శ్రీకృష్ణ తులాభారము:
శ్రీకృష్ణ తులాభారము:
సత్యభామ అనగా సత్యము
ఎప్పుడూ భామే. అనగా సత్యము నిత్య యౌవ్వని. అట్టి భామ శ్రీకృష్ణునితన్నుట అనగా శ్రీకృష్ణచైతన్యమును తలదన్నినది. అట్టి
సత్యమునకుకానుకగా పారి అనగా పరాశక్తివలన జాతము అనగా పుట్టిన పారిజాతవృక్షమే సరి అయిన కానుక. కనుకసత్యమునకు
పరాకాష్ఠగా నిలిచిన సాధకునకు కూటస్థము నుండి అనగా శ్రీకృష్ణచైతన్యముఇచ్చే కానుకయే పారిజాతవృక్షము.
సముద్రమును సముద్రముతోనే పోల్చవలయును. శ్రీకృష్ణచైతన్యమును శ్రీకృష్ణచైతన్యము తోనే తుల అనగా తూచగల సి అనగా వు. అనగా శ్రీకృష్ణచైతన్యమును శ్రీకృష్ణచైతన్యముతోనే
తూచగలవు.. దానికి సాటి వేరొకటి లేదు. రుక్ మణి అనగా రుక్కులకు మణి ఓంకారము. భారము
అనగా బరువు. కనుక శ్రీకృష్ణచైతన్య బరువును ఓంకారము తూచగలిగినది. ఇదియే శ్రీకృష్ణ
తులాభారము.
Comments
Post a Comment