sukra dosha in Telugu శుక్రదోషము



శుక్రదోషమ
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో,  శూన్య ముద్రలో   ఉండవలయును.
శూన్య ముద్ర:
మధ్యవ్రేలు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
అన్నిరకాల చెవ్వు, ముక్కు, గొంతు, థైరాయిడ్, పంటిచిగురులు మరియు మెడ నొప్పుల  బాధలు ఉపశమించును.  
విశుద్ధ చక్రమును tense చేయాలి.
విశుద్ధ చక్రములో మనస్సు దృష్టి పెట్టాలి.
మనము ఇప్పుడు 108 మారులు విశుద్ధచక్రములో హంఉచ్ఛారణ చేద్దాము.
తదుపరి
  ఋూ అలు అలూ ఎ ఐ ఒ  ఔ అం అః                                                
అక్షరములు 108 మారులు  ఉచ్ఛారణ చేయవలయును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
విశుద్ధచక్రము శుక్ర స్థానము.
దీనికి ఎడమ వయిపు అనగా ఇడా వయిపు ధనుస్సు రాశి ఉండును.
దీనికి కుడి వయిపు అనగా పింగళ వయిపు మకర రాశి ఉండును.
దీనివలన శుక్ర దోషము తొలగును.
ఉబ్బసము, శ్వాస సంబంధిత రుగ్మతలు, అల్లెర్జీ, క్షయ, ఆర్థరైటిస్, కి సంబంధించిన రోగముల నివారణ. ఆత్మహత్యచేసికుందామనే భావ నివారణ.
సంతానలోపము, సంసారములో కలహములు, మరియు  కలతలు, వీర్యలోప సంబంధిత విషయములలో లాభము చేకూరును.



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana