గౌతమ—అహల్య:

గౌతమ—అహల్య:
గౌతముని భార్య అహల్య. గౌతముడు భార్య అహల్యకు ఆథ్యాత్మిక బోధ చేస్తూ ఉంటాడు. ఆవిడ మనస్సు ఆసమయములో చంచలముగా ఉంటుంది. ప్రాపంచిక విషయముల వైపుకి మళ్ళియుంటుంది. దానికి కారణములు ఇంద్రియములు. ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు.  అది గ్రహించినగౌతముడు భార్య అహల్యను ‘న హల్య’ అహల్య (కదలకూడదు) అంటాడు. కదలకుండా రాయి లాగ నిశ్చలముగా ఉండమంటాడు. దీనినే అహల్య మనస్సు ఇంద్రుడు పయిన లగ్నమగుట మరియు గౌతముని శాపము పొందుట అందురు. రాముడు వచ్చి శాపవిమోచనము కలుగచేయుట అందురు. ఆథ్యాత్మిక విషయములు మనస్సు చంచలముగా ఉంటే బోధపడవు. బోధపడవలయునన్న మనోనిశ్చలత అత్యంత ఆవశ్యకము. మనోనిశ్చలతయే ధ్యానము. అట్టి మనోనిశ్చలతా పరిస్థితులో మాత్రమె రాముడు అనగా పరమాత్మ శక్తి మూలాధారమువద్దనున్న కుండలినీ శక్తిని జాగృతి చేయగలదు. అప్పుడే మనుష్య జన్మకు సార్ధకత. ధ్యానముచేయని మనుజుడు పశువుకు సమానము. తమతమ దైనందిక పనులు చేసికుంటూ ధ్యానముతో పరమాత్మ సామ్రాజ్యములో ప్రవేశమునకు అర్హత సంపాదించవలయును.  తత్తదుపరి మనుజులు తమతమతమ దైనందిక పనులు చేసికుంటూ ధ్యానము తీవ్రతరము చేసికుంటూ పరమాత్మతో ఐక్యము అవ్వవలయును.          


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana