మనిషి దశావతారం
మాతృమూర్తి గర్భంలో ఈదుతూ ఎదిగే "మత్స్యం"
నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక "కూర్మం"
వయసులోని జంతు ప్రవర్తన ఒక "వరాహం"
మృగం నుంచి మనిషిగా మారే దశ "నరసింహం"
మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు "వామనుడు'
ఎదిగినా క్రోధం తగదని తేలిస్తే వాడు "పరశురాముడు"
సత్యం, ధర్మ, శాంతి ప్రేమలతో తానే ఒక "శ్రీరాముడు"
విశ్వమంతా తానే అని విశ్వసిస్తే నాడు "శ్రీకృష్ణుడు"
ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక "బలరాముడు"
కర్తవ్య మొనరించి జన్మసార్ధకతతో కాగలడు "కల్కి భగవానుడు"
తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం..
మలుచుకుంటే జన్మ ఒక్కటిలోనే మనిషి దశావతారం...
Comments
Post a Comment