Chandra dosha in Telugu చంద్రదోషము

చంద్రదోషము




చంద్రదోష

కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, వాయుముద్రలో   చేయవలయును.
చూపుడువ్రేలు బొటనవ్రేలు మూలములో నొక్కిపెట్టి ఉంచవలయును.  మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.  
అనాహత చక్రము tense చేసి దానిమీద మనస్సు దృష్టి పెట్టవలయును. 
మనము ఇప్పుడు 108 మారులు అనాహత చక్రములో యంఉచ్ఛారణ చేద్దాము.
మనము ఇప్పుడు 108 మారులు అనాహత చక్రములో
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ             ఉచ్ఛారణ చేద్దాము.
దీనివలన చంద్రదోషము తొలగును.
అనాహత చక్రముఎడమ వయిపు అనగా ఇదా వయిపు తులా రాశి, మరియు కుడి  వయిపు అనగా పింగళ వయిపు వృశ్చిక రాశి ఉండును. రాశుల దోషములు కూడా తొలగును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
ఉబ్బసము, శ్వాస సంబంధిత రుగ్మతలు, పిచ్చి, వ్యాకులత, హృదయమునకు సంబంధించిన రోగముల నివారణ. రోగనివారణశక్తిని పెంచుట, రక్త శుద్ధీకరణ, ద్వేష మరియు నేరపూరిత భావనివారణ, ప్రేమ ఆప్యాతలను పెంచుట.
మానసిక సమస్యలు, వానిజ్యపరమయిన, మరియు ఉద్యోగ/వృత్తి సబంధమయిన సమస్యలు తోలిగిపోవును.
chanting పూర్తి అయిన తదుపరి, సహజముద్రలో కూర్చొని ధ్యానము చేయవలయును.
ధ్యానము అనగా:
దీర్ఘముగా శ్వాస తీసుకొని, తన శక్తి కొలది, కూటస్థము లో అట్టెపెట్టవలయును. light కనబడితే lightలో, శబ్దము వినబడితే శబ్దములో మమైకము అవ్వవలయును.  రెండింటిలో ఏది ముందు లభ్యమయితే దానిలో మమైకము అవ్వవలయును. రెండింటికీ ప్రయత్నమూ చేయరాదు.
దీర్ఘముగా నిశ్వాస తీసుకొని, తన శక్తి కొలది, కూటస్థము లో అట్టెపెట్టవలయును. light కనబడితే lightలో, శబ్దము వినబడితే శబ్దములో మమైకము అవ్వవలయును.  రెండింటిలో ఏది ముందు లభ్యమయితే దానిలో మమైకము అవ్వవలయును. రెండింటికీ ప్రయత్నమూ చేయరాదు. 
సమాధి లభ్యమయిన యడల దానిలో మునిగిపోవలయును.
ఒక సంవంత్సరమునకు ఒక నిమిషముచొప్పున ధ్యానము చేయవలయును. అనగా 40 సంవంత్సరముల సాధకుడు కనీసము 40 నిమిషములు ధ్యానము చేయవలయును.



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana