kalasarpadosham in Telugu కాలసర్పదోషము


కాలసర్పదోషము లేక యోగము :
సీదా వజ్రాసనము, లేదా పద్మాసనము, లేదా సుఖాసనములో సహజముద్రలో కూర్చోండి. తూర్పు లేదా ఉత్తరము దిక్కును చూస్తూ ఉండండి.
ధ్యానము వలన సర్వ గ్రహ దోషములు వినాశమగును.

కాలము సర్పము కలిసి కాలసర్పము అయినది.
పరాశరుడు, మరియు వరాహమిహిరుడు దీనిగురించి ఏమీ మాట్లాడలేదు.
రాహువు శిరస్సు, మరియు కేతువు తోక.
మేషం, మిథునం, సింహ, తుల, ధనుస్సు, కుంభ, మీన, మకర, వృశ్చిక, కన్యా, కర్కాటక, మరియు వృషభ రాశులలో అనగా clockwise direction అనగా ప్రదక్షిణ పూర్వకముగా రాహువు శిరస్సు, మరియు కేతువు  స్థితులయ్యి, రవి , బుధ, శుక్ర, చంద్ర, కుజ, గురు, మరియు శని గ్రహములు, రాహువు, మరియు కేతువుల మధ్య ఉన్నయడల దానిని కాలసర్పదోషము లేక యోగము అంటారు. దీనివలన అవకాశములు, మరియు బెదిరింపులు సమానముగా ఎదురగును. అది జాతకుడికి ఒక్కొక్కప్పుడు మహా అదృష్టం వరించవచ్చు. జాతకులకు ప్రయాణ సమయములో సమస్యలు ఎక్కువగా ఎదురవ్వవచ్చు.
రాహువు మొదటి ఇంట్లో ఉన్నప్పుడు 27 సంవత్సరములవరకు,
రెండవఇంట్లో ఉన్నప్పుడు 33 సంవత్సరములవరకు,
మూడవఇంట్లో ఉన్నప్పుడు 36 సంవత్సరములవరకు, ఉంటుంది.

విపరీత కాలసర్పదోషము లేక యోగము:
రాహువు శిరస్సు, మరియు కేతువు తోక.
వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, మకర, మీన, కుంభ, ధనుస్సు, తుల, సింహ, మిథునం, మరియు మేష, రాశులలో అనగా anticlockwise direction అనగా అప్రదక్షిణ పూర్వకముగా రాహువు శిరస్సు, మరియు కేతువు  స్థితులయ్యి, రవి , బుధ, శుక్ర, చంద్ర, కుజ, గురు, మరియు శని గ్రహములు, రాహువు, మరియు కేతువుల మధ్య ఉన్నయడల దానిని కాలసర్పదోషము లేక యోగము అంటారు. దీనివలన అవకాశములు, మరియు బెదిరింపులు సమానముగా ఎదురగును. అది జాతకుడికి సంసార జీవితముపై విరక్తి కలగజేసి భగవంతునికి చేరువజేయవచ్చు.

సహస్రారములో దృష్టి నిలిపి దీర్ఘముగా ఓం అని 108 పర్యాయములు రాం ఉచ్ఛారణ చేయాలి.
సహస్రారములో దృష్టి నిలిపి దీర్ఘముగా ఓం అని 108 పర్యాయములు ఓంకారోచ్ఛారణ చేయాలి.
ఎదురుగా జ్ఞానాగ్ని గుండము ఉన్నదని భావించాలి.
యథైదాంసి సమిద్ధోగ్నిభస్మసాత్ కురుతోర్జున
జ్ఞానాగ్ని సర్వకర్మాణిభస్మసాత్ కురుతె తథా       4--37
అని గీతా శ్లోకము చదవాలి.
పిమ్మట మూడుసార్లుగా హృదయమునుండి సంచిత కర్మలను తీసి ఎదురుగాఉన్న జ్ఞానాగ్ని గుండములో స్వాహా అని ఆహుతి చేయాలి..
పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి  లింగ ముద్ర లేక జ్ఞానముద్ర వేసికొని     ఖేచరీముద్రలో  ధ్యానం చేయాలి.









Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana