జ్యోతిష్యము – క్రియాయోగము

   ఓం శ్రీ యోగానందగురుపరబ్రహ్మణేనమః


జ్యోతిష్యము క్రియాయోగము
  కౌతా మార్కండేయశాస్త్రి
ప్రతులకు          
 K M SASTRY/  K SUBHALAKSHMI/ V SYAMALA, 32-80/16/1,
PN 42, DN76, YSS Dhyanamandir, Devinagar,
R K Puram Gate,   HYDERABAD(India) 500056

Ph:  09440364945         09440964947
email        dhyanamandir@gmail.com
ముందుమాట
క్రియాయోగము అద్భుతమైనది. ఈ క్రియాయోగము ద్వారా జాతకదోషములను సమూలముగా నివారణ చేసికొనవచ్చు. 
అనుభవజ్ఞులైన పండితులతో జాతకచక్రమును వేయించుకోండి. దానిలో పొందుపరచిన దోషములను క్రియాయోగ పద్ధతులద్వారా ఈ పుస్తకములో వ్రాసినవిధముగా  నివారణ చేసికోండి.   

నవ్వు కి ఖర్చు లేదు.  కాని ఎంతో విలువ అయినది. ఇచ్చే వారు దానివలన బీదవారు అవరు .  కానీ పుచ్చుకొనేవారు భాగ్యవంతులు అవుతారు.  నవ్వుకి పట్టేది ఒక్క క్షణం.  కానీ దాని తీపిగుర్తు ఒక్కోసారి ఎప్పటికీ ఉండిపోతుంది.    
గాయత్రిమంత్రము
గాయంత్రం త్రాయతే ఇతి గాయత్రి:  అనగా పాడుతున్నకొలది సాధకుడిని రక్షించును గనుక గాయత్రి అందురు.
న మాతా పరదైవం న గాయత్రి పరమంత్రం అనగా తల్లిని మించిన దైవము,  గాయత్రిని మించిన మంత్రము లేదు. 

ఓం భూర్భువస్సువః తత్ సవితర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధీయోయోనః ప్రచోదయాత్
ఓం = బ్రహ్మ ,  భూః = ప్రణవ స్వరూపము,  భువః = దుఃఖ నాశనము,
స్వః = సుఖ స్వరూపము
తత్ = ఆ ,  సవితుః = తేజస్సుచే ,   దేవస్య = దేవునియొక్క ,
వరేణ్యం = శ్రేష్ఠమైన ,
భర్గః = పాపనాశ మైన తేజమును , ధీమహి = ధ్యానింతుము,
యః = ఏదైతే, నః =  మాయొక్క , ధియః = బుద్ధులను ,
ప్రచోదయాతు = ప్రేరేపించుగాక,
జ్యోతిష్యము క్రియాయోగము

రాశులు మొత్తం కలిపి 12. 12 రాశులు కలిపి భచక్రము అంటారు. అద్భుతమైన కాంతి వృత్తమే భచక్రము.  దానికి మొదలు చివరా ఉండదు. ఆది అంతము లేదు.  కొలత కోసరము ఒక astronomical point అవసరము అనగా ఒక  మొదలు అంటూ ఉండాలి లేదా ఏర్పరచుకోవాలి.27 నక్షత్రములు కలిగినది  ఈ భచక్రము.
ఈ భచక్రము లేదా జాతకచక్రము  360డిగ్రీలుగా ఉంటుంది. ఒక్కొక్క రాశికి  30 డిగ్రీలు ఇచ్చుకుంటూ  12 రాశులకూ కలిపి 360డిగ్రీలుగా ఉంటుంది. ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఇల్లు.  ఈ ఇళ్ళలో ఉంటాయి గ్రహాలు.  గ్రహములకు స్థిరమయిన ఇల్లు ఉండవచ్చు.  ఉండక పోవచ్చు.   ఈ భచక్రము మేష(Aeries) రాశితో మొదలయ్యి  మీన(Pisces) రాశితో పూర్తి అగును. అశ్వని నక్షత్రముతో మొదలయ్యి,   రేవతి నక్షత్రముతో పూర్తి అగును.

ఈ  భచక్రము ఇరువది ఏడు నక్షత్రములతో కూడి ఉంటుంది.  అవి.......
1)అశ్వని, 2)భరణి, 3)కృత్తిక, 4) రోహిణి, 5)మృగశిర, 6)ఆరుద్ర, 7) పునర్వశు, 8)పుష్యమి, 9)ఆశ్లేష, 10)మఖ , 11)పూర్వఫల్గుణి, 12) ఉత్తర, 13) హస్త, 14) చిత్త, 15)స్వాతి, 16)విశాఖ, 17)అనూరాధ, 18) జ్యేష్ఠ 19)మూల, 20)పూర్వాషాఢ, 21)ఉత్తరాషాఢ, 22)శ్రవణం, 23) ధనిష్ఠ, 24)శతభిషం, 25)పూర్వాభాద్ర, 26)ఉత్తరాభాద్ర & 27) రేవతి .
   
ఒక్కొక్క  నక్షత్రమును నాలుగు పాదములుగా విభజించారు. 27 నక్షత్రములను 27x4=108 పాదములుగా విభజించారు. ఈ 108 పాదములను ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదముల వంతున 12 రాశులకు ఇవ్వబడినవి..
గ్రహములు, రాశులు పరస్పర సంబంధము కలిగిఉంటవి. ఈ రాశులను గ్రహములు  శాసిస్తూఉంటాయి.
రాశి పేరు (Sign)                                           నక్షత్రములు      
                                                    
1) మేష..... Aeries-----------అశ్వని , భరణి , కృత్తిక(మొదటి పాదము)
2)వృషభ......Taurus----------కృత్తిక(2,3,4పాదములు),రోహిణి,     మృగశిర(1,2 పాదములు)
3)మిథున……Gemini----------మృగశిర(3,4పాదములు), ఆరుద్ర,  పునర్వసు(1,2,3 పాదములు)
4) కటక….Cancer----------పునర్వసు(4వపాదము), పుష్యమి, ఆశ్లేష
5) సింహ.....…..Leo-----------మఖ, పూర్వఫల్గుణి లేదా పుబ్బ, ఉత్తర(1వపాదము) 
6) కన్య..........Virgo--------ఉత్తర (2,3,4పాదములు),, హస్త, చిత్త(1,2 పాదములు),
7)తుల........Libra----------చిత్త(3,4పాదములు), స్వాతి,  విశాఖ (1,2,3 పాదములు)
8) వృశ్చిక .........Scorpio----------విశాఖ(4వపాదము), అనూరాధ,  జ్యేష్ఠ, 
9) ధనుస్సు ........Saggitarus------మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ (మొదటి పాదము),
10)మకర..........Capricorn.......ఉత్తరాషాఢ(2,3,4పాదములు), శ్రవణం,  ధనిష్ట, (1,2పాదములు),
11)కుంభ............Aquarius-----------ధనిష్ట(3,4పాదములు), శతభిషం, పూర్వాభాద్ర, 1,2, 3 పాదములు)  
12) మీన........ Pisces ----------పూర్వాభాద్ర, (4వపాదము),
ఉత్తరాభాద్ర, &  రేవతి.
ఈ క్రింద పొందుపరచిన విషయములు జాతకుడి ప్రవర్తన మరియు మానసిక ప్రవృత్తి గురించి తెలుసుకొనుటకు ఉపయోగపడును.
జన్మ లగ్నముతో ఈ రాశులు  1,2,3 అని  లెక్కింపు మొదలగును.  1) 1,4,7,10 రాశులను, నాలుగింటినీ కలిపి  చతుష్టయములు లేదా కేంద్రములు (quadrants) అంటారు.
2) 1,5,9 రాశులను రెండింటినీ కలిపి కోణములు ( trines) అంటారు.
3) మేషం(Aeries), కటక, తుల, మకర రాశులను, ఈ నాలుగూ     చరరాశులు  అంటారు.
4) వృషభం, సింహం, వృశ్చికం , కుంభం ఈ నాలుగూ    స్థిర రాశులు  అంటారు.
*5) మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ నాలుగూ    మూల  రాశులు  అంటారు.

   ఋతువులు(Seasons)

1)      చైత్ర (middle of March—middle of April), వైశాఖ మాసములు  (middle of April—middle of May) ----వసంత  ----Spring
2)      జ్యేష్ఠ (middle of May—midle of June) , ఆషాఢ (middle of June—middle of July) మాసములు ---గ్రీష్మ ---Summer
3)      శ్రావణ(middle of July—middle of August), భాద్రపద (middle of August—middle of Sept) మాసములు ----వర్ష -----Rainy
4)      ఆశ్వీజ(middle of Sept—middle of Oct), కార్తీక (middle of Oct—middle of Nov) మాసములు ----శరద్ ----autuman
5)       మార్గశిర (middle of Nov—middle of Dec), పుష్య (middle of Dec—middle of Jan) మాసములు -----హేమంత ---winter
6)      మాఘ (middle of Jan—middle of Feb), ఫాల్గుణ (middle of Feb—middle of March) మాసములు ------శిశిర -------Winter.
సూర్యుడు ప్రతిమాసము ఒక్కొక్క రాశిలో సంచరించుటను సంక్రణము అందురు.  అనగా పన్నెండు రాశులకు పన్నెండు సంక్రణములు ఉన్నవి.  ఈ పన్నెండు సంక్రణములలో రెండు సంక్రణములు ముఖ్యమైనవి. వాటిని ఉత్తరాయణం, దక్షిణాయణం అందురు.

పక్షము అనగా పదిహేను దినములు.  ఇవి శుక్ల లేక శుద్ధ పక్షము, కృష్ణ లేక బహుళ పక్షము అని రెండు. 
అమావాశ్య నుండి పౌర్ణమి వఱకు శుక్ల లేక శుద్ధ పక్షము.
పౌర్ణమి నుండి అమావాశ్య వఱకు కృష్ణ లేక బహుళ పక్షము.
ఉత్తరాయణం అనగా సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించుట. సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశింఛినప్పటినుండి  ఉత్తరదిశవైపు ప్రయాణిస్తాడు.
దక్షిణాయణం అనగా సూర్యుడు కటకరాశిలోకి ప్రవేశించుట. సూర్యుడు కటకరాశిలోకి ప్రవేశింఛినప్పటినుండి  దక్షిణదిశవైపు ప్రయాణిస్తాడు.
                    రాశులు --- గ్రహాధిపతులు
రాశులు  గ్రహములయొక్క ఆధిపత్యముతో పనిచేయును.
రాశులు మొత్తం కలిపి 12. 12 రాశులను సూర్యుడు మరియు చంద్రుడుకి  పంచారు. తరువాత సూర్యుడికి కటక(Cancer)రాశి,   చంద్రుడికి చంద్రుడుకి సింహ(Leo) రాశి పంచారు.  అనగా సూర్యుడికి మరియు చంద్రుడుకి ఒక్కొక్క రాశి చొప్పున ఇచ్చారు.  మిగిలిన ఐదు గ్రహములకు ఒక్కొక్క గ్రహమునకు రెండు రాశులచొప్పున మిగిలిన పది రాశులను  పంచారు.. ఛాయా గ్రహములయిన రాహు కేతువులకు ప్రత్యేకముగా ఏ గ్రహమునూ ఇవ్వలేదు.  కానీ ఈ రెండు గ్రహములూ ఏ గ్రహముతో కలిసి ఏ ఇంట్లో ఉంటే దానికి తగిన ఫలితాలు కలుగుతాయి.  అనగా ఈ రెండు గ్రహములూ స్వయం ప్రకాశితములు కావు.


రాశి                                                            గ్రహాధిపతి
(1)మేష(Aeries), (8)వృశ్చికం (Scorpio)-- అంగారక లేక కుజ
(2)వృషభము (Taurus), (7)తుల (Libra)................................శుక్ర
(3)మిథున(Gemini), (6)కన్య(Virgo)……………..............బుధ
(4)కటక(Cancer)...................................................................................చంద్ర
(5)సింహ(Leo) ....................................................................................సూర్య
(12)మీన(Pisces),(9)ధనుస్సు(Saggitarus)..గురు లేక బృహస్పతి
(10)మకర(Capricorn), (11)కుంభ (Aquarius)………......శని


గ్రహములు మంచి చెడు అని రెండు విధములుగా ఉండును.
గురు లేక బృహస్పతి, శుక్ర, వృద్ధి చంద్ర, ,బుధుడు(well associated) సౌమ్యులు.
రవి, శని, కుజ, రాహు, కేతువులు , క్షీణ చంద్రుడు, పాపులతో కూడిన బుధుడు( badly associated)  పాపులు.
చంద్రుడు అమావాశ్య 8వ రోజునుండి పౌర్ణమి వెళ్ళిన 8వ రోజు వఱకు బలముగా ఉంటాడు.
చంద్రుడు పౌర్ణమి వెళ్ళిన 8వ రోజునుండి అమావాశ్య 8వ రోజు వఱకు బలహీనముగా ఉంటాడు.
రాశులు కౄరజాతులు, సౌమ్యజాతులు అని రెండు విధములుగా ఉండును.
(1)మేష (Aeries), (3)మిథున (Gemini), (5)సింహ(Leo), (7)తుల (Libra), (9)ధనుస్సు(Saggitarus), (11)కుంభ(Aquarius) రాశులు కౄర జాతులు.
(2)వృషభము (Taurus), (4)కటక(Cancer), (6)కన్య(Virgo),
(8)వృశ్చికం(Scorpio),(10)మకర(Capricorn), (12)మీన(Pisces) రాశులు సౌమ్యజాతులు.
కానీ రాశులు శుభగ్రహముల అధీనములో ఉన్నప్పుడు కౄరములు
కానేరవు.
అలాగే రాశులు కౄరగ్రహముల అధీనములో ఉన్నప్పుడు శుభములు కానేరవు.
         గ్రహములు - వర్ణములు - ఇతర గుణములు

గురు లేక బృహస్పతి, శుక్రుడు ----బ్రాహ్మణులు
రవి, కుజులు-----------------------క్షత్రియులు
చంద్ర, బుధులు---------------------వైశ్యులు
శని----------------------------------శూద్రుడు.

రవి, కుజ, గురు లేక బృహస్పతి -------------పురుషులు
చంద్ర,  శుక్రుడు----------------------------------స్త్రీలు
బుధ, శని----------------------------------------నపుంసకులు

రవి, చంద్ర, గురు లేక బృహస్పతి------సాత్వికులు
బుధ, శుక్రుడు-----------------రాజసులు
కుజ, శని-------------------------------తామసులు
రవి-------------------------ఆత్మ
చంద్ర-----------------------మనస్సు
కుజుడు---------------------వీరుడు, పరాక్రమము
బుధుడు....................వ్యాపారకారకుడు
గురు లేక బృహస్పతి--------జ్ఞానం, సుఖము, విద్య, వేదాంతం
శుక్ర-------------------------వీర్యము
శని--------------------------కౄరదృష్టిగలవాడు, దుఃఖదుడు

రవి, చంద్ర ---------------------------రాజులు
కుజుడు--------------------------------సేనాపతి
బుధుడు--------------------------------రాజకుమారుడు
గురు లేక బృహస్పతి, శుక్ర--------------మంత్రులు 
శని--------------------------------------సేవకుడు
రాహు  కేతువులు------------------------సేన

లగ్నము
రాశుల ఉదయమే లగ్నము.  అనగా ఉదయించు రాశికి  లగ్నము అంటారు.  అనగా జన్మ సమయమున తూర్పును చూస్తున్న రాశిని లగ్నము అంటారు. ఈ లగ్నవశమున గ్రహములు శుభ లేక అశుభ ఫలితములు ఇచ్చును. 
గ్రహములు ఈవిధంగా ఉంటాయి. రవి(sun---తరువాతబుధ(Mercury) తరువాత శుక్ర (Venus) ---- తరువాత  పృ థ్వి (Earth )---- తరువాత  కుజ (Mars )-- తరువాత  గురు(Jupiter )---- తరువాత   శని (Saturn)
 రాహు మరియు కేతు అనునవి ఛాయా గ్రహములు.

కుజ దోషము
ఏ  మనిషికైనా జన్మలగ్నాత్ 2,4,7,8,12 స్థానములలో కుజుడు ఉన్నట్లైతే దానిని కుజ దోషము అందురు. కుజదోషము ఉన్న జాతకులకు కుజదోషము ఉన్న జాతకులతో మాత్రమే వివాహము చేయవలయును.  భార్యాభర్తలలో ఎవరికి కుజదోషము ఉన్నా రెండో వాళ్లకి ఆయుఃక్షీణత కలుగును. అందువలన ఇరువురిజాతకములలో  ఆదోషముఉన్నయడల(సమతుల్యముగా) దుష్ఫలితములు ఉండ వని బుధులు అనుచున్నారు.   
కుజునకు గురు దృష్టిగాని చంద్ర దృష్టిగాని ఉన్నయడల కుజుడు దోషకారి కాదని శాస్త్రజ్ఞులు చెప్పారు. మేషాది 12 రాశులకు ఒకేవిధమైన ఫలితములు ఉండవు.  మేష వృశ్చికములకు చతుర్ధ  కుజుడు, వృషభ తులలకు వ్యయ కుజుడు, మిథున కన్యలకు ద్వితీయ కుజుడు , మకర కటకములకు సప్తమ కుజుడు , ధనుర్ మీనములకు అష్టమ కుజుడు, కుంభ సింహములకు, కుజుడు ఎక్కడ ఉన్ననూ దోషము లేదని విజ్ఞులు అంగీకరించిరి.
కాలసర్పదోషము 
మేషాది రాశులలో రాహు కేతువులు స్థితులై ఆరెండు గ్రహముల మధ్యలో మిగతాగ్రహములు ఉన్నచో దానిని కాలసర్పదోషము అందురు. అట్లుగాక మీనాది రాశులలో రాహు కేతువులు స్థితులై ఆరెండు గ్రహముల మధ్యలో మిగతాగ్రహములు ఉన్నచో దానిని విపరీత కాలసర్పదోషము అందురు. 
ఈ కాలసర్పదోషమునే కొందరు విజ్ఞులు కాలసర్పయోగం అని కూడా చెప్పుచున్నారు.
సహస్రారచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రామ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ, సహస్రారచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో 108 సార్లు ఓం ఉచ్ఛరించిన   ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు .
శుభగ్రహములైన గురు, శుక్ర(venus), బుధుడు(mercury), చంద్రుడు కేంద్రములందు ఉన్నయడల సామాన్యఫలితము మాత్రమే ఇచ్చును. ఉభయ కేంద్రాధిపత్యముపట్టిన గురు శుక్రులు విపరీత దుష్ఫలితములు ఇచ్చును. బుధ చంద్రులు సామాన్య దుష్ఫలితములు ఇచ్చును. ఉభయ కేంద్రాధిపత్యముపట్టిన గురు శుక్రులు మరియొక కేంద్రములో  స్థితులై ఉన్నచో ఇంకనూ మిక్కిలి దుష్ఫలితములు ఇచ్చును.
శని దోషము      
శని లగ్నాత్ సప్తమములో ఉన్ననూ, అష్టమములో ఉన్ననూ మహాపాపి. శని లగ్నాత్ చతుర్థములోనున్న అర్ధాష్టమ శని అనబడును. శని అష్టమస్థానములోనున్న అష్టమశని అనబడును. ఈ దోషముల వలన అనేక చికాకులు, ఋణగ్రస్థులగుట ఇత్యాది కష్టములు ప్రాప్తించును. గోచారరీత్యా ( పంచాంగ సంవత్సర ఫలితాలు) చంద్ర లగ్నాత్ శని  పన్నెండోఇంట, చంద్రుడున్నరాశియందు   మరియు  రెండవఇంట  శనిసంచారం చేయునప్పుడు ఏల్నాటి  శని లో అనబడును. 
క్లుప్తముగా జన్మరాశికి 12, 1, 2, స్థానములలో శని సంచరించుటనే  ఏల్నాటి  శని అనబడును. 12 లో 2 ½  , 1 లో 2 ½, 2 లో 2 ½, లో ఒక్కొక్క రాశిలో2 ½ సంవత్సరాల చొప్పున మొత్తం మూడు రాశులకి కలిపి 7 ½ సంవత్సరాల దోషమగును. దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు ,మానహాని, వ్యవహార చిక్కులు కలుగును.        
 ముఖ్య విషయములు
రెండు పాపగ్రహములమధ్య  శుభగ్రహం ఉన్నా, లగ్నము ఉన్నా పాపకర్తరి అందురు.
రెండు శుభగ్రహములమధ్య  పాపగ్రహం ఉన్నా, లగ్నము ఉన్నా శుభకర్తరి అందురు.

క్రియాయోగము
                                   రవి (సహస్రార)
కుంభం
బుధ(ఆజ్ఞ)
మీనం
ధనుస్సు
శుక్ర (విశుద్ధ )
మకరం
తుల
చంద్ర (అనాహత)
వృశ్చికం
సింహ
కుజ (మణిపుర)
కన్య
మిథునం  
గురు( స్వాధిష్ఠానం)
కటకం
మేషం
శని( మూలాధారం) 
వృషభం

మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞా + చక్రమువఱకు, ఒక్కొక్క చక్రమునకు ఇరువైపులా ఒక్కొక్క రాశిచొప్పున,  పైనపొందుపరచినవిధముగా రెండు రాశులుఉన్నవి.   క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆరుచాక్రములలో మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞా + చక్రమువఱకు, కూటస్థములోని ఆజ్ఞా + చక్రమునుండి ,మూలాధారము వఱకు త్రిప్పుతూ తద్వారా ఆత్మ సూర్యుణ్ణి ఈఆరు చక్రములలో ఇరువైపులా ఉన్న 12రాశులలో దర్శిస్తూ, ప్రతిచుట్టుకూ ఒక సంవత్సరముచొప్పున కర్మదగ్ధము చేసికొంటాడు. 
క్రియాయోగాములో 1)హఠయోగము (శక్తిపూరక అభ్యాసములు)  2)లయయోగము (సోహం మరియు ఓంకారక్రియలు)  3)కర్మయోగము (సేవ)  4)మంత్రయోగము(చక్రములలో బీజాక్షర ఉచ్చారణ) 5) రాజయోగము(ప్రాణాయామపద్ధతులు ) ఉండును. 
ఒకడికి జననకాలములో ఉన్న గ్రహస్థితికి అర్థం మానవుడు గతం చేతిలో కీలుబోమ్మకాడు/కాదు.  అతడు గర్వించదగ్గ సాధనం ధ్యానము. మానవుడు ప్రతిఒక్క బంధాన్ని త్రెంచుకొని స్వేచ్ఛపొందాలన్న సంకల్పం అతనిలో రగుల్కొల్పడమే దాని ఉద్దేశ్యం. 
దైవసాక్షాత్కారము కోసరము శాస్త్రీయమయిన ఒక పద్ధతిని వివాహితుడయినను, కాకపోయినను   సాధన చేసేవారు ఎవరయినా యోగే. ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దానిద్వారా మనస్సును శరీరమును క్రమశిక్షణలో పెట్టుకొని క్రమముగా ఆత్మముక్తిని సాధిస్తాడు.     
  
మన జీవితములు ఇచ్చాశక్తి మీద మరియు కర్మమీద ఆధారపడి ఉంటాయి. ఇచ్చాశక్తిని  ఉపయోగించి మనము  వస్తువును ఎన్నుకుంటాము. వస్తువును ఎన్నుకున్నతదుపరి మనము క్రియ చేస్తాం.  మనజీవితములోని ఒడుదుడుకు లన్నిటికీ కేవలము మనము చేసే పనులే  పూర్తిగా కారణము కాదు.      
. 
మనము క్రితం జన్మలలో చేసిన  కర్మలఫలితముగా ఎన్నోఅనూహ్య  సంఘట నలు మనజీవితములో చోటు చేసికుంటూఉంటాయి.  కనుక మనజీవితములు కేవలము  ఇచ్చాశక్తి కాక కర్మ మీద కూడా ఆధారపడిఉంటాయి.
జ్యోతిశ్శాస్త్రము ప్రకారము, తొమ్మిది గ్రహములు తమతమ స్థానమునుబట్టి స్థితిని కలుగజేస్తాయి.  ఆయాస్థితిగతులనను సరించి జాతకునకు బట్టిన ఆయాకర్మలను, మరియు ఆయాకర్మల ప్రభావమును ఏ ఏ సమయములలో ఆ జాతకుడు అనుభవించ వలసి వచ్చునో  చెప్పవచ్చు.  ఉదాహరణకి శనియొక్క స్థానమునుబట్టి, మనము  కూడగట్టిన చెడ్డ కర్మలను, ఆ  కూడగట్టిన చెడ్డ కర్మలు మనజీవితములను ఏ విధముగా చెడుగా  శాసించునో ఊహించవచ్చు.  నవగ్రహములు మనజీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయనటము  సరిగాదు.  నిజానికి మనకర్మలె  మనజీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయి.  కాని నవగ్రహముల స్థానములు  మనజీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయి. జ్యోతిశ్శాస్త్రముఎంతగొప్పదిఅయిననూ దానిని  సరిగ్గా అర్థము చేసుకొని ఆ నవగ్రహముల స్థానములను నిర్ణయం చేయుటకు నిష్ణాతుడైన జ్యోతిశ్శాస్త్ర పండితుడు అవసరము 
8 ½ గంటలు  =   1000 క్రియలు  =  1000 సంవత్సరముల అభివృద్ధి
8 ½ గంటలు x 165 దినములు  =    3,65,000 సంవత్సరముల అభివృద్ధి. కనుక 10 లక్షల సంవత్సరముల అభివృద్ధిని   3 సంవత్సరములలో  సాధించి ముక్తి పొందవచ్చు.
భౌతికశరీరములోకాని, సూక్ష్మశరీరములోకాని, ఒకమనిషికి కేటాయించిన జీవితకాలము అతని కర్మానుసారము పూర్వనిర్దారితమైఉంటుంది.  పురోభివృద్ధిచెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మఫలితాలవల్లకాక, కేవలం  ఆత్మనిర్దేశాలవలనే ప్రభావిత మౌతుంది.
ఈ ప్రపంచం యావత్తు ధ్రువత్వ నిరంకుశాదికారానికి లోబడి యున్నది.  ఏ శాస్త్రమయినా స్వతః సిద్ధమయిన వ్యతిరేకసూత్రాలు లేదావిరుద్ధసూత్రాలు లేకుండా లేదు. 
దేవుడు కుమారుడంటే మనిషిలోఉన్న కూటస్థలేక దివ్యచైతన్యం.
గంగాధరుడు అనగా వెన్నులో ఉన్న ప్రాణప్రవాహాము అనే నదిని అధీనములో ఉంచుకొన్నవాడు.
పూర్వజన్మలో యోహానే ఎలిజా. ఆజన్మలో ఏసుక్రీస్తే ఎలీషా.
ఎలీషా గురువు  ఎలిజా.
ఈ జన్మలో ఎలీషాయే ఏసుక్రీస్తు. ఈ జన్మలో ఎలిజాయే జాన్.  ఈ జన్మలో జాన్ ఏసుక్రీస్తు కి శిష్యుడు.
నాలుగు కులాల్లో ఏదో కులములో చేరడానికి పుట్టుకతో నిమిత్తం లేదు.  జీవితములో మనము సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజ శక్తుల మీద ఆధారపడిఉంటుంది. 
వేదాంతం
శరీరములు మూడు. స్థూలము, సూక్ష్మము, మరియు కారణము అని.
గుణములు మూడు.  సత్వం  అనగా జ్ఞానం, రజస్సు అనగా శక్తి , మరియు తమస్సు అనగా ద్రవ్యరాశి.
నాలుగు కులాలు:  తమస్సు అనగా అజ్ఞానం,  తమస్సురజస్సు అనగా  అజ్ఞానం + క్రియాశీలత,  రజస్సుసత్వం అనగా సత్కర్మ +  జ్ఞానం,  మరియు సత్వం అనగా  జ్ఞానం.
పుట్టుకతో నిమిత్తములేకుండానే ఏదో ఒక కులములో చేరవచ్చు. జీవితములో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజశక్తులమీద ఆధారపడిఉంటుంది. 
కామం అనగా కోరిక అనగా ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం శూద్రదశ.
అర్థం అనగా లాభార్జనం చేస్తూనే కోరికలను అదుపులో ఉంచుకొనే వైశ్యదశ.
ధర్మం అనగా స్వయంశిక్షణతోనూ , బాధ్యతతోనూ , సత్కర్మతోనూ గడిపే క్షత్రియదశ.
మోక్షం అనగా విడుదల, మతధర్మ బోధనలతో కూడిన జీవితము బ్రాహ్మణదశ.
ఈ నాలుగు కులాల మానవులకు సేవచేయడానికిఉపకరించే సాధనములు శరీరము, మనస్సు, సంకల్పశక్తి మరియు ఆత్మ. 
సనాతనఋషులు చెప్పిన మాయను ఆధునిక కాలము లోని గొప్ప ఆవిష్కరణలు ధృవీకరణ చేశాయి. 
ఉదాహరణకు ఒకే ఒక చర్యను చూడటం అసంభవం అని మన ఋషులు చెప్పినదే సమానంగానూ, వ్యతిరేకంగాను రెండు బలాలు ఉంటాయి అని న్యూటన్ సిద్ధాంతము దీనికి ఉదాహరణ.
కారణ విశ్వం  భావముల ఆనందమయ లోకం. ఇది సూక్ష్మ విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది.
దానితరువాతది హిరణ్యలోకం. ధ్యానశక్తిగల  సాధకుల లోకమే  హిరణ్యలోకం.  ఈ హిరణ్యలోకములో సద్భక్తులు , మంచి సాధకులు తమతమ కర్మబీజములను దగ్ధము చేసికుంటారు. 
దానితరువాతది సూక్ష్మలోకం.  ఈ సూక్ష్మలోకంలో భూమి మీద అంతకు క్రితమువి మరియు అప్పుడే మరణించిన జీవులన్నీ ఉంటాయి. అవి తమతమ గుణకర్మలననుసరించి వివిధ క్షేత్రాలలో నివసిస్తారు, వివిధ క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ వారు వారు చేసికున్న పుణ్యము ప్రకారము ఉంటుంది.  ఎక్కువ పుణ్యం చేసికున్న వారు  తక్కువ  పుణ్యం చేసికున్న వారి క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ ఉంటుంది. సూక్ష్మలోకవాసులు కాంతి మీద ఆధారపడిజీవిస్తారు.  జీవులు వారి వారి కర్మఫలమునుబట్టి భూమి మీదకి రావడానికిరెండు నుండి ఐదువేల సంవత్సరాల సమయము పడుతుంది.  భూమిమీద జీవులు ప్రాణశక్తి మీద ఆధారపడిజీవిస్తారు.       ఈ సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది. అనగా భౌతిక విశ్వంలో కనిపించే వాటికన్నా అనేకమైన సౌర, నక్షత్ర మండలములు ఎన్నో ఉంటాయి. సూక్ష్మలోకవాసులు పాతవారైనా కొత్త వారైనా, ఒకరినొకరిని గుర్తుపట్టగలరు.  అనగా పాతవారు అనగా క్రితం జన్మలోనివారు. కొత్తవారు అనగా అప్పుడే స్తూలశరీరము భూమిమీద వదలినవారు.   సూక్ష్మలోక రాత్రులు పగలులు మనము నివసించే భూమిమీద కంటే దీర్ఘముగా ఉంటాయి.     
పరమాత్మ  ఈ భూమిని ఒక భావముగా రూపొందించాడు.  దాన్ని త్వరితము చేశాడు.  పరమాణుశక్తి,   ఆ తరువాత పదార్ధము పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఈ విధమైన ఘన గోళముగా రూపొందించినాడు.  కేవలం పరమాత్మ సంకల్పం చేత కూడియుంటాయి, వికల్పము చేత విడిపోయి శక్తిగా పరివర్తన చెందుతాయి.  అణుశక్తి తన మూలచైతన్యము లోనికి వెళ్ళిపోతుంది, భూభావం స్తూల(త)త్వము లోంచి అదృశ్యం ఔతుంది. 
మనిషి స్వప్నంలో సృష్టించే విశ్వములు కూడా దేవుని మౌళిక ఆదర్శాన్ని అనుసరించి అప్రయత్నముగానే కరిగిస్తాడు.
పరిపూర్ణసిద్ధిని పొందినవాడు సిద్ధుడు. 
జీవించిఉండగానే ముక్తిని పొందినవాడు జీవన్ముక్తుడు.
సర్వోత్కృష్ట  స్వతంత్రుడు అనగా మృత్యుంజయుడుని పరాముక్త అంటారు. 
కొన్ని శ్లోకములు
జ్యోతిషామపితజ్జ్యోతిః సమస్తః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం  జ్ఞానగమ్యం హ్రుదిసర్వస్య విష్ఠితం   గీత  ---13—18
సూర్యునికి, చంద్రునికి,  మరియు అగ్నికి ప్రకాశము నిచ్చునది, అజ్ఞానముకంటే అతీతమైనది, జ్ఞానస్వరూపమయినదియు, పొందతగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు ఉన్నది ఆ పరమాత్మే.  
ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణాం అహం శశీ.  గీత  ---10—21 
నేను ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.
యదాదిత్యగతం తేజో జగద్భాసయతెఖిలం
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమమకం  గీత  ---15—12
సూర్యునియందున్నా ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును , అగ్నియందును ఏ తేజస్సు గలదో , ఇదియంతయు నాదిగా నెఱుగుము.
మయ్యాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే        గీత  ---9—10
ఓ అర్జునా! అధ్యక్షుడనై (సాక్షీభూతుడనై యున్న నాచేత ప్రకృతి  చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది.  ఈ కారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.
క్రియాయోగము
పరమాత్మే ఆదిపురుషుడు. పరాప్రకృతిని కలిగి ఉన్నాడు.   పరాప్రకృతియే రాధ.  ప్రత్యేకంగాగనపడే ప్రతి జీవాత్మయు అతడే.  సత్ అనగా అస్తిత్వం (EXISTANCE). చిత్ అనగా జాగరణ.  ఆనందం అనగా క ర్తృకము మరియు అక ర్తృకము.  మానవుడు తృటిలోకర్మాబద్ధుడు.  కర్మననుసరించి జన్మ వచ్చును.  గ్రహరాశులు  మనిషికి తన కర్మ ప్రకారము అంగీకృతమైనపుడు, సూక్ష్మశరీరము మాతృయోనియందు ప్రవేశించి, స్థూలశరీర నిర్మాణమునకు ఉపయుక్తమగును. మరణము అనగా స్థూల సూక్ష్మ శరీరములు రెండును జన్మ కారణమైన ప్రారబ్ధకర్మ పూర్తిఅగుటతో విడిపోవుట.  మానవుడు సజీవముగా నున్నప్పుడే చైతన్యస్ఫూర్తితో శరీరమును ఆత్మను వేరుచేయు స్థితికి చేరుకున్నచో మరణము బాధించదు.  కాని ఇట్టి స్థితికి చేరుకొనుటకు క్రమముతప్పని దృఢని శ్చయముతో చేయు ధ్యానము అవసరము.  సద్గురువు కృప వలన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అన్నహత, విశుద్ధ మరియు ఆజ్ఞా పాజిటివ్ లున్న బ్రహ్మదండినిశుద్ధము చేసి సాధకునిలోని సహజముగనున్న అనంతమైన కుండలినీ శక్తిని ప్రజ్వరిల్లజేయును. దీనివలన సాధకునకు (1) జ్యోతిదర్శనము (2) శబ్దము ( ఓం ) (3) ప్రకంపన ( trance vibration) కలుగును. అప్పుడు కుండలినీశక్తి ఉత్తే జించబడి ఆరుచక్రములలో పరిభ్రమించబడి మెదడునకు చేరును.
అప్పుడు సాధకుడు దైవశక్తియుతుడు అగును. 
క్రియాయోగములో మహాముద్ర, క్రియా మరియు జ్యోతిముద్ర అనే మూడు ముఖ్య విషయములు,  హంస, ఓం మొదలగు అనేక ఉప ప్రక్రియలు ఉంటాయి.         
మహాముద్ర మేరుదండమును సరిచేయుటకు అయస్కాంతీకరణము చేయుటకు ఉపయోగపడుతుంది.
మితాహారంవలననూ , రోగములేకుండానూ ఉన్నప్పుడు మరియు  సౌరశక్తి వలననూ పొందకలిగే ఒక సంవత్సరం శక్తిని, శారీరక మరియు మానసిక మార్పులను  , సాధకుడు ప్రాణశక్తిని బ్రహ్మదండి చుట్టి వచ్చు ఒక క్రియద్వారా సాధించవచ్చును.
ఇడా పింగళ మరియు సుషుమ్నల కలయికని లేదా కూటస్థ చైతన్యాన్నికేంద్రీకరించి జ్యోతిదర్శనమునకు ఉపయోగకారి జ్యోతిముద్ర.
హఠయోగము అనగా సూర్య చంద్రుల కలయిక.  దీనినే ప్రాణ అపాన వాయువుల కలయిక అంటారు.  హఠయోగములో  ప్రాణాయామము, ఆసనములు, బంధములు మరియు ముద్రలు ద్వారా శరీరము వశములో ఉంచబడుతుంది. 
రాజయోగమనగా మనస్సును వశపరచుకొనుట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార (ఇంద్రియములను వశములో ఉంచుకొనుట), ధారణ(ఏకాగ్రత), ధ్యానము మరియు సమాధి అనే ఎనిమిది అంగములుగలది రాజయోగము.  ప్రాణాయామము రాజయోగములో ప్రధానమైనది.  దీనివలన హృదయస్పందన, నాడీ స్పందన, మనస్సు మరియు  ప్రాణశక్తి వశమునందుండును.
.మంత్రయోగములోని శబ్దములు  ఆత్మ పరమాత్మల కలయికకి దోహదపడును.
లయయోగము అనగా పూర్తిగా మనస్సును వస్తువు మీద లగ్నము చేయుట. క్రియయోగ సాధనమైన ఒక పద్ధతిద్వారా మనస్సు ఓంకారశాబ్దమున లయమగును.
క్రియా యోగమున జపయోగముకూడా మిళితమైయున్నది.
కనుక క్రియాయోగము అన్ని యోగములసారము.  అనగా హఠయోగము లోని కొన్ని శారీరక వ్యాయామములను, రాజయోగములోని ప్రాణాయామ, ధారణ, ధ్యాన ప్రక్రియలని, లయయోగము లోని సారాంశాన్ని, జపయోగము లోని సారాంశాన్ని
మిళితము చేసియున్నది.
క్రియాయోగము ద్వారా షట్ చక్రములయండు నిక్షిప్తమైయున్న గ్రహములయొక్క, నక్షత్రములయొక్క చెడులనుండి  విముక్తుడగుటకు దారి లభ్యమగును.
మన స్థూల శరీరములో బ్రహ్మగ్రంథి,  విష్ణుగ్రంథి, మరియు రుద్ర గ్రంథి,  అని మూడు గ్రంథులు గలవు.
బ్రహ్మగ్రంథి:  మూలాధారమునుండి మణిపూరకము వఱకు వ్యాపించియున్న ఈ గ్రంథి మానవచైతన్యమునకు సంబంధించిన భౌతిక విషయాశక్తి యందు లగ్నమైయుండును.
విష్ణుగ్రంథి: ఇది మణిపూరకమునుండి పిట్యుటరీగ్రంథి  వఱకు వ్యాపించియున్న ఈ గ్రంథి పంచ జ్ఞానేంద్రియాలనుభౌతిక విషయాశక్తి యందు లగ్నము చేయించును. అందువలన మనస్సు భగవత్ అనుభూతిని పొందనీయదు. 
రుద్రగ్రంథి: ఇది పిట్యుటరీగ్రంథి మరియు ఉచ్చి గుంట నడుమనున్నది.  ఈ గ్రంథి మీద దృష్టి కేంద్రీకరించిన సాధకుడు కపాలమందున్న భగవానుని దర్శించగలడు. 
మానవరూపములోనున్న నిరాకారత్వము క్రియాయోగముద్వారా సులభముగా ఎఱుకబడును.
ఈ క్రియాయోగముద్వారా ప్రతిఒక్కరూ నరముల బలహీనత, నీరసము, అలసట, కోపము, విచారము, భయము, అకాలమృత్యువు, తొలగించుకొని బ్రహ్మ మస్తిష్కము , చిన్నమెదడు మధ్యనున్న దైవత్వమును దర్శించగలుగుతాడు. 
క్రియాయోగములో మేరుదండమును Antenna గా చేసి షట్ చక్రాలద్వారా dissipate అయిన  energyని తిరిగి వెనక్కి మలచి మేరుదండం ద్వారా సహస్రారానికి ఇడ, పింగళ మరియు సుషుమ్నాద్వారా పంప వీలవుతుంది. 
ఆపస్తంభ సూత్రము: 
వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్ఠాః ప్రేత్య
కర్మఫలం అనభూయతతః శేషేణ
విశిష్ట  దేశజాతి కులరూపాయుః శృతి
వృత్తవిత్త సుఖమేధసో జన్మప్రతిపద్యంతే
స్వకర్మ నిష్ఠులగు బ్రాహ్మణాదులును , బ్రహ్మచార్యాదులును పరలోకమున తమతమ కర్మఫలములననుభవించి అంతట సంచిత శేషముతో విశేషయుక్తమగు దేశాజాతి కులరూప ఆయుర్విద్యాచార ధనసుఖ బుద్ధులు కలవారుగా జన్మింతురు.
ప్రాణాయామౌ దేహేద్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషం
ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనాన్ ఈశ్వరాన్ గుణాన్ ...........  మనువు 
ప్రాణాయామముచే రాగాది చిత్తదోషముల గాల్చవలయును.
ధారణావశమున పాపమును 
ప్రత్యాహారముచే  ఇంద్రియములకు కలుగు విషయ సంసర్గములను ధ్యానముచే అనీశ్వరగుణములను లోభాదులను కాల్చివేయవలయును.
కనుక శ్రౌతస్మార్తకృత్యములు చేయవలయును. 
శ్రౌతం అనగా అగ్నిహోత్రాది క్రియలు.(rites) 
స్మార్తము అనగా ఔపాసనాది క్రియలు. (rites).
ధ్యానము
ధ్యానము మనకు పరమాత్మ ఉన్నాడని రెండు విధములుగా తెలియబరచును.
1)అపరితమయిన ఆనందము ఆయన ఉనికిని మనలోని ప్రతి అణువుకు తెలుస్తుంది. అదే ఆయన ఉనికికి ఋజూవు.
2)పరమాత్మ  యొక్క ఎడతెగని నిరంతర మార్గదర్శకము. ప్రతి సస్త కష్ఠసమయంలో  ఆయన యొక్క ఆదరణయే ఆయన ఉనికికి ఋజూవు.
ధ్యానములో నాలుగు అవస్థలు ఉంటాయి.
1) సత్యముయొక్క తార్కికత మరియు శోధన మీద ఏకాగ్రత. శుద్ధ మైన ఆలోచనలతో  ఆనందము  కలగచేస్తుంది.
2) సత్యముయొక్క తార్కికత మరియు శోధనలనుండి విముక్తి వలన కలిగే శాంతి.
3) స్థూలశరీరమునుండి  తేలికగా వైరాగ్యంతో బయట పడుట
4) శుద్ధ   సమతుల్యత, శుద్ధ జ్ఞానం మరియు శుద్ధ ధార్మికతే  నిర్వాణం. ద్వంద్వం లోనుండి విముక్తే నిర్వాణం. నిర్వాణం అంటే ఆత్మహత్య కాదు.  భ్రమపూరితమైన అహంకారమును హత్యచేయడం నిర్వాణం. శుద్ధఆత్మ కాని  అహంకార పూరితమైన నేనును వదలి, జన్మరాహిత్యమును పొంది నిత్య సత్యమైన పరమాత్మలో విలీనమగుటకు ప్రయత్నము  చేయవలయును.  నిత్య చైతన్యమైన ,  నిత్య స్థితివంతమైన, నిత్య నూతన ఆనందమైన పరమాత్మలో (తో) ఒకటి అవ్వాలనే సకారాత్మక నిర్ణయం అనేదే మానవ జీవిత లక్ష్యంగా ఉండాలి.
వాస్తు
వాస్తు ఇంటి నిర్మాణంలో తీసికొనవలసిన నియమాలు నిబంధనలకి సంబంధించిన శాస్త్రము.   ఇంటి నిర్మాణంలో మూడు ముఖ్యవిషయములు గుర్తుంచుకొనవలయును.  గాలి, వెలుతురు మరియు నీరు బాగా వచ్చేటట్లు ఇంటి నిర్మాణం చేయవలయును. 
వంట ఇల్లు ఆగ్నేయం (SE) లోనూ, పెంట అనగా పాకీదొడ్డి నైఋతి దిక్కు (SW)లోనూ, పంట అనగా కూరగాయల మరియు పూలతోట   వాయువ్యం (NW) లోనూ, మంచినీటిగుంట అనగా బావి మరియు నీళ్ళ పంపు ఈశాన్యం (NE) లోనూ ఉండేటట్లు చూసుకోవాలి. 
కిటికీలు మరియు తలుపులు సరి సంఖ్యలోనూ ఉండేటట్లు చూసుకోవాలి.అట్లా అని సరి సంఖ్యలో ఉండాలికదా అని చివర సున్నా ఉండకూడదు.  అనగా కిటికీలు మరియు తలుపుల సంఖ్య 10, 20 మరియు  30  వగైరా  అట్లా ఉండకూడదు.
ఎటువంటి జాతకులకైనా  ఇంటి లోనికి పడమరనుండికాని, దక్షిణం నుండికాని ప్రవేశము అన్నివిధాలా మంచిది. 
అదేవిధముగా తల దక్షిణమున గాని, పడమర వైపు గాని పెట్టుకొని నిద్రించవలయును.  అనగా మనము తూర్పుగాని ఉత్తరముగాని చూస్తూ నిద్రించుట ఉత్తమము.  ఉత్తరదిక్కున తలపెట్టుకొని నిద్రించకూడదు. ఎందుకంటే మనతల ఉత్తరము, పాదములు దక్షిణము. భూమి ఒక అయస్కాంతం లాంటిది. భూమియొక్క ఉత్తరదిక్కున తలపెట్టుకొని పడుకున్న యడల, మనతల ఉత్తరము మరియు భూమియొక్క ఉత్తరము వికర్షణ చెంది తలకాయ నొప్పులు, కలలు, రక్తపోటు రావడం వగైరా వగైరా వస్తాయి.    
నైఋతి(SW) వైపు బరువు అనగా సామానులు అవీ పెట్టుకునేందుకు కావలసిన అల్మైరాలు అవీ కట్టుకొనవలయును. 
పడమర దిక్కున కట్టుకునే గోడ తూర్పు దిక్కుకంటే ఎత్తగా ఉండవలయును.
మనము కూర్చొని ధ్యానము చేసే పూజగది తప్పక ఉండవలయును. దేవుని విగ్రహములు పడమరను చూస్తూ వాటి ఎదుట మనము తూర్పును చూస్తూ ఉండేటట్లుగా కూర్చొని ధ్యానము చేసేటట్లుగా ఉండవలయును.
ఎన్నిగదులున్న గదికి ఒక్కడు చొప్పున అంతమంది ఆ ఇంట్లో రోజూ భోజనము చేయవలయును. లేనియడల గ్రహశాంతి మరియు గృహశాంతి రెండూ కరువగును. కనుక ఎక్కువ గదులున్నయడల అద్దెకిచ్చుకోనుట ఉత్తమము.
 

(వాయువ్య) (North West)
    పంట
( కుబేర )
    (ఉత్తరం)  
   ( North)
   

  (ఈశ్వర)
(ఈశాన్యం )
 (North east)
మంచినీటిగుంట
(వాయుదేవ)



 (పడమర)
   (West)

 (వరుణ)

 ( తూర్పు)
   (East)
  (రవి)



( నైఋతి)
(South west)
   పెంట
 (చంద్ర)


  (దక్షిణము)
    (South)
 
  (యమ)
 

(ఆగ్నేయం) 
(South east)

    వంట
    (అగ్ని )


జాతక దోషాలు --- ప్రాణాయామ పద్ధతుల ద్వారా నివారణ
జాతక దోషములు సాధారణంగా ఈ క్రింద విధముగా ఉంటాయి.
1) గురుదోషము  వలన వివాహ విషయంలోనూ,  విద్యా విషయంలోనూ సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ గ్రహ గురువు కంటే సద్గురువు సలహాతో స్వాధిష్ఠానచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో వం అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.
2) శుక్ర దోషము  వలన సంతానలోపము, సంసారములో కలతలు కలహములూ, వీర్య లోపములు రావచ్చును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో విశుద్ధ చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో హం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.
సూర్యుడు కోడిగుడ్డు (elliptical order) ఆకారముగా తిరుగుతూ ఉంటాడు.  కనుక ఆయన దూరముగా ఉన్నపుడు  చలికాలం, దూరముగా ఉన్నప్పుడు ఎండాకాలం అవుతుంది. పుడమితల్లికి సూర్యుని దూరము మరియు దిశను బట్టి ఎండ, వాన, చలి కాలములు ఏర్పడుతాయి. 
జన్మసమయములో సూర్యుడు ఏ ఇంటికి అనగా ఏ రాశికి దగ్గిరగా ఉంటాడో అది జన్మ లగ్నరాశి అవుతుంది.  ఆజన్మ సమయములో మనిషి మీద  లగ్నరాశి యొక్క మరియు లగ్నరాశికి ఇరుప్రక్కలా ఇళ్ళలో(రాశులలో) ఉన్న గ్రహముల ప్రభావము మనిషి మీద తప్పక ఉంటుంది.
సూర్య కిరణములు భూమిని తాకటానికి ఎనిమిది నిమిషములు పడుతుంది. మనిషి జన్మసమయములో ఉండేస్థలమును బట్టి సూర్య కిరణములు కొంతమంది విషయంలోముందుగా, కొంతమంది విషయంలో తరువాత చేరుతూఉంటాయి.  అది సెకండ్లో  వందోవంతో వెయ్యోవంతో అవ్వచ్చు.  కాని ఆవ్యత్యాసమే మనిషి అదృష్టం నిర్ణయిస్తుంది.  కనుక మనిషి పుట్టిన స్థలము, సమయము గ్రహస్థితిని నిర్ణయించటము, ఆ  గ్రహస్థితి మనకి కర్మ ప్రకారము ఫలితాలు నిర్దేశించటమూ జరుగుతుంది.
3) చంద్రదోషము: చంద్రదోషము  వలన మానసికంగాను,  వాణిజ్యపరంగానూ, ఉద్యోగపరంగానూ  సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ సద్గురువు సలహాతో అనాహత చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో యమ్ అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు. 
4) శని దోషము:  శనిదోషము  వలన .దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు ,మానహాని, వ్యవహార చిక్కులు కలుగును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మూలాధార చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో లం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు .
5) కుజదోషం:   శతృవుల వలననూ, స్వయంకృతాపరాధము వలనను  చిక్కులు కలుగును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మణిపుర చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రమ్  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు .
6) బుధదోషం : వ్యాపారపరంగానూ, వాచాలత వలననూ , విద్యాపరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో అజ్ఞా  చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో ఓమ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు .
7) రవిదోషం:  విద్య, ఆధ్యాత్మిక న్యూనత లేక శూన్యత, ఆర్ధిక పరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో సహస్రార   చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రామ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు .
నవగ్రహస్తోత్రము
సప్తాశ్వరధమారూఢం  ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరమ్ దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్
ఏడుగుఱ్ఱములను (ఏడుచక్రములు) అధిరోహించువాడును, ప్రచండమైన కాంతిగలవాడును అనగా ఆజ్ఞానమును దూరము చేయువాడునూ, కశ్యప మహర్షి కుమారుడును అనగా శుద్ధ బుద్ధి ప్రదాతయూ, తెల్లనిపద్మమును ధరించినవాడును అనగా జ్ఞానమునకు ప్రతీకుడునూ అయిన సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ సప్తాశ్వరధమారూఢం అనగా మూలాధారము నుండి సహస్రారము వరకున్న ఏడు చక్రములను అనగా ఏడులోకములను ప్రకాశవంతముచేసి జ్ఞానవంతము చేసేవాడు అని అర్థము.  రవి ఆత్మకు ప్రతీక.

శ్వేతాశ్వ సమారూఢం కేయూర మకుటోజ్వలం
జటాధర శిరోరత్నం తం చంద్రం  ప్రణమామ్యహమ్
తెల్లని గుఱ్ఱమును అధిరోహించువాడును, కేయూరకాంతులు వెదజల్లువాడును, పరమశివుని శిరమున అలంకారముగా ఉన్నవాడును  అయిన  చంద్రదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ శ్వేతాశ్వ సమారూఢం అనగా బుద్ధికి , జటాధర శిరోరత్నం అనగా మనసుకి అధినేత అని అర్థము.. అనగా పరమశివుడు  మనసు, బుద్ధి రెండింటిని తన ఆధీనములో ఉంచుకున్నవాడు  అని అర్థము. అందువలన శివుని శిరమున అలంకారప్రాయముగా చంద్రుని చూపుతారు.
ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమాప్రభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్
భూదేవి గర్భమున జన్మించినవాడును, విద్యుత్ కాంతితో సమానమైన ప్రభ అనగా కాంతి గలవాడును, యవ్వనవంతుడు, శక్తివంతుడునూ, మంగళప్రదుడునూ, అయిన  కుజ(మంగళ) దేవునికి నమస్కరిస్తున్నాను.
ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్యగుణో పేతం తం బుధం ప్రణమామ్యహమ్
ప్రియమైన శ్యామ వర్ణము గలవాడును, అందమైనవాడును, సౌమ్యుడునూ, అయిన  బుధ దేవునికి నమస్కరిస్తున్నాను. బుధుడు వ్యాపారమునకు సంబంధించిననవాడు. దానిని సాధకుడు ఆధ్యాత్మిక వ్యాపారమునకు అనగా ఆధ్యాత్మికప్రగతికి అనుకూలించుకొనుటకు ఆయనని ప్రార్థించవలెను.
దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం
బుద్ధిపూతం త్రిలోకేశం తం గురుం  ప్రణమామ్యహమ్
దేవతలకు ఋషులకు బంగారము అనగా  గొప్ప గురువునూ, బుద్ధిమంతుడునూ, త్రిలోకపూజితుడునూ , అయిన  గురు దేవునికి నమస్కరిస్తున్నాను.  గురువు సాత్వికగుణమునకు, జ్ఞానము, వేదాంతం, విద్య మరియు సుఖమునకు ప్రతీక.
హిమకుండమృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తానాం తం శుక్రం ప్రణమామ్యహమ్
తెల్లని వాడునూ, రాక్షసులకు గురువునూ, సర్వశాస్త్రకోవిదుడు అయినప్పటికీ  అహంకారముతో కూడి సంసారబంధమోహము కలగజేయువాడునూ, వీర్యమునకు ప్రతీక అయిన శుక్ర దేవునికి నమస్కరిస్తున్నాను.  సంసారము(నీరు)లో నావ (మనిషి) ఉండవచ్చు. నావ (మనిషి) లో నీరు(సంసారము) ఉండరాదు. దీనినే సంసారబంధమోహము అంటారు. 
నీలాంజన సమాభూతం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం శనిం  ప్రణమామ్యహమ్
నల్లనివాడునూ, రవికి కుమారుడునూ, యమునికి అన్నయ్యనూ, ఛాయాదేవికి (అజ్ఞానం) రవికి (పరమాత్మ చైతన్యము) పుత్రుడునూ అయిన శనిదేవునికి నమస్కరిస్తున్నాను. మల, విక్షేప, ఆవరణ దోషములవలన  పరమాత్మచైతన్యమును  గుర్తించని జ్ఞానమునే ,              ఛాయా మార్తాండ సంభూతం అయిన ఆజ్ఞానము.  శని తామసగుణమునకు ప్రతీక. అందువలన దుఃఖదుడు.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం  ప్రణమామ్యహమ్
అర్థ శరీరము గలవాడునూ,  మహావీరుడునూ, చంద్ర అనగా మనస్సును  మరియు రవిని అనగా ఆత్మను (బుద్ధిని)  పీడించువాడునూ, సింహిక అనగా మనస్సు. అహంకారముతో కూడినవాడునూ  అయిన రాహు దేవునికి నమస్కరిస్తున్నాను.  
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం  రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్
మోదుగ పుష్పకాంతి గలవాడునూ, నక్షత్రములకు మరియు గ్రహములకు తలపై నుండు వాడునూ,  రౌద్ర స్వభావము గాలవాడునూ, రుద్రుని కుమారుడునూ అనగా తామస స్వభావుడునూ, ఘోరమయినవాడునూ, అయిన కేతుదేవునికి నమస్కరిస్తున్నాను.
ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్రహమునకు ప్రతీక. రాహు కేతువులు ఛాయాగ్రహములు.  కనుక వాటికి ప్రత్యేక స్థానములు ఇవ్వలేదు. 
సహస్రారము--------రవి
ఆజ్ఞా ----------------బుధ
విశుద్ధ -------------శుక్ర
చంద్ర---------------అనాహత
కుజ---------------మణిపుర
గురు--------------స్వాధిస్ఠానం
శని----------------మూలాధారం
మన శరీరములో 72,000 సూక్ష్మనాడులున్నవి. వాటిలో 3 సూక్ష్మనాడులు ముఖ్యమైనవి. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి. ఇడ మేరుదండములో ఎడమవైపున, పింగళ మేరుదండములో కుడి వైపున మరియు సుషుమ్న మేరుదండములో ఇడ, పింగళ మధ్యన ఉండును.  మూలాధారం నుండి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి ఆజ్ఞావరకు కలిసి ఉంటాయి. ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము వరకు సుషుమ్నమాత్రమె ముందుకు సాగును.  ఇడ  నకారాత్మక్రియలకు (negative)   పింగళ సకారాత్మ క్రియలకు(positive)  మరియు చ తటస్థ క్రియలకు (neutral).  ప్రతీకలు. సాధకుని లక్ష్యము మూలాధారచక్రము క్రింద ఉన్న కుండలినీ శక్తిని తన సాధనతో  సుషుమ్నద్వారా సహస్రారమునాకు చేర్చుట.  అందుకు విరుద్ధంగా ఇడ వైపు గానీ, , పింగళ వైపు గానీ కుండలినీ శక్తిని పంపగూడదు. పంపినయడల విపరీత స్వభావమును ధ్యానసమయమున పొందును. ఉదాహరణకి అనాహతలో ఇడ వైపు కుండలినీ శక్తి నడిచిన ద్వేషము, పింగళ వైపు నడిచిన అతిప్రేమ(మోహము) కలుగును.  అదే కుండలినీ శక్తిని సుషుమ్నద్వారా నడిపించిన మోహము ఉండదు, ద్వేషము ఉండదు.   ఏడు చక్రములలోను ఓంకారోచ్ఛారణ , బీజమంత్రోచ్ఛారణలాంటి 12 క్రియలు  చేయుట వలన నవగ్రహములవలన కలుగు అనేక దోషములను సమూలముగా నివారించుకొనవచ్చును. ఈ క్రియలు అతి సులభముగా నేర్చుకొనవచ్చును.  ఈ 12 క్రియలు చేయుపద్ధతులు నాపుస్తకము క్రియ కృష్ణ కైవల్య  సమాధి సర్వరోగానివారిణీక్రియలు అనే పుస్తకము ద్వారాను, మరియు సమాధి సర్వరోగానివారిణీక్రియలు అనే 150 నిమిషముల డి.వి. డి. (Audio, video DVD) ద్వారాను తెలుసుకొనవచ్చును.
ఆరోగ్యకరమయిన వ్యక్తీ రోజుకి 21,600 శ్వాస నిశ్వాసలు చేస్తాడు.  అనగా ఒక నిమిషము నకు 15 శ్వాస నిశ్వాసలు చేస్తాడు. మనిషి పుట్టినపుడు తనతోపాటు ఇన్ని హంసలు అనగా శ్వాస నిశ్వాసలను తెచ్చుకుంటాడు. ప్రాణాయామ పద్ధతులద్వారా  ఈ శ్వాస నిశ్వాసలను సాధకుడు నియంత్రణ చేసికొని అతి తక్కువ శ్వాస నిశ్వాసలను చేసి తనజీవితాన్ని పొడిగించుకోగలడు.  ఈ విధముగా మార్కండేయ తన జీవితాన్ని పొడిగించుకొని చిరంజీవి అయినాడు. క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా తన జీవితాన్ని తను నియంత్రించుకోగలడు.  పరమహంస శ్రీ శ్రీ యోగానందలాంటి వారు తనకి జ్యోతిష్యము ప్రకారము జరగవలసిన రెండు వివాహములను క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా జరగకుండా చేసికోగలిగారు.  కనుక అటువంటి మహానుబావులను స్ఫూర్తిగా తీసికొని మనము కూడా క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా  పరమాత్మను పొందగలము.    

హరి ఓం తత్ సత్.     జై గురు.


  




 



      
              
 

                     

           






  






















Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana