ONAM ओणम् ఓనం
ఓనం:
శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని వామనుని అవతారములో వచ్చి మూడు అడుగుల భూమిని దానముగా ఇవ్వమని అడుగుతాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినక మూడు అడుగుల భూమిని దానము ఇస్తాడు బలిచక్రవర్తి.
ఇక్కడ వా అనగా వరిష్ఠ అని అర్థము. మన అనగా మనస్సు అని అర్థము. వామన అనగా వరిష్ఠ మనస్సు అని అర్థము. అనగా స్థిరమైన మనస్సు అని అర్థము. స్థిరమైన మనస్సుకి మూడు అడుగులు అనగా అడగటములు అవసరము. సాధకునికి మూడు విధములయిన ఆటంకములు వస్తుంటాయి. అవి ఆదిభౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక ఆటంకములు.
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు, ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి.
అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయముల యందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈ రకములయిన విషయములను వైరాగ్యముతో అణగ త్రొక్కవలయును. పరమాత్మని ప్రార్థించి మూడు అడగటములు చేయవలయును. అవే ఈ మూడు అడుగులు. ఏది చేసినా పరమాత్మే. కనుక ఆయనే ఈ మూడు అడుగులు సాధకుడిని అడుగుతాడు. సాధకుడు తీవ్ర ధ్యానములో ఉన్నప్పుడు ఆంగుష్ఠ ప్రమాణములో కూటస్థములో సూక్ష్మ రూపములో వామనుడిగా తన స్వస్వరూపము కనబడుటే దీనికితార్కాణం.
బలి అనగా వైరాగ్యముతో అణగ త్రొక్కుట.
రాగ్యము అనగా మోహము. ప్రతి వ్యక్తికీ రాగ్యము ఉందును. వైరాగ్యము అనగా వైవిధ్యమయిన రాగ్యము అని అర్ధము. ఆ వైవిధ్యమయిన రాగ్యము అనగా వైవిధ్యమయిన మోహము పరమాత్మపయిన ఉండుటయే వైరాగ్యము.
చక్రవర్తి అనగా ఆలోచనా వృత్తులు వర్తులాకారముతో చక్రములాగా వస్తూ ఉంటాయి. బలి చక్రవర్తి అనగా వర్తులాకారములో వస్తున్న ఆలోచనలను వైరాగ్యముతో అణగ త్రొక్కుట. శుక్రాచార్యుడు అనగా అహంకారమును ఆచరించేవాడు. కామ, క్రోధ, లోభ, మోహ,మద మరియు మాత్సర్యములకు కారణభూతమయిన అహంకారమును త్యజించుటే బలి. వీటిని మనలోనే ఉంచుకొని వాటికి అతీతముగా సాధకుడు ఎదగ వలయును.
మనలోనే ఉంచుకొనటమే పాతాళానికి అణగ త్రొక్కుట. పాతాళము అనగా ఎక్కడోలేదు., మనలోనే ఉన్నది. అతీతము అనగా అవి మనలోనే ఉంటాయి.
కానీ వైరాగ్యముతోవాటిని అధిగమించి వాటికి అతీతముగా సాధకుడు ఎదుగుట.
ఓనం మళయాళ దేశములో వారి పంచాంగము(కొల్లవర్షం) ప్రకారము వారి సంవత్సరములో మొదటి మాసమయిన చింగం మాసములో శ్రావణ నక్షత్రము ప్రకారము దాదాపుగా పదిరోజులు జరుపుకుంటారు. ఇది తెలుగు పంచాంగము ప్రకారము శ్రావణ మాసములో శ్రావణ శుక్ల పంచమి నుండి శ్రావణ శుక్ల త్రయోదశి వరకు జరుపుకుంటారు.
ONAM
Sri
Mahavishnu comes in the guise of a dwarf, Vamana Avatar, and requests Emperor
of Demons, Bali, to donate three feet/steps of land. In spite of denial by Shukracharya, the Guru
preceptor of Rakshasas, the Demons, Bali
donates three feet of land as promised.
The
Vamana, Shree Mahavishnu, magically grows his foot /step infinitely. He keeps
first foot/step of infinite measurement covering the whole earth, second
foot/step covering the whole Space. HE asks Bali as to where to keep His third
foot /step. As desired by Bali Shree Mahavishnu keeps His third foot /step on
MahaBali, the Great emperor, and pushes him to Patala, the abyss. Patala is the
region underneath the earth.
VA means Varishta, the great or steady, MANA
means Mind. Vamana means the steady
Mind. For steady mind three feet/steps are required.
Sadhak,
the Meditator or kriyayoga sadhak confronts three steps during his Sadhana.
They are 1)Adibhautika, Physical, 2) Adidaivika, Subtle, and 3) Adhyatmika,
Spiritual.
a)Adibhautika, Physical: —Bodily pains etc.,
b)Adidaivika,
Subtle: — Mind related problems like thoughts, sub thoughts etc.,
c)
Adhyatmika, Spiritual: — Sadhana related problems like Sleep, lazyness etc.
These
are called Mala, Aavarana and Vikshepana Doshas, faults. Sadhak, Kriyayogi, seeing unity with
Parabrahman, shall be cautious about these things. To make mind steady one has
to annihilate these three faulty steps. One should pray God to make his Sadhana
a success by keeping these three falts away from him. Everything is God and so everything is under
His control. God is tangible and also
intangible. So He Himself will come in some Avatar, form, and helps the ardent
Meditator or kriyayoga sadhak in his Sadhana by asking him to part with these
three faults.
Sadhak
shall find his own replica in a miniature form measuring upto his thumb in
Kootastha, the space between the eye brows on the forehead during the intensity
of Sadhana. This miniature form is Vamana.
Bali means to do away the wants with dispassion.
Chakra means thought Circles. Varti means business/ profession.
Chakravarti means
the mind professed with wants and thought circles. Bali Chakravarti means to do
away the mind professed by wants and thought circle with dispassion.
Sukracharya means the follower of Ego. It is the source of Kama, Krodha, Lobha, Moha, Mada and Matsarya.
Sacrificing these is BALI. The Sadhak has to grow beyond these vices in him. To
keep them within ourselves without following them is pushing them into the
Abiss, Patala. Patala is not anywhere else. It is in us only. To grow beyond these sense wants with
dispassion is what is required.
ओणम्
श्री महाविष्णु वामनावतार में बलि चक्रवर्ती को तीन कदम् /फूट का जमीन दान माँगता है! राक्षस गुरु
शुक्राचार्य इंकार करने से भी नहीं सुनके वाग्दान का मुताबिक़ चक्रवर्ती दान देदेते
है!
वा का अर्थ वरिष्ठ, मन का अर्थ मनस्, वरिष्ठ मनस् यानी स्थिर मनस् है!
स्थिर मनस् के लिए तीन कदम् का अवसर है! साधक अपना साधन में तीन
प्रकार का अवरोध, आदिभौतिक, आदिदैविक, और आध्यात्मिक, आते है!
आदिभौतिक अवरोध का अर्थ शरीरक रुग्मतायें, आदिदैविक अवरोध का अर्थ मानसिक
रुग्मतायें, और आध्यात्मिक का अर्थ ध्यानसम्बंधिता रुग्मतायें, है!
इन्ही को मल, आवरण और विक्षेपण दोषों कहते है!
शरीरक रुग्मतायें का मतलब ज्वर, शिरदर्द, बदन का दर्द इत्यादि!
मानसिक रुग्मतायें, का मतलब मन का संबंधित विचारों इत्यादि!
ध्यानसम्बंधिता रुग्मतायें का मतलब निद्रा, तन्द्रा, आलसीपन
इत्यादि!
क्रिया योग साधक परमात्मा में ऐक्यता होनेके लिए ए उप्पर दिया हुआ तीन
प्रकार का अवरोधों का बारे में सावधान रहना चाहिए! इन तीनों को वैराग्य से दूर
करके स्थिर मन लभ्य करना चाहिए! परमात्मा से प्रार्थना करके ए तीनों कदम् पार करने
का माँगना चाहिए! ऐसा माँग ही तीन कदम्!
सब कुछ परमात्मा हे करता है! वे परिच्छिन्न भी है और
अपरिच्छिन्न भी है! परामात्मा ही साधक का साधना तीव्रतम होगा तब ए तीन
कदम् मांगेगा! तीव्रध्यान में अँगुष्ठ प्रामाण में सूक्ष्मरूपी वामन का दर्शन
कूटस्थ में होना ही इस का निदर्शन है! ए सूक्ष्मरूपी वामन साधक का स्वस्वरुप
है!
साधक अपना अंदर का इन्द्रिय विषय वांछोम् को वैराग्य से दूर करना ही
बलि है! विचारधारा वर्तुलाकार में (चक्र)
आना उनका वृत्ति (वर्ती) है! ए ही चक्रवर्ती का अर्थ है! वर्तुलाकार चित्त
वृत्तियों को वैराग्य से दूर करना ही बलि चक्रवर्ती का अर्थ है!
राक्षसगुरू शुक्राचार्य अहंकार को पालन करनेवाले है! काम, क्रोध, लोभ, मोह, मद, और मात्स्र्योम् को मूलकारण अहंकार को
त्यजना ही बलि है! पाताललोक कही और नहीं है, हमारा अंदर ही है! इन्द्रिय विषय वांछोम्
को वैराग्य से उन से अतीत होना ही साधक का आध्यात्मिक अभिवृद्धि है!
Comments
Post a Comment