గోవర్ధనగిరిపర్వతము:
గోవర్ధనగిరిపర్వతము:
గోలోకము అనగా
ఇంద్రియలోకము. ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు. మనస్సు అనేకవర్షములను అనగా
ఆలోచనలను వర్షిస్తుంది. ఇంద్రియ విషయములు అనగా ఆలోచనలను గోవులు అంటారు. గోపాలురు ఆ
ఇంద్రియ విషయములను పాలించేవారు. ఇంద్రియములను
నియంత్రించనియడల ఇంద్రియ విషయములు అనగా ఆలోచనలు పర్వతమంత ఎత్తుగా పెరుగుతూనే ఉంటాయి. దానినే గోవర్ధనపర్వతము
అంటారు. నియంత్రించని మనస్సు ఇంద్రుడు అనగా మనస్సు వర్షిస్తూనే ఉంటుంది.
ఆజ్ఞాచక్రము అనగా కూటస్థములో తీవ్రమైన
ధ్యానముచేయు క్రియాయోగ సాధకుడు కూటస్థుడు అయిన శ్రీకృష్ణ స్థితిని పొందుతే ఆలోచనా
రహిత స్థితిని అనగా క్రియా పరావస్థ స్థితిని పొందగలుగుతాడు. అట్టి స్థితిని
సాధించిన సాధకునికి వర్షములాంటి ఆలోచనలను నియంత్రించ గలుగుట చిటికిన వ్రేలుతో గోవర్ధనపర్వతము
ఎత్తినంత తేలికగా అవుతుంది.
దీనినే శ్రీకృష్ణుడు
గోవర్ధనపర్వతమును చిటికిన వ్రేలుతో ఎత్తుట అందురు.
Comments
Post a Comment