రుద్రాక్ష
రుద్రాక్ష
రుద్రాక్ష
రుద్రాక్ష
https://youtu.be/oWXrYTnuxXk
రుద్రాక్ష
క్రియాయోగ సాధకులు రుద్రాక్షలు ధరించవలసిన అవసరము లేదు.
రుద్రాక్ష అనేది ఒక పండు. దానిలో గుజ్జు మరియు దానిని cover చేస్తూ బయటి కవర్ ఉండును. ఇది ముఖ్యముగా హిమాలయ పర్వతములలోను, నేపాల్, ఇండొనీషియా, జావా మరియు జకర్తాలలో లభ్యమగును.
జబలోపనిషద్, పద్మపురాణం, శివపురాణం, మరియు దేవీ పురాణంమొదలగు వాటిలో వీటి ప్రస్థావన ఉన్నది.
రుద్రాక్ష పండు ఒకటి నుండి ఇరువదిఒకటి ముఖాలవరకు ఉన్నవి. అది ఆకుపచ్చని రంగులో ఉన్నది. ఎండిన తరువాత నలుపురంగుకి మారును. ప్రతి ముఖానికి దాని దాని చెట్టు ప్రత్యేకము.
తెలుపు, ఎరుపు, పసుపు, మరియు నల్ల రుద్రాక్షలు శాస్త్రాలలో చెప్పబడినవి. ఎండిన తదుపరి అన్నీ నల్ల రంగులోనే కనిపించును. అందువలన ఏది ఏ రంగో సరిగ్గా నిర్ణయించటము కఠినమయిన పనే.
రుద్రాక్షలకి అయస్కాంత శక్తి, మరియు విధ్యుత్ శక్తి ఉన్నది అని చెప్తారు. Shape & size ముఖ్యముకాదు. ముఖములనుబట్టి దాని ఖరీదు ఉంటుంది. ప్రకృతి సిద్ధముగా రుద్రాక్షలు వేడి. ధరించువారు భగవంతుని/పూజా మందిరములో ఉంచి ప్రతిరోజూ పూజించుట మంచిది.
ఇది/ఇవి ధరించుటకు, వయసు, కులము, జాతి, మతము, మరియు స్త్రీ పురుష బేధము లేదు. స్త్రీలు బహిష్టు లో ఉన్నపుడు, స్త్రీలు పురుషులు ఉభయులు మైలలలో ఉన్నపుడు, మలమూత్రాలు విసర్జించునప్పుడు ధరించుట ఉచితముకాడు. ఒక తరము నుండి ఇంకొక తరమునకు అందివ్వవచ్చు.
రుద్రాక్ష Elaeocarpaceae family కి సంబంధించినవి. చాలా వైద్య లక్షణములు కలిగిఉండి, ఆయుర్వేదములో ఉపయోగిస్తారు.
ఒక నీళ్ళ గ్లాస్ లో రెండు-మూడు-నాలుగు-అయిదు ముఖముల రుద్రాక్షలలో ఎదో ఒకముఖముగల రెండు రుద్రాక్షలు రాత్రంతా వేసిఉంచి, ఉదయము పరగడుపున త్రాగుటవలన blood pressure ఉపశమించును. shock వలన కలిగే హటాత్తుగా నరముల బలహీనత, శరీరము స్పృహ కోల్పోవుట, మొద్దుబారుట, చేతన తప్పుట, ఇత్యాది సమయములలో ఆ రోగి రెండుఅరచేతులలో అయిదు ముఖముల రుద్రాక్షలు వేసి గట్టిగా నీ కుడిఅరచేతితో నొక్కించటము చేస్తే వెంటనే ఉపశమనము చెందుతుంది.
పన్నెండు సంవత్సరములలోపు పిల్లలు రుద్రాక్షలు వాడకూడదు. రుద్రాక్షలువేసికొని స్మశానములోనికి వెళ్ళరాదు.
రుద్రాక్షను పరీక్షించే పధ్ధతి:
1)నీళ్ళతో పరీక్ష: రుద్రాక్షను నీటిలో వేసినప్పుడు మునిగితే మంచిది, తేలితే మంచిది కాదు.
2) రాగి బిళ్ళతో పరీక్ష: రెండురాగి బిళ్ళలమధ్య రుద్రాక్షను వేసి నెమ్మదిగా వత్తిడి తెచ్చినప్పుడు, కుడివయిపుకు తిరిగితే మంచిది, లేనియడల మంచిది కాదు.
3) పాలతో పరీక్ష: ఆవుపాలగ్లాసులో రుద్రాక్షను ఉంచి 48 గంటల తరువాత పరీక్షిస్తే పాల రంగు మారకుండా రుద్రాక్ష తన base మీద నిలబడి ఉంటె మంచిది, లేనియడల మంచిది కాదు.
రుద్రాక్ష ప్రభావాలు:
1. ఏకముఖి: మంత్రము: ఓం హ్రీం నమః
ఏకముఖి శుద్ధ చేతనకు ప్రతీక. రాజా జనకుడి మాదిరి ఇది ధరించినవానికి భౌతిక మరియు ఆధ్యాత్మిక ఉపయోగములు రెండూ కలుగును. భౌతిక ఆనందం అనుభవిస్తూనే తగులము లేకుండా ఉండును. వైద్యులు ధరించినయడల సరిఅయిన రోగనిర్ణయము చేయుటకు సహకరించును.
2. ద్వి ముఖి: మంత్రము: ఓం నమః
ఇది అర్థనారీశ్వర తంత్రమును ప్రతిబింబించును. ఇది ధరించిన
భార్యా-భర్త, గురు-శిష్య, తల్లీ తండ్రి- పిల్లలు, విడిపోయిన స్నేహితులు, తిరిగి కలియిదురు.
3.త్రిముఖి: మంత్రము: ఓం క్లీం నమః
ఈ రుద్రాక్ష అగ్నిదేవునికి ప్రతీక. ఏ విధముగా అగ్ని కట్టెలను కాల్చి బూడిద చేయునో, అదే విధముగా దీనిని ధరించినవారు, పాపపు పనులు, మరియు తప్పులనుండి బయటపడి స్వచ్ఛతవయిపుకు మళ్లుతారు. ఇది మనిషిలోని తక్కువతనము, తప్పుచేశాననే భావము, భయము, మరియు depression నుండి బయట పడవేయును.
4. చతుర్ముఖి: మంత్రము: ఓం హ్రీం నమః
ఈ రుద్రాక్ష సృష్టికర్త బ్రహ్మకి ప్రతీక. దీనిని ధరించిన విద్యార్ధులు, కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు, మరియు వేదాంతులు, ఇత్యాదులు తమ తమ సృజనాత్మకశక్తిని పెంపొందించు కొనుటకు అవకాశము లభించును.
5. పంచముఖి: మంత్రము: ఓం హ్రీం నమః
ఈ రుద్రాక్ష లయకర్త శివునికి, మరియు పవిత్రతకి ప్రతీక. ఇది ధరించిన మనిషికి ఆరోగ్యము, శాంతి, blood pressure, మరియు హృదయ సంబంధమయిన సమస్యలు, శాంతించును. జపమునకు కూడా ఇది మాలగా ఉపయోగించును.
6. షన్ముఖి: మంత్రము: ఓం హ్రీం హూం నమః
ఈ రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. ఇది ధరించిన మనిషికి తెలివి, స్థిరమనస్సు, మరియు శుద్ధ జ్ఞానము పొందుటకు సహకరించును. వ్యాపారవేత్తలు, executives, journalists, editors, Manage -ment people ధరించిన మంచిది. వీర్యమువృద్ధి చేయును.
7. సప్తముఖి: మంత్రము: ఓం హూం నమః
ఈ రుద్రాక్ష మహాలక్ష్మి దేవతకి ప్రతీకగా ధరిస్తారు. ఇది ధరించకుండా నగదుపెట్టెలో ఉంచుతే మంచిది. ఆర్ధిక పరిస్థితి మెరుగు పరుస్తుంది.
8. అష్టముఖి: మంత్రము: ఓం హూం నమః
ఈ రుద్రాక్ష వినాయుకినికి ప్రతీకగా ధరిస్తారు. దీనిని ధరించిన వారు అన్ని విఘ్నములను వారించుకోగలుగుతారు. మంచి అదృష్టమును పొందుతారు. వృద్ధి, సిద్ధి, మరియు achievement కలుగుతుంది.
9. నవముఖి: మంత్రము: ఓం హ్రీం హూం నమః
ఈ రుద్రాక్ష శక్తికి ప్రతీకగా ధరిస్తారు. దీనిని ధరించిన వారు శక్తి పొందుతారు.
10. దశముఖి: మంత్రము: ఓం హ్రీం నమః
ఈ రుద్రాక్ష విష్ణువుకి ప్రతీకగా ధరిస్తారు. దీనిని ధరించిన వారు వారికి వారి వారి పిల్లలకి తిండికి కొదువ వుండదు.
11. ఏకాదశిముఖి: మంత్రము: ఓం హ్రీం హూం నమః
ఈ రుద్రాక్ష హనుమంతునికి ప్రతీకగా ధరిస్తారు. దీనిని ధరించిన వారు జ్ఞానము, సరిఅయిన నిర్ణయము తీసికొనుట, మంచి వక్త, భయము లేకుండుట, విజయము, సాహసోపేతమయిన జీవితముగా రూపొందించు కొనుటలలో సాధ్యము పొందుతారు. ధ్యానము చేసే వారు దీనిని ధరించుట చాలా మంచిది.
12. ద్వాదశిముఖి: మంత్రము: ఓం క్రోం క్షోం రోం నమః
ఈ రుద్రాక్ష సూర్యునికి ప్రతీకగా ధరిస్తారు. దీనిని మంత్రులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, administrators, and executives ధరించుట ఉత్తమము.
13. త్రయోదశిముఖి: మంత్రము: ఓం హ్రీం నమః
ఈ రుద్రాక్ష ఇంద్రునికి ప్రతీకగా ధరిస్తారు. దీనిని ధరించిన వారికి సమస్త సదుపాయములు లభించును.
14. చతుర్దశిముఖి: మంత్రము: ఓం నమః
ఈ రుద్రాక్ష పవిత్రమయినది. సాధకుని మూడవ కన్ను తెరుచు కొనును. ధరించినవాడు భవిష్యత్ చెప్పుటకు అర్హత పొందుతాడు.
15. పదిహేను నుండి ఇరువది ఒక్కటి ముఖములవరకు ఉన్న రుద్రాక్షలకు పూజామందిరములో ఉంచుట మంచిది. వీటికి మంత్రములు ఉండవు.
16. గౌరీశంకర్: ఓం గౌరీశంకరాయ నమః
సంసారజీవితము నుండి విరక్తిచెందినవారు ధరించే రుద్రాక్ష ఇది. ప్రక్రుతి పురుషులు ఇద్దరి ఆశీస్సులు దీనిని ధరించిన వారు పొందుతారు.
రుద్రాక్ష ధరించుటకు నియమములు:
1) పొగత్రాగువారు, త్రాగుబోతులు, మాంసాహారులు, మరియు కాముకులు, ధరించరాదు. వీటిని వదిలిన వారు రుద్రాక్షను ధరించవచ్చు.
2)మాల రుద్రాక్షను మెడలో వేసికొనకూడదు. 54 లేక 108 రుద్రాక్షలు జపమాలగా ఉపయోగించాలి.
3) నిద్రలో ఉన్నప్పుడు మాల రుద్రాక్షను మెడలో వేసికొనకూడదు.
4) ప్రతి వారము మాల రుద్రాక్షను నీళ్ళతో శుభ్రము చేసికొన వలయును.
5) మహాశివరాత్రి, సోమవారము, మరియు మంగళవారము దినములలో మందిరమునకు తీసికొని వెళ్ళవలయును. రుద్రాభిషేకము అయిన తదుపరి తిరిగి వేసికొనవలయును.
6) బంగారము, వెండి, రాగి, ఎరుపు, మరియు నలుపు దారములు రుద్రాక్షలు నేయుటకు ఉపయోగించవచ్చు.
7) లగ్నరాశి, నక్షత్రమును అనుసరించి రుద్రాక్షలు ఉపయోగించవలయును.
గ్రహాధిపతి
|
ముఖము
|
రవి
|
ఏక లేక ద్వాదశ ముఖి
|
చంద్ర
|
ద్విముఖి
|
బుధ
|
త్రిముఖి
|
గురు
|
పంచముఖి
|
శుక్ర
|
షణ్ముఖి
|
శని
|
సప్త లేక చతుర్దశ ముఖి
|
రాహు
|
అష్ట
ముఖి
|
కేతు
|
నవ
ముఖి
|
గమనిక: 10 లేక 11 ముఖముల రుద్రాక్షలు ఏ గ్రహము వలనను ప్రభావితము చెందవు.
Comments
Post a Comment