Bhajagovindam Telugu commentary

Bhajagovindam Telugu commentary

Nirvanashatkam in Telugu     

నిర్వాణ షట్కము :
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం
మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం
మనస్సు బుద్ధి అహంకారము చిత్తము నేను కాదు. చెవ్వు, నాలుక, ముక్కు, కన్ను, నేను కాదు. వాయువు, భూమి, అగ్ని, ఆకాశము, జలము నేను కాదు. సత్ చిత్ ఆనంద రూపమును నేను, శివుడను నేను.  
అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతుర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను ముఖ్య ప్రాణమును కాను. పంచ ముఖ్య వాయువులను అనగా ప్రాణ, అపాన, వ్యాన, సమాన, మరియు ఉదాన వాయువులను నేను కాను. 1)ఆహారము,  2)రక్తము,  3)మాంసము,  4)నరములు,  5)ఎముకలు,  6)మజ్జ మరియు 7)శుక్లము—సప్త ధాతువులను నేను కాను. పాణి పాదము పాయువు ఉపస్థ మరియు శశినం అనే కర్మేంద్రియములు నేను కాను. సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
అన్నమయకోశము,ప్రాణమయకోశం, మనోమయకోశము, విజ్ఞానమయకోశము, మరియు  ఆనందమయకోశము అనే అయిదు కోశములు నేను కాను. కారణ సూక్ష్మ మరియు స్థూల శరీరములు మూడునూ నేను కాను.  సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహోమదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు ద్వేషము రాగము లోభము మదము మాత్సర్యము లేవు. నాకు ధర్మార్థ కామ మోక్షములు లేవు. సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం ||
పుణ్య పాపములు నాకు లేవు. సుఖ దుఃఖాలు నాకు అంటవు. నాకు మంత్రము లేదు. పుణ్యక్షేత్రము లేదు. నాకు శాస్త్రము లేదు. యజ్ఞము లేదు.    మంత్రము పుణ్యక్షేత్రము శాస్త్రము యజ్ఞము వీటన్నిటికీ అతీతుడిని.  నేను భోజ్యము కాదు, భోక్తను కాను, భోజనము కాను. వీటన్నిటికీ అతీతుడిని. సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బన్దనం నైవ ముక్తి న బంధః |చిదానంద రూపః శివోహం శివోహం ||

నాకు ఆలోచనలు లేవు. నాకు రూపము లేదు. నేను ఆలోచనా రహితుడిని. . నేను రూపరహితుడిని.  జ్ఞానేంద్రియములకు శక్తి నా వలననే కలుగు తుంది. నాకు తగులము లేదు. ముక్తి లేదు. సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః పితానైవ మేనైవ మాతా న జన్మ |
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం ||
 నాకు జననము లేదు. మరణము లేదు. నాకు కుల మత భేదములు లేవు. నాకు తల్లి తండ్రి లేరు. నాకు బంధువు లేడు. మిత్రుడు లేదు. గురువు లేడు. శిష్యుడు లేడు. సత్ చిత్ ఆనంద స్వరూపమును నేను, శివుడను నేను.
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం |



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana