వాసుదేవక్రియ 1&2 Vaasudevakriya 1&2 in Telugu
ఓం శ్రీ
యోగానంద గురు పరబ్రహ్మణేనమః
గమనిక: గురుముఖతః ఇది నేర్చుకొనుట అతిఉత్తమము.
తూర్పు లేదా ఉత్తర
దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో,
పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును.
కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ
వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి
అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. దీనినిఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును.
వాసుదేవక్రియ 1:
ఖేచరీముద్రలో నోరు
బాగా తెరిచిఉంచుకొని లోతుగా శ్వాస తీసుకోవాలి. రెండు చేతులవ్రేళ్ళు ఒకదానితో ఒకటి
పెనవేసికొని ఉంచవలయును. అట్లాపెనవేసికొని ఉంచు కొనిన చేతులవ్రేళ్ళతో బొడ్డు క్రింద
ఉన్న పోట్టికడుపును నిదానముగా నొక్కుతూ
లోతుగా శ్వాస తీసికుంటూ మూలాధరచక్రములో ‘ఓం’, స్వాధిష్ఠాన చక్రములో ‘న’, మణిపుర చక్రములో
‘మో’, అనాహతచక్రములో భ’, విశుద్ధచక్రములో ‘గ’, ఆజ్ఞా పాజిటివ్టివ్ చక్రములో ‘వ’, అని అంటూ మనస్సు దృష్టి ఆయా చక్రములో ఉంచుతూ శ్వాసను కూటస్థము వరకు ఆరోహణాక్రమములో
తీసుకొని వెళ్ళాలి.
ఇప్పుడు అంతః కుంభకములో
ఆజ్ఞానెగటివ్ చక్రములో ‘తే’ అంటూ కుడివైపున, విశుద్ధచక్రములో ‘వా’ అంటూ ఎడమవైపున, అనాహతచక్రము
లో ‘సు’ అంటూ మెడను వంచి తిరిగి మెడను నిఠారుగా ఉంచుతూ, మణిపుర చక్రములో ‘దే’, స్వాధిష్ఠాన చక్రములో ‘వా’,
మూలాధరచక్రములో ‘య’ అంటూ అవరోహణాక్రమములో శ్వాస నిదానముగా వదలుతూ, మనస్సు
దృష్టి ఆయా చక్రములో ఉంచుతూ పెనవేసిన చేతులవ్రేళ్ళను
నిదానముగా సడలిస్తూ, మూలాధరచక్రములో పెనవేసిన చేతులవ్రేళ్ళను పూర్తిగా సడలించాలి, శ్వాసను
పూర్తిగా వదలాలి.
తిరిగి మూలాధరచక్రమునుండి
‘ఓం’ అంటూ పై మాదిరిగానే ప్రారంభించి పెనవేసికొని ఉంచుకొనిన
చేతులవ్రేళ్ళతో బొడ్డు క్రింద ఉన్న పోట్టికడుపును నిదానముగా నొక్కుతూ లోతుగా శ్వాసను కూటస్థము వరకు ఆరోహణాక్రమములో
తీసుకొని వెళ్ళాలి. అవరోహణా క్రమములో మూలాధరచక్రములో ‘య’ అంటూ పూర్తిగా పెనవేసిన చేతులవ్రేళ్ళను
సడలించాలి, శ్వాసను పూర్తిగా వదలాలి.
ఆజ్ఞా పాజిటివ్ చక్ర ‘వ’ ‘తే’
ఆజ్ఞానెగటివ్ చక్ర
విశుద్ధచక్ర ‘గ’ ‘వా’ విశుద్ధచక్ర
అనాహతచక్ర ‘భ’ ‘సు’ అనాహతచక్ర
మణిపురచక్ర ‘మో’ ‘దే’ మణిపురచక్ర
స్వాధిష్ఠానచక్ర ‘న’ ‘వా’ స్వాధిష్ఠానచక్ర
మూలాదారచక్ర ‘ఓం’ ‘య’ మూలాదారచక్ర
ఈ విధముగా ఉదయము సాయంత్రము పన్నెండు క్రియలు చేయవచ్చు.
వాసుదేవక్రియ 2
ఈ క్రియ కూడా వాసుదేవక్రియ 1 మాదిరిగానే చేయవలయును. ‘తే ‘వా’ ‘సు’ అని వారి వారి శక్తి
సామర్థ్యాలను అనుసరించి 24 పర్యాయములు తలను త్రిప్పవచ్చు.
సమాధి అనగా భగవంతునితో ఐక్యము పొందటము ఈ క్రియల ఉద్దేశ్యము. ఈ క్రియలలో
సాధకుడు వృధాగా బయటకి వెల్తున్న ప్రాణశక్తిని తిరిగి మేరుదండముద్వారా షట్
చక్రములద్వారా కూటస్థము లోనికి పంపగలుగుతాడు. శిరస్సును ఒక అయస్కాంతముగా మరల్చ
కలుగుతాడు. ప్రాణశక్తిని పినియాల్ గ్లాన్డ్స్ లో, మేడుల్లాలో పెద్ద మెదడు(Medulla and Cerebrum)లో కేంద్రీకరించగలుగుతాడు.
‘తే ‘వా’ ‘సు’ అని తలను త్రిప్పుతూ సమాధి పొంద కలుగుతాడు. అప్పుడు ధ్యాత, ధ్యానం, ధ్యేయం మూడూ ఒక్కటి
అవుతాయి.
Comments
Post a Comment