనగా చెవ్వు (వినేశక్తి), స్పర్శనుడు అధిదేవతగా గల త్వక్ ఇంద్రియము
అనగా చర్మము (స్పర్శాశక్తి), సూర్యుడు అధిదేవతగా
గల చక్షురింద్రియము అనగా కన్ను (చూచేశక్తి), వరుణుడు అధిదేవతగా గల రసన ఇంద్రియము, రసనము అనగా నాలుక (రుచిశక్తి), అశ్వనీ దేవతలు అధిదేవతగా గల ఘ్రాణ
ఇంద్రియము), ఘ్రాణము అనగా ముక్కు
(వాసనాశక్తి) వ్యక్తీకరించినవి. మిగిలిన అపంచీకృత సమిష్టి సత్వగుణ సూక్ష్మ పంచమహాభూతముల
సగభాగముల నుండి అంతఃకరణ వ్యక్తీకరించినది. సత్వ గుణ సగభాగ ఆకాశములో బ్రహ్మ
చైతన్యము స్వయముగా ప్రవేశించెను. సత్వగుణ సగభాగ వాయువులో చంద్రుడు అధిదేవతగా గల
సంశయాత్మక మనస్సు వ్యక్తీకరించెను. సత్వగుణ సగభాగ అగ్నిలో వాచస్పతి లేక బృహస్పతి
అధిదేవతగా గల నిశ్చయాత్మకమైన బుద్ధి వ్యక్తీకరించెను. సత్వగుణ సగభాగ జలములో
రుద్రుడు అధిదేవతగాగల చంచలకరమైన చిత్తము వ్యక్తీకరించెను. సత్వగుణ సగభాగ భూమిలో
జీవుడు అధిదేవతగా గల కర్తృత్వ భావముగల అహంకారము వ్యక్తీకరించెను.
పరమాత్మనే బ్రహ్మము
అని పిలిచెదరు. బ్రహ్మము అవిద్యయందు తన చైతన్యమును వ్యాపింపజేసినది. దాని పరిణామమే
సృష్టి. బ్రహ్మము నాలుగు పాదములుగా
అనుకుంటే, అందులో ఒక పాదము
నామరూపములతో జగత్తుగా రూపొందినది. దీనినే వ్యక్తబ్రహ్మము లేదా వ్యాకృత బ్రహ్మము
అంటారు. ఇది ఇంద్రియ గోచరము.
అవ్యక్తమైన లేదా
అవ్యాకృతమైన మిగిలిన మూడుపాదములు నిరాకారబ్రహ్మము సత్, చిత్, ఆనంద స్వరూపము.
అతీతము: ఒక తివాచీ
మీద నువ్వు కూర్చున్నావనుకో. నీవు కూర్చున్న మేర ఆ తివాచీ నీలో ఉన్నది. నీకంటే
అతీతముగానూ ఆ తివాచీ ఉన్నది. దీనినే అతీతము అంటారు. అదేవిధముగా పరమాత్మ నీలోనూ
ఉన్నాడు, నీకంటే అతీతముగానూ ఉన్నాడు.
ఒక విద్యుత్ పరికరము
పనిచేయుటకు దానిలోని విద్యుత్ శక్తి కారణము. అటులనే ఈ శరీరము చైతన్యవంతమగుటకు మనలో
ఉన్న పరమాత్మ చైతన్యమే కారణము.
రెండు విరుద్ధమైన
కంటికి కనిపించని వాయువులు ఉదజని మరియు ప్రాణవాయువు కలిసి కంటికి కనిపించే నీరుగా
ఏర్పడుతున్నది. సూర్యునియందు తేజస్సు ఇమిడియున్న చందమున మాయ అనగా అవిద్య వలన
ఉద్భవించిన ఈ సకల చరాచర దృశ్య జగత్తు
యావత్తూ కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మముయొక్క అంతర్భాగమే. ఈ జడమైన మాయా జగత్తుకు
ఆధారము పరమాత్మ చైతన్యమే.
సర్వవ్యాపక
బ్రహ్మమును గుర్తించిన యోగికి మాయ కనబడదు. అలాగే మాయలో ఉన్న సాధారణ మనుష్యునికి
బ్రహ్మము కనబడదు. జడమైన మాయ సృష్టికి హేతువు, నిశ్చలమైన బ్రహ్మము కాదు. ఈ మాయనే
యోగమాయ అంటారు.. సత్వ రజో తమో గుణములు కలిగియున్న ఈ యోగమాయను చిత్ శక్తి, మహామాయ, మూలప్రకృతి, అంటారు.
కారణసృష్టి:--త్రిగుణాత్మకమైన అవిద్య బ్రహ్మ చైతన్యముతో
సృజనా త్మకశక్తిని పొందినది. బ్రహ్మ చైతన్యముతో కూడిన అవిద్యనుండి ముందర
ఆకాశము(శబ్దము), ఆకాశమునుండి
వాయువు(స్పర్శ), వాయువు
నుండి అగ్ని(రూపము), అగ్ని
నుండి జలం(రసము), జలం
నుండి పృథ్వి (గంధము) పుట్టినవి. వీటినే పంచ మహాభూతములు అంటారు. ఇవి స్వయం
ప్రకాశము లేనివి. అందు వలన బ్రహ్మ క్రమశః ముందుగా ఆకాశము, తరువాత వాయువు, అగ్ని, జలం, పృథ్విలోనికి వ్యాపించుటవలన అయస్కాంత
క్షేత్రము లోని ఇనుపమేకులు ఐస్కాంతీకరణ చెందినట్లుగా ఇవి చైతన్యవంత మయినవి. శబ్ద, స్పర్శ, రూప, రస మరియు గంధములను పంచ తన్మాత్రలు
అంటారు. అవిద్య లేక మూల ప్రకృతి నుండి పుట్టిన మొదటి శబ్దమే ఓంకారము. ఈ సృష్టి
అంతా ఓంకారమునుండే పుట్టినది. ఈ సూక్ష్మ పంచమహాభూతములు సత్వ, రజో మరియు తమో గుణములు కలిగియుంటాయి. ఈ
త్రిగుణాత్మకమైన మూల అజ్ఞానమును లేదా అవిద్యనే కారణ సృష్టి అంటారు..ఇంతవరకు వేటితో
కలవని సూక్ష్మ పంచమహాభూతములను అపంచీకరణము
అంటారు.
అపంచీకృత రజోగుణసూక్ష్మపంచమహాభూతములు
అపంచీకృత
సమిష్టిసత్వగుణ సూక్ష్మ పంచమహాభూతముల సగభాగమునుండి పంచజ్ఞానేంద్రియములు
వ్యక్తీకరించినవి. అనగా ఆకాశమునుండి శ్రోత్రము(చెవ్వు), వాయువునుండి త్వక్ (చర్మము) స్పర్శ, అగ్నినుండి చక్షు(కన్ను), జలమునుండి రసము(నాలుక), పృథ్వినుండి ఘ్రాణము(ముక్కు)
వ్యక్తీకరించినవి. ఈ చెవ్వు, చర్మము, కన్ను, నాలుక మరియు ముక్కు కంటికి కనబడే మాంసమయ
అవయములు కావు. ఇవి కేవలము వినికిడి, స్పర్శ, చూపు, రుచి మరియు వాసన శక్తులు మాత్రమె.
మిగిలిన అపంచీకృత సమిష్టిసత్వగుణ సూక్ష్మ పంచమహాభూత
ముల సగభాగమునుండి అంతఃకరణ వ్యక్తీకరించినది. సత్వగుణ సూక్ష్మ సగభాగ ఆకాశములో
బ్రహ్మచైతన్యము స్వయముగా ప్రవేశించినది. సత్వగుణ సూక్ష్మ సగభాగవాయువులో సంశయాత్మక
మనస్సు వ్యక్తీకరించినది. సత్వగుణ సూక్ష్మ సగభాగ అగ్నిలో నిశ్చయాత్మక బుద్ధి
వ్యక్తీకరించినది. సత్వగుణ సూక్ష్మ సగభాగ జలములో చంచలచిత్తము వ్యక్తీకరించినది.
సత్వగుణ సూక్ష్మ సగ భాగపృథ్విలో కర్తృత్వ భావనగల అహంకారము వ్యక్తీకరించినది.
అపంచీకృత సమిష్టి రజోగుణ సూక్ష్మ పంచమహాభూతముల సగభాగమునుండి క్రమశః
కర్మేంద్రియములు వ్యక్తీకరించినవి.
అపంచీకృత సమిష్టి రజోగుణ సగభాగ సూక్ష్మ
ఆకాశమునుండి వాక్ లేక మాట్లాడే శక్తి (నోరు), అపంచీకృత సమిష్టి రజోగుణ సగభాగ సూక్ష్మ
వాయువునుండి క్రియాశక్తి (పాణి లేక చెయ్యి), అపంచీకృత సమిష్టి రజోగుణ సగభాగ సూక్ష్మ
అగ్నినుండి గమనశక్తి లేక (పాదము), అపంచీకృత
సమిష్టి రజోగుణ సగభాగ సూక్ష్మ జలము నుండి విసర్జనాశక్తి (పాయువు లేక ముడ్డి), మరియు అపంచీకృత సమిష్టి రజోగుణ సగభాగ
సూక్ష్మ పృథ్వి నుండి ఆనందించుశక్తి (ఉపస్థ లేక శిశినము), వ్యక్తీకరించినవి..
మిగిలిన అపంచీకృత
సమిష్టి రజోగుణ సూక్ష్మ పంచమహా భూతముల సగభాగమునుండి ముఖ్యప్రాణము వ్యక్తీకరించినది. క్రమశః ఆ ముఖ్యప్రాణము చేయు పనులవలన
ఐదుప్రాణములుగా విభజించబడినది.
అపంచీకృత సమిష్టి
రజోగుణ సూక్ష్మ ఆకాశమునుండి ప్రాణవాయువు (స్థానము హృదయము), అపంచీకృత సమిష్టి రజోగుణ సూక్ష్మ వాయువు
నుండి అపాన వాయువు (స్థానము ముడ్డి), అపంచీకృత సమిష్టి రజోగుణ సూక్ష్మ అగ్ని
నుండి వ్యాన వాయువు (స్థానము సర్వశరీరము), అపంచీకృత సమిష్టి రజోగుణ సూక్ష్మజలము
నుండి ఉదాన వాయువు (స్థానము కంఠము) మరియు అపంచీకృత సమిష్టి రజోగుణ సూక్ష్మ పృథ్వి
నుండి సమానవాయువు (స్థానము నాభి).
సూక్ష్మసృష్టి తత్వములకు అధిదేవతలు
ఉంటారు. అవిసులభముగా అర్థము చేసికొనుటకు
క్రింద పట్టికలలో ఇవ్వడమయినది.
పరమాత్మ
శ్రీకృష్ణ చైతన్యము (సృష్టిలోని
పరమాత్మ)
|
అవిద్య లేక త్రిగుణములు
సత్వ
|
రజో
|
తమో
|
కారణశరీరము
ఆకాశము
(శబ్దం)
|
వాయువు
(స్పర్శ)
|
అగ్ని
(రూపం)
|
జలము
(రస)
|
పృథ్వి
(గంధ)
|
సత్వ, రజో
మరియు తమో అనే మూడు గుణములతో కూడిన అవిద్య, ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు పృథ్వి అనే సూక్ష్మ
పంచమహాభూతములు కలిపి కారణసృష్టి అంటారు.
అపంచీకరణ సూక్ష్మసృష్టి(సమిష్టి సత్వగుణ
పంచమహాభూతముల సగభాగములనుండి అంతఃకరణ
వ్యక్తీకరించినది). మిగిలిన సగ
భాగములనుండిజ్ఞానేంద్రియములువ్యక్తీకరించినవి. ఇవిమాంసమయ అవయములు కావు. కేవలము
శక్తులు మాత్రమె.
సత్వగుణ పంచ సత్వగుణ పంచ
మహాభూతముల మహాభూతముల
సగభాగము
సగభాగము
అంతఃకరణ
|
అధిదేవత
|
జ్ఞానేంద్రియములు
|
అధిదేవత
|
|
½ ఆకాశము
(పరమాత్మ
చైతన్యము)
|
పరమాత్మ
|
½ ఆకాశము
|
శ్రోత్రము(చెవ్వు)
|
దిక్కులు
|
½ వాయువు
(సంశయాత్మక
మనస్సు)
|
చంద్రుడు
|
½ వాయువు
|
త్వక్(
చర్మము)
|
స్పర్శనుడు
|
½ అగ్ని
(నిశ్చయాత్మక
బుద్ధి)
|
బృహస్పతి
|
½ అగ్ని
|
చక్షు
(కళ్ళు)
|
సూర్యుడు
|
½జలం(
చంచ ల చిత్తం)
|
రుద్రుడు
|
½జలం
|
జిహ్వ(నాలుక)
|
వరుణుడు
|
½ పృథ్వి
(అహంకారం)
|
జీవుడు
|
½ పృథ్వి
|
ఘ్రాణం
(ముక్కు)
|
అశ్వనీదేవతలు
|
అపంచీకరణ
సూక్ష్మసృష్టి(సమిష్టి రజోగుణ పంచమహాభూతముల సగభాగములనుండి కర్మేంద్రియములు
వ్యక్తీకరించినవి). మిగిలిన సగ భాగములనుండిపంచ ప్రాణములువ్యక్తీకరించినవి.
ఇవిమాంసమయ అవయములు కావు. కేవలము శక్తులు మాత్రమె.
రజోగుణపంచ రజోగుణపంచ
మహా
భూతముల మహా
భూతముల
సగభాగము సగభాగము
మహా
భూతము
|
కర్మేంద్రి
యములు
|
అధిదేవత
|
పంచప్రాణ
ములు
(స్థానము)
|
అధిదేవత
|
|
½ ఆకా
శము
|
నోరు(మాట్లాడే
శక్తి)
|
అగ్ని
|
½ ఆకా
శము
|
ప్రాణ(హృదయము)
|
విశిష్టుడు
|
½ వా
యువు
|
పాణి
(చేతులు) క్రియాశక్తి.
|
ఇంద్రుడు
|
½ వా
యువు
|
అపాన(ముడ్డి)
|
విశ్వకర్మ
|
½ అగ్ని
|
పాదము
(గమన శక్తి)
|
ఉపేంద్రుడు
|
½ అగ్ని
|
వ్యాన(సర్వశరీరము)
|
విశ్వయోనిః
|
½ జలం
|
ముడ్డి(విసర్జన
శక్తి)
|
మృత్యువు
|
½ జలం
|
ఉదాన(కంఠము)
|
అజుడు
|
½ పృథ్వి
|
శిశినము
(ఆనందశక్తి)
|
ప్రజాపతి
|
½ పృథ్వి
|
సమాన(నాభి)
|
జయుడు
|
కనుక సూక్ష్మ
సృష్టి 19తత్వములు. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 4 అంతఃకరణ. ఈ సూక్ష్మసృష్టి సాధారణ
నేత్రమునకు కనిపించదు.
పంచ
జ్ఞానేంద్రియాలు
|
పంచ
కర్మేంద్రియములు
|
పంచ
ప్రాణములు
|
అంతఃకరణ(నాలుగు)
|
మొత్తము 19 తత్వములు
|
స్థూల సృష్టి లేక
పంచీకరణము:
పంచ తన్మాత్రలు వివిధ
పాళ్ళలో కలియుట ద్వారా స్థూల సృష్టికి దారితీయటము జరిగినది.
ద్విధా విధాయ చ ఏకైకం చతుర్థా ప్రథమమ్
పునః
స్వస్వేతర ద్వితీయామ్శైర్యో జనాత్ పంచ పంచతే వేదాంత పంచదశి 1-27
అపంచీకృత సమిష్టి
తమోగుణ సూక్ష్మ పంచమహాభూతములు లోని
సగభాగము క్రమశః మిగిలిన నాలుగు తమోగుణ
సూక్ష్మమహాభూతముల ఎనిమిదవవంతు భాగములను కలుపుకొని స్థూల పంచ భూతములు ఏర్పడినవి.ఈ
క్రింది పట్టికను చూడండి.
ఆకాశము
|
వాయువు
|
అగ్ని
|
జలం
|
పృథ్వి
|
పంచకము
|
½
|
1/8
|
1/8
|
1/8
|
1/8
|
ఆకాశ
|
1/8
|
½
|
1/8
|
1/8
|
1/8
|
వాయు
|
1/8
|
1/8
|
½
|
1/8
|
1/8
|
అగ్ని
|
1/8
|
1/8
|
1/8
|
½
|
1/8
|
జలం
|
1/8
|
1/8
|
1/8
|
1/8
|
½
|
పృథ్వి
|
పంచీకరణ చెందిన ఆకాశ, వాయు, అగ్ని, జలం మరియు పృథ్వి పంచకములు ఐదును ఆకాశము, వాయువు, అగ్ని, జలం మరియు పృథ్వి అని వ్యవహరించబడును.
అవిద్య లేక సత్వ రజో
తమో త్రిగుణాత్మకమైన మూలప్రకృతి నుండివ్యక్తీకరించిన సత్వగుణ సూక్ష్మ
పంచమహాభూతములు ఒక్కొక్కటి ఒక్కొక్క తన్మాత్రనే కలిగియుండెను. తన్మాత్ర అనగా శక్తి.
ఆకాశమునకు శబ్దము, వాయువునకు
స్పర్శ, అగ్నికి,రూపం, జలమునకు రస, పృథ్వికి గంధ తత్వములు ఉండెను.
ఈ స్థూల సృష్టి అటుల
కాదు. స్థూల ఆకాశమునకు శబ్దము, స్థూల
వాయువునకు శబ్దము మరియు స్పర్శ, స్థూల
అగ్నికి శబ్దము, స్పర్శ మరియు రూపము, స్థూల జలమునకు శబ్దము, స్పర్శ రూపము మరియు రస, స్థూల పృథ్వికి శబ్దము, స్పర్శ రూపము రస మరియుగంధ తత్వములు
ఐదునూ వ్యక్తీకరించినవి.
ఈ వ్యక్తీకరించిన
స్థూలపంచభూతములనుండి జరాయువులు అనగా నాలుగు పాదముల జంతువులు, అండజములు అనగా పక్షులు, సరీకృపములు అనగా ప్రాకే జంతువులు, స్వేదజములు అనగా నల్లులు, దోమలు మొదలగునవి, ఉద్భిజములు అనగా చెట్లు, చేమలు వ్యక్తీకరించినవి.
మనో బుద్ధి చిత్త
అహంకారములు అనెడు స్థూల అంతఃకరణ స్థూల ఆకాశ పంచకమువలన కలిగెను.
స్థూల పంచ ప్రాణములు
స్థూల వాయు పంచకము వలనను, స్థూల
పంచజ్ఞానేంద్రియములు స్థూల అగ్నిపంచకము వలనను, స్థూల పంచతన్మాత్రలు స్థూల జలపంచకము
వలనను, స్థూల
పంచకర్మేంద్రియములు స్థూల పృథ్వీపంచకము
వలననూ కలిగెను.
స్థూల అంతఃకరణ:
ఆకాశములోని సగభాగములో బ్రహ్మచైతన్యము స్వయముగా ప్రకాశించెను.
మిగిలిన సగభాగ
ఆకాశములో సమాన ప్రతిపత్తిలో క్రమశః 1/8 పృథ్వి, జలము, అగ్ని, మరియు వాయువు కలిసి సమిష్టి స్థూల
అహంకారము,(విషయచింతనముగల)చిత్తము, (నిశ్చయాత్మకమైన) బుద్ధి,
(సంకల్ప వికల్పములుగల)మనస్సు ఏర్పడినవి.
స్థూల అంతఃకరణయొక్క ½ ఆకాశము=బ్రహ్మచైతన్యము
|
1/8 స్థూల ఆకాశము+1/8 పృథ్వి =
స్థూల సమిష్టి అహంకారము
1/8 స్థూల ఆకాశము+1/8 జలము =
స్థూల సమిష్టి చిత్తము
1/8 స్థూల ఆకాశము+1/8 అగ్ని =
స్థూల సమిష్టి బుద్ధి
1/8
స్థూల ఆకాశము+1/8
వాయువు = స్థూల సమిష్టి మనస్సు
|
స్థూల వాయువులు: స్థూల వాయువుయొక్క సగభాగము వ్యానవాయువుగా
వ్యక్తీకరించెను.
మిగిలిన సగభాగస్థూల
వాయువుతో సమాన ప్రతిపత్తిలో క్రమశః1/8
ఆకాశము, అగ్ని, జలము మరియు పృథ్వి కలిసి క్రమశః సమిష్టి
సమాన, ఉదాన, ప్రాణ మరియు అపాన వాయువులుగా వ్యక్తీక
రించెను. ప్రాణ మరియు అపాన వాయువులను వ్యానవాయువు అనుసంధింపజేసి సంచరింపచేయును.
½ స్థూల వాయువు=
సమిష్టి స్థూల వ్యానవాయువు
|
1/8 స్థూల వాయువు +1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టిసమాన వాయువు
1/8 స్థూల వాయువు +1/8 స్థూల అగ్ని
= స్థూల సమిష్టి ఉదాన
1/8 స్థూల వాయువు +1/8 స్థూల జలము =
స్థూల సమిష్టి ప్రాణ
1/8 స్థూల వాయువు +1/8 స్థూల పృథ్వి = స్థూల సమిష్టి అపాన
|
స్థూలజ్ఞానేంద్రియములు:
అగ్ని యొక్క సగభాగము చక్షువుగా (చూచే శక్తి) వ్యక్తీకరించెను. మిగిలిన సగభాగ
అగ్నితో సమాన ప్రతిపత్తిలో క్రమశః 1/8
ఆకాశము,వాయువు, జలము మరియు పృథ్వి కలిసి క్రమశః సమిష్టి
శ్రోత్ర(వినేశక్తి), త్వక్
(స్పర్శశక్తి), జిహ్వ(రసన)
మరియు ఘ్రాణ(వాసన శక్తి) ఉదయించినవి.
½ స్థూల అగ్ని=
సమిష్టి స్థూల నేత్రము
|
1/8 స్థూల అగ్ని
+1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టిచెవి
1/8 స్థూల అగ్ని
+1/8 స్థూల వాయువు = స్థూల సమిష్టి చర్మము.
1/8 స్థూల అగ్ని
+1/8 స్థూల జలము =
స్థూల సమిష్టి నాలుక
1/8
స్థూల అగ్ని +1/8
స్థూల పృథ్వి =
స్థూల సమిష్టి ముక్కు
|
స్థూల పంచభూతతత్వములు
లేక తన్మాత్రలు): జలము యొక్క సగభాగము నుండి సమిష్టి రసతత్వము వ్యక్తీకరించినది.
మిగిలినసగభాగ జలముతో సమాన ప్రతిపత్తిలో క్రమశః 1/8 ఆకాశము,వాయువు, అగ్ని మరియు పృథ్వి కలిసి క్రమశః
సమిష్టి శబ్ద, స్పర్శ, రూప మరియు గంధ తన్మాత్రలు
వ్యక్తీకరించెను.
½ స్థూల జలము=
సమిష్టి స్థూల రసతత్వము
|
1/8 స్థూల జలము
+1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టి శబ్ద
1/8 స్థూల జలము
+1/8 స్థూల వాయువు = స్థూల సమిష్టి స్పర్శ.
1/8 స్థూల జలము
+1/8 స్థూల అగ్ని = స్థూల సమిష్టి రూప
1/8
స్థూల జలము +1/8
స్థూల పృథ్వి =
స్థూల సమిష్టి గంధ
|
స్థూల
పంచకర్మేంద్రియములు: స్థూల పృథ్వియొక్క సగభాగము నుండి సమిష్టిపాయువు
(మలవిసర్జనతత్వము) వ్యక్తీకరించెను.
మిగిలిన స్థూల
పృథ్వియొక్క సగభాగముతో సమాన ప్రతిపత్తిలో క్రమశః 1/8 ఆకాశము, వాయువు, అగ్ని మరియు జలము కలిసి క్రమశః సమిష్టి
వాక్కు(నోరు), పాణి(క్రియాశక్తి), పాదము(గమనశక్తి), పాయువు(మలవిసర్జనశక్తి) మరియు ఉపస్థ (మూత్ర విసర్జనశక్తి) వ్యక్తీకరించెను.
½ స్థూల పృథ్వి=
సమిష్టి స్థూల పాయువు(ముడ్డి)
|
1/8 స్థూల పృథ్వి +1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టి నోరు
1/8 స్థూలపృథ్వి
+1/8 స్థూల వాయువు = స్థూల సమిష్టి పాణి(చేతులు).
1/8 స్థూల పృథ్వి +1/8 స్థూల అగ్ని = స్థూల సమిష్టి పాదం
1/8
స్థూల పృథ్వి +1/8
స్థూల జలము =
స్థూల సమిష్టి ఉపస్థ(లింగం)
|
కనుక స్థూల
సృష్టి 24
తత్వములు. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు,
5 తన్మాత్రలు, 4 అంతఃకరణ.
పంచ జ్ఞానేంద్రియాలు
|
పంచ
కర్మేంద్రియములు
|
పంచ
ప్రాణములు
|
పంచ
తన్మాత్రలు
|
అంతఃకరణ(నాలుగు)
|
మొత్తము 24 తత్వములు
|
శుద్ధ సత్వ మాయ యందు
ఈశ్వరుడు గాను, సత్వ రజో తమో
గుణములతో కూడిన అవిద్య యందు జీవుడు గాను పరమాత్మ చైతన్యము
వ్యక్తీకరించబడును. అద్దములో కనిపించు ప్రతిబింబమునకు చైతన్యములేదు. కనుక ప్రతి
ఒక్కరిలో ప్రతిబింబించు ఆత్మ ప్రత్యక్షంగా నివసిస్తున్న పరమాత్మ అంశమే.
పరమాత్మతక్క అన్ని జడములే. పరమాత్మ చైతన్యము ప్రతి ప్రాణియొక్క శిరస్సును
బేధించి శరీరమునందు ప్రవేశంచి జడమైన శరీరమును చైతన్యము చేయుచున్నది.
ఒకటి అనేకము అగుటయే
సృష్టి. కార్య కారణ రూపమే సృష్టి.
కుమ్మరి కుండను
మట్టితో యంత్రసహాముతో చేసెను.
కుమ్మరి=
నిమిత్తకారణము, మట్టి= ద్రవ్య లేదా ఉపాదానకారణము, యంత్ర= సాధనాకారణము.
పరమాత్మ తననుండి
మాయతో సృష్టి చేసెను.
పరమాత్మ=
నిమిత్తకారణము,
తననుండి= ద్రవ్య లేదా
ఉపాదానకారణము,
మాయతో = సాధనాకారణము
అనగా
నిమిత్త, ద్రవ్య లేదా ఉపాదాన, మరియు సాధనా కారణములు
మూడునూ పరమాత్మే. అందుకనే సర్వంఖలు ఇదంబ్రహ్మ అనుటకు కారణము.
తన్నులుతింటున్న దొంగ, కొడుతున్న మనిషి, చోద్యం చూస్తున్న మనుష్యులూ అంతా
పరమాత్మే. పరమాత్మకు లేదా పరబ్రహ్మకు మూడుపాదములు అవ్యక్త నిరాకార పరబ్రహ్మము. అవి
అస్తి (సత్యస్వరూపం, సత్తు), భాతి (స్వయంప్రకాశం), ప్రియం (చైతన్యస్వరూపం).
నాలుగవపాదము నామము, రూపములతో ఐదు లక్షణములతో అనగా అస్తి
భాతి చిత్, నామము, రూపములతో జగత్తుగా
రూపొందినది.
ఆభరణము తనలోని లోహముయొక్క ధర్మమును పోగొట్టుకొనని రీతిగా నామ రూప జగత్తు తనలోని
సత్ చిత్ ఆనంద స్వరూపం అయిన పరబ్రహ్మము తనయొక్క ధర్మమును పోగొట్టుకొనలేదు.
యస్తంతునాభ ఇవ
తంతుభిః ప్రధానజై స్వభావతః
దేవఏకఃస్వమావృణోతిస
నోదధాతు బ్రహ్మాద్వయం
6-10 - శ్వేతాశ్వతరోపనిషత్తు
సాలె పురుగు తన
చొంగతో గూడు తయారు చేసుకొని ఎట్లు వసించునో, పరమాత్మ తన మాయతో సృష్టిని చేసి అందు
ఉపస్థితుడైయున్నాడు.
పంచ కోశములు
1)అన్నమయకోశము:
పంచీ
కరణమువలన ఏర్పడిన స్థూల పంచభూతముల నుండి వ్యక్తీకరించిన 24 తత్త్వములుగల స్థూల
శరీరమే అన్నమయ కోశము అని పిలవబడుతున్నది. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచప్రాణములు పంచభూతములు మరియు అంతఃకరణ
కలిసి 24 తత్త్వములు.
2) ప్రాణమయకోశము:
సూక్ష్మ శరీరములోని
అపంచీకృత పంచప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన), పంచకర్మేంద్రియములు (వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థ) రెండింటిని అనగా పంచప్రాణములు
మరియు పంచకర్మేంద్రియములు కలిపి ప్రాణమయకోశము అందురు.
3) మనోమయకోశము:
సూక్ష్మ శరీరములోని
పంచజ్ఞానేంద్రియములు అనగా చక్షు,
శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్ ఇంద్రియముల శక్తులు, మనస్సు, చిత్తము మూడింటిని కలిపి మనోమయకోశము
అందురు.
4) విజ్ఞానమయకోశము:
సూక్ష్మ శరీరములోని
పంచజ్ఞానేంద్రియములు (చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్ ఇంద్రియముల శక్తులు), అహంకారము, నిశ్చయాత్మక బుద్ధి మూడింటిని కలిపి
విజ్ఞానమయకోశము అందురు.
5) ఆనందమయకోశము:
త్రిగుణాత్మకమైన, మూల అజ్ఞానమైన, మోహస్వరూపమైన అవిద్యా కవచమే
ఆనందమయకోశము.
శరీరత్రయము:
1) కారణశరీరము:
ఆనందమయకోశమే కారణశరీరము. సృష్టికి
మూలకారణము కారణశరీరము. ఇది త్రిగుణాత్మకము, మూల అజ్ఞానము మోహస్వరూపము, అవిద్యా కవచము. ఈ అవిద్యా కవచమువలన
జనించిన సూక్ష్మ పంచమహాభూతములు సృష్టికి కారణము.
2) సూక్ష్మశరీరము:
(విజ్ఞానమయకోశము, మనోమయకోశము, మరియు ప్రాణమయకోశములు) అపంచీకృత సూక్ష్మ
పంచమహాభూతముల సత్వ రజో గుణముల నుండి వ్యక్తీకరించిన పంచకర్మేంద్రియములు, పాయువు (ముడ్డి), వాక్కు, పాణి (క్రియాశక్తి), పాదం (గమనశక్తి), ఉపస్థ (మూత్ర విసర్జనశక్తి), పంచప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన), పంచజ్ఞానేంద్రియములు (చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్ ఇంద్రియముల శక్తులు), మనో, బుద్ధి, చిత్త, అహంకారములతో కూడిన అంతఃకరణ, మొత్తము కలిపి 19 తత్త్వములు సూక్ష్మ
శరీరము అనబడుచున్నది.
3) స్థూలశరీరము:
తమో గుణాత్మకము, పంచీకరణము చేయబడినవి అయిన సూక్ష్మ
పంచమహాభూతములు స్థూలముగా వ్యక్తీకరణము చెందినవి. ఆ స్థూల పంచమహాభూతములతో ఏర్పడిన
పంచజ్ఞానేంద్రియములు, (చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్ ఇంద్రియములు) పంచకర్మేంద్రియములు, పాయువు (ముడ్డి), వాక్కు (నోరు), పాణి (చేతులు), పాదం (పాదములు), ఉపస్థ (శిశినము) పంచప్రాణములు, (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన), పంచభూతములు (ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి) మరియు అంతఃకరణ కలిసి మొత్తము 24
తత్త్వములను, స్థూలశరీరము అందురు.
ఈ స్థూల, సూక్ష్మ, కారణశరీరములను చైతన్యవంతము చేయునది, వాటిలోకి స్వయంగా ప్రవేశించిన పరమాత్మ
చైతన్యమే.
అవస్థలు:
1) జాగ్రతావస్థ :
బ్రహ్మ చైతన్యము
కారణశరీరములోనూ, దాని ద్వారా సూక్ష్మ
శరీరములోనూ, తద్వారా
స్థూలశరీరములోనూ ప్రవేశించి మూడు శరీరములను అనగా కారణ, సూక్ష్మ, స్థూలశరీరములను చైతన్య వంతము చేయుటను జాగ్రతావస్థ
అందురు. అనగా అధిచేతన, అవచేతన, మరియు జాగ్రతావస్థ మూడునూ
చైతన్యవంతమగును.
2) స్వప్నావస్థ : (అవచేతన)
దీనినే నిద్రావస్థ
అనికూడా అందురు. కారణ స్వప్నావస్థలు రెండునూ చైతన్యవంత స్థితిలో ఉండుటనే
స్వప్నావస్థ లేదా నిద్రావస్థ అందురు. అనగా కారణ సూక్ష్మ శరీరములు రెండునూ
చైతన్యవంత స్థితిలో ఉండుటయే స్వప్నావస్థ. అనగా అధిచేతన అవచేతన, రెండును చైతన్యవంతమగును. జాగ్రతావస్థ
నిద్ర్రాణమై ఉండును.
3) సుషుప్తి అవస్థ : (అధిచేతన అవస్థ) గాఢ
నిద్ర యందు సూక్ష్మ, స్థూల శరీరములు
రెండునూ చైతన్యవంతముగా ఉండవు. ఇంద్రియ రహితమైన అవిద్యా రూపమైన కారణశరీరము
బ్రహ్మచైతన్యంతో తాదాత్మ్యము చెంది మిగిలిన సూక్ష్మ, స్థూలశరీరములు రెండునూ అచేతనముగా
ఉండుటను సుషుప్తి అవస్థ అందురు. సృష్టిలోని పరమాత్మను కృష్ణచైతన్యము లేదా శుద్ధ
సత్వ మాయ అందురు. ఈ సృష్టిలోని పరమాత్మచైతన్యము సమిష్టిలోనూ, వ్యష్టిలోనూ తనతో కలుపుకొని ఏడు
చైతన్యములుగా వ్యక్తమగును.
సృష్టిలోని చైతన్యము
(కృష్ణచైతన్యము)
అవస్థ
|
బ్రహ్మచైతన్యము
పేరు
|
శరీరము
|
వ్యష్టి
జాగ్రత
|
విశ్వ, వ్యవహారిక, చిదాభాస
|
స్థూల
|
వ్యష్టి స్వప్న
|
తైజస్, ప్రాతిభాసిక, స్వప్నకల్పిత
|
సూక్ష్మ
|
వ్యష్టి సుషుప్తి
|
ప్రాజ్ఞ, పారమార్థిక, ఆనందమయ
|
కారణ
|
సమిష్టి జాగ్రత
|
విరాట్, వైశ్వానర, వైరాజస
|
స్థూల
|
సమిష్టి స్వప్న
|
హిరణ్యగర్భ, సూత్రాత్మక, ప్రాణ
|
సూక్ష్మ
|
సమిష్టి సుషుప్తి
|
అవ్యాకృత, ఈశ్వర
|
కారణ
|
ప్రకృతి మరియు వికృతి:
“ఇదమ్ శరీరమ్ కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే” గీత 13-2
మాయా
స్వరూపమైన ఈ జగత్తు అంతయు క్షేత్రము అని, ఈ
క్షేత్రమునందు వ్యాపించియున్న బ్రహ్మచైతన్యము అనగా పరాప్రకృతి క్షేత్రజ్ఞుడు అని
పిలవబడుచున్నది. ఈ బ్రహ్మచైతన్యము లేదా పరాప్రకృతి నుండి వ్యక్తీకరించిన అవిద్యను
ప్రకృతి అని, ఆ అవిద్య నుండి
జనించిన నామ రూపాత్మకమగు జగత్తు వికృతి అని పిలవబడును. ప్రకృతి వికృతి రూపమయిన ఈ
శరీరము అనే కూటములో ఉండు పరమాత్మను శరీరి అని, కూటస్థుడు అని వ్యవహరించెదరు. అవినాశి
అయిన ఈ కూటస్థుడే అక్షరుడు. నాశము చెందు ఈ శరీరమే క్షరుడు. ఒక పాదములోని ఈ క్షరుడు
శరీరమునందుండి వ్యష్టి రూపములో ఆత్మ, ప్రత్యగాత్మ
అని, సమిష్టి రూపములో అనగా
వ్యక్తముచెందని పరబ్రహ్మమే మూడు పాదముల పరబ్రహ్మము, పరమాత్మ అని వ్యవహరించ బడుచున్నాడు. మాయ
లేదా అవిద్యను తన అధీనములో ఉంచుకొన్న శుద్ధ చైతన్యమే బ్రహ్మము. అవిద్యయొక్క
ప్రభావమునకు లేదా ఆవరణకు లోబడి ఉన్నది జీవుడు. ఆవరణ తొలగిన జీవుడు బ్రహ్మమే. ఒక
వ్యక్తియొక్క శరీరము కుండగను, అంతఃకరణను జలముగను, జీవునియందలి ప్రతిబింబము సాక్షాత్తు
పరమాత్మే అని అర్థము చేసుకొనవలయును. జీవుడు ప్రతిబింబమే అయిన జడమైన శరీరమును
చైతన్యవంతము చేయగల శక్తి ఉండదు. కనుక జీవుడు సాక్షాత్తు పరమాత్మే.
మల, విక్షేపణ, ఆవరణ దోషములు:
కారణశరీరమునకు తమోగుణ ప్రభావమువలన
మలావరణదోషములు, రజోగుణమువలన
విక్షేపణదోషములు కలుగును. సత్ వస్తువుయొక్క యదార్థ రూపమును మఱుగుపరిచి, వేఱొక రూపముగా అభివ్యక్తము చేయుటయే
ఆవరణదోషము.
మురికిబట్టిన గాజుచిమ్నీవలన లాంతరులోని
జ్యోతి కనబడదు.. చిమ్నీ శుభ్రపరచిన జ్యోతి తనకాంతిని వెదజిల్లుతుంది. మురికిబట్టిన
గాజుచిమ్నీలాంటిదే మలదోషము. అజ్ఞానము అనేమురికిబట్టిన గాజుచిమ్నీవలన మనలోని
పరమాత్మ కనబడడు.
రజోగుణ సంభూతమైనది విక్షేపణశక్తి. అనగా
మాయయొక్క విక్షేపణశక్తియే సకలసృష్టికి, రాగద్వేషములు, సుఖదుఃఖములు, స్వార్థము, ప్రేమ, వాత్సల్యము, దయ, సంతోషము, తృప్తి, అసంతృప్తి, అరిషడ్వర్గములు అనగా కామ క్రోధ లోభ మోహ
మద మాత్సర్యములు మొదలగునవి కారణశరీర రజోగుణసంభవ విక్షేపణదోషములు. అవతారపురుషులు, కారణజన్ములు అయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సత్వగుణ ప్రధానమైన మాయ పొరతో ఏర్పడిన
వారియొక్క కారణశరీరమునకు, తమోగుణములతో కూడిన
మలావరణ రజోగుణములతో కూడిన విక్షేపణదోషములు ఉండవు. ఈ ఆవరణ విక్షేపణదోషములవలననే ఈ
కారణశరీరమునకు 1) దేహవాసన అనగా
కర్తృత్వ, భోక్తృత్వములు, ధనేషణ, పుత్రేషణ మరియు ధారేషణ అనే ఈ షణత్రయము, కీర్తివాసనలు 2) శాస్త్రవాసన 3) లోకవాసనలు తద్వారా కర్మఫలములు, అవిద్య, అస్మిత (భయం లేదాఅహంకారము), రాగ, ద్వేషములు మరియు అభినివేశములు (తన
శరీరముమీద మోహము) కలుగుచున్నవి.
ఓంకారము :
ఓం ఇత్యేకాక్షరం
బ్రహ్మ గీత 8-13
ఓంకారం బిందు
సంయుక్తం నిత్యం గాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః
ఒక ఫాక్టరీ నుండి ఏదేని వస్తువు
ఉత్పన్నమగునపుడు ముందుగా శబ్దము ఉత్పన్నమగును. అదే విధముగా పరమాత్మ చైతన్యమువలన
మాయనుండి సృష్టి వ్యక్తీకరించబడుతున్నపుడు అనగా పరమాత్మ ఫాక్టరీ నడుచుచున్నపుడు
వ్యక్తీకరించు శబ్దమే ఓంకారము. ఈ ప్రణవనాదము అకార (స్థూల), ఉకార (సూక్ష్మ), మకారముల (కారణ) సంయోగము.
సమిష్టి స్థూల, సూక్ష్మ, కారణ, లోకములతో కూడిన జగత్తు భగవత్
ప్రతిరూపమైన ఈ ఓంకారమే.
ప్రళయములు:
ప్రతీరాత్రీ నిద్రాసమయమున స్థూల, సూక్ష్మ, లోకములు, కారణలోకములోనికి లేదా సుషుప్తిలోనికి
జారిపోయి చిత్తవృత్తులు నిద్రాణమైయుండుటను నిత్యప్రళయము అందురు.
నాలుగు యుగములు = ఒక మహాయుగము.
ఒక మనువు కాలపరిమితి = 71 మహాయుగములు
లేదా 71 x 4 = 284 యుగములు
ఒక బ్రహ్మపగలు = 14 మనువుల కాలపరిమితి = 14 x 71 మహాయుగములు లేదా 994 యుగములు = 4,320,000,000 సంవత్సరములు
ఒక బ్రహ్మరాత్రి = 14 మనువుల కాలపరిమితి = 14 x 71 మహాయుగములు లేదా 994 యుగములు = 4,320,000,000 సంవత్సరములు
ఒక యుగమునకు మరియొక యుగమునకు మధ్య జరుగు
ప్రళయము అవాంతర ప్రళయము అందురు.
ఒక మనువు గతించిన తదుపరి జరుగు
ప్రళయమునకు నైమిత్తిక ప్రళయము అందురు.
994 యుగముల ఒక బ్రహ్మ పగలు తదుపరి జరుగు
ప్రళయమునకు దైనందిన ప్రళయము అందురు
కలియుగము = 4, 32, 000 సంవత్సరములు
ద్వాపరయుగము = 8, 64, 000 సంవత్సరములు
త్రేతాయుగము = 12, 96, 000 సంవత్సరములు
కృత లేక సత్యయుగము = 17, 28, 000 సంవత్సరములు
ఈ బ్రహ్మని కార్యబ్రహ్మ అందురు.
ఒక కార్యబ్రహ్మ పూర్తి దినము = ఒక
బ్రహ్మ పగలు + ఒక బ్రహ్మ రాత్రి
= 8,640,000,000 సంవత్సరములు
ఈ కార్యబ్రహ్మ మరణమే బ్రహ్మప్రళయము
అందురు.
ఏ ప్రళయమందైనా స్థూల, సూక్ష్మ శరీరములు నశించును. కారణశరీరము
నశించదు. ప్రళయమందు స్థూలభూమి స్థూల జలమునందు, స్థూలజలము స్థూలఅగ్నియందు, స్థూలఅగ్ని స్థూలవాయువునందు, స్థూలవాయువు స్థూలఆకాశమునందు విలీనము
చెందును. ఈ స్థూలఆకాశము సూక్ష్మభూమి (సమిష్టి అహంకారమునందు), సూక్ష్మభూమి (సమిష్టి అహంకారము)
సూక్ష్మజలమునందు (సమిష్టి చిత్తమునందు), సూక్ష్మజలము
సూక్ష్మఅగ్నియందు (సమిష్టి బుద్ధియందు), సూక్ష్మఅగ్ని
సూక్ష్మ వాయువునందు (సమిష్టిమనస్సు) విలీనము చెందును. ఈ సమిష్టి సూక్ష్మమనస్సునే
మహత్తత్వము అందురు.
ఈ మహత్తత్వము, మూలప్రకృతి, అవిద్య లేదా కారణశరీరము మిగిలియుండుటయే
ప్రళయము. గురువు కృపతో బ్రహ్మజ్ఞానము కలిగిన సాధకునికి కారణశరీరము నశించి
బ్రహ్మమునందు ఐక్యము చెందును. దీనినే జన్మరాహిత్యము అందురు. ఈ కారణశరీరము ఉన్నంత
వరకు జీవునికి పునర్జన్మ తప్పదు. పదార్థము నాశము కాదు. పదార్థములోని అణువులు స్థాన
భ్రంశము చెందవచ్చు. అనగా పదార్థము శాశ్వతము. రూపాంతరము చెంది సూక్ష్మ రూపములో
కల్పమునకు కల్పమునకు మధ్య బ్రహ్మములో ఐక్యము చెంది యుండును. అవ్యక్తముగ యుండును.
తిరిగి జగత్తు వ్యక్తము అగునపుడు అనేక నామ రూపములతో, బంగారము రకరకములైన ఆభరణముల యందు
నిక్షిప్తమై వైవర్తము చెందినట్లుగా,
బ్రహ్మము
కంటె వేరు కాని మాయవలన వేరే వస్తువుగా తోచుటయే అనగా సృష్టి అంతా బ్రహ్మముతో నిండి యుండుటయే బ్రహ్మ
వైవర్తము. సమస్త చరాచర ప్రపంచమునందు ఆత ప్రోతముగా ఉన్న బ్రహ్మ చైతన్యమే ప్రాణులందు
“నేను” అని వ్యవహరించబడుచున్నది. బాహ్య
సంసారానుభవములను, కర్మఫలములను
అనుభవించుటకు ఏర్పడిన పైతొడుగే జడమైన స్థూలశరీరము. ఈ స్థూల శరీరమునకు కావలిసిన
బ్రహ్మచైతన్యము సూక్ష్మశరీరము ద్వారా కలుగును. సూక్ష్మశరీరములోని సూక్ష్మఅంతఃకరణ
ద్వారా స్థూల అంతఃకరణలోనికి, స్థూలఅంతఃకరణ ద్వారా స్థూలశరీరములోనికి
ప్రవేశించిన బ్రహ్మ చైతన్యము ద్వారా మాంసమయమైన స్థూల శరీరము పని చేయును. అనేక
జన్మల సంస్కారములవలన కర్మఫలముల సుఖదుఃఖానుభవమునకు ఆశ్రయమైన సూక్ష్మ శరీరమునకు
సాధనమైనదే ఈ స్థూలశరీరము. అవయవరహితమైన కారణశరీరము ద్వారా అనగా బ్రహ్మనాడి ద్వారా
బ్రహ్మచైతన్యము సూక్ష్మశరీరములోనికి ప్రవేశించి సూక్ష్మశరీరమును సూక్ష్మశరీర
అంతఃకరణ ద్వారా చైతన్యవంతము చేయును. కర్తృత్వ భోక్తృత్వ వాసనలు సూక్ష్మశరీర
అంతఃకరణధర్మము. సుఖము దుఃఖము రెండునూ అనుభవించునది అంతఃకరణమే.
జడమైన శరీరము వ్యష్టి సృష్టి. జడమైన జగత్తు
సమిష్టి సృష్టి. జడమైన శరీరము సృష్టి లో సృష్టికి అతీతమైన లేదా సృష్టిగా
పరిణమించని మూడు పాదముల బ్రహ్మము ప్రవేశించి, ఆ జడమైన శరీరమును/సృష్టిని
చైతన్యవంతముచేసి జీవుడు లేక ప్రత్యగాత్మ అని పిలవబడుచున్నది. అనగా అవిద్యకులోనైన
బ్రహ్మము జీవుడు. ఈ అవిద్య అనగా కారణశరీరములోనున్న అనగా జీవునిలోనున్న
బ్రహ్మముయొక్క యదార్థరూపమును మఱగు పరిచి తమో గుణమువలన కలిగిన ఆవరణధర్మము, రజోగుణమువలన కలిగిన రాగద్వేషములు, అరిషడ్వర్గములు, శీతోష్ణ సుఖ దుఃఖములు అనే
విక్షేపణధర్మములు కలుగుచున్నవి. అవయవ రహితమైన కారణశరీరము, సూక్ష్మ స్థూల శరీరముల సహాయముతో కర్మ
ఫలములను అనుభవించుటకై శరీర ధారణ అనగా సూక్ష్మ తదుపరి స్థూలశరీరములోనికి
ప్రవేశించును. ఈ కారణశరీరమునే జీవుడు అందురు. తమోగుణమువలన కలిగిన ఆవరణ ధర్మమువలన
తన యదార్థరూపమును మరిచి ఈ దేహమే నేను అన్నట్లుగా వ్యావహారికుడుగా ఉన్న జీవుని
అవస్థ జాగ్రతావస్థ. రజోగుణమువలన కలిగిన విక్షేపణ ధర్మమువలన సూక్ష్మశరీర అభిమానియైన
జీవుడు ప్రాతిభాసకుడుగా అంతఃకరణ ద్వారా సూక్ష్మశరీరములోనికి ప్రవేశించుట, తద్వారా పనిచేయుట స్వప్నావస్థ.
అవిద్యవలన కారణశరీర అభిమానియైన జీవుడు పారమార్థికుడిగా భౌతిక దుఃఖరహితుడై
ఆనందమయుడైన స్థితి సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థయొక్క ప్రత్యేకతతో బీజ మాత్ర
రూపకమైన అంతఃకరణ కారణశరీరములో లయమై
యుండుటయే గాఢనిద్ర
జీవుడు సృష్టి ప్రయాణము:
జీవుడు ప్రయాణము చేయునపుడు అతని వెంట
అష్టవసువులు అనగా (1) అవిద్య లేదా
కారణశరీరము 2) కామము 3) కర్మము, కర్మఫలములు, వాసనలు 4) పంచమహాభూతములు వెన్నంటియే యుండును.
కారణశరీరములో చిత్రగుప్తుని చిట్టా లాంటి వాసనలు, కర్మఫలములు తగులుకొనియుండును. జీవుడు
కారణ, సూక్ష్మశరీరములతో ఆకాశము, వాయువు, ధూమము, వర్షించు మేఘముద్వారా పయనించి, పురుషశుక్లముద్వారా పయనించి, ధాన్యముల (వ్రీహ్యాదులు) ద్వారా అన్న
స్వరూపము అగును. ఆ అన్నము భుజించిన పురుష శరీరములో ప్రవేశించి, పురుషశుక్లముద్వారా స్త్రీ శరీరములోని
శోణితముతో కలియును. 19 తత్త్వములు గల
సూక్ష్మశరీరము, నశించిన స్థూలశరీర
పంచీకృతమహాభూతముల సూక్ష్మాంశములు,
పుణ్య
పాప కర్మ ఫలములు, వాసనల రూపములో నున్న
తీరని కోరికలు, త్రిగుణాత్మకమైన
కారణశరీరముగల జీవుడూను జన్మరాహిత్యము చెందనంత వరకు తోటి ప్రయాణీకులే.
జననము
ఒక నాటి రాత్రి పురుషశుక్లము స్త్రీ
శోణితముతో కలిసిన తదుపరి ఐదు దినముల తరువాత నీటి బుగ్గ (జైగోట్) మాదిరి, పది దినములకు కోడిగ్రుడ్డు మాదిరి
ఉండును. మూడు పదుల దినముల తదుపరి గట్టి పిండమై శిరస్సు ఏర్పడును. రెండు నెలలకు
కాళ్లు చేతులు, మూడు మాసములకు కడుపు, నాలుగు నెలలకు ప్రక్కలు, ఐదు మాసములకు పాదములు వ్రేళ్లు, ఆరు నెలలకు ముక్కు, చెవులు, కళ్ళు మొదలగు రంధ్రములు గల అవయములు
కలుగును. ఏడవ నెలయందు జీవుడు ప్రవేశించును. ఏడవ నెలయందు శిశు దేహము ఊర్థ్వ ముఖమై
యుండును. నాభి మొదలు కొని బ్రహ్మ రంధ్రము వరకు వెనుక భాగమునందు చిన్న రంధ్రముగల ఒక
నాడి ఉండును. అప్పుడు తల్లియొక్క జఠరాగ్ని బాధ లేకుండా ఒక తొడుగు పిండము జుట్టి
యుండును. ఆరు నెలల చివర లేదా ఏడవ నెలయందు జీవుడు ప్రవేశించును. అంత వరకు శిశువు
తల్లినుండి శ్వాస తీసు కొనును. అనగా శిశువుకు తల్లి శ్వాసే ఆధారము. ఆరవ నెల వరకు
తల్లి జీవముతో పాటు శిశువు జీవము కూడా కలిసి యుండును. ఆరు నెలల చివర లేదా
ఏడవ నెల యందు బియ్యము వడ్లు వేరు చేసినట్లుగా, శిశువు జీవము అనగా ప్రాణశక్తి + సూక్ష్మ
కారణశరీరములు, కర్మఫలములు, వాసనలు, శిశువు శరీరములో అనగా శిశువు స్థూలశరీరములో
ప్రవేశించును. . ఎనిమిది తొమ్మిది నెలలయందు పూర్వజ్ఞానము కలిగి పిండము అథోముఖమై, తల్లియొక్క అపాన వాయువు ప్రసారము చేతను, పిండమందుండెడి ప్రాణాది వాయు
ప్రసారముచేతను భూమిమీద పడును.
జీవులు నాలుగు రకములుగా ఉండెదరు అని
శ్రీ రామకృష్ణపరమహంస అందురు.
1) బధ్ధజీవులు: విషయాసక్తులై పొరబాటున కూడా
భగవంతుని స్మరించరు.
2) ముముక్షజీవులు: ముక్తికై ప్రయత్నము చేయువారు.
3) ముక్తజీవులు: సాధువులు, మహాత్ములు
4) నిత్యజీవులు: నారద, మహావతార్ బాబాజీ మొదలగువారు
లోకోపకారార్థము ఉందురు.
కర్మ
కర్మలు లౌకికములు, అలౌకికములు అని రెండురకములు. స్నానము, ఉద్యోగము, భోజనము చేయడములాంటివి లౌకికములు. సంధ్యావందనము, దైవపూజ, జపము, హోమములాంటివి అలౌకికములు. తిరిగి ఈ
అలౌకికములు ఫలమునాశించి చేసిన అనగా కర్తృత్వభావనముతో చేసిన బంధము. లౌకిక అలౌకిక
కర్మలు రెండునూ సంచిత, ప్రారబ్ధ, ఆగామి అని మూడు రకములుగా విభజించబడినవి.
సంచితము పూర్వజన్మకర్మ ఫలితములు. సంచితములో జన్మజన్మలనుండి కూడగట్టుకున్న
కర్మఫలితములు ఒకేసారి అనగా ఒకే జన్మలో అనుభవించుటకు ఒక జన్మ సమయము చాలదు. ఆ సంచిత
కర్మఫలితములలో కొంతభాగము అనగా మంచి,
చెడు, లేదా మంచిచెడుల మిశ్రమమును తెచ్చుకొని ఈ
జన్మలో అనుభవించు కర్మనే ప్రారబ్ధ కర్మ అందురు.
ప్రారబ్ధ కర్మ అనుభవించుచూ ఈజన్మలో చేసే
క్రొత్త కర్మలు ఆగామి కర్మయందురు. సంచితము బ్యాంకులోని ఫిక్సుడు డిపాజిట్ వంటిది.
ప్రారబ్ధకర్మ కరెంట్ అక్కౌంట్ లాంటిది. ఆగామికర్మ పిల్లల భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని వేసే బీమా (Life
Insurance) వంటిది.
ప్రారబ్ధంభోగతేభుంజాత్
తత్త్వజ్ఞానేనసంచితమ్
ఆగామిద్వివిధమ్
ప్రోక్తమ్ తద్వేష్టిప్రియవాదినౌ
ప్రారబ్ధకర్మ ఎంతటివారైనా
అనుభవించితీరాల్సిందే.
జ్ఞానాగ్నిసర్వకర్మాణిభస్మతాత్
కురుతే
అని భగవద్గీతలో చెప్పినట్లుగా జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మంచేయును.
డాక్టర్ చదివిన రాఘవ్ డాక్టర్ రాఘవ్. లా
చదివిన రాఘవ్ లాయర్ రాఘవ్, ఇంజనీరింగ్ చదివిన
రాఘవ్ ఇంజనీర్ రాఘవ్
బ్రహ్మవిద్
బ్రహ్మైవభవతి
అనగా బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు బ్రహ్మే.
సాధకుడు నిష్కామకర్మ యోగములో మలదోష
వివర్జితుడై బ్రహ్మ విదుడుగాను, నిరంతరము
బ్రహ్మీస్థితిలో ఉండి తమోగుణ ఆవరణదోషములు తొలగి బ్రహ్మవిద్వరుడుగాను, సవికల్పసమాధి స్థితిలో ఉండి రజోగుణ
విక్షేపణదోషములు తొలిగి బ్రహ్మవిద్వ రీయుడుగాను, నిర్వికల్పసమాధి స్థితిలో ఉండి
సర్వగుణరహితుడై బ్రహ్మవిద్వరిష్ఠుడుగాను విరాజిల్లుచున్నాడు.
ప్రాయశ్చిత్తమ్
ప్రతీ మనిషి తనకు తెలిసీతెలియక చేసిన
పాపముల నుండి విముక్తి పొందుటకు 1)
దేవయజ్ఞము
(పూజలు, వ్రతములు) 2) పితృయజ్ఞము (శ్రాధ్ధకర్మలు, తర్పణములు) 3) నరయజ్ఞము (అతిథిసేవ) 4) బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనము) 5) భూతయజ్ఞము (ప్రాణులకు ఆహారము పెట్టుట)
చేయవలయును.
భక్తి
తొమ్మిది విధములు.
1) శ్రవణమ్ 2) కీర్తనమ్ 3) స్మరణమ్ 4) పాదసేవనమ్ 5) అర్చనమ్ 6) వందనమ్ 7) దాస్యమ్ 8) సఖ్యమ్ 9) ఆత్మార్పణమ్
భక్తిపుష్పములు ఎమిమిది
రకములు:
అహింసా ప్రథమోపుష్పః
పుష్పమింద్రియనిగ్రహః
సర్వభూతదయాపుష్పం
క్షమాపుష్పం విశేషతః
శాంతిపుష్పం
తపఃపుష్పంధ్యానపుష్పంతథైవచ సత్యమష్ఠవిధంపుష్పంవిష్ణోఃప్రీతికరంభవేత్
1) అహింస 2) ఇంద్రియనిగ్రహం 3) సర్వభూతదయ 4) తపస్సు 5) క్షమ 6) శాంతి 7) ధ్యానం 8) సత్యం
అనెడు ఎమిమిది రకముల పుష్పములు
భగవంతునికి ప్రీతికరము అయిన పుష్పములు.
శుభంభూయాత్ ప్రియం
బ్రూయాత్ ప్రియంచ నానృతం బ్రూయాత్
నబ్రూయాత్
సత్యమప్రియం ఏతత్ ధర్మసనాతనమ్
సత్యం పలకాలి. ప్రియం పలకాలి. కాని
అసత్యం పలక రాదు. కాని సత్యం అప్రియంగా పలకరాదు. దీనినే సనాతన ధర్మము అందురు.
పరమాత్మ తత్త్వము:
ప్రతి ఆలోచన, క్రియ, సంకల్పం ప్రారబ్ధకర్మవలన వచ్చునవే.
ప్రతి అనుభవము, ప్రతి ఫలితము కర్మ
ఫలములే. జీవునివెంట వచ్చేవి కర్మ ఫలములు మాత్రమే కాదు. వాసనా రూపములో నున్న
కోరికలు - అనగా సంస్కారములు. ఇవియే కొత్తకర్మలు - అనగా ఆగామి కర్మలు. ఎన్నో జన్మల
నుండి పేరుకు పోయిన కర్మలను సంచితకర్మలు అందురు. జ్ఞానాగ్నివలన సంచితము, అకర్తృత్వంవలన ఆగామి, అనుభవించుటవలన ప్రారబ్ధము నశించును.
ప్రయత్న బలముతో ప్రారబ్ధ కర్మను అధిగమించ వలయును.
సర్వంఖలు ఇదంబ్రహ్మ.
అంతటా బ్రహ్మ పదార్థమే నిండియున్నది.
బ్రహ్మ పదార్థం తప్ప వేరే ఏమీలేదు. మనిషి పరమాత్మ ప్రతిరూపమే. చరాచర ప్రపంచము
అంతయూ పరమాత్మ ప్రతిరూపమే. ఈ ప్రపంచమును సృష్టించేది సర్వశక్తివంతమైన శక్తి.
దానిని ఆనందం, నిత్యానందం అంటారు. ఈ
శక్తివలన వ్యక్తీకరించిన ఈ జగత్తును గుర్తించటానికి సర్వము తెలిసిన భావము ఉండాలి.
దానినే చిత్ అందురు. బ్రహ్మాండము అంతా నిండియున్నది కేవలము పరమాత్మయే. దానినే సత్
అందురు. అనగా పరమాత్మ సత్ - అనగా సర్వవ్యాపి. చిత్ అనగా సర్వజ్ఞుడు. ఆనంద - అనగా
సర్వశక్తిమంతుడు. ఏమీ లేక పోయినా ఆయన ఉంటాడు. ఆయన లేక పోయిన ఏమియునూ లేదు.
అందువలననే పరమాత్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అపరిమితమైన పరమాత్మని పరిమితమైన ఈ
ఇంద్రియములు, వాటి వాటి ధర్మములతో
గుర్తించలేము. దూరముగా నున్న వస్తువులను చూడటానికి టెలిస్కోప్ (Telescope), అతి సూక్ష్మముగా
నున్న వస్తువులను చూడ టానికి మైక్రోస్కోప్ (Microscope) ఎలా అవసరమో అలాగే అణోరణీయాన్
మహతోమహీయాన్ అన్నట్లుగా అణువులలో అణువు, గరిష్ఠములలో గరిష్ఠముఅయిన పరమాత్మని
అర్థము చేసుకొనటానికి ధ్యాన సాధన అవసరము. ఈ భౌతిక ప్రపంచము నుండి ఉన్నత స్థితికి
ఎదిగిన యోగి మాత్రమే పరమాత్మని అర్థము చేసుకొనటానికి సమర్థుడు. గీతలో పరమాత్మ
అందుకనే తస్మాత్ యోగి భవార్జున అన్నారు.
స్వంత ఇల్లు:
ఇంటి నుండి బయలు దేరిన వ్యక్తి తిరిగి తన స్వంత
ఇంటికి చేరటముతో (లో) నే సంతోషము పొందుతాడు. అదేవిధముగా ప్రతి జీవి కూడా తన
స్వస్థానం అయిన పరమాత్మలోనే సంతోషము పొందుతాడు. పరమాత్మతో ఐక్యం చెందే వరకు ప్రతి
జీవి తప్పక సాధన చేయాలి. అన్ని యోగములు కలిసిన
క్రియాయోగము సాధనాపరుడికి చాలా ఉత్తమ మైనది.
యోగములు:
1) హఠయోగము అనగా ఆసనములు, వ్యాయాయముల ద్వారా శరీరాన్ని
క్రమశిక్షణలో ఉంచటం 2) లయయోగము: ఓం శబ్దాన్ని వినటం
మరియు ఓంలో మమేకం అగుట 3) కర్మయోగము: ఫలితమును ఆశించక
కర్మ చేయుట 4) మంత్రయోగము: ఆత్మని పరమాత్మతో
కలపటానికి చేసే ఉచ్ఛారణలు (Chantings),
బీజాక్షరములలో
మమేకం అగుట 5) రాజయోగము: ప్రాణాయామ పద్ధతులు
- అనగా పతంజలి అష్ఠాంగ యోగ పద్ధతుల ప్రకారము ప్రాణశక్తి నియంత్రణ. అసలు శ్వాసని
అస్త్రంగా ఉపయోగించటమే శాస్త్రం. ఆత్మసాక్షాత్కారము పట్ల కలిగే స్వాభావిక ఆకర్షణే
భక్తి యోగము.
ప్రాణాయామం ద్వారా ప్రాణ, అపాన వాయువులు మహాముద్ర ద్వారా ఉదాన, వ్యాన వాయువులు స్థిర మగును.
జ్యోతిముద్ర ద్వారా ఆత్మ సాక్షాత్కారము లభించును. అంగుష్ఠ ప్రమాణములో నున్న
వామనుని, అనగా పురుషుణ్ణి
దర్శించు కోవచ్చును. వామన అనగా వరిష్ఠమైన మనస్సు గలవాడు అని అర్థము. క్రియా యోగము
చేయుటవలన క్రియలు మేరుదండాన్ని (వెన్నుపూసను) అయస్కాంత వంతము చేయును.
అయస్కాంతవంతము అయిన మేరు దండము యాంటినా (Antenna) మాదిరిగా అగును. అయస్కాంతవంతము అయిన మేరు దండము యాంటినా (Antenna) మిగిలిన శరీరములోని
శక్తినంతా ఆకర్షించును. ఈ ఆకర్షింప చేసుకొనబడిన శక్తి సుషుమ్న ద్వారము గుండా
సహస్రారము లోనికి చేర్చ బడును. ఈ విధముగా చంచల మనస్సు స్థిర భావము చెంది
అంతర్ముఖత్వము చెందుచుండును. క్రియా యోగము ద్వారా త్రిగుణాతీత నిష్కామ భావము
కలుగును.
షట్చక్రక్రియనే వేదవిధి అందురు. ప్రాణాయామ కర్మ
క్రియే కర్మ యోగము. కర్మచేయనిదే జ్ఞానము కలుగదు. ప్రాణాయామ కర్మ క్రియ చేయనిదే
భక్తి - అనగా సర్వము అర్పించు భావన ఉత్పన్న మవదు. సర్వము అర్పించు భావన
ఉత్పన్నమవనిదే పరమాత్మ మీద మనస్సు లగ్నమవదు. పరమాత్మ మీద మనస్సు లగ్నమవనిదే
స్వాభావిక మైన ఆకర్షణ ఉదయించదు.
ఉత్తమః బ్రహ్మసద్భావో
ధ్యానభావంతు మధ్యమః
స్తుతిర్పూజా అథమమ్
బహిర్పూజ అథమాథమమ్.
ఎన్ని పూజలు, స్తోత్రములు చేసినా ప్రాణాయామ కర్మ
క్రియ ద్వారా కలుగు స్వాభావికమైన ఆకర్షణ ఉదయించనిదే పరమాత్మకు సర్వము అర్పించు
భావన ఉత్పన్నమవదు. అనగా భక్తి ఉదయించదు. పరమాత్మకి సర్వము అర్పించు భావన
ఉత్పన్నమవటమే ఆత్మజ్ఞానము. . ఈ ఆత్మజ్ఞానముతో జ్ఞేయాన్ని- అనగా పరమాత్మని
సాధించాలి. ప్రాణాయామ కర్మ క్రియ చేసి చంచల ప్రాణము స్థిరప్రాణము అయినపుడు సత్వ, రజో, తమో గుణములు అనగా ఇడ, పింగళ, సుషుమ్నలు లేని అవస్థే క్రియాతీత అవస్థ.
జ్ఞానముయొక్క అంతము లేదా పరాకాష్ఠ పరమాత్మలో విలీనమగుట. దీనినే వేదాంతము అందురు.
కనుక పరమాత్మలో విలీనము అగుటయే వేదాంతము. ఇంకొక రకముగా చెప్పాలి అంటే వేదము అనగా
వినుట లేక వినబడుట. వినబడిన తరువాత వినబడు శబ్దము అంతమైపోవును. ఇక వినునది
వినబడునది ఏమీ ఉండదు. అటులనే జ్ఞానికి నేర్చుకోవలసినది నేర్చుకోకూడనిది ఏమీఉండదు.
కర్మ, భక్తి, జ్ఞాన, యోగములు స్వతంత్ర
యోగములుకావు. సాధనాక్రమములు. జ్ఞాన ప్రాప్తి లేనిదే ముక్తి
చిక్కదు. చంచల ప్రాణమును ఊర్థ్వమయిన ఆజ్ఞాచక్రములో నిలపడమే ఊర్థ్వరేతస్సు. ప్రాణం, బుద్ధి, మనస్సు, కళ్ళ ద్వారా ఈ జీవుడు అనగా ఆత్మ, ఈ సంసార జగత్తును చూస్తూ ఉంటుంది. ఈ
జీవుడు అనగా ఆత్మ ఈ సంసార జగత్తును పరిత్యాగము చేసి కూటస్థము వైపు దృష్టి మరల్చి, కూటస్థము ద్వారా చూడటము, చెందటము చేస్తూ ఉంటే ఆథ్యాత్మిక జగత్తు
సాధ్య మగును.
ఏదీ హఠాత్తుగా జరగదు. 17-20 సంవత్సరముల సమిష్టి పఠనా ఫలితమే ఒక
వైద్యునిగానూ, ఒక ఇంజనీరుగానూ, ఒక లాయరుగానూ, ఒక శాస్త్రవేత్తగానూ, ఒక పారిశ్రామికవేత్తగానూ అగుటకు దోహదపడు
తున్నది. అలాగే క్రితం లేదా గడచిన జన్మల సమిష్టి కర్మల ఫలితమే జీవుని సుఖదుఃఖముల
అనుభవమునకు కారణము. నిశ్చయంగా దైవశక్తి గొప్పదే. కాని పురుషాకారము అనగా కర్మ లేదా
ప్రయత్నము చేయనిది ఏదీ సాధ్యపడదు. దైవము విజ్ఞాన సమ్మతముకాదు. కర్మ చేయనిదే
జ్ఞానము రాదు.
ప్రాణాయామ కర్మ చేయనిదే ఆత్మ జ్ఞానము
కలుగదు. జీవునికి ఇచ్ఛఉండదు. కనుక ఆత్మయొక్క అనిచ్ఛమైన ఇచ్ఛతో, అనగా జీవునియొక్క ఇచ్ఛతో కర్మ చేయడమే
వ్యాప్తావస్థ లేదా జీవితావస్థ. దైవంకూడా కర్మలో అంతర్భాగమే. ఈ జీవుడు ఆత్మయొక్క
అనిచ్ఛమైన ఇచ్ఛతో కర్మ లేదా ప్రాణత్యాగము చేసినపుడు అది జీవుని మృత్యువు లేదా
అవ్యక్తావస్థ అందురు. ఈ (ఈక్షణముల నుండి వచ్చు) శ్వర (బాణముల వంటి శ్వాస) అనగా ప్రాణాయామ
కర్మ చేస్తున్న యోగియొక్క ప్రకాశ మానమౌ ఆత్మశక్తి సదృశమౌ ఈక్షణములను ఈశ్వర అంటారు.
నిశ్చల బ్రహ్మయొక్క ప్రథమ చంచలత్వమే పరాశక్తి. ద్వైతము ఈ పరాశక్తినుండే ప్రారంభము.
కూటస్థములో దర్శనము ఇచ్చు ఈ త్రిభుజమునే మహత్ బ్రహ్మ, యోగమాయ, ఆదిశక్తి, మహామాయ, అందురు. యోగి, ప్రాణాయామ కర్మ చేస్తున్న యోగి, ప్రాణము తద్వారా మనస్సు స్థితి వంతము
అయినపుడు ఈ త్రిభుజమునే అనగా మహత్ బ్రహ్మ, లేక యోగమాయ, లేక ఆదిశక్తి, లేక మహామాయ లేక మహత్ యోని దర్శనము
పొందును. ప్రాణిరూపి అయిన ఆత్మ (జీవుడు) గర్భాదాన సమయములో, ఆ త్రిభుజ యోని మధ్యలో బిందు రూపములో
అవస్థితమై యుండును. ఆ బిందువు క్రమశః విస్తారముచెంది అవయవ సహితము అగును. ఈ విధముగా
మహత్ బ్రహ్మ యోని నుండి జరిగే సకల భూత సృష్టి
అధిక చంచలత్వాన్ని ప్రాప్తించుకొని
నానారకముల యోనులు ఉత్పన్నమగును. నానారకముల యోనుల నుండి నానా రకముల మూర్తులు
ఉత్పన్నమగును. కానీ సకలమూ ఉత్పన్న మగుటకు మహత్ బ్రహ్మ రూపమైన బ్రహ్మయోనే మూలము.
అవిభక్తమైన బ్రహ్మే మహత్ యోని. అదే మాతృ స్థానము. కూటస్థములోని యోని మధ్యలో బిందు
లేక అణు రూపములో ఉన్నది ఈ పితా స్వరూపము అయిన పరమాత్మే. ఆ బిందువుయొక్క విస్తార
రూపమైన అధిక చంచలత్వము మాధ్యమంగా విస్తారమైన కూటస్థ రూపాంతరంవలన నానారకముల
మూర్తులుగా ఉత్పన్నమగునది పరమాత్మయే. ఈవిధముగా తల్లి, తండ్రి మరియు పుత్రుడు/పుత్రిక అన్నీ
పరమాత్మయే. విభక్తములుగా ఉన్న నాలుగు వేదములు, సకల దేవతలు, త్రిమూర్తులు అన్నియు ఆ మహత్ బ్రహ్మ రూప
పరాశక్తి యోని నుండే ఉత్పన్న మగును. స్థిరబ్రహ్మ ప్రథమ చంచలత్వము ఈ పరాశక్తి అనే
శుధ్ధసత్వమాయ. అధిక చంచలత్వము రజో తమో
గుణముల ఉద్భవానికి దారితీయును. అభిన్న ఓంకారమే ఆది వేదము, మూల వేదము, మూల జ్ఞానము. నిశ్చలావస్థ రూప బ్రహ్మకు
ముందుగా కనిపించే ఆత్మ సూర్యుడి నుండే ఈ ప్రపంచములోని సర్వమూ ఉత్పన్న మగుచున్నది.
కర్మసిధ్ధాంతము
క్రితం లేదా గడచినజన్మలలోని
సమిష్టికర్మలఫలితమే దైవము లేదా విధి. కర్మ లేకుండా దైవము లేదా విధి ఉండదు. కాని
దైవము లేకుండా కర్మ ఉండును.
బుధ్ధిఃకర్మాణుసారిణీ=
బుద్ధి కర్మను అనుసరించును.
అదృష్టం అనగా న దృష్టం. అనగా కనబడనిది.
పాత కర్మలు అనగా సంచిత కర్మలు న దృష్టం, అనగా
కన బడవు. వాటి ఫలితములు మాత్రమే మానవుడు అనుభవించేది. ఒకే అర్హత కలిగి, తెలివి తేటలు కలిగిన ఇద్దరు వ్యక్తులలో
ఒకడికి మంచి జీవితము, ఇంకొకడికి దుర్భర
దరిద్ర జీవితమునకు కారణము ఈ కనబడని సంచితకర్మల నుండి తెచ్చుకున్న
ప్రారబ్ధకర్మఫలితమే. స్థూలదేహము లేనిదే దైవము లేదా దయ్యము. ఈ దేహము లేని కనబడని
సంచిత కర్మల నుండి తెచ్చుకున్న కొంత సంచిత కర్మ ఫలితమే ప్రారబ్ధకర్మ. ఈ ప్రారబ్ధ
కర్మమే మన ప్రస్తుత, మంచి, చెడు, లేదా మిశ్రితమైన మంచి చెడు, స్థితికి కారణము.
కనుక కటికదరిద్రానికి, అమితఇశ్వర్యానికి కారణము మనము చేసుకున్న, చేసుకుంటున్నకర్మ. ఈ విషయము దృష్టిలో
పెట్టుకొని ఆగామికర్మలు అనగా ప్రారబ్ధకర్మ అనుభవిస్తూ భవిష్యత్తులో ఉపయోగపడే
(సత్కర్మలు) ఆగామికర్మను నిష్కామముతో దృఢ నిశ్చయముతో చేయవలయును. కనుక జ్ఞానముతో
సంచిత, ప్రారబ్ధ, మరియు ఆగామికర్మలు దృఢనిశ్చయముతో దగ్ధము
చేయవలయును. మత్తుమందు ఇచ్చి ఆపరేషను (Operation) చేసినయడల నొప్పితెలియదు. అదేవిధముగా ప్రారబ్ధకర్మ జ్ఞానిని అంత
తీవ్రముగా బాధించదు. కావున కర్మే ప్రధాన మైనది. క్రితం లేదా గడచిన జన్మల సమిష్టి
కర్మల ఫలితమే దైవం లేక విధి. కర్మ ఉంటే దైవము ఉన్నట్లే.
గ్రామములో జల్లడపట్టిన ధాన్యము
ధాన్యాగారబుట్టలో పోస్తూ ఉంటారు. పోస్తున్న ధాన్యము ఆగామి కర్మ. ధాన్యంబుట్టలో
ఇంతకు ముందే ఉన్న ధాన్యము సంచితకర్మ. ప్రస్తుతము ఖర్చు చేస్తున్నది ప్రారబ్ధకర్మ.
దేవీదేవతలు
కొన్ని కర్మల ఫలితములు వెంటనేలభ్యమగును.
కొన్ని కర్మల ఫలితములు ఆలస్యముగా లభించును. బ్లేడుతో (Blade) చర్మము తెగిన వెనువెంటనే రక్తము
చిందును. ప్రతి బాక్టీరియాకి
(Bacteria) రోగము
కలుగజేయు సమయము (Incubation
period) ఆయా
బాక్టీరియానిబట్టి ఉండును. ఆ సమయము 7, 14, 21రోజులు
కూడా ఉండవచ్చును. ఒక విత్తనము మొలకెత్తుటకు, ఆ తరువాత మొక్క అయి వృక్షము అగుటకు 4 నుండి 9 సంవత్సరములు పట్టవచ్చును. అదే విధముగా
ఈ జన్మములో మనము అనుభవించేది, అనుభవిస్తున్నది
ప్రారబ్ధ కర్మ మాత్రమే. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను సాధకుడు జ్ఞానము, ధ్యానముతో నశింప జేసికొనవచ్చును.
ఎంతవారలైనా ప్రారబ్ధకర్మ మాత్రము అనుభవించి తీరవలసినదే. త్యాగయ్య, రామదాసు, అన్నమాచార్యులు మొదలగు మహాత్ములు
అనుభవించినది కేవలము ప్రారబ్ధకర్మ మాత్రమే. కాకపోతే మత్తు మందు ఇచ్చి ఆపరేషను
చేస్తే రోగికి నొప్పి తెలియనట్లుగా,
యోగికి
ఆ ప్రారబ్ధకర్మబాధ అంతగా బాధించదు.
ప్రారబ్ధంభోగతేభుంజాత్
తత్త్వజ్ఞానేన సంచితమ్
ఆగామిద్వివిధం ప్రోక్తమ్ తద్వేష్టి ప్రియవాదినౌ.
స్థూలశరీరము లేని జీవుడినే దేవి, దేవత, దేవుడు, దెయ్యము, పిశాచము అందురు. మనకు అనుకూలముగా
పనిచేయు శక్తినే మంచి శక్తి లేదా దేవి లేదా దేవుడు అనెదము. మనకు అనుకూలముగాపనిచేయని
లేదా ప్రతికూలమైన శక్తినే చెడ్డ శక్తి లేదా దెయ్యము లేదా పిశాచము అనెదము . కనుక
ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, మనస్సు, బుధ్ధి, చెట్టు, పుట్ట అన్నీ దేవి, దేవుడు, దేవతలే. మనకు అనుకూలముగా ఆ పనిచేయు
శక్తినే దేవి (స్త్రీ), దేవుడు (పురుషుడు) గా
పిలచెదము.
నిష్కామకర్మ
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన గీత 2 - 47
ఫలము ఆశించకుండా చేసే కర్మే
నిష్కామకర్మ. సంజయ్ అనే అతను ఒక మంచి నీటి బావిని త్రవ్వించాడనుకుందాము. దానివలన
దారిన బోయే బాటసారుల దప్పిక తీరుతున్నందున తనను అందరూ మంచిపని చేశావని పొగడాలనుకోవటము
తప్పుగాదు. కాని ఆ బావిని త్రవ్వించి నందువలన వచ్చిన లెదా రాబోయే అననుకూల
పరిస్థితులకు కూడా సమానమైన బాధ్యత వహించవలయును.
ఉదాహరణకి ఆ దారినబోయే వారిలో ఇద్దరు
బాటసారులు పొరబాటున దానిలోపడి మరణించారనుకోండి. అప్పుడు ఆ మరణించిన వారియొక్క పరిపూర్ణ బాధ్యత అనగా వారి దహనసంస్కారములు
మరియు మరణించిన వారియొక్క పిల్లల పెంపకబాధ్యతలు అతనే సమానముగా తీసుకొనవలయునుగదా.
అందువలన చేసిన కర్మకి ప్రతిఫలము ఆశించకూడదు.
పూర్వజన్మస్మృతి
పూర్వజన్మస్మృతి లేక పోవడము అనేది ఆ
పరమాత్మ మనకిచ్చిన వరము. ఉదాహరణకి ఒక భార్యాభర్తలకి పూర్వజన్మస్మృతి వలన వారిలో
ఒకరు ఇంకొకరిని క్రిందటిజన్మలో హత్యచేశారని తెలిసిందనుకుందాము. లేదా వారు ఇరువురూ క్రితం జన్మలో సోదర
సోదరీమణులు అనుకుందాము. వారు ఈ జన్మలో ఈవిషయము తెలిసి కాపురము చేయగలరా? కనుక పూర్వజన్మస్మృతి లేక పోవడము అనేది
ఆ పరమాత్మ మనకిచ్చిన వరము.
కూటస్థ స్థితిని
పొందడమే శరణాపన్నస్థితి. పరిమితమైన వస్తువుతో అపరితమైన
వస్తువును చూడలేము.
పంచభూతములన్నింటిలోను, ఆ పంచభూతముల నుండి ఉత్పన్న మయ్యే
జగత్తులోని సర్వములోనూ పరమాత్మని దర్శించటము అసాధ్యము. అనగా అనేక రూపములు కలిగిన
పరమాత్మని దర్శించటానికి సాధకునికికూడా అనేక రూపములుండాలి. సాధకుడు కూటస్థుడైన
పరమాత్మని దర్శించటానికి కూటస్థములోనే స్థిరుడై ఉండవలయును. కూటస్థము, కూటస్థుడైన పరమాత్మ రెండునూ అవినాశులే.
ప్రాణముయొక్క ప్రథమ చంచలత్వము లేదా ప్రథమ తరంగంనుండి సృష్టి తత్త్వము లోని చివరి ఘనీభూతమైన
దేవీ దేవతల తరంగం వరకు వర్తమానమై యున్న 33
కోట్ల దేవీ దేవతలు వారి వారి పరిమితుల ననుసరించి ఉన్నవి. గుణసహితమైన ఈ దేవీ
దేవతలను స్తుతులతోనూ, ప్రార్థనలతోను
సంతృప్తి పఱచవచ్చు. స్థిరప్రాణము నుండి జన్మించిన ప్రథమ తరంగంలో నుండి
ఆవిర్భవించినదే చంచల ప్రాణము. అన్ని తరంగములను అతిక్రమించి మహాస్థిరత్వంతో విలీనమై
పోవడానికి చేసే కర్మే ఈ ప్రాణాయామ కర్మ. ఆత్మసూర్యుడు ఒకోసారి బిందురూపములోను, ఒకోసారి సీమారహితమైన అనంతం గానూ, ఒకోసారి సహస్రకోటి సూర్య తేజస్సు తోను, ఒకోసారి స్వచ్ఛమైన మహా శూన్యము గానూ
ఉంటాడు.
తేజస్సు శూన్యము. ఆ తేజస్సులో లయమగుటయే
మహా తేజస్సు లేదా మహాశూన్యము
ద్యావాపృథివ్యోరిరుమంతరంహి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చసర్వో గీత 11-20
కుండలిని
మూలాధారచక్రమునుండి (భూమినుండి)
సహస్రారము (సత్య లోకము) వరకు ఉన్నదే అంతరిక్షము. కుండలిని మూలాధార చక్రములో
సర్పాకారముగా బ్రహ్మద్వారాన్ని అనగా సుషుమ్న ద్వారాన్ని మూసి ఉంచి మూడున్నర
చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్న శక్తి . ప్రతి వ్యక్తి లోనూ 72 వేల సూక్ష్మ నాడులు ఉన్నవి. అందులో
మేరు దండం మధ్యలో ఎడమ ప్రక్కన ఇడ,
మేరు
దండం మధ్యలో కుడిప్రక్కన పింగళ,
మేరు
దండం మధ్యలో సుషుమ్న అని మూడు సూక్ష్మనాడులు ఉన్నవి. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు సూక్ష్మనాడులు చాలా
ముఖ్య మైనవి. ఈ సుషుమ్న లోపల వజ్ర,
దాని
లోపల చిత్ర, దాని లోపల బ్రహ్మనాడి
ఉన్నవి. ఈ సుషుమ్న మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి యుంటుంది. వజ్ర
సూక్ష్మశరీరమునకు కావలిసిన కదలికలకు సంకోచ వ్యాకోచ శక్తుల్ని సమకూరుస్తుంది. వజ్ర
స్వాధిస్ఠానచక్రమునుండి పైకి వ్యాపించి ఉండును చిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమములు
అనగా చేతనకి సంబంధించినవి అదుపులో ఉంచు కొనును. ఈ మూడు సూక్ష్మ మేరుదండములు అనగా
సుషుమ్న, సుషుమ్నలోని వజ్ర, వజ్రలోని చిత్ర అనేమూడూ సహస్రారము లోని
సూక్ష్మ మెదడు ద్వారా పని చేయును. భౌతిక శరీరము రక్త, మాంసమయము. సూక్ష్మ శరీరము ప్రాణ లేక
తెలివిగల ప్రకాశముతోనూ నిండియుండును.
కారణశరీరము చేతనతో కూడు కొని యుండును. కారణశరీరము ఆధ్యాత్మికమెదడు
కలిగి, బ్రహ్మనాడి అనే
ఆధ్యాత్మిక మేరు దండము కలిగియుండును. కేవలము చేతన మాత్రమే కలిగి యుండును.
భౌతికశరీరమునకు కావలిసిన శక్తి సూక్ష్మశరీరము అందించును. సూక్ష్మశరీరమునకు
కావలిసిన ఆలోచన, గుర్తింపు, భావన, ఇచ్ఛా శక్తులను కారణశరీరము అందించును.
చక్రములు స్థానములు
1) మూలాధారచక్రము: వ్యష్టిలో పాతాళ, సమిష్టి లో భూలోకం
అంటారు.
గుద స్థానానికి వారివారి తర్జనియొక్క
మొదటి కణుపు (అంగుళము)తో రెండంగుళములు పైన మేరు దండములో మూలాధార చక్రము ఉండును.
బీజాక్షరము “లం”. పృథ్వీ తత్త్వం. ఘ్రాణకారణము (గంధం). ఉఛ్వాశ
నిశ్వాశములు రెండింటిని కలిపి హంస అందురు. ఈ చక్రములో 600 హంసలు 96 నిమిషములలో జరుగును. ఇచ్ఛాశక్తికి
ప్రతీక. అధిదేవత విఘ్నేశ్వరుడు. తియ్యటి పండు రుచి. భ్రమరము మాదిరి ఝం అనే అనే
శబ్దము కుడి చెవి లో వినబడును. పసుపు రంగు. కుండలిని శక్తి ఈ మూలా ధారములో
సర్పాకారముగా మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉండును. సుషుమ్న ద్వారాన్ని
బ్రహ్మద్వారము అందురు. ఈ సుషుమ్న ద్వారాన్ని మూసి ఉంచి నిద్రిస్తున్న ఈ కుండలిని
శక్తిని యోగసాధన ద్వారా మేల్కొలిపి అఖండానందము, దివ్య దృష్టి, దివ్య జ్ఞానము సాధించటమే కుండలిని జాగృతి అందురు. ఆ అఖండానందము
అనేది ఈ మేల్కొలిపిన కుండలిని శక్తి సుషుమ్న ద్వారా బ్రహ్మరంధ్రములోనికి మూలాధారము
నుండి స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములు దాటుకుంటూ వెళ్తేనే కలుగుతుంది.
కుండలిని శక్తి మహాభారతములో ద్రౌపదిగాను, రామాయణములో సీతాదేవిగాను, శ్రీబాలాజి వెంకటేశ్వర స్వామి చరిత్రలో
శ్రీపద్మావతి దేవిగానూ వ్యవహరించబడుతున్నది. మూలాధారచక్రము మహా భారతములో
సహదేవుడుగా వ్యవహరించెదరు. ధ్యాన సాధనకి ప్రతికూలముగా ఉండే శక్తిని అడ్డుకునే
దివ్యశక్తిగా అభివర్ణిస్తారు. మూలాధార చక్రములో సుప్తమై (నిద్రించి యున్న)
కుండలిని ప్రాణశక్తి స్వాధిష్టాన,
మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రముల ద్వారా సహస్రారచక్రము
చేరటానికి చేసే ప్రయత్నములే అన్నిసాధనలయొక్క ఉద్దేశ్యములు. .
మహాభారతము: మహా=గొప్ప
భారతము=ప్రకాశము.
ద్రౌపది - శ్రీపద్మావతిదేవి
(కుండలినిశక్తి)
ద్రౌపది అనగా కుండలినీ ప్రాణశక్తి, ఐదుగురు పాండవులను అనగా సుషుమ్న ద్వారా
ఐదు చక్రాలు దాటుకుంటూ కూటస్థముచేరి, కూటస్థమునుండి
సుషుమ్నద్వారా సహస్రారము చేరటము,
తత్
పశ్చాత్ మహా ప్రకాశములో లయం అగుటయే మహాభారతము.
ఈ కుండలినీ ప్రాణశక్తినే వాసుకి అందురు.
మేరుదండమే మేరు పర్వతము.
మేరు దండమును మధించుట అనగా శ్వాసని
అస్త్రంగా అనగా ప్రాణకర్మ ద్వారా సంసారములో ఉండి విషము చిందించుచున్న కుండలినీ
ప్రాణశక్తి అనే వాసుకి అనే సర్పాన్ని సుషుమ్న ద్వారము ద్వారా ఐదు చక్రముల గుండా
పంపుతున్నపుడు ఈ ఐదు చక్రముల స్వభావ
స్వగుణములను పుణికి పుచ్చు కొని, అనగా
గంధ, రుచి, రూప, స్పర్శ, శబ్ద ములు అనే ఐదు తలల సర్పముగా
అభివర్ణించ బడును. ఈ ఐదు తలల సర్పము ఆజ్ఞా + లేదా కూటస్థము చేరి, కూటస్థము నుండి సహస్రారము చేరుట తోడనే ఆ
ఐదుతలల సర్పముయొక్క విషాన్ని అనగా అహంకారాన్ని, అంతఃకరణని వదిలించటమే శ్రీకృష్ణుడు
కాళీయ మర్దనము చేయుట అందురు.
అంతా యోగమే
శివాలయములో శివలింగానికి ఎదురుగా ఉంచే
నందియొక్క గూఢార్థము ఈ అష్టాంగయోగమే. నందియొక్క మేరుదండము నిఠారుగా ఉండును.
నందియొక్క రెండు కొమ్ములు ఇడ మరియు పింగళ సూక్ష్మ నాడుల ప్రతీకలు. ఆ నందియొక్క
రెండు కొమ్ముల మధ్యలో నిఠారుగా ఉన్న
మేరుదండము సుషుమ్న సూక్ష్మ నాడియొక్క ప్రతీక. శివలింగము సహస్రారచక్రమునకు ప్రతీక.
ముడ్డి దగ్గర ఒక చేత్తో రాస్తూ,
నందియొక్క
రెండు కొమ్ముల మధ్య నుండి చూడటము అంటే, సాధనచేసి
ముడ్డిదగ్గర మూలధారచక్రములో ఉన్న కుండలిని ప్రాణశక్తిని వెచ్చబరిచి, ఆ కుండలిని ప్రాణశక్తిని నిఠారుగా ఉన్న
మేరుదండములోని సుషుమ్నద్వారా సహస్రార చక్రములోనికి పంపమని సూచన. కొన్ని యోగి
వేమన పద్యముల యొక్క గూఢార్థము ఇదే.
చెప్పులోన రాయి
చెవులోనిజోరీగ కంటి లోని నలుసు కాలు లోనిముల్లు
ఇంటిలోనిపోరు
ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమా.
అంతరార్థం: ఓంకారాన్ని చెప్తూ లోపల
జోరీగ మాదిరి రాసుకో. తద్వారా - అనగా ఓంకారాన్ని చెప్తూ లోపల జోరీగ మాదిరి
రాసుకుంటూ ఉంటే, లోపలి అజ్ఞానాన్ని
కంటావు. ఓంకారాన్ని చెప్తూ లోపల జోరీగ మాదిరి రాసుకుంటూ ఉన్నావు కాబట్టి ఆ కన్న
అజ్ఞానము అప్పుడు కాలి పోతుంది.
దేహోదేవలయోప్రోక్తః
జీవోదేవోసనాతనః లేని యడల ఈ ఇంటిలో (శరీరములో ) ఉన్న నాగు పాముల లాంటి
ఇంద్రియములు నిన్ను ఈ ఇంటిలో (శరీరములో) ఉన్న పరమాత్మని కనబడకుండా మరుగుపఱచును.
ఉప్పుకప్పురంబు
నొక్కబోలికనుండు చూడచూడ రుచులుజాడవేరు.
పురుషులందుపుణ్యపురుషులువేరయా
విశ్వదాభిరామవినురవేమా.
యోగి, భోగి ఒకే రకముగ కనబడుదురు. క్రమక్రమంగా
వారి వారి స్వభావములు బయట బడును. పుణ్యపురుషులు ఉండేది, వచ్చేది సాధారణముగా గనబడు పురుషుల
నుండే.
కాకఃకృష్ణః
పికఃకృష్ణః కోబేధఃపిక కాకయోః
వసంతకాలే సంప్రాప్తే
కాకః కాకః పికఃపికః
కాకీ నలుపే, కోకిలా నలుపే. వసంత కాలము వస్తే కాకి
కాకే, కోకిల కోకిలే.
డాక్టరు చదివితే డాక్టరు వెంకట్రావు, ఇంజనీరింగు చదివితే ఇంజనీరు వెంకట్రావు.
లాయరు చదివితే లాయరు వెంకట్రావు.
బ్రహ్మజ్ఞానము తెలిసిన వెంకట్రావు
బ్రహ్మే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
2) స్వాధిస్ఠానచక్రము: వ్యష్టిలో మహాతల, సమిష్టి లో భువర్లోకం
అంటారు.
మూలాధారచక్రమునుండి నాలుగు (తర్జని
మొదటికణుపు ఒక అంగుళము) అంగుళములపైన మూత్రాశయము, గర్భాశయము, మలాశయముల నడుమ నుండే శుక్రాశయములో మేరు
దండములో ఉండును. బీజాక్షరము “వం”. తెలుపు రంగు. ఆరు దళములు. కొంచెము చేదు
రుచి. వేణు నాదము మాదిరి శబ్దము వినబడుచుండును. జలతత్త్వము. రసనేంద్రియమునకు అనగా
నాలుకకు కారణము. అధ్యాత్మిక సాధనకి అతుక్కునే దివ్యశక్తిని అనుగ్రహించును.
మహాభారతములో నకులుడు. వేద అనగా వినబడుట. పవిత్రమయిన వేణునాదగానము వినబడును.
అందువలన బాలాజి చరిత్రలో వేదాద్రి అని
వ్యవహరించబడినది.. ఆరు దళములు,
144నిమిషములలో
6000 హంసలుజరుగును.
క్రియాశక్తికి ప్రతీక. ఈ చక్రానికి బ్రహ్మ అధి దేవత. పక్షి ఆకృతి.
3) మణిపూరచక్రము: వ్యష్టిలో తలాతల, సమిష్టిలో స్వర్లోకం
అంటారు.
స్వాధిస్ఠాన చక్రము నుండి మూడు అంగుళముల
పైన నాభి వెనకాల ఉండును. పీఠిక ఆకృతి. అగ్ని తత్త్వము. చూచే శక్తికి అనగా కన్నుకి
కారణము. జ్ఞాన శక్తికి ప్రతీక. శ్రీవిష్ణువు అధి దేవత. 240 నిమిషములలో 6000 హంసలు జరుగును. “రం” బీజాక్షరము. ఎఱ్ఱటి రంగు. 10 దళములు. వీణ నాదము. కాకరకాయ మాదిరి
చేదుగా ఉండును. సాధకునికి అవసరమైన దివ్యమైన ఆత్మ నిగ్రహముమును కలగజేయుచుండును.
భారతములో అర్జునుడుగాను, బాలాజి చరిత్రలో
గరుడాద్రిగాను వ్యవహరించబడును. గ (జ్ఞాన) రుడ (వంతుడు) అనగా జ్ఞానవంతుడు అని
అర్థము.
4) అనాహతచక్రము: వ్యష్టిలో రసాతల, సమిష్టిలో మహర్లోకం అందురు.
మణిపూరచక్రము నుండి 10 అంగుళముల పైన గుండె వెనకాల ఉండును. బీజ
శక్తికి ప్రతీక. రుద్రుడు అధిపతి. లింగాకృతి. నీలం రంగు. 12 దళములు. “యం” బీజాక్షరము. 288 నిమిషములలో 6000 హంసలు జరుగును. సాధకునికి అవసరమైన
ప్రాణాయామ నియంత్రణ శక్తిని ఒసంగును. పెద్దగుడిగంట శబ్దము వినవచ్చును. పులుపు
రుచి.
భారతములో భీముడిగాను, బాలాజి చరిత్రలో అంజనాద్రి గానూ
వ్యవహరించ బడును. వాయు తత్త్వము. స్పర్శ అనగా చర్మమునకు కారణము.
5) విశుద్ధ చక్రము: వ్యష్టిలో సుతల, సమిష్టి లో జనలోకం
అంటారు.
అనాహత చక్రము నుండి 12 అంగుళముల పైన కంఠ ప్రదేశములో ఉండును.
ఆది శక్తికి ప్రతీక. ఆత్మ అధిపతి. తెల్లని మేఘము రంగు. 16 దళములు. “హం” బీజాక్షరము. 384 నిమిషములలో 1000 హంసలు జరుగును.
సాధకునికి అవసరమైన దివ్యమైన శాంతిని
ఒసంగును. ప్రవాహము మాదిరి శబ్దము విన వచ్చును. కాలకూటవిషము మాదిరి రుచి. భారతములో
యుధిష్టిరుడిగాను, బాలాజి చరిత్రలో
వృషభాద్రి గానూ వ్యవహరించ బడును. ఆకాశతత్త్వము. శబ్ద అనగా శ్రవణేంద్రియము చెవ్వుకు
కారణము. జీవుడు అధిదేవత.
6) ఆజ్ఞా చక్రము: వ్యష్టిలో వితల, సమిష్టి లో తపోలోకం అంటారు.
ఆజ్ఞా చక్రము కనుబొమ్మల మధ్యలో ఉండును.
విశుద్ధ నుండి 12 అంగుళముల పైన
ఉండును. రెండు దళములు ఉండును. 48 నిమిషములలో 1000 హంసలు జరుగును. పరాశక్తికి ప్రతీక.
శ్రీకృష్ణుని చక్రము. శ్రీబాలాజిచరిత్రలో వేంకటాద్రి. ద్వంద్వము. ఇక్కడ నుండి
మొదలు. ఈశ్వరుడు అధి దేవత. పరాశక్తి స్ఠానము. బీజాక్షరం “ఓం”. మహాలింగం. వ్యష్టిలో వితల, సమిష్టి లో తపోలోకం అందురు.
7) సహస్రార చక్రం :
వ్యష్టిలో అతల, సమిష్టి లో సత్యలోకం
అంటారు.
శిరస్సు పైన నడినెత్తిలో బ్రహ్మరంధ్రంలో
సహస్రారచక్రం ఉండును. శ్రీ సత్ గురువు అధిదేవత. రోజు మొత్తంలో 240 నిమిషములలో 1000
హంసలు జరుగును. ఓంకార లింగం. “రాం” బీజాక్షరం. ఈ పట్టిక లో అన్ని విషయములు
పొందుపరచడమైనది.
ప్రతిచక్రంలోనూ ఆయా చక్రానికి
సంబంధించిన బీజాక్షరం ఉచ్ఛరించడమువలన ఆయా చక్రము తెరుచుకొనును.
ధ్యానం చేయని వ్యక్తి శూద్రుడు.( పరిచారికుడు)
కలియుగంలో ఉన్నట్లు లెక్క. అతని హృదయం నల్లగా ఉన్నట్లే. ధ్యానం ప్రారంభించగానే క్షత్రియ వర్గంలోకి అనగా
యుద్ధం చేసేవర్గం లోనికి ప్రవేశించినట్లు లెక్క.
చక్రములు స్థానములు
|
తత్వము తన్మాత్ర
|
లింగం, హంస, హృదయం
|
ఫలితం
|
బీజాక్షరం,శక్తి, అధిదేవత
|
రంగు, రుచి, శబ్దం, దళములు
|
ప్రాతినిధ్యం
|
సమాధి
|
||||
మహాభారతం
|
శ్రీ తిరపతి బాలాజి
చరిత్ర
|
||||||||||
మూలాధార
గుదస్థానములో
|
పృథ్వి, గంధ, క్షత్రియ వర్గం
|
ఆధారలింగం
96ని లో 600 హంస .
స్పందనాహృదయం
|
సుఖనాశనం, దివ్యజ్జ్ఞానం & దృష్టి
|
.”లం” ఇచ్ఛా శక్తి, వినాయక, సాధకుడు
కలియుగంలోఉన్నట్లు
|
పసుపు, తియ్యటి పండ్ల రుచి, భ్రమరం శబ్దం, 4 దళములు
|
సహదేవ, మణిపుష్పక్ శంఖం
|
శేషాద్రి
(పాము మీద కూర్చున్నట్లు)
|
సవితర్క
సంప్రజ్జ్ఞాత (సందేహాస్పదం)
|
|||
స్వాధిస్ఠాన ( గుదస్థానమునకు 21/2 కణుపులపైన )
|
జలం
, రస, రుచి, ద్విజ (రెండవజన్మ)
|
గురు
లింగం, 144 ని. లో 6000
హంస స్థిర హృదయం
|
ఇంద్రియ
నిగ్రహం, అనిగ్రహం, తెలివి ఉండుట లేకపోవుట
|
“వం” క్రియాశక్తి,
బ్రహ్మ , ద్వాపరయుగ
|
ధవళ, మాదిరిచేదు పిల్లనగ్రోవి శబ్దం, 6 దళములు,
|
నకుల
, సుఘోష, పరమాత్మ నాతో న్నాడనే భావన కలుగుట
|
వేదాద్రి
(పవిత్ర పిల్లనగ్రోవి శబ్దంవినుట)
|
సవిచార
సంప్రజ్జ్ఞాత లేక సాలోక్య
|
|||
మణిపుర
నాభి వెనకాల
|
అగ్ని
, రూప, విప్ర వర్గం
|
శివ
లింగం 240ని.లో 6000 హంస లగ్న హృదయం
|
రోగ
నిరోధక శక్తి, దుష్టశక్తుల
నుండి విముక్తి , లేదా
చెడు లక్షణములు
|
“రం” జ్జ్ఞానశక్తి. , శ్రీ విష్ణు త్రేతాయుగ,
|
ఎరుపు, చేదు, వీణ శబ్దం, 10 దళములు
|
అర్జున, దేవదత్త, పరమాత్మకి దగ్గిర అవుతున్న అనుభూతి
|
గరుడాద్రి
( పై కి ఎగిరి పోతున్న అనుభూతి)
|
సానంద
సంప్రజ్జ్ఞాత
లేక సాలోక్య
|
|||
అన్నహత
హృదయం వెనకాల
|
వాయువు
, స్పర్శ, బ్రాహ్మణ్
|
చర
లింగం, 288ని.లో 6000 హంస, శుద్ధ హృదయం
|
పవిత్ర ప్రేమ , ప్రేమ లేక పోవుట
|
“యం” బీజ శక్తి, రుద్ర, సత్యయుగ,
|
నీలం, పులుపు, గుడిగంట, 12 దళములు
|
భీముడు, పౌండ్రం పరమాత్మపొందు
లభించును అనే అనుభూతి.
|
అంజనాద్రి
(గాలిలో తేలుతున్న అనుభూతి
|
సస్మిత
సంప్రజ్జ్ఞాత లేక సాయుజ్య
|
|||
విశుద్ధ గొంతులో
|
ఆకాశ
, శబ్ద
|
ప్రసాదలింగం, 384ని.లో 1000 హంస
|
శాంతి,
ప్రశాంతి
|
“హం” ఆదిశక్తి ఆత్మ
|
తెల్లని
మేఘం , కటిక చేదు,
ప్రవాహం శబ్దం,
16
దళములు
|
యుధిష్ఠిర, అనంత విజయం, నేను పరమాత్మ తో ఉన్నాను
|
వృషభాద్రి,
|
అసంప్రజ్జ్ఞాత
లేక సారూప్య,
|
|||
ఆ
జ్ఞా
కూటస్థ
|
మహాలింగం
48ని.లో 1000హంస
|
దివ్యదృష్టి
|
“ఓం” పరాశక్తి ఈశ్వర
|
మిరుమిట్లు
గొలిపే ప్రకాశం
|
శ్రీ
కృష్ణ, పాంచ జన్యం నేనే ఆ పరమాత్మ
|
వేంకటాద్రి
|
సవికల్ప
లేక
స్రష్ఠ
|
||||
సహస్రార
బ్రహ్మ
రంధ్రం
|
ఓంకార
లింగం , 240ని.లో
1000 హంస
|
జగత్
సంసారం నుండి విముక్తి
|
“రాం” పరమాత్మ, సత్ గురు
|
పరమాత్మతో
ఐక్యం
|
నారాయణాద్రి
|
నిర్వికల్ప
|
|||||
అసలు ధ్యానమే చేయనపుడు ఆ కుండలినిని
నిద్రిస్తున్న కుండలిని అందురు. సరియైన ధ్యానం సత్ గురువు నుండి పొంది అభ్యసించిన
నిద్రిస్తున్న కుండలిని మేల్కొనును. అప్పుడు ఆ కుండలినిని మేల్కొనిన కుండలిని
అందురు. నిద్రిస్తున్న కుండలిని దళములు క్రిందికి వంగి యుండును. మేల్కొనిన
కుండలిని దళములు పైకి లేచియుండును.
శుచిగా శుభ్రముగా ఉన్న ప్రదేశములో
ఆసనమువేసికొని ధ్యానము చేయవలయును.
శుచౌ దేసేప్రతిష్ఠ గీత 6 - 11
సమమ్ కాయ శిరోగ్రీవం గీత 6 - 13
యుక్తాహార విహారస్య గీత 6 – 17
ధ్యానమునకు ఉపక్రమణ పధ్ధతి:
ఆసనం ఎక్కువ ఎత్తుగా గాని తక్కువ
ఎత్తుగా గాని ఉండరాదు. ఆసనంమీద దర్భాసనం వేసికొనవలయును. దానిమీద పులి లేక జింక
చర్మం లేదా ఉన్నివస్త్రం వేసికొనవలయును. వాటి అంతట అవే చనిపోయిన పులి లేక జింక
చర్మములను వేసికొనవలయును. ధ్యానంకొరకై వేటాడి చంపకూడదు. అందువలననే ఉన్నివస్త్రము
చాలా మంచిది. దానిమీద పట్టు వస్త్రం వేసికొనవలయును. ఆ తదుపరి సత్ గురువు చెప్పిన
విధముగా ధ్యానము నియమిత నిర్ణీత సమయములలో చేయవలయును.
(బొమ్మలో చూడుడు) నిద్రిస్తున్న
కుండలినియొక్క క్రిందికి వంగియున్న దళములు, మేల్కొనిన కుండలిని యొక్క పైకి
లేచియున్న దళములు
కుండలిని
మూడున్నర చుట్టలు చుట్టుకొని మూలాధార
చక్రమునందు ఉండి సుప్తమై నిద్రాణమైయున్న ఈ శక్తిని కుండలిని, కుల కుండలిని అందురు. కుండలిని శక్తి
గుద స్థానమున అథో శీర్షయై ఉండును.
నాడీ మండలమున ఉన్న గొప్ప శక్తిని ఓజః
శక్తి అందురు. ప్రతి వ్యక్తి లోనూ కొద్దో గొప్పో ఈ ఓజఃశక్తి ఉండును.
ఈ శక్తి ఎంత అధికముగా ఉండునో అంత
అధికముగా ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండును. ఈ ఓజఃశక్తి మీద ఆధారపడి
మనోబలము, ఆరోగ్యము ఉంటాయి.
క్రియాయోగ సాధన ద్వారా మూలాధార చక్రమున
ఉన్న నిద్రించి యున్న కుండలినిని ధారణ ధ్యానములు చేసి జాగృతి చేయాలి. ఆ విధముగా
మేలుకొన్న కుండలిని శక్తి ప్రాణాపాన వాయువులచే ప్రేరేపించబడి సుషుమ్న నాడియందు
ప్రవేశించి, ఊర్థ్వ ముఖముగా
మూలాధారము, స్వాధిష్టానములు
దాటగానే బ్రహ్మనాడిని, మణిపూర, అనాహతలు దాటంగానే రుద్రగ్రంధిని, విశుద్ధ, ఆజ్ఞా దాటంగానే విష్ణుగ్రంధిని
ఛేదించును.
జీవాత్మకి, పరమాత్మకి విభేదము కల్పించేది ఈ బ్రహ్మ, రుద్ర, విష్ణు గ్రంధులే అనగా ఈ మూడుముడులే. ఈ
జడశరీరమునకు, పరమాత్మకు ఉన్న
సంబంధము లేదా ముడి ఈ ప్రాణశక్తియే. చంచల ప్రాణమును స్థిర ప్రాణమును చేస్తే తప్ప ఈ
ముడి, ఈ సంసారబంధము
త్రెగిపోదు. చంచలప్రాణము స్థిరప్రాణము అయితే తప్ప మనస్సు స్థిరమవదు. స్థిరమనస్సు
అగుటకు ప్రాణాయామ నియంత్రణ ఒక్కటే మార్గము. ఆ ప్రాణాయామ సాధనలోని భాగమే ఈ గ్రంధి
ఛేదన.
గ్రంధులు:
బ్రహ్మగ్రంధి అనగా స్థూలదేహ తాదాత్యము.
అనగా ఈదేహమే “నేను” అనే అభిమానమే అన్నమయ కోశము. . అన్నమయ
కోశమును ముందర దాటాలి. అనగా ప్రాణ రూపియైన స్వాధిష్ఠానమును దాటి “నేను” అనే ముడిని తీసివేయాలి సాధకుడు. .
దీనినే ఆది భౌతిక శాంతి అందురు.
రుద్ర గ్రంధి అనగా సూక్ష్మ శరీర
తాదాత్మ్యము. ప్రాణమయ, మనోమయ, విజ్ఞా న మయముల సమిష్టి రూపము.
ద్వంద్వానికి ఈరుద్ర గ్రంధి ప్రతీక. స్థూలశరీరము లేనిదే దేవత. ప్రాణరూపియైన
పశ్యంతి వాక్కు, మణిపూర అనాహతలను
దాటటమే ఈ రుద్ర గ్రంధి ఛేదన. రుద్ర గ్రంధి ఛేదనవలన మానసిక చంచలత చాలా వరకు
నిర్మూలించబడుతుంది. దీనినే ఆదిదైవికశాంతి అందురు. విష్ణు గ్రంధి అనగా కారణశరీర
తాదాత్మ్యము. ఆనందమయకోశము. ఇక్కడ చంచలప్రాణము స్థిరప్రాణ రూపమును బొంది సుషుమ్న
ద్వారా ఇడ పింగళలను వదిలిపెట్టి సహస్రారము చేరుట. తద్వారా బ్రహ్మీ స్థితిని
పొందుటయే విష్ణుగ్రంధి ఛేదన. అస్థిరప్రాణమే గొంతులో ఉన్నపుడు ఉపాంశు అంటారు. అనగా
బిందు రూపము. ఇట్టి ప్రాణమునే మధ్యమము లేదా ప్రియ అందురు. ఈ మధ్యమము లేదా ప్రియ, వైఖరిగా మారి, స్థిరప్రాణ రూపమై సహస్రారము చేరుటయే
విష్ణుగ్రంధి ఛేదన.
ఆత్మకి మాధ్యమము ప్రాణము, ప్రాణమునకు మాధ్యమము బుద్ధి, బుద్ధికి మాధ్యమము మనస్సు, మనస్సుకి మాధ్యమము కళ్ళు. . . అనగా ఆత్మే
(జీవుడు) ప్రాణము, బుద్ధి, మనస్సు, కళ్ళు, అనగా ఆత్మే కళ్ళద్వారా ఈ జగత్
సంసారాన్ని చూచును.
మా = అజ్ఞా నము న= లేకుండా వ =
వర్తించుట
మా = కాదు నవ = క్రొత్త
అనగా ఓ మానవా, నీవు నిన్న, ఇవ్వాళ మరియు రేపు ఉంటావు.
ఎప్పుడైతే ఈఆత్మ (జీవుడు) జగత్
సంసారములను పరి త్యాగముచేసి కూటస్థము ద్వారా చూస్తుందో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక
జగత్తు అనగా దైవ సామ్రాజ్యము అందుబాటులోనికి వచ్చును. గత జన్మములందు చేసిన
సమిష్టికర్మల ఫలితమే జీవుడు ప్రస్తుత జన్మలో అనుభవించే సుఖదుఃఖములు. .
ఏదీ హఠాత్తుగా జరగదు. కనుక ప్రతివ్యక్తి
వ్యష్టిలో ఉన్న మూలాధారచక్రములో మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రాణమై యున్న
కుండలినీ ప్రాణశక్తిని మేలుకొలిపి సుషుమ్న ద్వారా చక్రములన్నింటినీ దాటించి
బ్రహ్మరంధ్రములోని సహస్రారచక్రము నకు కలపటమే సాధన లేదా చేయవలసిన విద్యుక్త ధర్మము.
ఈ సాధననే అష్టాంగయోగ సాధన అంటారు. అది:
అష్టాంగయోగము:
1) యమ: నీతి ఆత్మనిగ్రహము
2) నియమ: ఆధ్యాత్మక నిబంధనలు. అనగా శరీరము
మనస్సు శుభ్రముగా ఉంచుకొనుట
3) ఆసన: ధ్యానము చేయుటకు శరీరమును ఒక
అనుకూల పద్ధతిలో నిశ్చలముగ ఉండునట్లు చేయుట
4) ప్రాణాయామ: ప్రాణశక్తిని నియంత్రించుట
5) ప్రత్యాహార: బయటి విషయములనుండి
ఇంద్రియములను మనస్సును అంతర్ముఖము చేయుట
6) ధారణ: మనస్సును
స్థిరపరచుట
7) ధ్యాన: సద్వస్తువు అనగా పరమాత్మయందే
ధ్యాస
8) సమాధి: పరమాత్మలో లయమగుట
సాధన నాలుగు విధములు
1. కర్మయోగం: నీధర్మం నీవు చేయుము.
కర్మఫలాన్ని అశించకుము
2. భక్తియోగం: భగవంతుని పాదములను
పరిపూర్ణముగా విశ్వసించుట
3. ధ్యానయోగం: భగవంతునియందే
మనస్సును లగ్నం చేయుట
4. జ్ఞానయోగం: అహంబ్రహ్మాస్మి అనే పరిపూర్ణమైన భావన
ఈ సాధనలు
స్వతంత్రమైనవి కావు. ఒక యోగమునకు ఇంకొక యోగమునకు పరస్పర సంబంధం గలదు.
కొన్ని ముఖ్య విషయములు:
తిన్న ఆహారము వీర్యము క్రిందకు మారుటకు
ఏడు మార్పులు జరుగును. అవి
1) ఆహారము 2) రక్తం 3) మాంసం 4) నరములు
(స్నాయువులు) 5) ఎముకలు 6) మజ్జ 7) శుక్లము
* ఉదరములోని ఆమ్లములవలన ఆహారము రసము
క్రింద మారును. దీనికి 360 నిమిషములు పట్టును. .
*రసము సాధారణ రక్తమగుటకు 15 దినములు
పట్టును. (పక్షము)
* సాధారణ రక్తం స్వచ్ఛ రక్తమగుటకు 27
దినములు పట్టును. (నక్షత్రములు)
·
స్వచ్ఛ రక్తం మాంసమగుటకు 41 దినములు
పట్టును. ఏ మంత్ర సిద్ధి కైననూ కనీసం 41 దినములు పట్టును.
·
మాంసం నరములగుటకు (స్నాయువులు) 52
దినములు పట్టును. (సంస్కృత అక్షరములు).
·
నరములు (స్నాయువులు) ఎముకలగుటకు 64
దినములు పట్టును. (కళాశాస్త్రములు).
·
ఎముకలు మజ్జ అగుటకు 84 దినములు పట్టును.
(జీవరాసులు 84 లక్షలు).
·
మజ్జ శుక్లమగుటకు 96 దినములు పట్టును.
(సాంఖ్యులప్రకారం ఈ శరీరము 96 తత్త్వములతో చేయబడినది)
·
శుక్లము ఓజఃశక్తి అగుటకు 108 దినములు
పట్టును. (అష్టోత్తరము).
స్వామి శాఖలు
తీర్థ ఆశ్రమ వన
అరణ్యమ్ గిరి పర్వత సాగరం సరస్వతి భారతీచ పురి నామాని దశః
1)
తీర్థ 2) ఆశ్రమం 3) వనం 4) అరణ్యం 5)
గిరి 6) పర్వతం 7) సాగరం 8) సరస్వతి 9) భారతి 10) పురి
2)
అని స్వామి శాఖలు శంకరాచర్యులవారి కాలము
నుండి ఒక పద్ధతి ప్రకారము వస్తూన్నవి.
3)
ప్రతి స్వామికి ఆఖరిన “ ఆనంద” అని ఉంటుంది. దీని అర్థం ఆయా
మార్గాన్ని ఎన్నుకొని ముక్తి పొందారని అర్థం. ఉదా: యోగానంద అనగా యోగమార్గమును
ఎంచుకొని దానిలో నిష్ణాతులయ్యారు అని అర్థం.
4)
ఇచ్ఛాశక్తి : = సృష్టి ఉద్దేశించ
బడినది. = బిందు = కారణ = సరస్వతి
5)
జ్ఞానశక్తి : సృష్టి క్రమము: = కళ = సూక్ష్మ
= లక్ష్మి
6)
క్రియశక్తి = క్రియరూప సృష్టి = నాద =
స్థూల = దుర్గ
సృష్టిలోని పరమాత్మని కృష్ణ చైతన్యం అంటారు. ఇది
శుద్ధసత్వ మాయ
ధ్యానము ఎందుకుచేయవలయును?
ప్రతి ప్రాణి కోరుకొనేది ఆనందమే. ప్రతి
ప్రాణి లాభము కోసమే శ్రమ చేస్తాడు/చేస్తుంది. ప్రతి ప్రాణి ఎక్కువ కాలము
జీవించాలని, ఆనందముతో ఉండాలని
ఆకాంక్షిస్తుంది. శ్వాసని అస్త్రముగా ఉపయోగించటమే శాస్త్రము. శ్వాసమీద ధ్యాసే
ధ్యానము. హంస అనగా ఒక శ్వాస+ఒక నిశ్వాస. ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి అనగా భోగి
రోజుకి అనగా 24 గంటలలో 21, 600 హంసలు చేస్తాడు.
అనగా ఒక నిమిషమునకు 15 హంసలు చేస్తాడు
(చేస్తుంది).
ఒక నిమిషమునకు 15 హంసలు చేస్తే భోగి
ఒక నిమిషమునకు 15 హంసలకి మించి చేస్తే రోగి.
ఒక నిమిషమునకు 15 హంసలకి తక్కువ చేస్తే యోగి.
ప్రతి మనిషి తన పుట్టుకతో ప్రారబ్ధకర్మ తెచ్చుకొనును.
ప్రారబ్ధ కర్మతో బాటు ఇన్ని హంసలు అని తెచ్చుకొనును. దృఢ నిశ్చయముతో, ఇచ్ఛాశక్తితో ప్రాణాయామ కర్మ చేసి ఎన్ని హంసలు పొదుపు
చేయునో అంత ఎక్కువ కాలము జీవించగలుగును. బాంకులో (Bank) వేసి ఉంచిన డబ్బు ఎంత ఎక్కువగా వాడినచో అంత త్వరితముగా
ఖర్చు అగును. ఎంత తక్కువగా వాడినచో అంత ఎక్కువకాలము వచ్చును. హంసలు కూడా అంతే.
దినమునకు 3 లేదా 4 మారులు శ్వాస తీసుకునే
తాబేలు ఎక్కువ కాలము జీవించును. కనుకనే గాయంతం త్రాయతే ఇతి గాయత్రి అనునది.
చక్కగా గాయత్రిలోని 24 హంసలు ఎంత నిదానముగా చక్కటి ఉఛ్ఛారణతో చేస్తూ ఉంటే మన
హంసలు పొదుపయ్యి, మనస్సు హాయిగా ఉండటమేగాక, మనల్నిఎక్కువ కాలము జీవించేటట్లు చేయును. కనుక ధ్యానముజీవితకాలాన్ని అందంగా, ఆరోగ్యముగా దీర్ఘాయువుగా చేయుననుటలో
సందేహము లేదు. ధ్యానము చేయ గలిగినది ఒక్క మానవ జన్మమే. అందువలననే 1) మానవజన్మ 2) ముముక్షత్వము 3) మహాపురుష దర్శనము దుర్లభము అనుటకు
కారణము.
గజేంద్రమోక్షము
గజము అనగా ఏనుగు. గజ తెలివి అనగా మహా
తెలివి. గజ ఈతగాడు అనగా గొప్ప ఈతగాడు. ఏనుగు దృష్టి సూక్ష్మ దృష్టి. అంత ఎత్తున
చిన్న చిన్న కళ్ళతో ఉన్న ఏనుగు క్రిందబడ్డ చిన్న రేగు పండుని తొండంతో తీసికొని
తినగలదు. గజ ఇంద్రియము అనగా గొప్ప ఇంద్రియము. గొప్ప ఇంద్రియము మనస్సు. . మనస్సు
మానవులకు మాత్రమే వృద్ధి చెందియున్నది.
“మనఏవ మనుష్యాణామ్ బంధమోక్ష్మ కారణమ్” అనగా మనస్సు అనే గజేంద్రియమే ఈ సంసారము
అనే బంధానికి మోక్షానికి కారణము. సహస్రారచక్రమే సు (మంచి) దర్శన (చూడదగినది).
సహస్రారచక్రమే సుదర్శనచక్రము.
శ్రీ కాళహస్తి
సాలెపురుగు ని శ్రీ అందురు. కాళము అనగా
పాము. హస్తి అనగా ఏనుగు.
సాలెపురుగు (శ్రీ) తన గూడును తన చొంగతో
తనే నిర్మించుకొనును. దానిలోనే నివసిస్తుంది. అలాగే ప్రతిజీవి తన సంసారాన్ని తనే
నిర్మించుకొనును. ఇదేసాలెగూడు. కాళము అనగా పాము ఇంద్రియముల వంటిది. ఇంద్రియములను
వశపరచుకోవటము పామును వశములో ఉంచుకోవటమంత కష్టము. హస్తి అనగా ఏనుగు. ఏనుగు దృష్టి
నిశిత దృష్టి. శివలింగం సహస్రారచక్రం. కనుక నిశిత దృష్టితో ఇంద్రియములను
వశపరచుకొని ఈ సంసార బంధమునుండి బయటపడి సహస్రారచక్రంలో లయమవమనే తిన్నడి సందేశము.
శివ
శివుడు మెడచుట్టూ పాములు వేసికొనును.
అనగా పాముల లాంటి ఇంద్రియములను వశపరచుకొనుము. గంగ అనగా నీరు. నీరు అనగా ప్రకృతి.
ప్రకృతిని అధిగమించుము. బూడిద అనగా ఈ సంసారం అనిత్యమైనది. త్రిశూలము అనగా
త్రిగుణములను దాటుము.
రెండుకన్నులను ఒక కన్నుగా మలచుకొనుము.
అనగా కూటస్థములో మూడవ కన్నుగా ఏకదృష్టిని అలవర్చుకొనుము. ఓంకారము జపించి పరమాత్మలో
లయమగుము. శివుడు అనగా మంగళస్వరూపుడు.
అభిషేకం-పంచామృత స్నానం
నీరు అనగా ప్రకృతి. నీటిని అనగా
ప్రకృతిని ఆ పరమాత్మకి అప్పగించటం అనగా ప్రకృతిని అధిగమించి పరమాత్మలో ఐక్యం
జెందటం. నీకన్న నీవు ఒసంగిన ఈ ప్రకృతి అధికము కాదు అని నమ్రతతో తెలియజేసికొనుటయే ఈ
అభిషేకం.
జ్ఞాని కాని వాడికి జన్మరాహిత్యం
చెందనంత వరకు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే పంచ మహాభూతాలు పంచ అమృతాలే.
పరమాత్మకు మనం పైన, క్రింద, ఎడమ, కుడి, అన్నివైపులా నమస్కారం అని మన
గౌరవప్రవృత్తులు తెలియ బఱచుకుంటాము. ఈ పంచమహాభూతాలతో స్నానం చేయించుటకు ప్రతీకే
పంచామృత స్నానం.
శ్రీ రామ పాదుక పట్టాభిషేకం--శ్రీ రామ పట్టాభిషేకం
రమయతి ఇతి రామః అనగా తన ఆకర్షణతో మనల్ని
రమింప జేసేది అనగా ఆత్మ జ్యోతి దర్శనం
పాదుక మూలాధారచక్రానికి ప్రతీక. భరతుడు
(ఇక్కడ సాధకుడు) ఆత్మ జ్యోతి దర్శనం కొరకై మూలధారచక్రానికి ప్రతీక అయిన పృథ్వితత్వాన్ని ఆ పరమాత్మకు అంకితం
చేయటమే పాదుక పట్టాభిషేకం. అనగా ధ్యాన సాధనా పద్ధతి ప్రారంభంలో పృథ్వి తత్వం దాటటం
ఈ పాదుకా పట్టాభిషేకం. పట్ట అనగా మేరుదండం.
ధ్యాన పరాకాష్ట అయిన శ్రీ అనగా
పవిత్రమైన రామ అనగా ఆత్మజ్యోతి దర్శనం కొరకై పట్టకి అనగా మేరుదండంలోని జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలను పరమాత్మకు అర్పించుటమే
శ్రీ రామపట్టాభిషేకం.
జయవిజయులు
విష్ణు ద్వారపాలకులైన జయవిజయులు కథ
ఆధ్యాత్మిక ఉన్నతి నుండి అహంకారంవలన క్రిందకి పడిపోవటానికి ప్రతీక . అనగా సాధనా
సమయములో సాధకుడు కడు జాగరూకుడై మెలగవలెను
పరమాత్మ సహాయముతో ధ్యానసాధనలో
బ్రహ్మగ్రంథి ఛేదనయే హిరణ్యాక్ష,
హిరణ్య
కశిపుల వధ. (స్థూల దేహ నిర్మూలన)
పరమాత్మ సహాయముతో ధ్యానసాధనలో
రుద్రగ్రంథి ఛేదనయే రావణ కుంభ కర్ణ వధ (సూక్ష్మ దేహ నిర్మూలన)
పరమాత్మ సహాయముతో ధ్యానసాధనలో
విష్ణుగ్రంథి ఛేదనయే శిశుపాల దంతావక్తృ ల వధ. (కారణ దేహ నిర్మూలన)
సాంఖ్యం - ఆదిశంకరుడు
శుద్ధ, పవిత్రమైన జ్ఞానమే సాంఖ్యం. ఈబ్రహ్మాండం
చైతన్యరహితం. రాళ్ళు, రప్పలతో చేయబడ్డది.
కనుక శుద్ధజ్ఞానానికి చైతన్యరహితమైన పదార్థము కారణము కాజాలదు. కనుక చైతన్యరహితమైన
పదార్థమునకు ఈశ్వరుడు కారణమనడము సరియైనది కాదు. ఈ శుద్ధజ్ఞానమే పురుషుడు అంటుంది సాంఖ్యం..
ఈ శుద్ధజ్ఞానమే నిర్గుణబ్రహ్మం. ఈ అనంతం
భౌతిక పదార్థము కాదు. భౌతికపదార్థము కాని ఈ అనంతాన్ని విభజించలేము. ప్రతి వ్యక్తి
అఖండాత్మే. అంశ, అంశుడుగాదు.
భాస్కరుడు సహస్ర ఘటములలో ప్రతి బింబించినట్లుగా మనలోని ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరియందు ఉన్న ఆత్మ
పరమాత్మయొక్క ప్రతిబింబమే. ఆ ఒక్క ఆత్మే అనగా ఆ పూర్ణాత్మే వివిధ ఆత్మలుగా
గోచరించు చున్నది.ఈ విషయమును గ్రహించకనే ఈ
దుఃఖం అని వివరించారు ఆదిశంకరాచార్య. .
బౌద్ధం ద్వైతం విశిష్టాద్వైతం
ఆత్మ గురించి చర్చలు ఎందుకు? సత్కర్మల నొనర్చి సజ్జనులై ఉండండి అంటుంది
బౌద్ధం.
దేవుడు ఒకడు ఉన్నాడు. కాని ఆత్మలు
అనేకము. తత్త్వము, రూపము ప్రతి
విషయమునందు ఈ ఆత్మ దేవుని కంటే భిన్నమైనది. వ్యక్తి దేవునికి ప్రకృతికి వేరుగా
ఉన్నవాడు. మానవుడు ప్రకృతిని చూచుచున్నపుడు మానవుడు విషయి. ప్రకృతి విషయము. మానవుడు
దేవుని చూచుచున్నపుడు మానవుడు జ్ఞాత. . దేవుడు జ్ఞేయము అంటుంది ద్వైతం.
ఈ దేహము పూర్ణము. దీని వెనుక ఒక మనస్సు
ఉన్నది. ఈ మనస్సు వెనుక వ్యష్టాత్మ ఉన్నది. ఈవిశ్వము పూర్ణము. దీని వెనుక ఒక
విశ్వమనస్సు ఉన్నది. ఈ విశ్వమనస్సు వెనుక విశ్వాత్మ ఉన్నది. మానవదేహము
విశ్వదేహములో ఒక భాగము. ఈ ఆత్మలు విశ్వాత్మలో అంశములు. అనగా మనము వ్యష్టాత్మలమే.
కాని వ్యష్టాత్మలమైన మనము దేవుని కంటే వేరైన వారముకాము. వ్యష్టాత్మలమైన మనము ఒకే
రాశియందు తేలియాడుతున్న అణువుల వంటి వారము. వ్యష్టాత్మలమైన మనకు దేవునియందు
మాత్రమే ఐక్యము. వ్యష్టాత్మలమైనమనము అందరము ఒక్కటే. కాని వ్యష్టాత్మకి
వ్యష్టాత్మకి మధ్య ఒక భిన్నమైన వ్యక్తిత్వము గలదు.
కాని ప్రతి వ్యష్టాత్మకి దేవునికి నడుమ
ఒక భిన్నమైన, ఒక అభిన్నమైన
వ్యక్తిత్వముగలదు అంటుంది విశిష్టాద్వైతం.
కారణజన్ములు
జీసస్ క్రైస్త్ : ఆధునిక సౌకర్యములు
కాదు కావలిసినది. వెతుకు దాన్ని పొందుతావు. అడుగు. దాన్నిపొందుతావు. తలుపు తట్టు.
ఆ ద్వారము తెరుచుకుంటుంది. అదే ఆధునికత అంటే. సత్యాన్ని అన్వేషించువాడే ఆధునికుడు.
మిగిలినవాళ్ళు కానేకారు.
గౌతమబుద్ధ : వేదము, వేదాంతము విమర్శించి సత్య అసత్యములను
గ్రహించుట మానవహక్కు.
శ్రీవ్యాస: అథతోబ్రహ్మజిజ్ఞా సా.
సాధన చతుష్టయ సంపత్తి కలిగి అనగా శమ
దమాది గుణములు కలుగజేసుకొని బ్రహ్మజిజ్ఞాస అనగా బ్రహ్మ విచారము చేయ వలయును. సాధన చతుష్టయ సంపత్తి అనగా::
1) నిత్యానిత్యవస్తువివేకము: ఆత్మ నిత్యం అనాత్మ
అనిత్యం
2) ఇహ ముత్ర ఫల భోగ విరాగము: భౌతిక ప్రపంచ
విషయములపై వైరాగ్య భావన
3) శమ దమాది షట్క సంపత్తి: శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము
అ) శమము : ప్రాపంచిక
విషయములయందు అనగా సుఖములు, వస్తు సంపదలయందు
విముఖత, మనోనిగ్రహము వృద్ధి
చేసుకొనుట
ఆ) దమము: బాహ్యేంద్రియ
నిగ్రహము
ఇ) ఉపరతి: నిశ్చల మనస్సుతో
బ్రహ్మధ్యాన నిమజ్ఞుడైయుండుట
ఈ) తితీక్ష: శీతోష్ణములు, ఆకలిదప్పులు, మానావమానములందు ఓర్పు. ప్రాపంచిక
విషయములయందు, చలించకుండుట
ఉ) శ్రద్ధ: శాస్త్ర, గురు వాక్యములయందు గౌరవము, భక్తి, ఆచరణ కలిగియుండుట
ఊ) సమాధానము: లక్ష్యవస్తువునందు
మనస్సు నిలుపుట
4) ముముక్షత్వము: మోక్షము పొందవలయుననే
తీవ్రమైన కోరిక.
పతాంజలి
బ్రహ్మాభ్యాసము చేతను, విషయ విరక్తిచేతను, మనోనిగ్రహముతో దైవసుఖమగు జ్ఞానము
పొందదగినది.
పరమహంస
శ్రీశ్రీయోగానంద :
ఏదైనా నీవు వాయిదా (Pending)లో పెట్టుము.
కాని భగవదన్వేషణను మాత్రము నీవు వాయిదా లో
పెట్టకూడదు.
రమణమహర్షి : “ నేను ఎవరిని” ? తెలుసుకో
త్రిదేహశుద్ధి
స్థూలదేహశుద్ధి : వ్రత, అనుష్ఠాన, గురుశుశ్రూషలవలన కలుగును.
సూక్ష్మదేహశుద్ధి : వైరాగ్యము, కరుణ, అనన్యభక్తిలవలన కలుగును..
కారణదేహశుద్ధి : ధారణ, ధ్యాన, సమాధిలవలన కలుగును.
యోగసాధనాచతుష్ఠయము అనగా కర్మ (ప్రాణాయామ
కర్మ), భక్తి (అనన్య భక్తి), ధ్యాన జ్ఞాన యోగములు.
ప్రతివ్యక్తి
హితభుక్ : మంచి చేయవలెను
ఋతభుక్ : సంపాదించి తినవలెను
మితభుక్ : మితంగా తినవలెను
షడ్భావనలు మరియు
షడూర్ములు
ఆధ్యాత్మిక విషయములను కనుగొన్న వారిని ఋషులు అందురు. ఋషులు అనగా క్రాంతిదర్శులు అని అర్థము. ఈ ఋషులు కనుగొన్న ఆధ్యాత్మిక విషయములు శాశ్వతములు. . ఈ విషయములను వారివారి అనుచరులు లేక శిష్యులు ఇహ ముందరి జనావళియొక్క ఉపయోగము కొరకై తాళపత్రగ్రంధములమీద వ్రాసియుంచిరి. న్యూటన్, ఐన్స్టీన్లాంటి శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయములను కూడా గ్రంధీకరించినవేగదా. దీనినే (documentation) డాక్యుమెంటేషన్ అందురు. న్యూటన్, ఐన్స్టీన్లాంటి శాస్త్ర వేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయములు ఆత్మావబోధ నుండి (intuition) వచ్చినవే.
ఆత్మావబోధనుండి (intuition) విన/కనవచ్చిన శాస్త్ర విషయములను వేదము అందురు. కనుక వేదములు అనేవి ఒక్క రోజులో వచ్చినవి కావు. క్రమశః వచ్చినవే. జైమిని, కణాదుడు మొదలగువారు ఇటువంటి ఋషులే. వారి వారి
కాలములలో వారు కనిపెట్టిన విషయములను తరువాతి వారు ఇంకనూ ఎన్నో క్రొత్త విషయములను కనిపెట్టి వేదములను ఇంకనూ ముందరికి త్రీసుకొని వెళ్ళిరి. ఈ కాలములో కూడా న్యూటన్, ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయములను అక్కడితో ఆపక, వాటి తోనే తృప్తిపడక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇంకనూ కనిపెడుతూనే ఉన్నారు. ఆయా సమయములలో ఈ ఋషులు కనుగొన్న ఆధ్యాత్మిక విషయములు శాశ్వతములుగా ఉండేటట్లుగా నామకరణము కూడా చేసిరి. ఉదాహరణకి
జగతి అనగా జ = కూడి ఉన్నది (along with) గతి = కదలిక (displacement). కదలిక ఉన్నది గనుక జగతి. కదలిక లేనియడల ప్రగతి లేదు.
మనిషి చిన్నతనములో తప్పటడుగులు వేస్తాడు. ముద్దుముద్దుగా మట్లాడుతాడు. పెద్దవుతున్నకొలదీ ఈ తరహా మారాలి. పెద్దైన తరువాత కూడా మారకపోతే, తప్పటడుగులు వేస్తూ ఉంటే, ముద్దు ముద్దుగా మట్లాడుతూ ఉంటే మానసిక ఎదుగుదల లేనట్లే గదా. అందుకని మానవునికి ఆ మాటకొస్తే ప్రతిజీవికి షడ్ భావనలున్నవి. ఆ
షడ్భావనలు : 1) పుట్టుట 2) ఉండుట 3) పెరుగుట 4) పరిణమించుట 5) శుష్కించుట 6) నశించుట
అలాగే మానవునికి షడూర్ములు ఉన్నవి. ఆ
షడూర్ములు : 1) ఆకలి 2) దప్పిక 3) శోకము 4) మోహము 5) ముసలితనము 6) మరణము
మనిషి పుట్టినపుడు 2, లేక 3 సంవత్సరముల వరకు వెనకటి జన్మల స్మృతులవలన తను వదిలిన మలమూత్రాదులలో పొర్లాడటము, పశువుల మాదిరి, పక్షుల మాదిరి వాటిని వాసన చూడటము అనేది వెనకటి జన్మల వాసనా ఫలితములే.
నిన్నటి నీరు అనగా నిలవ ఉన్న నీరు ఈ రోజు కంపు కొట్టును. కనుక చలనము అనేది జీవిత గమనము.
జీవుడు బయటికి వెడలు మార్గము కృష్ణ లేక పితృ యానములు:
జ్ఞానియైననూ, అజ్ఞానియైననూ, ఇంద్రియములు అంతఃకరణయందు, అంతఃకరణము ప్రాణమునందు, ప్రాణము జీవునియందు, లయముచెందును. వీటితోబాటు వాసనలు, కర్మ ఫలములు గూడా లయము చెందును. కంఠమందున్న ఉదాన వాయువు జీవునియొక్క కర్మఫలానుసారము పుణ్య, పాప లేదా ఉత్తమ, నీచ లోకములకు పంపించు కార్యమును నిర్వహించును.
ఈ శరీరములో మొత్తము 11 రంధ్రములు ఉన్నవి. అవి:
1) బ్రహ్మ రంధ్రము ఒకటి (2) ముక్కు రంధ్రములు రెండు (3) కంటి రంధ్రములు రెండు (4) చెవి రంధ్రములు రెండు
5) నోరు రంధ్రము ఒకటి 6) మల మూత్ర విసర్జన రంధ్రములు రెండు (7) నాభి రంధ్రము ఒకటి.
ప్రతి మానవశరీరములో 72,000 సూక్ష్మనాడులు ఉన్నవి. అందులో మూడు సూక్ష్మనాడులు ముఖ్యమైనవి. అవి
1) సుషుమ్న లేక బ్రహ్మ నాడి: ముడ్డి (పాయువు) కి 2½ కణుపులపైన ఉన్న మూలాధారచక్రమునుండి బ్రహ్మ రంధ్రములోని సహస్రారము వరకు వ్యాపించియున్నది. జ్ఞానులు, యోగులు ఐన జీవన్ముక్తులు ఈ మార్గము ద్వారా బయటకు వెళ్ళెదరు.
2)ఇడనాడి: ఇది మూలాధారచక్రమునుండి ముక్కురంధ్రము వరకు సుషుమ్నకి ఎడమ వైపున వ్యాపించియుండును.
దీనినే చంద్రనాడి, పితృయాననాడి లేదా కృష్ణ యాననాడి అందురు. ఆత్మజ్ఞానశూన్యులు, కర్మఫలమును ఆశించువారు ముక్కు ఎడమ రంధ్రమునుండి పోవుదురు.
3)పింగళనాడి: ఇది మూలాధారచక్రమునుండి ముక్కురంధ్రమువరకు సుషుమ్నకి కుడివైపున వ్యాపించియుండును. దీనినే సూర్యనాడి, దేవయాననాడి లేదా శుక్లయాననాడి అందురు. నిష్కామకర్మమును ఆచరించి, కర్మఫలమును ఆశించక సుకార్యములు చేయువారు ముక్కు కుడి రంధ్రమునుండి పోవుదురు. అనగా జీవుడు ఈ రంధ్రము నుండి పోవును.
జీవన్ముక్తి – విదేహముక్తి:
జీవన్ముక్తి అనగా కేవలము సాక్షిగా ఉండటము. వేయించిన శనగలకి ఆకారము ఉండును. కాని బీజమునకు పనికిరావు. .
ధ్యాత, ధ్యానము, ధ్యేయము మూడింటినీ కలిపి త్రిపుటి అందురు. ఈ త్రిపుటి అనగా ధ్యాత, ధ్యానము, ధ్యేయము మూడూ లేకుండ ఉండుటయే విదేహముక్తి. ఎక్కువగా ఉడికి చిదిమిపోయి ఆకారముపోయిన శనగ గింజవలె
ఉండును..
జీవుడు ఇడనుండి వెళ్ళవచ్చు, పింగళ నుండి అయిన వెళ్ళవచ్చు, మూలాధారము అనగా ముడ్డి (పాయువు) నుండి ముక్కువరకు అనగా భ్రూమధ్యమువరకు ఉన్న ఏ రంధ్రమునుండైనా వారి వారి కర్మానుసారము, ముడ్డి, శిశినము, నాభి, నోరు, ముక్కు, కళ్ళు చెవులగుండా వెడలవచ్చును.
జ్ఞాని లేదా యోగి మాత్రము సుషుమ్న అనగా బ్రహ్మ రంధ్రము గుండా వెడలుతాడు. అంతేగాదు. ఈ ఇడ, పింగళ, సూక్ష్మ నాడుల ప్రక్కలకి, క్రిందకీ కొన్ని సూక్ష్మ నాడులు కలిపిఉండును. అందువలన ఈ నాడులు వేటినుండైనా జీవుడు బయటికి వెడలవచ్చును.
కొన్ని సూక్ష్మనాడుల వివరణ:
కంటికి అనగా కంటి రంధ్రములకు ఇరు వైపులా గాంధారి హస్తిజిహ్వ.
చెవి రంధ్రములకు ఇరువైపులా పూషా.
నాలుక చివరన నోటి రంధ్రమున సరస్వతి.
మూత్ర విసర్జన రంధ్రమున సినీవాలి.
మల విసర్జన రంధ్రమున కుహు నాడి అనే సూక్ష్మ నాడులు ఉండును.
ఈ సూక్ష్మ నాడులు అన్నీ ఇడ, పింగళలతో కలపబడి ఉండును. ఇడ, పింగళలనుండి ఇడ, పింగళల ప్రక్కలకు వ్యాపించియున్న సూక్ష్మ నాడులు ఈ కలపబడిన నాడులే.
మరణము అనగా మనము పాతబట్టలు విడిచి ఉతికిన లేక క్రొత్త వస్త్రములు ధరించినటుల స్థూలశరీర విసర్జనమే. జీవుడు కర్మ శేషమును అనుభవించుటకై ఆకాశము, వాయువు, ధూమము, మబ్బు, మేఘముల ద్వారా పయనించి వర్షము ద్వారా అన్నరూపమై, వారి వారి కర్మలననుసరించి ఘనములుగాను (రాళ్ళు, కొండలు), వృక్షములు, పశు పక్ష్యాదులు, మానవజన్మ పొందును. అందువలన ఆత్మ సాధన తప్పక చేయవలసినదే.
శ్రద్ధయా బ్రహ్మచర్యేణ తపసా విద్యయా ఆత్మానం అన్వేషత్
ప్రశ్నోపనిషద్
అనగా శ్రద్ధ, బ్రహ్మచర్యము, తపస్సు, ఆత్మవిద్యలతో ఆత్మసాధన చేయవలెను.
శ్రీవిద్య – అంతర్ముఖత్వం:
కుండలినీ విద్యయే శ్రీ విద్య.
శ్రీవిద్యని అభ్యసించుటకై ఐదు నియమములను పాటించ వలయును.
1) ఆహారనియమము: సాత్విక ఆహారము భుజియించుట
2) ఆత్మనియమము: ఇంద్రియ నిగ్రహము పాటించుట.
3) నివాసనియమము: ఎక్కడ బడితే అక్కడ నివసించుకుండుట
4) ప్రవర్తననియమము: ధనార్జనకై ఏ పని బడితే ఆ పని చేయకుండుట.
5) సంసర్గ నియమము: ఎవరితోబడితో వారితో సహవాసము చేయకుండుట.
అంతర్ముఖత్వం:
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు చేసిన తదుపరి
12 ఉత్తమ ప్రాణాయామములు చేయుటవలన ప్రత్యాహారము అనగా అంతర్ముఖత్వం ఏర్పడును. ఏర్పడని పక్షంలో 24, 36 అనగా మొదటి 12 ప్రాణాయామములకు 12 కలుపు కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి.
144 ఉత్తమ ప్రాణాయామములు చేయుటవలన ధారణ అనగా చిత్తైకాగ్రత ఏర్పడును. ఏర్పడని పక్షంలో 144 ప్రాణాయామములకు 12 కలుపు కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి.
1728 అంతకంటే ఎక్కువ ఉత్తమ ప్రాణాయామములు చేయుటవలన
ధ్యానములో స్థిరత్వమేర్పడును
20,736 అంతకంటే ఎక్కువ ఉత్తమ ప్రాణాయామములు చేయుటవలన సమాధి ఏర్పడును.
ఈదేహమే రథము, ఆత్మ రథికుడు, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెములు, ఇంద్రియములు గుఱ్ఱములు.
శ్రీ కృష్ణ స్థితి:
బహూనిమేవ్యతీతానిజన్మానితవచార్జున గీత 5 - 5
ఓ అర్జునా నీకు నాకు ఎన్నో జన్మలు గడచిపోయినవి. నీ జన్మల గురించి నాకు తెలుసు. నా జన్మల గురించి నీకు తెలియదు అంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ. మనువులు పదునాలుగురు. వారు
1) స్వాయంభువ 2) స్వారోచిష 3) ఉత్తమ 4) తామన 5) రైవత 6) చాక్షుష 7) వైవస్వత 8) సావర్ణి 9) దక్ష సావర్ణి 10) బ్రహ్మ సావర్ణి 11) ధర్మ సావర్ణి 12) రుద్ర సావర్ణి 13) దేవ సావర్ణి 14) ఇంద్ర సావర్ణి
ఒక మహా యుగము = నాలుగు యుగములు
ఒక మనువు కాల పరిమితి = 71 మహా యుగములు ప్రస్తుతము ఏడవ మన్వంతరము అనగా వైవస్వత మన్వంతరము జరుగుచున్నది.
అనగా 7x71x 4 = 1988 యుగములు లేదా 497 మహాయుగములు గడిచిపోయినవి.
ప్రతి సంవత్సరములో 51/52 ఆదివారములు ఉన్నట్లుగా, ప్రతి నాలుగుయుగములు అనగా కృత, త్రేతా, ద్వాపర, కలి యుగములలో ఒక ద్వాపర యుగము ఉన్నది కదా.
కనుక ఈ శ్రీ కృష్ణుడు ఇప్పటి వరకు గడిచిపోయిన 497 ద్వాపర యుగములలో ఏ (లేక) ఎన్నోద్వాపర యుగము కృష్ణుడు?
దీనినిబట్టి రాజకీయములో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఛాన్స్లర్ మాదిరి గా ఆధ్యాత్మికములో శ్రీకృష్ణస్థితి అనేది ఒక సర్వోత్కృష్ఠమైన స్థితి. సర్వోత్కృష్ఠమైన స్థితియైన ఈ శ్రీకృష్ణస్థితిని కఠోర సాధనతో ఎవ్వరైనా పొందవచ్చు, పొందుటకు ప్రయత్నము చేయవలయును.
ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి అనేది వెంకట్ గాదు. కాని వెంకట్ ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి కావచ్చు.
అదే విధముగా పరమాత్మ శ్రీకృష్ణుడు గాడు. శ్రీ కృష్ణుడు పరమాత్మ . సర్వోత్కృష్ఠమైన స్థితి ఒక్కటే.
ఎవరైనా, ఎంత మందైనా ఈ సర్వోత్కృష్ఠమైన స్థితి ఒక్కటిని కఠోర సాధనతో ఒకేసారి ఒకే సమయములో లేక అనేక సమయములలో ఒకే దేశములో లేదా దేశ ప్రదేశములలో, వివిధ దేశ ప్రదేశములలో పొందవచ్చును
రావణవధ:
మూలాధారచక్రంలో ఉన్నకుండలినీ ప్రాణశక్తే సీతాదేవి. సహస్రారచక్రంలో ఉన్న శ్రీరాముడే పరమాత్మ.
మామూలు మనిషి అనగా యోగసాధన చేయని వ్యక్తి తనకు కావలిసిన శక్తి సహస్రారచక్రంనుండి మూలాధార చక్రంలోనికి వస్తున్నంత సేపూ శాంతిగానూ, సౌఖ్యముగానూ ఉండును. కాని మణిపూరచక్రములోని వ్యతిరేక శక్తులు అనగా భయం, లోభం, ద్వేషం, అనిగ్రహం, అమితమైన ఆలొచనలవలన సహస్రారచక్రంనుండి వచ్చే ప్రాణశక్తి నిరోధించబడుతుంది. ఆ నిరోధము ఎక్కువైన కొలదీ, రకరకాలైన రుగ్మతలకి శరీరము ఆలవాలమగును. తద్వారా ఒక సిస్టమ్ ఉదాహరణకి లివర్ సిస్టమ్ ఇంకో సిస్టమ్ ఉదాహరణకి రక్తప్రసరణని దెబ్బతీయును. అనగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ శరీరము దుర్బలత్వం చెందుతూ ఉండును, ఈవిధముగా సహస్రారచక్రం నుండి వచ్చేప్రాణశక్తి నిరోధించ బడుటకు కారణము మణిపూరచక్రములోని వ్యతిరేక శక్తులు. మణిపూరచక్రమునకు 10 దళములు ఉండును. అందువలననే దీనిని రావణ చక్రము అని కూడా అందురు. అప్పుడు మానవుడు (ఇక్కడ సీతాదేవి) ఓరామా (ఓ పరమాత్మ చైతన్యమా) నన్ను రక్షించు అని వేడుకొనును .
మణిపూరచక్రములోనున్న రావణుడు అహంకారమునకు ప్రతీక. ఇది సాధారణమైన అనగా యోగ సాధన చేయని
వారికి అహంకారం
చావదు, నిత్యమైనది, అమృతమైనది. యోగ సాధన చేయనిది ఇది చావదు. ఆర్తుల మొర ఆలకించే శ్రీరాముడు (సహస్రారచక్రంలోని పరమాత్మ) అనాహతచక్రంలోని వాయుపుత్రుడైన ఆంజనేయుని ద్వారా అనగా థైమస్ గ్లాండ్ ద్వారా మణిపూరచక్రములో నున్నలోపమును తెలుసుకొనును. తను తెలుసుకున్నాను, రక్షిస్తాను అని చెప్తాడు.
ఆర్తో జిజ్ఞా సురర్థార్ధో జ్ఞా నీ చ భరతర్షభ గీత 7-16
ఈ తెలియజెప్పటమనేది ఒక వెలుగు ద్వారా లేదా ఆత్మావబోధ ద్వారా ఆర్తుడికి అందజేయబడుతుంది. దీనినే చూడామణి అందురు. తూములో నుండి సరిగ్గా ప్రవహించని నీరుని పుల్లబెట్టి పొడిచి మార్గము సుగమం చేసే చందమున మణిపూరచక్రములోనున్న లోపమును అనగా పరమాత్మ చైతన్యమును తిరిగి అందజేయుటయే రావణుని నాభిలోనున్న నిత్యమైన అహంకారం అనే అమృతభాండమును రామబాణముతో హరింపజేయుట. అందువలన సాధకుడు ప్రాణాయామకర్మను తప్పక చేయవలెను. ఇది చేయుటవలన మణిపూర వద్ద అడ్డగించబడిన ప్రాణశక్తి తిరిగి మూలాధారములోనున్న కుండలినీప్రాణశక్తికి చేరుతుంది. ఆవ్యక్తి తిరిగి ఆరోగ్యవంతుడు అవుతాడు. మణిపూరచక్రము మేరుదండములో నాభి వెనకాల ఉండును.
ఉపవాయువులు:
1)
నాగ: వాక్ అనగా గొంతులోఉండును. త్రేన్పులు వచ్చును.
2) కూర్మ: కనురెప్పల కదలికకు కారణము.
3) కృకర: తుమ్ములు వచ్చుటకు కారణము
4) దేవదత్త: ఆవలింతలకి కారణము
5) ధనంజయ: సర్వశరీరములోనూ, ఆఖరికి ప్రాణము పోయిన తరువాత కూడా శరీరములో ఉండి ప్రాణం పోయిన 10 నిమిషముల వరకు శరీరమును వేడిగా ఉంచును. .
ముద్రలు:
మనలో ప్రవహిస్తున్న ప్రాణశక్తిని మనభౌతికమైన నరముల ద్వార అవయవాలకి అందజేసి ఆరోగ్యకరముగా ఉండేటట్లు చేసేవే ఈ ముద్రలు. ఇవి భౌతికముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా శరీరాన్ని సమతుల్యముగా ఉంచును. ఒక టన్ను సిద్ధాంతముల కంటే ఒక ఔన్సు అభ్యాసము చాలా ఉత్తమం. కనుక ఆరోగ్యము కొఱకై ప్రతి ఒక్కరు అభ్యసించదగినవి .
ఖేఛరి ముద్ర: కూటస్థములోదృష్టి నిలిపి కనులు మూసిగాని తెరిచి గాని ఉంచి తాళువులో నాలుకను ప్రవేశ పెట్టి ప్రాణాయామ క్రియ చేయుట.
శృతి స్మృతి
ఎల్లవేళలా ఉండే సత్యాన్ని శృతి అని, ఆ పరిస్థితులకు సమయమునకు అనుగుణంగా ఉండే
సత్యాన్ని స్మృతి అని అందురు. అందువలనే సత్యం కూడా వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యం, పారమార్థిక సత్యం, అని మూడు విధములుగా ఉండును. ఉదాహరణకి
సినిమా జరుగుతున్నపుడు సినిమాలో జరిగే విషయములు వ్యావహారిక సత్యం, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించును
అనేది వ్యావహారిక సత్యం, సూర్యుడు అసలు
ఉదయించడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, అందువలన రాత్రింబగళ్ళు ఏర్పడుతూ
సూర్యుడు తిరుగు తున్నట్లుగా అనిపించటమే ప్రాతిభాసిక సత్యం. లేని దానిమీద ఆపాదించ
బడినది ప్రాతిభాసిక సత్యం.
మసకమసక చీకట్లో ఉన్న త్రాడుని చూచి పాము
(సర్పము) అని భ్రమపడి భయపడటము, లేదా తెలిసీ తెలియని
వయసులో ఆయా సినిమాలో పాత్రలు అనుభవించే విషయములను సత్యమని భ్రమించుట ప్రాతిభాసిక
సత్యం. అన్నివేళలా ఉండే సత్యాన్ని,
పారమార్థిక
సత్యం అందురు. సినిమా తెర ఎల్లవేళలా అనగా సినిమా జరగనపుడు, జరునపుడు, అయిపోయిన తరువాత కూడా తెల్లగా ఉండుట
అనేది పారమార్థికసత్యము.
44 రకముల స్మృతులు:
మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, పరాశరస్మృతి, మొదలగునవి ఆయా యుగధర్మములనుబట్టి, కాలమునుబట్టి ఆయా స్మృతులు ఏర్పడినవి.
ఉదాహరణకి ఎండాకాలమున ఎక్కువ నీరు త్రాగుట అనేది సహజం, కానీ అదే చలి కాలము ఎక్కువ నీరు త్రాగ
కుండుట అనేది సహజం. అన్ని కాలములకు ఒకే ఆరోగ్య ధర్మం పాటించము కదా. అదే విధముగా
ఆయా యుగధర్మములను బట్టి, కాలమును బట్టి ఆయా
స్మృతులుఏర్పడినవి. కలియుగములో ఆచరించునది పరాశరస్మృతి.
నస్త్రీ
స్వాతంత్ర్యమర్హతి అంటారు. అది ఎప్పుడు? స్త్రీకి చదువు రానప్పుడు, లోకజ్ఞానములేనప్పుడు, తన కాళ్ళ మీద తను నిలబడ గలిగే
ఉద్యోగంలేనప్పుడు. స్త్రీ సహజంగా శారీరకంగా దుర్బలురాలు. ఆ మాటకొస్తే చిన్నపిల్లలు, వృద్ధులు కూడా శారీరకంగా దుర్బలులే కదా.
అందువలన వారికి తగిన సహాయము చేయవలెను. అసలు ఒకరి పై ఒకరు ఆధారపడక ఈ
ప్రపంచంలో ఎవరైనా ఉండ గలరా?
అర్థనారీశ్వరుడు:
ప్రతి ఆడవ్యక్తిలో ఎక్స్ క్రోమొజోమ్స్ (X chromozomes) ఉంటాయి. వై
క్రోమొజోమ్స్ Y chromozomes) ఉంటాయి. అదే విధముగా
ప్రతి మగవ్యక్తిలోను ఎక్స్ క్రోమొజోమ్స్ ఉంటాయి. వై క్రోమొజోమ్స్ ఉంటాయి. కనుక
ప్రతి వ్యక్తి అర్థనారీశ్వరుడే.
అపుత్రస్య గతిర్నాస్తి:
అపుత్రస్య గతిర్నాస్తి అనగా మగ పిల్లలు
లేని వారికి ఊర్ద్వ గతులు లేవు అని. అందుకని పుత్రుడు కలిగేటంత వరకు
పిల్లల్నికంటునే ఉందురు కొంతమంది. వైద్యశాస్త్రం ప్రకారము, పుట్టే బిడ్డ ఆడా మగా నిర్ణయించడమనేది
బీజప్రదాతయైన మగవాడి మీదనే ఆధారపడి ఉండును. అయినా సరే స్త్రీ కారణమని హింసించటము
సబబు కాదు కదా.
శ్రీవివేకానంద,శ్రీపరమహంసయోగానంద, ఆది శంకరాచార్యులవారు, మొదలగు వారు వివాహమే చేసుకొనలేదు. వారు
పూజనీయులేగదా!
వివాహితులై, దంపతులైనప్పటికీ, శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస, పరమపూజనీయ శ్రీ శారదాదేవి అమ్మలకు
పిల్లలే లేరు గదా !
కనుక మగపిల్లలు లేనివారికి ఊర్ధ్వగతులు
లేవు అనేది సమంజసము గాదు. ఈ అజ్ఞానానికి కారణము ఆధ్యాత్మిక న్యూనతే.
పెద్దచేప – చిన్నచేప:
శక్తిని మనం సృష్టించలేము. నాశనం
చేయలేము. కాని ఒక శక్తిని ఇంకొక శక్తి క్రింద మార్చ గలము. ఉదా : విద్యుత్ శక్తిని
మనం ఫాన్ (table or ceiling
fan) సహాయంతో
యాంత్రిక శక్తిగా మార్చుకొని గాలిని పొందుతాము. టర్బైన్స్ (Turbines) సహాయముతో యాంత్రిక శక్తిని విద్యుత్
శక్తిగా మార్చుకుంటాము. నదులు సముద్రములలో కలిసి నటుల చిన్నశక్తులు పెద్ద శక్తులతో
కలిసి పోతాయి. అందువలన పెద్దచేప చిన్నచేపని మ్రింగటం అంటే పెద్దశక్తి చిన్నశక్తిని
కబళించటమే. చివరికి మనంవాడే ఫోస్సిల్ ఫ్యూయల్ (fossil fuel) అనబడే ఈ బొగ్గు, క్రూడ్ ఆయిల్ (Crude oil) గూడా ఒకప్పటి జీవులే.
మనస్సు:
సర్వేజనాః సుఖినో
భవంతు.
అనగా అందరూ సుఖంగా ఉండాలి. ఉన్నది ఒకే
ఆకాశము. ఒకే అగ్ని. ఒకే జలము. వివిధ రకములైన ఆకాశములు, అగ్నిలు, జలములు లేవుగదా! మన సౌకర్యము కోసము
ప్రకృతి సిద్ధమైన పరమాత్మ ప్రసాదమైన ఈ ఉన్న ఒకే ఆకాశము, ఒకే అగ్ని. ఒకే జలములను ఇంతవరకు నాది, ఇంతవరకు నీది అని విభజించుకొని
కలవరబడుచున్నాము.
సుగంధము, దుర్గంధము ఎక్కడ ఉన్ననూ, క్రమంగా ఇంపు కంపులనూ సమానంగా
పంచిబెట్టును. ఒక చోట భూకంపం, తూఫాన్, వగైరాలు వస్తే ప్రపంచం మొత్తం దాని ఫలితములను అనుభవించక తప్పదు. కేంద్రం (epicenter) ఏదైనా, భూకంపం వస్తే విడుదలైన ‘పి’(P waves) తరంగములు, ‘ఎస్” తరంగములు(S or longitudinal waves) మరియు సమానాంతర తరంగములు
(horizontal waves) సమతుల్యత (state of equilibrium) వచ్చేవరకు భూమిపై
పొరలో (crest) సంకోచ వ్యాకోచములు
చెందుతూ ఉండును.
అంతే కాదు, ఈ ఖగోళంలో ఏ సెలెస్టియల్ బాడీ (celestial body) అయినా మండినపుడు దాని
ప్రభావం ఖగోళం మొత్తం మీద ఉంటుంది. అదేవిధంగా మనస్సు అనేది మొత్తం జగత్తుకు
సంబంధించినది. విశ్వమనస్సులో భాగమే వ్యక్తమనస్సు. నీలోని భూకంపం, తూఫాన్, వగైరాలలాంటి మంచి లేదా చెడు ఆలోచనలు
వస్తే ఎప్పటికైనా ఏదో ఒకరకముగా జగత్తుమీద వాటి వాటి ప్రభావం తప్పక చూపుతాయి.
దీనికి కారణం వ్యక్తమనస్సే. దీనినే Ecological imbalance అందురు.
అయంనిజః పరోవేతి గణణా
లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైకకుటుంబకం
నీవు, నేను, నాది అని లెక్కించటము చిన్న మనస్సుల
లక్షణం. ఈ ప్రపంచమే నాది, నా కుటుంబం అనేది
పెద్ద మనస్సుల తత్వం.
ఆకర్షణ:
పరస్పర ఆకర్షణవలననే ఈ గ్రహములు, వగైరాలు వాటివాటి కక్ష్యల్లో (orbits) తిరుగుచున్నవి. ప్రతి జీవి ఒక శక్తే. మనమందరం ఒకరికి ఒకరు
పరస్పర ఆకర్షణ వికర్షణలకు లోనుకావటానికి మనలో
ఉన్న ఆ శక్తే కారణము. ఈ శక్తులన్నీ ఒకే శక్తియొక్క వివిధ రూపములే. అందువలననే సమస్త
జగత్తు పరమాత్మయొక్క మాయాశక్తికి ఆకర్షితమగుచున్నది. మగ నిప్పు అని ఆడ నిప్పు లేదా
మగ నీరు ఆడ నీరు అని ఉండదు. అదే విధంగా పరమాత్మయొక్క శుద్ధసత్వమాయ అనగా సృష్టి
లోని దేవుణ్ణి నీవు ఆడ అనుకొనిన ఆడ లేదా మగ అనుకొనిన మగ. తండ్రి అనుకొనిన తండ్రి
లేదా తల్లి అనుకొనిన తల్లి, బిడ్డ అనుకొనిన
బిడ్డ. కాని నిజానికి ఆయన నిరాకార,
నిర్గుణ, నిర్లింగ, సచ్చిదానందమూర్తి.
ధ్యానము ఎందుకుచేయాలి?
ఆకలి వేసినపుడు ఆహారంకావాలి. అదేవిధంగా
శరీర సమతుల్యతకి ధ్యానం అవసరం. ఊహ వచ్చినప్పటినుంచి చచ్చిపోయేంత వరకు, శాంతిసౌఖ్యములకై, కుల మత విచక్షణ, వర్గ భేదం, వర్ణ భేదం, లింగ భేదం లేకుండా అందరూ చేయదగ్గది
ధ్యానం. రోజులో ఎంతో కొంత సమయం,
ఉదయం, సాయంత్రం, రాత్రి వెచ్చించి సద్గురువు ద్వారాగాని, సద్గురువుకి సంబంధించిన యోగదా సత్సంగ
సమితి, రాంచి, లాంటి సంస్థల ద్వారాగాని ధ్యాన పద్ధతులు
నేర్చుకొని అభ్యసించవలయును.
సృష్టి – ప్రళయం:
ఒకటి అనేకం అవటంసృష్టి. అదే బిగ్ బాంగ్(Big Bang Theory) సిద్ధాంతము.. అదే బిందు విస్ఫోటనం. అనేకం మరల ఆ
ఒక్కటిలో చేరటం ప్రళయం. నీటిలో పడవ ఉండవచ్చు. పడవలో నీరు ఉండకూడదు. అదే విధంగా
సంసారంలో (నీరు) వ్యక్తి (పడవ) ఉండవచ్చు. వ్యక్తి (పడవ) లో సంసారం (నీరు) ఉండకూడదు.
రోజూ బిడ్డని త్రిప్పుకొని వచ్చే పనిమనిషి డబ్బు తక్కువ ఇచ్చారని పనిమానివేసిన
చందమున, సంసారం మీద అతి మోహం
పనికి రాదు. నీవు అద్దె ఇంటిలో ఉంటున్న విధముగా, పరమాత్మ ఇంటిలో అద్దెకి ఉంటున్నట్లుగా
భావించవలెను. ఈ ప్రపంచం అనే రంగస్థలములో పరమాత్మ
దర్శకుడు, వ్యక్తి సూత్రధారుడు. పరమాత్మ మెచ్చుకునేటట్లుగా తన పాత్రను పోషించాలి.
thanks. ahamkaara: adhi devata-> rudra
ReplyDelete