SriKrishnashtami—श्रीक्रृष्णाष्टमि—శ్రీకృష్ణాష్టమి
4.శ్రీకృష్ణాష్టమి—దక్షిణాయణం—వర్షఋతువు—శ్రావణమాసము—బహుళ పక్షము —అష్టమి
శ్రీకృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి నాడు వస్తుంది. పరమాత్మశ్రీకృష్ణ జన్మదినము అగుట వలన దీనిని జన్మాష్టమి లేదా గోకులాష్టమి అనికూడా అంటారు.
శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకీమాత శరీరమునకు ప్రతీక. తండ్రి వాసుదేవుడు ప్రాణశక్తికి ప్రతీక. శరీరమునందు ప్రాణశక్తి పెరిగినప్పుడు ఆనందం అనగా శ్రీకృష్ణుడు పుడతాడు. కాని అహంకారము అనగా
కంసుడు ఆ ఆనందమును తీసివేయుటకు ప్రయత్నము చేస్తుంది. దేవకీ సోదరుడు అయిన కంసుడు శరీరము అనగాదేవకీమాత ఏర్పడినపుడే దానితోపాటే పుడతాడు. సుఖము, సంతోషము,
మరియు ఆనందకరమయిన శరీరము ఇతరులకు హాని చేకూర్చదు. సుఖ సంతోషములు
లేనివాడే ఇంకొకరి అనర్థమునకు హేతువు. ప్రేమ, సర్వసాధారణత్వము,
మరియు ఆనందములకు ప్రతీక అయిన శ్రీకృష్ణుని ముందర అహంకారము(కంసుడు) కరిగి లేక వీగిపోతుంది.
అహంకారము ఎక్కువయినపుడు ఈ శరీరము ఒక కారాగారములాగా
ఉంటుంది. శ్రీకృష్ణుడు కారాగారములో దేవకికి జన్మిస్తాడు. అప్పుడు కావలివాళ్ళు
నిద్రపోతూ ఉంటారు. అనగా ప్రేమ, సర్వసాధారణత్వము, మరియు
ఆనందములకు ప్రతీక అయిన శ్రీకృష్ణుని జన్మ కావలివాళ్ళు అనగా ఇంద్రియములను
అంతర్గతము చేస్తుంది. బహిర్గతము అయిన ఇంద్రియములు అహంకారమునకు ప్రతీక. అనగా
మేల్కొన్న ఇంద్రియములు అహంకారమునకు ప్రతీక.
శుద్ధ జ్ఞానము వెన్నకు ప్రతీక. వెన్న ఆరోగ్యమునకు, పౌష్టికతకు ప్రతీక. ఆ వెన్న అనగా
శుద్ధజ్ఞానమును దొంగిలించినవాడే లేదా దొంగిలించేవాడే శ్రీకృష్ణుడు. అటువంటి శుద్ధజ్ఞానమునకు
పరాకాష్ఠ అయిన శ్రీకృష్ణుడు నిర్వికల్పుడు, నిరాసక్తుడు, మరియు నిర్విషయాసక్తుడు.
ఆయన ధరించే నెమలి కన్ను పింఛము మూడవనేత్రము అయిన
శ్రీకృష్ణ చైతన్యమునకు ప్రతీక. శవమునకు ఆలోచనలు రావు. ప్రాణశక్తి లేదా శ్రీకృష్ణ చైతన్యము వచ్చిపోయే శరీరము మంగళకరమయినది. ఆ శరీరమునే శివము అందురు. ఆ శివములోని ఆలోచనలు గోప్యముగా ఉండును. గోప్యముగా ఉండు ఆలోచనలను గోపికలు అందురు. ఆ ప్రతి గోపిక వెనకాల శ్రీకృష్ణుడు లేదా శ్రీకృష్ణచైతన్యము ఉండితీరవలసినదే. అవి పదహారువేలు ఉండును. ఇది షుమారుగా
చెప్పినది. ఆలోచనలను అనగా గోపికలను ఎవ్వరూ లెక్క పెట్టి చెప్పలేదు. శ్రీకృష్ణునికి పదహారువేలమంది గోపికలు అంటే ఇది అర్ధము.
జన్మించిన ప్రతిజనుడు లేదా మనిషి ఆనందముతో ఉండవలెను
అని చెప్పుటకు ఉద్దేశ్యించబడినదే ఈ జన్మాష్టమి. దానికై సహకరించునది
క్రియాయోగము.
4.SriKrishnaashtami—Varsharutu—Shraavanamaas—Baulapaksh—Ashtami.
4.Sri Krishnaashtami, is celebrated on Varsharutu,
Shraavanamaas, Baulapaksh, and on Ashtami thithi. It is the birth day of
Paramaatma Shree Krishna, and therefore it is celebrated as Sree
Krishnaashtami, Janmaashtami, or Gokulaashtami.
Devaki Mata is the mother of Sree Krishna.
Devaki Mata is the replica of body. Vasudeva is the father of shree Krishna.
Vasudeva is the replica of life force. When there is a growth of life force in
the body then the birth of Ananda i.e. Shree Krishna is born.
Kamsa is the brother of Devaki and is the maternal
uncle of Krishna. Kamsa is a replica of
ego. Ego always tries to eradicate the happiness. When man is born with
physical boy he will have Ego simultaneously. The body born with Happiness, and
joy shall not cause any harm to others. The body which is deficient with
happiness and joy only shall intend to cause harm. The love, and
simplicity(Krishna) shall always be victorious over ego(Kamsa).
When ego is predominant this body resembles a jail.
Shri Krishna is born to Devaki in the jail. Then the watchmen will be in deep
slumber. That means the advent of love, and simplicity(Krishna) shall make the
senses to sleep/inactive. The active senses represent ego.
Pure wisdom is the replica of Butter. Butter is the replica of health and
nourishment. Krishna steals that butter i.e., pure wisdom. Krishna is the wisdom
personified. As such he is desire less, and uninterested in the objects of the
senses.
The peacock eyed feather is the replica of third
eye/Shri Krishna consciousness.
Dead body or Savam in Sanskrit will not have any
thoughts. The body which breaths in and breaths out life force is auspicious or
sacred. That body is called Shivam in Sanskrit. This body will
have thoughts. These thoughts are not known to anybody other than him. These
thoughts are called Gopyam in Sanskrit as such they are called Gopikas. There will/must
be Shri Krishna consciousness behind
each and every thought i.e., Gopika. They are approximately sixteen thousands.
This no body has counted and no body can count also. Its real meaning is
several. This is the meaning of Krishna is having sixteen thousands Gopikas.
Each and every human being
bound to have joy and happiness. Janmashtami is meant for this. Kriyayoga helps
us to be like this.
4.
श्रीक्रृष्णाष्टमि—दक्षिणायाण—वर्षऋतु—श्रावणमास—बहुळपक्ष—अष्टमी
दक्षिणायाण, वर्षऋतु, श्रावणमास, बहुळपक्ष, अष्टमी तिथि में श्रीक्रृष्णाष्टमि, को उत्सव बनाते है! इस
श्रीक्रृष्णाष्टमि को जन्माष्टमी व गोकुलाष्टमी का नाम में भी बनाते है!
श्रीक्रृष्ण का माता
देवकी माता शरीर को प्रतीक है! पिताश्री वासुदेव प्राणशक्ति को प्रतीक है! शरीर का
अंदर प्राणशक्ति वृद्धि होनेसे आनंद व श्रीक्रृष्ण का जन्म होता है! परंतु अहंकार
व कंस उस आनंद को भ्रष्ट करने के प्रयास करेगा! देवकी का सहोदर
कंस शरीर व देवकी माता का साथ ही आविर्भाव होताहै! सुख, संतोष, और आनंददाई शरीर
दूसरो को हानी नहीं पहुम्चादेगा! जिसका पास सुख और संतोष नहीं है वह
मनुष्य ही दूसरो का अनर्थ का हेतु है! प्रेमा, सर्वसाधारणत्व, और आनंद का प्रतीक श्रीक्रृष्ण है! श्रीक्रृष्ण का सामने अहंकार
व कम्स पिघल जाएगा!
अहंकार
अधिकतर होनेपर इस शरीर ही एक कारागृह जैसा लगेगा! श्रीक्रृष्ण कारागृह में
देवकी का गर्भ में जन्म लेता है! उस समय में चौकीदार लोग सोते है! इस का तात्पर्य
प्रेम, सर्वसाधारणत्व, और आनंद का प्रतीक
श्रीक्रृष्ण चौकीदार लोग का निद्रा का हेतु होता है! चौकीदार लोग का तात्पर्य
इम्द्रियो को अंतर्गत करेगा! बहिर्गत हुआ इम्द्रियो अहंकार का प्रतीक है!
जागृति हुआ इम्द्रियो अहंकार का प्रतीक है!
शुद्ध ज्ञान
मक्खन का प्रतीक है! मक्खन आरोग्य और पौष्टिकता का प्रतीक है! उस मक्खन व
शुद्धज्ञान को चुरानेवाले ही श्रीक्रृष्ण है! वैसा शुद्धज्ञान का
पराकाष्ठा श्रीक्रृष्ण है! वह निर्विकल्प, निरासक्त, और निर्विषयासक्त है!
वह श्रीक्रृष्ण धरा मोर का
पंख तीसरा नेत्र व श्रीक्रृष्ण चैतन्य का प्रतीक है! शव का विचारे नहीं होते है!
शरीर का अन्दर आने जाने वाले प्राणशक्ति मंगळकर है! वैसा शरीर को शिव कहते है! उस
शिव का अन्दर का विचारे गोप्य होते है! वैसा गोप्य विचारे को गोपिका कहते है! हर एक गोपिका का
पीछे श्रीक्रृष्ण चैतन्य होना ही चाहिए! गोपिकाये सोलह हजारे है! यह किसी ने
गिना नहीं है! अंदाज से कहा है क्योकि गोपिकाये व विचारे को कोई भी नहीं गिनसकेगा!
श्रीक्रृष्ण का सोलह हजारे गोपिकाये का अर्थ ये ही है!
जन्म लिया हर एक मनुष्य
आनंद से रहना चाहिए! इस के लिए उद्देश्यित है यह जन्माष्टमी! इसके लिए सहकार
करनेवाला क्रियायोग है!
Comments
Post a Comment