GuruPoornim—गुरुपूर्णिमा— గురుపూర్ణిమ


3) గురుపూర్ణిమ:
గురుపూర్ణిమదక్షిణాయణంగీష్మఋతువుఆషాఢమాసముశుక్ల పక్షము పూర్ణిమ
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. సనాతనులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
 ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది సనాతనులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు.
సనాతనధర్మములో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
 గురు లేదా గురువు ( गुरुవిద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం సనాతన సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని  మార్గదర్శికత్వము అందించేవాడు. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ.  తల్లి (Mother) తొలి గురువు.
శాంతోదాంతఃకులీనశ్చవినీతఃశుద్ధవేషవాన్
శుద్ధాచారసుప్రతిష్టఃశుచిర్దక్షఃసుబుద్ధిమాన్
ఆధ్యాత్మజ్ఞాననిష్ఠశ్చమంత్రతంత్రవిశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.
అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్థనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.
భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు.  కుమారస్వామికూడా గురువు.  విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద  బలరామ కృష్ణులు పరశురాముని వద్ద భీష్ముడుద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులువీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్యరామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. 
గురువును స్మరించే కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు
గురుర్బ్రహ్మాగురుర్విష్ణుఃగురుర్దేవోమహేశ్వరః
గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీగురవేనమః

అజ్ఞానతిమిరాంధస్యజ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః
గురువుపట్ల ఎలా మెలగాలో ఈ పద్యం చెబుతుంది.
గురుమూర్తి వచ్చుచో గూర్చుండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు
గురునింద వినరాదు కూడి సేయగరాదు గురునికప్రియమును గూర్చరాదు
సద్గురువిడిన శాసనము మీరగరాదు హెచ్చిదా గురుని శాసింపరాదు
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు

శ్రీగురుమూర్తి చేరినంతనె నమస్కారము ముందుగా సలుపవలయు
లజ్జాభిమాన కులంబు వీడి పాదచారియై సద్భక్తి చేరవలయు
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును
గురునాజ్ఞ వర్తించి గురుడిచ్చు తృణమైన మేరువుగా నెంచి మెలగవలయును
గురుని ప్రభువంచు స్వామి దేవర యటంచు బిలుచుచు లోభ గుణముల దొలచవలయును
 "శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా వ్రాశాడు[1]. -
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
సూచక గురువు - చదువు చెప్పేవాడు
వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -
స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) బ్రహ్మ దీక్ష
3) GuruPoornima:
GuruPoornim—Dakshinaaayanam—Greeshmarutuvu—Ashaadhamaas  —Shuklapaksh—Poornima
GuruPoornim comes in Dakshinaaayanam, Greeshmarutuvu, Ashaadha maasam, Shuklapaksh, and on Poornimama and that too Thithi. 
To respect and adore Gurus, Teachers, and elders is the customary procedure in sanatana dharma in general and that too on this day in
particular. Sanatana dharma followers shall celebrate every year  this day as Guru Poornima or Vyaasa Poornima. This particular day the Gurus are worshipped and they give gifts to them, and obtain their blessings. The Gurus will bestow the magnitude and direction to their respective disciples so that they will be lead to liberation.
The birthday of VyasaMahaRishi on this day as such this day is celebrated as Vyasa Poornima.
Today so many will observe fast throughout day from sun rise to Moon rise. Some sanatana dharma people will keep their association with Gurus incessantly through out their respective lives.
Gu=Ignorance   Ru= wisdom, the Guru will lead the disciple from ignorance to wisdom.
Guru is the mediator between the devotee and God. Vedavyasa is the best mediator between the God and the mankind as such he is deemed to be Guru of each and everybody.  The other name of of Veda Vyasa is Krishna Dwaipaayana. He has organised the sporadic Vedic scriptures systematically into Four Vedas. As such he is being respectfully called as Veda Vyasa since then. On this Guru Poornima day special prayers are done in Temples. Some people do Satyanarayana Pooja.
Guru is considered and revered as trinity of Brahma, Vishnu, and Maheswara. In the life of each and everybody, the role of Guru is unique. Mother is the first and foremost Guru.  
Saantodaantah kuleenascha vineetah shuddhaveshavaaan
Shuddhaachaarasuprathistah shchirdakshah subuddhimaan
Aadhyaatmagnaananishtashcha mantratantra vishaaradah
Nigrahaana graheshakto gururityabhidheeyathe 
He is peaceful, controller of senses, noble,  humility personified, orderly, follower of good customs, good personation, sublimation, auspicious, smart and intelligent, expert in mantras and Tantras,  and giver of sense control.
Spiritually, and socially there is lot of  importance to Guru in Bharat.   Matrudevo bhava, Pitrudevo bhava, and aacharyadevo bhava.
We worship Gurudev as God the Father. To give Guru dakshina or donation after the completion of education is customary in Bharat.  We pray our Guru in our daily prayers.
Sadasiva is our Prathama Guru i.e., our first/initial Guru. He is also called Dakshinaamurty. Several Great personalities became successful with the kind grace of Guru. We must bow before Guru. We must take his orders and execute them.
The person whose form remain in your mind, the sage who preaches you the good way, the person who removes all your doubts, the person whose presence gives you peace of mind and pleasure, the person on whom your confidence fortifies, that auspicious person is your Guru.  
There are seven types of Gurus. They are:
Soochakaguru—who gives you education.
Vaachakaguru—who teaches you about the duties of Ashramam i.e., Baalya, Youvana, Kaumaara, and Vaardhakya.
BodhakaGuru—who bestows you the mahamantraas,
Nishiddhaguru—who teaches you about vasikarana, and maarana prayogas,
Vihitaguru—who makes you disattachment over desire,
Kaaranaguru—who preaches you about the unity of soul with spirit,
Paramaguru—who makes you to have a practical perfect perfection of unity of soul with spirit.
Guru will give you
1)Sparsha deeksha, 2) dhyana deeksha, 3) Drugdeeksha, 4) Brahma deeksha.
3)गुरु पूर्णिमा:
गुरुपूर्णिमादक्षिनायणग्रीष्म ऋतुआषाढ़मॉसशुक्लपक्षपूर्णिमा
दक्षिणायाण, ग्रीष्म ऋतु, आषाढ़मॉस, शुक्लपक्ष, पूर्णिमा तिथि में गुरुपूर्णिमा का त्यौहार  बनाते है!
गुरुओं, उपाध्यायों, और बुजुरुगो को आदर करके पूजा करने का दिन को गुरुपूर्णिमा, अथवा व्यासपूर्णिमा का नाम से पुकारते है! सनातनो हर एक साल को अषाढशुद्ध पूर्णिमा के दिन गुरुपूर्णिमा का नाम से बनाते है! आज का दिन गुरु पूजा उत्सव बानाके गुरुओं को उपहार समर्पण करते है, उन को सत्कार करते है, और उन का आशीर्वाद पाते है! वे गुरुओं अपना जीवन का मार्गदर्शन करके उन को मुक्ति मार्ग में चलाते है!
आज का दिन व्यास महामुनि का जन्म दिन वा आविर्भाव दिन जिस का हेतु इस दिन को व्यास पूर्णिमा का नाम से बनाते है! 
सूर्योदय से लेकर चंद्रोदय तक व दिन भर उपवास करते है! चंद्रोदय का पश्चात पूजा सब समाप्त करके उपासको आहार ग्रहण करते है! गुरु का अर्थ आध्यात्मिक ज्ञान प्रासादी है! इस का हेतु बहुत सारे सनातानो जीवन का अंत तक गुरु का साथ अनुबंध रखते है!
सनातनधर्मं में भगवान आयर भक्त का बी च में गुरु ही अनुसंथानकर्ता है! वेदव्यास मानवजाति को अच्छा आध्यात्मिक वारसत्व को बचाके रखा है, जिसका हेतु वे पूरा मानवजाती का गुरु इति भावना करते है! पूर्वाश्रमम में वेदव्यास का नाम कृष्णद्वैपायन था! वेदकाल संस्कृति को चार वेदों में संकलन किया है, जिसका हेतु उस को वेदव्यास नाम से पुकारते है!
दक्षिणभारत में कुछ कुछ प्रदेशों में इस गुरुपूर्णिमा व्रत को आदिशक्ति का नाम से आचरण करते है! इसी दिन कुछ लोग सत्यनारायण व्रत व पूजा भी करते है!
सृष्टि,स्थिति, और लय स्वरुप/कारक त्रिमूर्ति है! वैसा गुरु को त्रिमूर्ति स्वरूप करके भावना करना, और आराधना करना सनातन सम्प्रदाय है!
हर एक व्यक्ति का जीवन में गुरु का पात्र गणनीय है! गु= अंधकार/अज्ञान से रु= ब्रह्मा विद्या प्रकाश/ज्ञान में लानेवाला गुरु है! गुरुपूर्णिमा का दिन गुरु को स्मरण करके बड़ा पार करना हमारा रिवाज है! 
हमारे प्रप्रथम गुरु हमारा माता ही है!
शान्तोदांतः कुलीनश्च विनीतः शुद्धावेषवान्
शुद्धाचारः सुप्रतिष्टः शुचिर्दक्षः सुबुद्धिमान्
आध्यात्म ज्ञाननिष्ठश्च मंत्र तमता विशारदः
निग्रहान ग्रहेशक्तो गुरुरित्यभिदीयते!
शांतमूर्तिम्, इम्द्रियों नियंत्रित करने में समर्थ, कुलीन, विनयशीली, परिशुद्ध, आचारवान्, सुवेषधारण्, गौरवनीय, पवित्र, बुद्धिमान, मंत्र तंत्रों में निष्णात, अनुग्रहाशकता, वैसा है गुरु का योग्य है!
भारत में आध्यात्मिक रूप में, और सामाजिकरूप में गुरु का प्राधान्यता अधिक है! माता पिता का बाद गुरु श्रेष्ट इति शास्त्र कहते है! इसी हेतु मात्रुदेवोभवा, पित्रुदेवोभवा, आचार्यदेवोभवा, अथिथिदेवो भव, कहते है!
गुरु ही भगवान और साधक के बीच में अनुसंधान करता है! भगवान और साधक के बीच में गुरु ही माध्यम है! गुरु बिना निर्वाण नहीं है! विध्याभ्यास का पश्चात गुरुदाक्षिण देना एक आचार है! नित्यप्रार्थानो में गुरु का प्रथम प्रार्थना करना भारत में एक आचार है! वैसा गुरु का पात्र सनातानो में महत्वपूर्ण है! माता पिता जन्म देते है, गुरु, मार्गानिर्देश देके भगवान का दर्शन कराते है!
जिस महात्मा का रूप आपका मन में स्थिर होगा, जो स्वप्ना में भी संमार्गाबोधन करेगा, जिस का धर्मसूत्रो आप का मन में स्थिर होगा, जिस महात्मा का समीप में जाने से आप का संदेह सभी निवृत्ति होगा, जिस महान का समीप में जाने से आप को प्रशाम्तता, और आनंद लाभ्याहोगा, जिस महान को उप्पर आप का विशवास और श्रद्धा द्विगुनीकृत होगा, उस महान ही आप का गुरु है! "
विद्या बोधन करनेवाले सूचिका गुरु, वर्णाश्रम धर्मो को बोधन करनेवाले वाचक गुरु, महा मंत्र उपदेश करनेवाले बोधक गुरु, निषिद्ध और मारणप्रयोग सिखानेवाले निषिद्ध गुरु, विषयभोगो का उप्पर विरक्ति व वैराग्य दिलानेवाले विहित गुरु, जीवब्रह्मैक्य बोधन करनेवाले कारण गुरु, जीवात्म और परमात्मा एक ही है करके प्रत्यक्षानुभव करनेवाले परम गुरु, इति कहते है!  
स्पर्श दीक्षा, ध्यानदीक्षा, दृग्दीक्षा, और ब्रह्म दीक्षा, इति चार प्रकार का दीक्षा होते है!

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana