Ravi dosha in Telugu రవిదోష
1)రవిదోష:
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము
positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును
మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, యోని లేక సహజముద్రలో చేయవలయును.
రెండుచేతుల తర్జని గోరున్న భాగములు నొక్కిపెట్టి
ఉంచాలి. రెండు చేతుల అంగుష్ఠముల గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన
వ్రేళ్ళు ఒకదానితో ఇంకొకటి పెనవేసి ఉంచాలి.. అంగుష్ఠముల గోరున్న భాగములు బొడ్డుకి
ఆనించిపెట్టాలి. అంగుష్ఠముల గోరున్న భాగములు దూరంగా ఉంచాలి. ఇది ఒక ధ్యానముద్ర.
రక్తము శుద్ధమగుట, హృదయమునకు మరియు ligaments (స్నాయువులను) బలోపేతము చేయును.
సహస్రార చక్రము tense చేసి, దాని మీద మనస్సు, దృష్టి పెట్టాలి.
108 మారులు సహస్రార చక్రములో ‘రాం’ ఉచ్ఛారణ చేయాలి. దీనివలన రవి దోషము తొలగును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
దీనివలన total nervous systems, మరియు semen count, improve అగును.
Brain hemorrhage తొలగిపోవును.
విద్యలో మాంద్యత , ఆధ్యాత్మిక
న్యూనత, మరియు. ఆర్ధిక
చిక్కులు తొలగిపోవును.
chanting పూర్తి అయిన తదుపరి,
సహజముద్రలో కూర్చొని ధ్యానము చేయవలయును.
ధ్యానము అనగా:
దీర్ఘముగా శ్వాస తీసుకొని, తన శక్తి కొలది,
కూటస్థములో అట్టెపెట్టవలయును. light కనబడితే lightలో, శబ్దము వినబడితే శబ్దములో
మమైకము అవ్వవలయును. రెండింటిలో ఏది ముందు
లభ్యమయితే దానిలో మమైకము అవ్వవలయును. రెండింటికీ ప్రయత్నమూ చేయరాదు.
దీర్ఘముగా నిశ్వాస తీసుకొని, తన శక్తి కొలది,
కూటస్థము లో అట్టెపెట్టవలయును. light కనబడితే lightలో, శబ్దము వినబడితే శబ్దములో
మమైకము అవ్వవలయును. రెండింటిలో ఏది ముందు
లభ్యమయితే దానిలో మమైకము అవ్వవలయును. రెండింటికీ ప్రయత్నమూ చేయరాదు.
సమాధి లభ్యమయిన యడల దానిలో మునిగిపోవలయును.
ఒక సంవంత్సరమునకు ఒక నిమిషముచొప్పున ధ్యానము
చేయవలయును. అనగా 40 సంవంత్సరముల సాధకుడు కనీసము 40 నిమిషములు ధ్యానము చేయవలయును.
Comments
Post a Comment