దీపావళి:--
దీపావళి:--
నరకాసురవధ ఆశ్వీజబహుళ
చతుర్దశినాడు జరిగినట్లుగా మన పురాణాలు చెప్తాయి. అమావాస్యనాడు దీపావళి పండుగగా
జరుపు కుంటారు హిందువులు.
నిద్ర, సోమరితనము, తంద్ర,
రేపు రేపు అని సాధనని దాటవేస్తూ ఉండుట, అహంకారము, కోరికలు, క్రోధము, మోహము, లోభము,
మదము మాత్సర్యము, స్త్రీ లోలత, పుత్రేషణ దారేషణ ధనేషణ ఇత్యాదివన్నీ
నకారాత్మకశక్తులు. అవి అసుర లక్షణములు. అవి సాధకుడ్ని క్రియాయోగ సాధన
చేసికొననీయవు. అడ్డుపడుతూ ఉంటాయి. సాధకుని చేతనని సంసార చక్రములయిన మూలాధార
స్వాధిష్ఠాన మణిపుర చక్రములకుపరిమితి చేస్తాయి. మూలాధారచక్రము పృధ్వీతత్వమునకు
ప్రతీక. పృధ్వీతత్వము గంధతత్వమునకు ప్రతీక. మనిషిలోని నకారాత్మకశక్తులు అన్నిటికీ
నాయకుడు నరకాసురుడు. ఈయన భూదేవి కుమారుడు. అనగా పృధ్వీతత్వమునకు అనగా గంధతత్వమునకు
ప్రతీక. అనగా పృధ్వీతత్వము కుమారుడు గంధతత్వముగల నరకాసురుడు. ఇది సాధకుని చేతనను శరీరమునకు అనగా
భౌతిక/శారీరక సుఖమునకు అంటిపెట్టుకునేటట్లు చేసి కుండలినీశక్తిని నిద్రాణస్థితికి
పరిమితము చేస్తుంది. జాగృతి చెందని కుండలినీశక్తి పరమాత్మని పొందలేదు. సాధకుడు తన
క్రియాయోగాధ్యానముతో కూటస్థుడు అయిన శ్రీకృష్ణుని అనగా శ్రీకృష్ణచైతన్యమును సహాయము
అడుగుతాడు. అనగా కూటస్థములో తీవ్రధ్యానము చేస్తాడు. అప్పుడు శరీరమునకు పరిమితి
అయిన పృధ్వీతత్వము అనగా భూదేవి అనగా మూలాధార చక్రమును శ్రీకృష్ణచైతన్యము ముందుగా
జాగృతి పరచును. అప్పుడు దాని కుమారుడు
అయిన అనగా గంధతత్వము నిర్జీవము అయి సాధకుని క్రియాయోగాధ్యానమునకు దోహదపడుటయే
నరకాసుర వధ. అట్టి జాగృతిచెందిన మూలాధారచక్రములోని నాలుగు దళములు సాధకునికి
అమావాస్య చీకటి తొలగించి పసుపు పచ్చని రంగులో కనిపించుటయే దీపావళి.
Comments
Post a Comment