*తస్మాత్ జాగ్రత జాగ్రత !
*తస్మాత్ జాగ్రత
జాగ్రత !*
*హిందూ
ధర్మచక్రం*
1. శ్లో|| మాతా
నాస్తి, పితా
నాస్తి, నాస్తి
బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి
అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః
పునః|
సంసార సాగరం
దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము
ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే
తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన
రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా ◆ కామము, క్రోధము, లోభము మొదలైన
అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన
రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా
సావధానుడవై ఉండుము.
4. శ్లో|| ఆశయా బధ్యతే
జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న
జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు
ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును
గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః
స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల
ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన
సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే
ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం
జీవితమావయోః|
యమస్య కరుణా
నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు
క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్
కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే
వినశ్యంతి తత్ర కా పరివేదన||
తా:- మనుషులకు
వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై
దుఃఖించుట ఎందులకు?
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాదయః|
ఋణక్షయే క్షయం
యాంతి తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధముచే
పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు.
దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్కాని
తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క
పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై
దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో
యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి
చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా
ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై
దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం
కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ
వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా -
ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు
ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు
సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
... ✍ *హిందూ ధర్మచక్రం*
Comments
Post a Comment