క్రియయోగాసాధన-లలితాసహస్రనామము-మొదటి భాగము
ఓం శ్రీ యోగానందగురు పరబ్రహ్మనేనమః
శ్రీలలితాసహస్రనామము అనగా సృష్టిలోని పరమాత్మని
అనేక నామములతో ప్రార్థన చేయుట. పరమాత్మపొందుకు రెండే మార్గములు. అవి చంచల మనస్సును
స్థిరము చేయుట లేదా చంచల ప్రాణమును స్థిరము చేయుట.
చంచల ప్రాణమును స్థిరము చేయుటద్వారా చంచల
మనస్సు స్థిరము అగును. దీనినే ప్రాణాయామము అందురు. ఇది సాధకులకు సులభమైన
మార్గము. చంచల మనస్సును స్థిరము
చేయుటద్వారా చంచల ప్రాణము స్థిరము అగును. ఇది జ్ఞానమార్గము. జటిలమైనది.
పరమాత్మని అనేక నామములతో ధ్యానము చేయుట ద్వారా
చంచల మనస్సు స్థిరము అగును. పరమాత్మపొందు
సులభమగును.
సత్ అనగా సత్తా గలది. దానికిరణములే మాయ
అనే గోళములో పడుతున్నవి. ఆలోపలి కిరణములనే ‘తత్’ అంటారు. అవి
బయటికి వికేంద్రీకరించేటప్పుడు ‘ఓం’ అనే శబ్దముతో హరించిపోయే సృష్టి ఏర్పడుతున్నది. సమస్త
జీవకోటి ఆ సృష్టిలోని అంతర్భాగమే. ఉన్నది ఒకటే. అదే సత్. అది సర్వశక్తివంతము, సర్వవ్యాపి, మరియు
సర్వజ్ఞత్వముగలది. సత్ చిత్ ఆనందము. దీనికి నామరూపములు జోడిస్తే ఏర్పడేది
హరించిపోయే సృష్టి. సృష్టికి కారణము
అనేకముగా కనిపించే అనిపించే మాయ.
మా అనగా కాదు, య అనగా యదార్థము, కనుక యదార్థము కానిది మాయ. పదార్థము యదార్థముకాదు. పరమాత్మ కలయే మాయ. భయంకరమైన కల కని భయంతో
గడగడలాడే మానవుడు కళ్ళుతెరిస్తే భయము పోయినట్లుగానే, మాయ నుండి
బయటపడుటకు క్రియాయోగసాధన అవసరము. అది అన్నిజన్మలలోను దుర్లభమైన మానవజన్మలోనే
సాధ్యము. అన్నిజన్మల లోను మానవజన్మ ఉత్తమము. సత్తు అనగా పరమాత్మ. పరమాత్మను చేరాలంటే హరి
నుండి, శబ్దబ్రహ్మమైన ఓం లోకి, తరువాత తత్ లోకి తద్వారా సత్ లోకి చేరాలి.
మొదటిది సత్. ఒకప్రకాశవంతమైన దీపము
అనుకోండి.
రెండవది తత్. ఇది ఒక గాజు గోళము
అనుకోండి. సత్ అనే దీపములోని కొన్ని కిరణములు మాత్రమె దీనిలోకి ప్రవేశిస్తాయి.
కనుక సత్ తత్ లోనూ ఉంటుంది, తత్ కి అతీతంగానూ ఉంటుంది. సత్ ఉంటేనే తత్ ఉంటుంది.
మూడవది ఓం. అనగా సృష్టికి కారణము. తత్
యొక్క పరావర్తనము. ఏదైనా ఉత్పత్తి అవాలంటే ముందర శబ్దము వస్తుంది. తరువాత కంటికి
కనిపించే వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఇదే హరించిపోయే ప్రపంచము (హరి).
అందువలననే ఏ శుభకార్యమయిననూ హరి ఓం తత్ సత్ అని ప్రారంభించాలి. అనగా నాశమయ్యే హరినుంచి
నాశముకాని సత్ లోకెళ్ళాలి.
మన శరీరములో 72,000 సూక్ష్మనాడులు ఉన్నవి. వాటిలో ఇడా పింగళ మరియు
సుషుమ్న సూక్ష్మనాడులు అతి ముఖ్యమయినవి.
మేరుదండములో ఎడమ ప్రక్కనున్నది ఇడాసూక్ష్మనాడి, కుడిప్రక్కనున్నది
పింగళ సూక్ష్మనాడి, మేరుదండముమధ్యలోనున్నది సుషుమ్న సూక్ష్మనాడి. మన శరీరములోని మేరుదండములో ఏడు
చక్రములున్నవి. ముడ్డివద్దనున్నమూలాదారచక్రము మొదటిది.
మూత్రవిసర్జనద్వారమువెనకాలఉన్న స్వాధిష్ఠాన చక్రము రెండవది. నాభివెనకాల ఉన్న మణిపురచక్రము
మూడవది. హృదయము దగ్గరగా మేరుదండములో నున్న అనాహతచక్రము నాలుగవది. కంఠములోనున్న విశుద్ధచక్రము
అయిదవది. మెడుల్లకేంద్రమువద్దనున్నది ఆజ్ఞా నెగటివ్, భ్రూమధ్యములోనున్నది
ఆజ్ఞా పాజిటివ్ చక్రము. ఈ ఆజ్ఞా నెగటివ్, మరియు భ్రూమధ్యములోనున్న ఆజ్ఞా పాజిటివ్ రెండునూ కలిపి
ఆరవచక్రమయిన ఆజ్ఞాచక్రము. ఈఒక్కచక్రమునకు మాత్రము నెగటివ్, పాజిటివ్
పొలారిటీలు ఉండును. తలలో బ్రహ్మరంధ్రమునానుకొని ఏడవదయిన సహస్రారచక్రము ఉండును.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము
మణిపురచక్రము అనాహతచక్రము విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా పాజిటివ్ చక్రము, మరియు సహస్రారచక్రము
అనేది ఆరోహణాక్రమము.
సహస్రారచక్రము ఆజ్ఞా పాజిటివ్ చక్రము
ఆజ్ఞా నెగటివ్ విశుద్ధచక్రము అనాహతచక్రము మణిపురచక్రము స్వాధిష్ఠాన చక్రము మరియు
మూలాదారచక్రము అనేది అవరోహణాక్రమము.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము
మణిపురచక్రము వరకు వ్యాప్తించియున్నది బ్రహ్మగ్రంథి. ఇదియే కురుక్షేత్రము. ఋగ్వేద
కాలము.
మణిపురచక్రము అనాహతచక్రము విశుద్ధచక్రము
వరకు వ్యాప్తించియున్నది రుద్రగ్రంథి. ఇదియే కురుక్షేత్ర - ధర్మక్షేత్రము.
యజుర్వేదకాలము
విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా పాజిటివ్ చక్రము, మరియు
సహస్రారచక్రము వరకు వ్యాప్తించియున్నది విష్ణుగ్రంథి. ఇదియే ధర్మక్షేత్రము. సామవేద
కాలము
శ్రీవిష్ణుసహస్రనామములోని కొన్ని నామములు
లేదా బీజాక్షరాలు ఉచ్చరించునపుడు ఒకేసారి ఆరోహణా లేదా అవరోహణా క్రమములో రెండు లేదా
మూడు చక్రములు స్పందింపజేయుటను గమనించవచ్చు. బ్రహ్మ రుద్ర లేదా విష్ణుగ్రంథి
విచ్ఛేదన జరుగుట గమనించవచ్చు. ఒకగ్రంథి
విచ్ఛేదన జరిగిన తదుపరి ఆ విచ్ఛేదన స్థిరపడుటకు ఒకే చక్రములో అనగా మణిపుర విశుద్ధ
లేదా ఆజ్ఞా(కూటస్థము) చక్రములో మాత్రమె స్పందన కలుగుటను గమనించవచ్చు. గ్రంథి
విచ్ఛేదన క్రియాయోగములో అతి ముఖ్యమయినది.
క్రియాయోగము:
క్రియాయోగములో1)హఠయోగం(శక్తిపూరక
అభ్యాసములు), 2)లయయోగము(సోహం మరియు ఓం ప్రక్రియలు), 3)కర్మయోగము(సేవ),4)మంత్రయోగము(చక్రములలోబీజాక్షరధ్యానము)మరియు 5)రాజయోగము(ప్రాణాయామ
పద్ధతులు) ఉండును. అన్నియోగముల సమ్మేళనమేక్రియాయోగము.
తూర్పు లేదా ‘’ఉత్తర దిక్కును
చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థము’’లో దృష్టి నిలిపి
ఖేచరీ ముద్రలో ఉండాలి. ఇలా ధ్యానముద్రలో కూర్చొని ఈ నామములను/ మంత్రములను
ఉచ్చరించవలయును.
ఓం శ్రీ యోగానంద పరబ్రహ్మణేనమః
క్రియాయోగ
సాధనా—లలితసహస్రనామం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః
1)శ్రీమాతా =పవిత్రమయిన
‘తత్’ అనగా సృష్టిలోని పరమాత్మ
2)శ్రీమహారాజ్ఞీ=
శుద్ధతత్వమాయ
3)శ్రీమత్ సింహాసనేశ్వర్యైనమః=
సింహాసనము వలన కడుపులోని కుళ్ళు అంతా పోతుంది. మనస్సు ప్రశాంతముగా ఉంటుంది. అట్టి ఆసనము వేసికొని ఈక్షణములు శ్వరములుగా
ఉపయోగించునది. ధ్యాననిమగ్నుని నేత్రములు బాణములవలె ప్రకాశవంతముగా ఉండును.
4)ఓం చిదగ్నికుండ
సంభూతాయైనమః =సత్ చిత్ ఆనంద స్వరూపము పరమాత్మ. అట్టి పరమాత్మయొక్క చిదగ్ని అనగా జ్ఞానాగ్ని
నుండి ఉద్భవించిన శుద్ధతత్వమాయ.
5)ఓం
దేవకార్యసముద్యతాయైనమః=జీవుల అజ్ఞానమును రూపుమాపి పరమాత్మ దిశకు మరలించటమే
దేవకార్యము. అందుకు ముందర సగుణోపాసన తత్తదుపరి నిర్గుణోపాసన అంత్యంత ఆవశ్యకము.
6)ఓం ఉద్యద్భాను
సహస్రాభాయైనమః=క్రియాయోగ ధ్యానములో ఆజ్ఞాచక్రములో కుండలినీ శక్తి
స్థితివంతమయినపుడు సాధకునికి ఉదయించిన వేయిసూర్యుల వెలుగు మాదిరి దర్శనము కలుగును. దానిని
సృష్టిలోని పరమాత్మ లేదా లలిత అంటారు.
7) ఓం చతుర్బాహుసమన్వితాయైనమః=చతురమయిన అనగా యోగయుక్తి పరమయిన చేతులుగలది.
8) ఓం రాగాస్వరూపపాశాఢ్యాయైనమః=ఇచ్ఛాశక్తి స్వరూపిణి.
9) ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయైనమః=క్రోధముఅను వాసనను రూపుమాపు అంకుశము
వంటిది.
10) ఓం మనోరూపేక్షుకోదండాయైనమః= మేరుదండమును నిఠారుగా ఉంచి ధ్యానించుట వలన
మనోనేత్రమును తెరపించునది.
11) ఓం పంచతన్మాత్రసాయకాయైనమః=ఆకాశము వాయువు అగ్ని జలము మరియు భూమి తత్వములను
పంచతన్మాత్రలందురు. ఈ పంచతన్మాత్రలు మరియు శుద్ధ సత్వగుణము కలిపి మాయ లేక లలితా
అందురు.
12) ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయైనమః=బ్రహ్మాండమంతా ఆమె అనగా
సృష్టిలోని పరమాత్మప్రకాశము వలన ఏర్పడినదే.
13) ఓం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయైనమః=ధ్యానపరుని శరీరము తల్లి శరీరము
ఒక్కటే. ఆ శరీరమునుండి అనేక పుష్పసౌరభ్యములు వెడలుచుండును.
14) ఓంకురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయైనమః=ఆజ్ఞాచక్రములో అనగా కూటస్థములో
క్రియాయోగ ధ్యానపరునికి కురువిందమణి కాంతులతో మహా ప్రకాశరూపములో ఆ తల్లి
దర్శనములభించుట అనుభవైకవేద్యము.
15) ఓం అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయైనమః=తీవ్రమయిన క్రియాయోగ ధ్యానయోగము
చేయువానికి ఎనిమిదవ రోజున చంద్రకాంతి మాదిరి కాంతితో కనబడునది.
16) ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయైనమః=కస్తూరిమృగముయొక్క నాభిలో
కస్తూరిఉండును.అదేవిధముగా ఆతల్లి చంద్రకళమాదిరి క్రియాయోగధ్యానము చేయువాని
ఫాలభాగములో ప్రకాశించుచుండును.
17) ఓం వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికాయైనమః=భ్రూమధ్యమును కూటస్థము అందురు. దానిలో
మంగళప్రదమయిన గృహతోరణములమాదిరి ఆ తల్లి వదనస్మరము
క్రియాయోగ ధ్యానము చేయువాని ఫాలభాగములో ప్రకాశించుచుండును.
18) ఓం వక్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయైనమః= మరీచిర్మరుతామస్మి గీతా 10—21. ఏడుమహా వాయువులలోపరీవాహ అనేది ముఖ్యమయినది. మీనము
నీటిలో ఉన్ననూ దానికి నీరు అంటదు. అదేమాదిరి అమ్మ సృష్టిలో ఉన్ననూ తగులము లేకుండును.
19) ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయైనమః=ఆజ్ఞాచక్రములో కుండలినీ జాగృతి అయిన
క్రియాయోగధ్యానపరుడికి దర్శనమిచ్చి ఆతల్లి దానికి నిదర్శనముగా ఆయోగి ముక్కు నుండి
అప్పుడే కోసిన సంపెంగపూవువాసనమాదిరి సువాసనను వెదజల్లుతుంది.
20) ఓంతారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషితాయైనమః= భూచరీముద్ర వేసి యోగసాధనజేయు
సాధకునికి ముక్కు వద్ద మిరుమిట్లు గొలుపు
కాంతితో నక్షత్రకాంతిని మించిన కాంతితో ప్రకాశరూపముతో కనిపించును.
21) ఓంకదంబమంజరీక్లప్త కర్ణపూరమనోహరాయైనమః= క్రియాయోగసాధనజేయు సాధకునికి ఆ చెవినుంది
ఈచెవి వరకు మనోహరమయిన కదంబసువాసన పరిమళించును.
మనస్సు కాంతితో ప్రకాశరూపముతోవిరాజిల్లును.
22) ఓంతాటంకయుగళీభూత తపనోడుపమండలాయైనమః=సూర్యచంద్రులు చెవి ఆభరణములుగా ధరించినదా
అన్నంతగా కాంతిరూపముతో క్రియాయోగసాధనజేయు
సాధకునికి కూటస్థములో అమ్మ కనబడును.
23) ఓంపద్మరాగశిలాదర్శపరిభావిక పోలభూయైనమః=పద్మము నీటిలోనున్నను
కుళ్ళిపోదు.నీటిపయిన రాయిమాదిరి మోహముఉండదా అనునట్లుగాతేలియుండును. సంసారము అనే
నీటిలో రాయిమాదిరి మోహరహితుడయి నిశ్చలముగా
క్రియాయోగసాధనజేయు సాధకునికి కూటస్థములో ప్రకాశరూపముతో
అమ్మ కనబడును.
24) ఓంనవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయైనమః=క్రొత్తగా మెరుగు పెట్టిన పగడము,
ఎర్రని దొండపండు రంగులో క్రియాయోగసాధనజేయు సాధకునికి కూటస్థములో ప్రకాశరూపముతో
అమ్మ కనబడును.
25) ఓంశుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్వలాయైనమః=శుద్ధవిద్య అనగా ఆత్మవిద్య
అనగా తను ఎవరు అను జ్ఞానము అంకురము వేసినపుడు రెండు పసుపురంగు దళములు క్రియాయోగ
సాధనజేయు సాధకునికి కూటస్థములో ప్రకాశరూపముతో అమ్మ కనబడును.
26) ఓంకర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయైనమః= అద్భుతమయిన కర్పూర తాంబూల సువాసనలతో
క్రియాయోగ సాధనజేయు సాధకునికి కూటస్థములో అబ్బురపరచి అమ్మ ఆకర్షించును.
27) ఓంనిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛప్యైనమః=కచ్ఛపి అనే వీనానాద మాధుర్యముతో
క్రియాయోగ సాధనజేయు సాధకునికి కూటస్థములో అబ్బురపరచి అమ్మ ఆకర్షించును.
28) ఓంమందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయైనమః=యోగసాధనపై సాధకుని మానసిక ఇచ్ఛాశక్తిని వృద్ధిపరచి క్రియాయోగ సాధనజేయు సాధకునికి కూటస్థములో
చిరునవ్వుతో కూడిన ప్రకాశరూపముతో అమ్మ ఆకర్షించును.
29) ఓంఅనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితాయైనమః= క్రియాయోగ సాధనజేయు సాధకునికి
కూటస్థములో అసమానమయిన చుబుకములాగా కోడిగుడ్డు ఆకారముతో కూడిన ప్రకాశరూపముతో అమ్మ సాక్షాత్కారించును.
30) ఓంకామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకందరాయైనమః=పరమాత్మశక్తి బ్రహ్మరంధ్రము ద్వారా
సహస్రార ఆజ్ఞా పాజిటివ్ ఆజ్ఞానెగటివ్ విశుద్ధ అనాహత మణిపుర స్వాధిష్ఠాన మూలాధార
చక్రములద్వారా అవరోహణాక్రమములో వెలుపలికి పోవుచూ ప్రాణశక్తి అనగా మానవచేతనగా
మారును. ప్రాణశక్తి ఉన్న శరీరము శివము అనగా మంగళము, ప్రాణశక్తి లేని శరీరము శవము
అమంగళము. ఈ జడమయిన శరీరమునకు కామేశుడు అనగా పరమాత్మకు ఉన్న బంధము ప్రాణశక్తి అనే
దారమే మాంగళ్యసూత్రము. ఆ ప్రాణశక్తి ప్రదాయిని ఈ అమ్మే.
31) ఓంకనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయైనమః=
క్రియాయోగ సాధనజేయు సాధకునికి కూటస్థములో బంగారమురంగుతోకూడిన భుజకీర్తులుధరించినదా
అనునట్లు సువర్ణ ప్రకాశరూపముతో అమ్మ సాక్షాత్కారించును.
32) ఓంరత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితాయైనమః=
క్రియాయోగ సాధనజేయు సాధకుని వజ్రకఠోరమయిన చింతలను రూపుమాపి ముక్తిఫలమునొసగు అమ్మకు
నమస్కారము.
33)
ఓంకామేశ్వరప్రేమరత్నమణిప్రతిఫణస్తన్యైనమః= తన ఇచ్ఛాశక్తితో ఈశ్వర ప్రేమరత్నమణికై
అనగా అమ్మ అత్యంత ప్రీతిపాత్రుడగుటకు తన హృదయమును పణముగా లేదా బూర ఊదువాని
శబ్దమునకు అనుకూలముగా పాము తన ఫణము అనగా పడగను
ఏకాగ్రతతో త్రిప్పుమాదిరి
క్రియాయోగ సాధనజేయు సాధకుడు
కూటస్థములో తనమనస్సును ఏకాగ్రతపరచును.
34)
ఓంనాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయాయైనమః=రోమములతో కూడిన నాభివద్ద మేరుదండములోనున్న మణిపురచక్రములో ధ్యానముచేయు
సాధకునికి అమ్మ రోగనిరోధకశక్తి మరియు దుష్టశక్తులనుండి విముక్తి అనే రెండు ఫలములను
ప్రసాదించును. కాముడురాముడవ్వాలన్నా తృష్ణ కృష్ణఅవ్వాలన్నాశవంశివంఅవ్వాలన్నా ప్రాణాయామమే కాముడురాముడవ్వాలన్నా
తృష్ణ కృష్ణఅవ్వాలన్నాశవంశివంఅవ్వాలన్నా
ము
35) ఓంలక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమాయైనమః= రోమములతో కూడిన నాభివద్ద
మేరుదండములోనున్న మణిపురచక్రములో ధ్యానముచేయు సాధకుని రోగనిరోధకశక్తి మరియు
దుష్టశక్తులనుండి విముక్తి అనే రెండులక్ష్యముల మధ్య సమున్నతమయి రక్షించు అమ్మకి
నమస్కారము. కాముడురాముడవ్వాలన్నా తృష్ణ కృష్ణఅవ్వాలన్నాశవంశివంఅవ్వాలన్నా ప్రాణాయామమే కాముడురాముడవ్వాలన్నా
తృష్ణ కృష్ణఅవ్వాలన్నాశవంశివంఅవ్వాలన్నా
ము
36) ఓంస్తనభారదళన్మధ్యపట్టబద్ధవళిత్రయాయైనమః=హృదయమువద్దనున్న పట్టఅనగా
మేరుదండములోని అనాహతచక్రములో భారముతో అనగా హృదయ పూర్వకముగా మనసా వాచా కర్మణా
ధ్యానముచేయు సాధకుని పవిత్రప్రేమకు బద్ధురాలయిన అమ్మకు నమస్కారము.
37) ఓంఅరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతట్యైనమః= క్రియాయోగ సాధనజేయు సాధకునికి
మణిపురచక్రములోఎరుపురంగులో అమ్మ దర్శనమిచ్చును.
38) ఓంరత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయైనమః= హృదయమువద్దనున్న పట్టఅనగా
మేరుదండములోని అనాహతచక్రములో సాధకునికి గంటానాదము వినిపించి, ‘నేనున్నాను’ అని
తెలియబరచి ఆనందబరచు అమ్మకు నమస్కారము.
39) ఓంకామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయైనమః=మృదువైనతొడలమధ్యనున్న
మూలాధారచక్రమువద్ద ధ్యానముచేయు సాధకుని ఇచ్ఛాశక్తిజ్ఞాతను చేసి సౌభాగ్యమును
ప్రసాదించు తల్లికి నమస్కారము.
40) ఓంమాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయైనమః= మాణిక్యమకుటాకారము అనగా కిరీటము
మాదిరి వజ్రాసనములో ధ్యానముచేయు సాధకునికి కూటస్థములో దర్శనమిచ్చు తల్లికి
నమస్కారము.
41) ఓంఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయైనమః= దాగియున్న ఆలోచనలతో చుట్టబడియున్న
చంచలమనస్సును తన ప్రకాశబాణములతో మనస్సు యొక్క పిక్కలు విరగగొట్టి నిశ్చలము చేయు
తల్లికి నమస్కారము.
42) ఓంగూడగుల్ఫాయైనమః= ధ్యానమునకు అనుకూలమయిన బలమయిన చీలమండలను ప్రసాదించు తల్లికి
నమస్కారము.
43) ఓంకూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయైనమః=తాబేలువలె అంగములను అనగా ఇంద్రియములను
లోనికి ముడుచుకొని చంచలమనస్సునుజయించు సాధకునికి సహాయతనొనర్చు దివ్యమాతకి
నమస్కారము.
44) ఓంనఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణాయైనమః=సాధకుని తమోగుణమును తన గోళ్ళతో చీల్చి
చెండాడి నశింపజేయు తల్లికి నమస్కారము.
45) ఓంపదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయైనమః=ద్వైతమయిన పరాప్రకృతితో విరాజిల్లు
తల్లికి నమస్కారము.
46) ఓంశింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయైనమః= పద్మము నీటిలో ఉన్నప్పటికీ నీరు అంటనట్లు
సంసారతగులములేని అద్భుతమయిన మణి కాంతులతో పవిత్రమయిన ప్రకాశముగల తల్లికి
నమస్కారము.
47) ఓంమరాళీమందగమనాయైనమః=హంసకి నీరు కలిపినపాలు ఇస్తే పాలుత్రాగి నీరువదలి మెల్లగా
నడిచివెళ్ళు తీరున స్వచ్ఛమయిన ధవళ కాంతులతో కూడిన హంస లాంటి ఆ తల్లికి నమస్కారము.
48) ఓంమహాలావణ్యశేవధియేనమః=చాలాగొప్పలావణ్యమునకు అనగా ప్రకాశము నకు నిధి అయిన ఆ
తల్లికి నమస్కారము.
49) ఓంసర్వారుణాయైనమః=సాధకునికి కూటస్థములో ఎరుపురంగులో దర్శనమిచ్చు ఆతల్లికి
నమస్కారము.
50) ఓంఅనవద్యాంగ్యైనమః=దోషరహితమయిన ప్రకాశము అనే అంగములుగల ఆతల్లికి నమస్కారము.
51) ఓంసర్వాభరణభూషితాయైనమః= అద్భుతమయినర్వాభరణముల కాంతిని మించిన ప్రకాశముతో
విరాజిల్లు ఆతల్లికి నమస్కారము.
52) ఓంశివకామేశ్వరాం కాస్థాయైనమః=పరాశక్తితో విరాజిల్లు ఆతల్లికి నమస్కారము.
53) ఓంశివాయైనమః=మంగళస్వరూపిణియిన ఆతల్లికి నమస్కారము.
54) ఓంస్వాధీనవల్లభాయైనమః=మాయను తనస్వాధీనములో ఉంచుకొన్న ఆతల్లికి నమస్కారము.
55) ఓంసుమేరుశృంగమధ్యస్తాయైనమః=మేరుదందములోని ఇడా మరియు పింగళ సూక్ష్మ
నాడులమధ్యనుండు సుషుమ్నా స్థిత అయిన ఆతల్లికి నమస్కారము.
56) ఓంశ్రీమన్నగరనాయికాయైనమః=పవిత్రమయిన సాధకుని శరీరము అనే నగరములో నాయికగా
విలసిల్లు ఆతల్లికి నమస్కారము.
57) ఓంచింతామణిగృహాంతస్థాయైనమః=శివము అనగా ప్రాణశక్తి, గృహము అనగా శరీరము, చింతలు అనగా ఆలోచనలు.
శవమునకు ఆలోచనలుండవు. అట్టి గృహమునందు చింతామణిగా విలసిల్లు ఆతల్లికి నమస్కారము.
58) ఓంపంచబ్రహ్మాసనస్థితాయైనమః=పృథ్వీ,ఆపః(జలము), తేజో(అగ్ని), వాయుః మరియు ఆకాశము
అనే పంచబ్రహ్మాసనస్థిత అయిన ఆతల్లికి నమస్కారము.
59) ఓంమహాపద్మాటవీసంస్థాయైనమః=మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ,
ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా పాజిటివ్, మరియు సహస్రార చక్రములను మహామహాపద్మ అటవి అందురు.
అందు స్థిత అయిన ఆతల్లికి నమస్కారము.
60) ఓంకదంబవనవాసిన్యైయైనమః=మానవశరీరమే ఒకకదంబవనము. ఈ వనములో విరాజిల్లు ఆతల్లికి నమస్కారము.
61) ఓంసుధాసాగరమధ్యస్థాయైనమః=క్రియాయోగ సాధకుని జాగృతి చెందిన కుండలినీ శక్తి
ఆజ్ఞా చక్రము చేరినపుడు అక్కడ అద్భుత కాంతులతోసుధాసాగరము కనిపించును. దాని
మధ్యస్థయైన ఆతల్లికి నమస్కారము.
62) ఓంకామాక్యైయైనమః= క్రియాయోగ సాధకుని మోక్ష కాంక్షను తీర్చు నేత్రములు గల
ఆతల్లికి నమస్కారము.
63) ఓంకామదాయిన్యైనమః= క్రియాయోగ సాధకుని మోక్ష కాంక్షను తీర్చు ఆతల్లికి
నమస్కారము.
64) ఓందేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవాయైనమః=మన శరీరములోని సకారాత్మకశక్తులనే
దేవర్షిగణములచే స్తుతించబడు ఆతల్లికి నమస్కారము.
65) ఓంభండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయైనమః= క్రియాయోగ సాధకుని కామవాంఛలు అనే
నకారాత్మకసేనను వధించుటకయి శరీరములోని సకారాత్మక శక్తులను సమాయుత్తముచేయు ఆతల్లికి
నమస్కారము.
66) ఓంసంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితాయైనమః=శబ్ద(విశుద్ధ) స్పర్శ(అనాహత)
రూప(మణిపుర) రస(స్వాధిష్ఠాన) గంధ(మూలాధార)చక్రములను పంచతన్మాత్రలందురు. వీటినే
సంపత్ గజములు(ఏనుగులు) అందురు. వీటిచే సేవింపబడే ఆతల్లికి నమస్కారము.
67) ఓంఅశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయైనమః=అశ్వములనగా ఇంద్రియములు. వాటిఅధిష్ఠానము మనస్సు. ఆ మనస్సునుఅధిష్ఠించిన ఆదివ్యమాతకి నమస్కారము.
68) ఓంచక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయైనమః=మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత,
విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రములను కలిగియున్న ఈ రథము అనగా శరీరమును
ఆత్మజ్ఞానము అనే సర్వాయుధముతో అధిష్ఠించిన
ఆదివ్యమాతకి నమస్కారము.
69) ఓంగేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయైనమః=ఓంగేయముతో మూలాధార, స్వాధిష్ఠాన,
మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రములను కలిగియున్న ఈ రథము అనగా
శరీరమును ఓంగేయముతోఅనగా శబ్దనామముతో ఆ
చక్రములను సేవించు ఆదివ్యమాతకి నమస్కారము.
70) ఓంకిరిచక్రరథారూఢదండనాథపురస్కృతాయైనమః=కిరి అనగా వరాహ, వరాహ అనగా వరిష్ట
రాహ(మార్గము) అనగా ఆత్మజ్ఞానము. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ,
ఆజ్ఞా మరియు సహస్రార చక్రములను కలిగియున్న ఈ మేరుదండమునకు నాయికగా విలసిల్లు ఆదివ్యమాతకి నమస్కారము.
71) ఓంజ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయైనమః=ప్రతిచక్రమునకు ఒక
ప్రకాశము(రంగు) ఉండును. దానినే జ్వాలామాలినికాక్షిప్తవహ్నిఅనగా
దాగియున్నఅగ్నిజ్వాల అందురు. ఆ ప్రాకారమధ్యలోనుండు ఆదివ్యమాతకి నమస్కారము.
72) ఓంభండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితాయైనమః=భండసైన్యమనగా క్రియాయోగసాధకునికి
తన సాధనకు అడ్డు తగులు నకారాత్మకశక్తులు. వాటిని వధించుటకై సాధకుని
సకారాత్మకశక్తులను సమాయత్త పరచి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
73) ఓంనిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయైనమః= క్రియాయోగసాధకునికి తన సాధనకు
అడ్డు తగులు నకారాత్మకశక్తులను వధించుటకై సాధకుని సకారాత్మక నిత్య శక్తులను
సమాయత్త పరచి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
74) ఓంభండపుత్రవధోద్యుక్తబాలవిక్రమనందితాయైనమః= భండపుత్రులనగా క్రియాయోగసాధకునికి
తన సాధనకు అడ్డు తగులు నకారాత్మకశక్తుల అనుయాయులు.. వాటిని వధించుటకై సాధకుని
నిత్య యౌవన సకారాత్మకశక్తులను సమాయత్త పరచి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి
నమస్కారము.
75) ఓంమంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయైనమః= క్రియాయోగసాధకునికి తన సాధనకు అడ్డు
తగులు నకారాత్మకశక్తులను ప్రణవనాద ఓంకార మంత్రముతో విషయవాసనలను వధింఛి సాధకునికి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
76) ఓంవిశుక్రప్రాణహరణావారాహీవీర్యనందితాయైనమః=మణిపుర, స్వాధిష్ఠాన, మరియు మూలాధార
అనేవి సంసారచక్రములు. యోగసాధనయందు నిష్ఠ కుదరని సాధకుని ప్రాణశక్తి వీర్యము ఈ సంసారచక్రములకు పరిమితమయి ఉండును.దీనిని విశుక్రము
లేదా అధోరేతస్సు అందురు. అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార ములను
ఆధ్యాత్మికచక్రములందురు. క్రియాయోగసాధకునికి తన సాధనకు అడ్డు తగులు విషయవాంఛలను
తొలగించి ప్రాణశక్తి వీర్యములను అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రములనే
ఆధ్యాత్మికచక్రములవైపుకు మళ్ళించును. దీనిని వారాహీవీర్యము లేదా ఊర్ధ్వరేతస్సు
లేదా ఓజస్సు అందురు. ఆవిధముగా సాధకునికి
యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
77) ఓంకామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయైనమః= ఇచ్ఛాశక్తికి మూలాధార చక్రము ప్రతీక.దీనిని
శ్రీగణేశ్వరచక్రము అందురు. కామ ఈశ్వర అనగా ఇచ్ఛాశక్తి అనే ఈక్షణములను
శ్వరములుగానున్నది. శ్రీగణేశ్వరచక్రము ద్వారా ఇచ్ఛాశక్తిప్రదాత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
78) ఓంమహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయైనమః= ఇచ్ఛాశక్తికి మూలాధార చక్రము
ప్రతీక.దీనిని శ్రీగణేశ్వరచక్రము అందురు. శ్రీగణేశ్వరచక్రము ద్వారా క్రియా యోగసాధన
విఘ్నరహితముగానిర్భిన్నముగా సాగునట్లు చేసి సాధకునికి యోగఇచ్ఛాశక్తినొసగి
ముదముకలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
79) ఓంభండాసురేంద్రనిర్ముక్తశాస్త్రప్రత్యస్త్రవర్షిణ్యైనమః= భండాసురేంద్ర
అనగా క్రియా యోగసాధకునికి తన సాధనకు అడ్డు
తగులు నకారాత్మకశక్తులు కలిగిన మనస్సు.
దానినిర్మూలనకై సాధకుని
సకారాత్మకశక్తులను సమాయత్త పరచి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
80) ఓంకరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృత్యైనమః= చేతులు వ్రేళ్ళు కలిపి తగిన
ముద్రలువేసి సాధన చేయు క్రియాయోగసాధకునికి నారాయణదశ ఆకృతి కలిగించు ఆదివ్యమాతకి
నమస్కారము.
81) ఓంమహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికాయైనమః= క్రియాయోగసాధకునయే
మహాపాశుపతాస్త్రాగ్ని. ఆధ్యానాగ్నిలో నకారాత్మకశక్తులువాటి సైనికులు అనగా
అనుయాయులను దగ్ధము చేసి సాధకునికి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి నమస్కారము.
82) ఓంకామేశ్వరాస్త్రనిర్ధగ్ధసభండాసురశూన్యకాయైనమః= భండఅనగా క్రియాయోగ సాధకునికి
తన సాధనకు అడ్డు తగులు నకారాత్మకశక్తులు. వాటిని దగ్ధము చేయుటకు సాధకునికి
యోగఇచ్ఛాశక్తినొసగి సాధకుని సకారాత్మకశక్తులను సమాయత్త పరచి యోగానందము కలిగించు ఆదివ్యమాతకి
నమస్కారము.
83) ఓంబ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయైనమః= సృష్టిలోని గొప్పమనస్సు అనగా
సాధనతో స్థిరత్వముచెందిన మరియుచెందని మనస్సులతో స్తుతించబడు ఆ దివ్యమాతకి
నమస్కారము.
84) ఓంహరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యైనమః= క్రియాయోగ సాధకునికి తన సాధనలో
అడ్డుతగులు విషయవాంఛలు లేదా కోరికలను దగ్ధముచేయు ఔషధమువంటి లయకారక నేత్రములుగల ఆ
దివ్యమాతకి నమస్కారము.
85) ఓంశ్రీమద్వాగ్భావకూటైకస్వరూపముఖపంకజాయైనమః=శ్రీమత్ అనగా పవిత్రమనస్సు. క(మూలాధార-పర)
ఏ(స్వాదిష్ఠాన-పశ్యంతి)ఈ(మణిపుర-ప్రియ) ల(అనాహత-వైఖరి) హ్రీం(విశుద్ధ-వాక్
వెలువడేది) బీజాక్షరములను వాగ్భావకూటమి అంటారు. అట్టి బీజాక్షరములఉచ్చారణతో
ప్రసన్నమగు ఆ దివ్యమాతకి నమస్కారము.
86) ఓంకంఠాథఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర,
అనాహత, మరియు విశుద్ధ చక్రములను కలిగియున్న ఈ మేరుదండము నకుకంఠాథఃకటిపర్యంత కూటము
అంటారు. దానికి నాయికగా విలసిల్లు ఆదివ్యమాతకి నమస్కారము.
87) ఓంశక్తికూటైకతాపన్నకట్యథోభాగధారిణ్యైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర,
అనాహత, మరియు విశుద్ధ చక్రములను కలిగియున్న ఈ మేరుదండము నకు కట్యథోభాగకూటము
అంటారు. దానికి నాయికగా విలసిల్లు ఆ దివ్యశక్తిమాతకి నమస్కారము.
88) ఓంమూలమంత్రాత్మికాయైనమః= ఓం మంత్రము మూలమంత్రముగాయున్న ఆ దివ్యశక్తిమాతకి
నమస్కారము.
89) ఓంమూలకూటత్రయకళేబరాయైనమః= స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరములు మూడింటికి ఓం
మంత్రము మూలమంత్రముగా యున్న ఆ దివ్యశక్తిమాతకి నమస్కారము.
90) ఓంకులామృతైకరసికాయైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా
మరియు సహస్రార చక్రములను కులమ్ అంటారు. దానియందు అమృతరస్వరూపిణి అయి విలసిల్లు
ఆదివ్యమాతకి నమస్కారము.
91) ఓంకులసంకేతపాలిన్యైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా
మరియు సహస్రార చక్రములను కులమ్ అంటారు.ప్రతిచక్రమునకు ఒక రంగు, రుచి, శబ్దము మరియు
దళములు ఉంటాయి. ఆయా సంకేతములను పాలించు ఆదివ్యమాతకి నమస్కారము.
92) ఓంకులాంగనాయైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు
సహస్రార చక్రములను కులమ్ అంటారు. ఆయా చక్రములే అంగములుగాగల ఆదివ్యమాతకి నమస్కారము.
93) ఓంకులాంతస్థాయైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా
మరియు సహస్రార చక్రములను కులమ్ అంటారు. ఆయా చక్రములలో యుండు ఆ దివ్యమాతకి
నమస్కారము.
94) ఓంకౌళిన్యైనమః= శక్తిరూపకమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
95) ఓంకులయోగిన్యైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు
సహస్రార చక్రములను కులమ్ అంటారు. యోగము అనగా కలయిక. ఆయా చక్రములలో కలయిక
కలిగియుండు ఆ దివ్యమాతకి నమస్కారము.
96) ఓంఅకుళాయైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు
సహస్రార చక్రములను కులమ్ అంటారు. యోగము అనగా కలయిక. ఆయా చక్రములలో కలయిక
కలిగియుండియు తగులములేని ఆ దివ్యమాతకి నమస్కారము.
97) ఓంసమయాంతస్థాయైనమః=సమయము అనగా భ్రూమధ్యమునుండు కూటస్థము లేక ఆజ్ఞా పాజిటివ్
చక్రము అంటారు. కూటస్థస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
98) ఓంసమయాచారతత్పరాయైనమః= సమయము అనగా భ్రూమధ్యమునుండు కూటస్థము లేక ఆజ్ఞా
పాజిటివ్ చక్రము అంటారు. కూటస్థస్థిత అయిన ఆ దివ్యమాతని ధ్యానము చేయు సాధకుని
అనుగ్రహించు నమస్కారము.
99) ఓంమూలాధారైకనిలయాయైనమః=మూలాధారనిలయ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
100) ఓంబ్రహ్మగ్రంథివిభేదిన్యైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మరియు మణిపుర చక్రముల వరకు వ్యాపించియున్నబ్రహ్మగ్రంథి
విచ్ఛేదనం క్రియాయోగసాధకునికి ఆత్మసాక్షాత్కారమునకై అతిముఖ్యము. దానికి
సహాయతనొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
101) ఓంమణిపూరాంతరుదితాయైనమః= మణిపూరచక్ర నిలయ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
102) ఓంవిష్ణుగ్రంథివిభేదిన్యైనమః= విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రముల వరకు
వ్యాపించియున్నవిష్ణుగ్రంథి విచ్ఛేదనం క్రియాయోగసాధకునికి ఆత్మసాక్షాత్కారమునకై
అతిముఖ్యము. దానికి సహాయతనొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
103) ఓంఆజ్ఞాచక్రాంతరాళస్థాయైనమః= ఆజ్ఞాచక్ర నిలయ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
104) ఓంరుద్రగ్రంథివిభేదిన్యైనమః= మణిపుర, అనాహత, మరియు విశుద్ధ చక్రముల వరకు
వ్యాపించియున్నరుద్రగ్రంథి విచ్ఛేదనం క్రియాయోగసాధకునికి ఆత్మసాక్షాత్కారమునకై
అతిముఖ్యము. దానికి సహాయతనొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
105)
ఓంసహస్రాంబుజారూఢాయైనమః= సహస్రారచక్ర నిలయ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
106) ఓంసుధాసారాభివర్షిణ్యైనమః= క్రియాయోగసాధకునికి అమృతవర్షము అనే
ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
107) ఓంతటిల్లతాసమరుచ్యైనమః= క్రియాయోగసాధకునికి మెరుపుతీగవలె సాక్షాత్కరించి అనే ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
108) ఓంషట్చక్రోపరిసంస్థితాయైనమః= మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ,
మరియు ఆజ్ఞా చక్రములయందు సంస్థితయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
109) ఓంమహాశక్త్యైనమః=మహాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
110) ఓంకుండలిన్యైనమః= మేరుదండములో మూలాధారచక్రమువద్ద 31/2
చుట్టలు చుట్టుకొని పడగ క్రిందకు తోక పై చక్రములలో
పెట్టుకొని నిద్రాణస్థితిలో ఉంటుంది కుండలినీ శక్తి రూపములోనున్న ఆ దివ్యమాతకి
నమస్కారము.
111) ఓంబిసతంతుతనీయస్యైనమః=తామరతూడులలోని దారములవలె మన శరీరములో 72,000 సూక్ష్మనాడులు ఉండును.వాటిని తన శరీరముగా చేసికొని
విరాజిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
112) ఓంభవాన్యైనమః= సంసారమునందున్ననూ సంసారతగులములేని ఆ దివ్యమాతకి నమస్కారము.
113) ఓంభావనాగమ్యాయైనమః=యోగభావనతోకూడిన సాధకునికి గమ్యమును చేర్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
114) ఓంభవారణ్యకుఠారికాయైనమః=సంసారము అనే అరణ్యమునుండి బయటపడు సాధకునికి జ్ఞాన
గొడ్డలినందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
115) ఓంభద్రప్రియాయైనమః= క్రియాయోగసాధన భద్రము అనగా శుభప్రదము. అట్టి సాధనచేయు
సాధకులు ఆ తల్లికి ప్రియము. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
116) ఓంభద్రమూర్త్యైయైనమః= శుభప్రదమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
117) ఓంభక్తసౌభాగ్యదాయిన్యైనమః= క్రియాయోగ సాధకభక్తులకుసౌభాగ్యదాయిని అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
118) ఓంభక్తప్రియాయైనమః= క్రియాయోగ సాధకభక్తులకు ప్రియమయిన ఆ దివ్యమాతకి నమస్కారము
119) ఓంభక్తిగమ్యాయైనమః= క్రియాయోగసాధక భక్తులకు గమ్యమయిన ఆ దివ్యమాతకి నమస్కారము
120) ఓంభక్తివశ్యాయైనమః= క్రియాయోగసాధక భక్తులకు వశమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
121) ఓంభయాపహాయైనమః=భవభయాలను తొలగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
122) ఓంశాంభవ్యై నమః=తత్ రూపిణి అయిన దివ్యమాతకి నమస్కారము.
123) ఓంశారదారాధ్యాయైనమః=శారద అనగా సరస్వతి అనగా జ్ఞానస్వరూపిణి. జ్ఞాన ముచే
ఆరాధించబడు అనగా జ్ఞానస్వరూపిణియైన దివ్యమాతకి నమస్కారము.
124) ఓంశర్వాణ్యైనమః= తత్ రూపిణి అనగా సృష్టి లోని పరమాత్మ అయిన దివ్యమాతకి నమస్కారము.
125) ఓంశర్మదాయిన్యైనమః= క్రియాయోగసాధక భక్తులకు పరమానందమును ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
126) ఓంశాంకర్యై నమః= తత్ రూపిణి అనగా సృష్టి లోని పరమాత్మ అయిన దివ్యమాతకి నమస్కారము.
127) ఓంశ్రీకర్యైనమః=పవిత్రమునొనర్చుఆ దివ్యమాతకి నమస్కారము.
128) ఓంసాధ్వ్యైనమః=అనన్యసాధ్యమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
129) ఓంశరచ్చంద్రనిభావనాయైనమః =అద్భుత కాంతితో విరాజిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
130) ఓంశాతోదర్యైనమః= తీవ్రమయిన క్రియాయోగసాధన చేయు సాధకునికి తనకుగల శాతములేని
ఉదరముగల అనగా భేదమును తొలగంచు ఆ
దివ్యమాతకి నమస్కారము.
131) ఓంశాంతిమత్యైనమః= తీవ్రమయిన క్రియాయోగసాధన చేయు సాధకునికి శాంతిమతిని
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
132) ఓంనిరాధారాయైనమః= ఆధారరహితమయి
విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
133) ఓంనిరంజనాయైనమః=శుద్ధతత్వ మాయాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
134) ఓంనిర్లేపాయైనమః=సంసారమునకు హేతువయినను ఆ సంసారమునందు తగులములేని ఆ దివ్యమాతకి
నమస్కారము.
135) ఓంనిర్మలాయైనమః = శుద్ధతత్వ
మాయాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
136) ఓంనిత్యాయైనమః= శుద్ధతత్వ నిత్యస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
137) ఓంనిరాకారాయైనమః= శుద్ధతత్వ నిరాకారస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
138) ఓంనిరాకులాయైనమః= శుద్ధతత్వ నిత్యసంతోషస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
139) ఓంనిర్గుణాయైనమః= శుద్ధతత్వ గుణరహిత స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
140) ఓంనిష్కళాయైనమః=అవయవరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
141) ఓంశాంతాయైనమః=శాంత స్వరూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
142) ఓంనిష్కామాయైనమః=కోరికలులేని ఆ దివ్యమాతకి నమస్కారము.
143) ఓంనిరుపప్లవాయైనమః=నాశరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
144) ఓంనిత్యముక్తాయైనమః=నిత్యముక్తఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
145) ఓంనిర్వికారాయైనమః=ఎట్టి వికారములులేని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
146) ఓంనిష్ప్రపంచాయైనమః=ఉపాదిరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
147) ఓంనిరాశ్రయాయైనమః=ఆశ్రయరహితఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
148) ఓంనిత్యశుద్ధాయైనమః=నిత్యశుద్ధ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
149) ఓంనిత్యబుద్ధాయైనమః= నిత్యజ్ఞాన స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
150) ఓంనిరవద్యాయైనమః=అవిద్యారహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
151) ఓంనిరంతరాయైనమః=బేధరహిత
స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
152) ఓంనిష్కారణాయైనమః=కారణరహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
153) ఓంనిష్కళంకాయైనమః=కళంకరహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
154) ఓంనిరుపాధయేనమః=ఉపాధిరహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
155) ఓంనిరీశ్వరాయైనమః=శరీరరహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
156) ఓంనీరాగాయైనమః=కోరికరహిత స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
157) ఓంరాగమథనాయైనమః=క్రియాయోగసాధకుని కోరికలను నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
158) ఓంనిర్మదాయైనమః=క్రియాయోగసాధకుని గర్వమును నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
159) ఓంమదనాశిన్యైనమః= క్రియాయోగసాధకుని గర్వమును నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
160) ఓంనిశ్చింతాయైనమః=క్రియాయోగసాధకుని చింతలను నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
161) ఓంనిరహంకారాయైనమః
162) ఓంనిర్మోహాయైనమః=క్రియాయోగసాధకుని మోహమును నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
163) ఓంమోహనాశిన్యైనమః=క్రియాయోగసాధకుని మోహమును నాశనముచేసి ముక్తి ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
164) ఓంనిర్మమాయైనమః=క్రియాయోగసాధకుని మమత్వమును నిర్మూలించి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
165) ఓంమమతాహంత్రైనమః=క్రియాయోగసాధకుని మమత్వమును నాశనముచేసి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
166) ఓంనిష్పాపాయైనమః=క్రియాయోగసాధకుని పాపమును నాశనముచేసి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
167) ఓంపాపనాశిన్యైనమః= క్రియాయోగసాధకుని పాపమును నాశనముచేసి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
168) ఓంనిష్క్రోథాయైనమః= క్రియాయోగసాధకుని కోపమును నాశనముచేసి ముక్తి ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
169) ఓంక్రోధశమన్యైనమః=క్రియాయోగసాధకుని కోపమును నాశనముచేసి శాంతిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
170) ఓంనిర్లోభాయైనమః=క్రియాయోగసాధకుని లోభమును నాశనముచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
171) ఓంలోభనాశిన్యైనమః=క్రియాయోగసాధకుని లోభమును నాశనముచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
172) ఓంనిస్సంశయాయైనమః=క్రియాయోగసాధకుని సంశయములను నాశనముచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
173) ఓంసంశయఘ్న్యైనమః=క్రియాయోగసాధకుని సంశయములను నాశనముచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
174) ఓంనిర్భవాయైనమః=క్రియాయోగసాధకుని జన్మరహితునిచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
175) ఓంభవనాశిన్యైనమః=క్రియాయోగసాధకుని జన్మరహితునిచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
176) ఓంనిర్వికల్పాయైనమః=క్రియాయోగసాధకుని సందేహరహితునిచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
177) ఓంనిరాబాధాయైనమః=క్రియాయోగసాధకుని బాధారహితునిచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
178) ఓంనిర్బేధాయైనమః=క్రియాయోగసాధకుని పరమాత్మవేరు తను వేరు అను బేధమునుండి రహితునిచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
179) ఓంభేదనాసిన్యైనమః=క్రియాయోగసాధకుని పరమాత్మవేరు తను వేరు అను బేధమును నాశనముచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
180) ఓంనిర్నాశాయైనమః=క్రియాయోగసాధకునికి నాశరహితస్థితి కలగచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
181) ఓంమృత్యుమథన్యైనమః=క్రియాయోగసాధకునికి అమరత్వస్థితి కలగచేసి ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
182) ఓంనిష్క్రియాయైనమః=క్రియాయోగసాధకునికి క్రియాపరావస్థ స్థితి కలగచేసి
ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
183) ఓంనిష్పరిగ్రహాయైనమః=క్రియాయోగసాధకునికి నిష్పరిగ్రహాస్థితి అనగా ఏ వస్తువునూ
స్వీకరించుకుండుట అను స్థితి కలగచేసి ముక్తిని
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
184) ఓంనిస్తులాయైనమః= తులారహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
185) ఓంనీలచికురాయైనమః= సృష్టి లోని పరమాత్మ అనగా తత్ నీలపు రంగులోనుండును. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
186) ఓంనిరపాయాయైనమః=నాశరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
187) ఓంనిరత్యయాయైనమః=నాశరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
188) ఓందుర్లభాయైనమః=ఆమె సాన్నిధ్యముదుర్లభము. కేవలము క్రియాయోగ సాధనతోనే సుసాధ్యము
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
189) ఓందుర్గమాయైనమః =ఆమె
సాన్నిధ్యముదుర్లభము. కేవలము క్రియాయోగ సాధనతోనే సుసాధ్యము అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
190) ఓందుర్గాయైనమః=ఆమె సాన్నిధ్యముప్రవేశించుటకు వీలుకాని దుర్గము అనగా కోట
వంటిది. కేవలము క్రియాయోగ సాధనతోనే సుసాధ్యము అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
191) ఓందుఃఖహంత్రైనమః=క్రియాయోగ సాధకుల దుఃఖమును నశింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
192) ఓంసుఖప్రదాయైనమః=క్రియాయోగ సాధకుల దుఃఖమును నశింపజేసి సుఖమును ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
193) ఓందుష్టదూరాయైనమః=క్రియాయోగ సాధకులకు దుఃఖమును కలగజేయు నకారాత్మకశఅనే
దుష్టశక్తులను నశింపజేసి సుఖమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
194) ఓందురాచారశమన్యైనమః=క్రియాయోగ సాధకుల దురాచారములను నశింపజేసి క్రియాయోగయుక్తులనుజేసి శాంతిని
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
195) ఓందోషవర్జితాయైనమః=క్రియాయోగ సాధకుల దోషములనుండి ముక్తుల్నిజేసి
క్రియాయోగయుక్తులనుజేసి శాంతిని ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
196) ఓంసర్వజ్ఞాయైనమః=సర్వజ్ఞ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
197) ఓంసాంద్రకరుణాయైనమః=అపారమయిన కరుణతో క్రియాయోగ సాధకులను ఆదరించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
198) ఓంసమానాధికవర్జితాయైనమః=అపారమయిన కరుణతో క్రియాయోగ సాధకుల అధికత్వము అనగా
అహంకారమును తొలగించి సమానమయిన అనగా సరి అయిన స్థితిని కలగజేసి ఆదరించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
199) ఓంసర్వశక్తిమయైనమః=సర్వశక్తిమంతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
200) ఓంసర్వమంగళాయైనమః=సర్వమంగళరూపిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
201) ఓంసద్గతిప్రదాయైనమః= క్రియాయోగ సాధకులను ఆదరించి సద్గతి ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
202) ఓంసర్వేశ్వర్యైనమః=సర్వఐశ్వర్యరూపిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
203) ఓంసర్వమయ్యైనమః=సర్వమూ తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
204) ఓంసర్వమంత్రస్వరూపిణ్యైనమః =సర్వమంత్రములూ తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
205) ఓంసర్వయంత్రాత్మికాయైనమః=సర్వయంత్రములూ అనగా జీవులు తానే అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
206) ఓంసర్వతంత్రరూపాయైనమః=సర్వతంత్రములూ అనగా తనువులు తానే అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
207) ఓంమనోన్మన్యైనమః =మనస్సుకు మనస్సు
అనగా కూటస్థము(రెండు కనుబొమ్మల మధ్యప్రదేశము) తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
208) ఓంమహేశ్వర్యైనమః =మహా అనగా గొప్ప ఈ
అనగా ఈక్షణములు శ్వర అనగా బాణములుగా గలది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
209) ఓంమహాదేవ్యైనమః=మహాదేవి అనగా సృష్టిలోని పరమాత్మ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
210) ఓంమహాలక్ష్మ్యైనమః =మహాలక్ష్మి అనగా
మహాశక్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
211) ఓంమృడప్రియాయైనమః=శుద్ధసత్వమాయ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
212) ఓంమహారూపాయైనమః=మహారూపా అనగా సృష్టిలోని పరమాత్మయే గొప్ప రూపము. అట్టి ఆ
దివ్యమాతకి నమస్కారము.
213) ఓంమహాపూజ్యాయైనమః =మహాపూజ్యా అనగా
సృష్టిలోని పరమాత్మయే సర్వుల పూజలను అందుకోదగినది. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
214) ఓంమహాపాతకనాశిన్యైనమః=అపారమయిన కరుణతో క్రియాయోగ సాధకుల మహాపాతకములను నాశనము
చేసి ఆదరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
215) ఓంమహామాయాయైనమః= సృష్టిలోని
పరమాత్మఅయిన లలితనుమహామాయా అంటారు. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
216) ఓంమహాసత్వాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితనుమహాసత్వా అనగా శుద్ధసత్వమాయా అంటారు. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
217) ఓంమహాశక్త్యైనమః =సృష్టిలోని
పరమాత్మఅయిన లలితయే మహాశక్తి మంతురాలు. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
218) ఓంమహారత్యైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహారతి అనగా ప్రీతిమంతురాలు. అట్టి
ఆ దివ్యమాతకి నమస్కారము.
219) ఓంమహాభోగాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాభోగ అనగా అత్యంత ఆనందమయి.
అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
220) ఓంమహైశ్వర్యాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాఐశ్వర్యా. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
221) ఓంమహావీర్యాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన
లలితయే మహావీర్యా. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
222) ఓంమహాబలాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాబలా. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
223) ఓంమహాబుధ్యైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాజ్ఞాని. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
224) ఓంమహాసిధ్యైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాసిద్ధి మంతురాలు. అట్టి ఆ
దివ్యమాతకి నమస్కారము.
225) ఓంమహాయోగీశ్వరేశ్వర్యైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే మహాయోగులకే యోగి.
అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
226) ఓంమహాతంత్రాయైనమః=తన్ త్రాయతే ఇతి తంత్రః అనగా తనువును రక్షించునది తంత్రము. సృష్టిలోని
పరమాత్మఅయిన లలితయే క్రియాయోగ సాధకులను రక్షించు మహాతంత్రము. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
227) ఓంమహామంత్రాయైనమః=మన్ త్రాయతే ఇతి
తంత్రః అనగా మనస్సును రక్షించునది మంత్రము. సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే
క్రియాయోగ సాధకులను రక్షించు మహామంత్రము.
అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
228) ఓంమహాయంత్రాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే క్రియాయోగ సాధకులను రక్షించు
మహాయంత్రము. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
229) ఓంమహాసనాయైనమః= సృష్టిలోని పరమాత్మఅయిన
లలితయే క్రియాయోగ సాధకులను రక్షించు మహాఆసనము.షట్ చక్రములు మరియు సహస్రారచక్రము
ఆమె ఆసనము. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
230) ఓంమహాయాగక్రమారాధ్యాయైనమః= సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే క్రియాయోగ సాధకులను రక్షించు మహామహాయాగక్రమము.షట్
చక్రములు మరియు సహస్రారచక్రములను జాగృతి చేయుటయే ఆమె మహామహాయాగక్రమము. అట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
231) ఓంమహాభైరవపూజితాయైనమః=సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే సృష్టి స్థితి లయ
కారకురాలు. మహాభైరవి. క్రియాయోగ సాధకులను రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
232) ఓంమహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణ్యైనమః= సృష్టిలోని పరమాత్మఅయిన లలితయే సృష్టి
స్థితి లయ కారకురాలు. ప్రళయము తదనంతరము తిరిగి సూక్ష్మరూపములోనున్న జగత్ అంతా
తిరిగి స్థూలరూపము దాల్చుటను మహాకల్ప మహాతాండవమందురు. దానికి కారకురాలు సాక్షి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
233) ఓంమహాకామేశమహిష్యైనమః =మహాకామేశమహిషి అనగా అనేక కోరికలు కలిగిఉండు తామస ప్రవృత్తి. దానినుండి
క్రియాయోగ సాధకులను రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
234) ఓంమహాత్రిపురసుందర్యైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ లోకములను త్రిపురములందురు.
అందులో విరాజిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
235) ఓంచతుష్షష్ఠ్యుపచారాఢ్యాయైనమః==64విధములుగా సేవించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
236) ఓంచతుష్షష్ఠికళామయ్యైనమః=64కళల స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
237) ఓంచతుష్షష్ఠికోటియోగినీగణసేవితాయైనమః=64కోట్ల కణములుగలది
ఈ శరీరము. అట్టి ఈ శరీరముతో సేవించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
238) ఓంమనువిద్యాయైనమః=మంత్రవిద్యా స్వరూపిణీ అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
239) ఓంచంద్రవిద్యాయైనమః=మంత్రవిద్య మానసికమయినది. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
240) ఓంచంద్రమండలమధ్యగాయైనమః=మానసికమయిన మంత్రవిద్య మధ్యస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
241) ఓంచారురూపాయైనమః=సుందరరూపయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
242) ఓంచారుహాసాయైనమః=సుందరమయిన నగవుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
243) ఓంచారుచంద్రకళాధారాయైనమః=సుందరమైన చంద్రకళకలిగియున్న ఆ దివ్యమాతకి నమస్కారము.
244) ఓంచరాచరజగన్నాథాయైనమః=చరాచరజగత్తుకునాథురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
245) ఓంచక్రరాజనికేతనాయైనమః=క్రియాయోగము అత్యంతరహస్యమయినది. రహస్యము అనగా రహితమయిన
హాస్యము కలిగినది. ఆ దివ్యమాతకి నమస్కారము.
246) ఓంపార్వత్యైనమః=పరాశక్తిగలది పార్వతి. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
247) ఓంపద్మనయనాయైనమః= శుద్ధ జ్ఞానమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
248) ఓంపద్మరాగసమప్రభాయైనమః== శుద్ధజ్ఞానమోహనమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
249) ఓంపంచప్రేతాసనాసీనాయైనమః=పృథ్వీ జలము అగ్ని వాయువు మరియు ఆకాశము లకు
శక్తినొసగి చేతనామూర్తిలను చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
250) ఓంపంచబ్రహ్మస్వరూపిణ్యైనమః=పృథ్వీ జలము అగ్ని వాయువు మరియు ఆకాశము అనే
పంచబ్రహ్మల స్వరూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
251) ఓంచిన్మయ్యైనమః=జ్ఞానమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
252) ఓంపరమానందాయైనమః=పరమానందమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
253) ఓంవిజ్ఞానఘనరూపిన్యైనమః=విజ్ఞానఘనరూపి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
254) ఓంధ్యానధ్యాతృధ్యేయరూపాయైనమః=ధ్యానధ్యాతృధ్యేయరూపి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
255) ఓంధర్మాధర్మవివర్జితాయైనమః=ధర్మాధర్మములకు అతీతురాలయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
256) ఓంవిశ్వరూపాయైనమః=విశ్వరూపిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
257) ఓంజాగరిణ్యైనమః=జాగ్రతఅవస్థలో భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
258) ఓంస్వపంత్యైనమః=స్వప్నావస్థలో భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
259) ఓంతైజసాత్మికాయైనమః=స్వప్నావస్థలోక్రియాయోగ సాధకునికితైజసునిగా భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
260) ఓంసుప్తాయైనమః=సుషుప్తి అవస్థలోక్రియాయోగ సాధకునికి భాసిల్లు ఆ దివ్యమాతకి
నమస్కారము.
261) ఓంప్రాజ్ఞాత్మికాయైనమః=సుషుప్తి అవస్థలోక్రియాయోగ సాధకునికిప్రాజ్ఞుడుగా భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
262) ఓంతుర్యాయైనమః=తురీయావస్థలోక్రియాయోగ సాధకునికిప్రాజ్ఞుడుగా భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
263) ఓంసర్వావస్థావివర్జితాయైనమః=సర్వావస్థలకు అతీత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
264) ఓంసృష్టికర్త్రైనమః=సృష్టికర్త అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
265) ఓంబ్రహ్మరూపాయైనమః=సృష్టికర్తబ్రహ్మరూప అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
266) ఓంగోప్త్రైనమః=సృష్టిరక్షణ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
267) ఓంగోవిందరూపిణ్యైనమః=క్రియాయోగాసాధకుని మనస్సుస్థిరముచేసి రక్షణ స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
268) ఓంసంహారిణ్యైనమః=క్రియాయోగాసాధకుని మనస్సుస్థిరముచేసి విషయవాంఛలను
సంహరించి రక్షణ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
269) ఓంరుద్రరూపాయైనమః=క్రియాయోగాసాధకుని మనస్సుస్థిరముచేసి విషయవాంఛలను తన
రౌద్రరూపముతో తొలగించు రక్షణ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
270) ఓంతిరోధానకర్త్రైనమః=ప్రళయ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
271) ఓంఈశ్వర్యైనమః=తన ఈక్షణములే శ్వరములుగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
272) ఓంసదాశివాయైనమః=నిత్యమంగళరూప అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
273) ఓంఅనుగ్రహదాయైనమః= క్రియాయోగాసాధకునికి నిత్యఅనుగ్రహదాత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
274)ఓంపంచకృత్యపరాయణాయైనమః=క్రియాయోగములో1)హఠయోగం(శక్తిపూరక అభ్యాసములు),2)లయయోగము(సోహంమరియుఓంప్రక్రియలు),3)కర్మయోగము(సేవ),4)మంత్రయోగము(చక్రములలోబీజాక్షరధ్యానము)మరియు5)రాజయోగము(ప్రాణాయామపద్ధతులు)
ఉండును. అన్నియోగముల సమ్మేళనమేక్రియాయోగము. ఈ విధమయిన
పంచకృత్యముల ఆరాధించు క్రియాయోగాసాధకునికి అనుగ్రహదాత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
275) ఓంభానుమండలమధ్యస్థాయైనమః=సూర్యునికి వెలుగునిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
276) ఓంభైరవ్యైనమః=లయకారకురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
277) ఓంభగమాలిన్యైనమః=ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కాంతి, జ్ఞానము,
విజ్ఞానములకు కారకురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
278) ఓంపద్మాసనాయైనమః=
నీరు అనగా సంసారము, పద్మము అనగా
తగులములేకుండుట. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
279) ఓంభగవత్యైనమః=భక్తి, జ్ఞాన, వైరాగ్యము మరియు తత్వజ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
280) ఓంపద్మనాభసహోదర్యైనమః=సృష్టికర్త అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
281) ఓంఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళ్యైనమః=కన్నులు మూసినంతనే లేదా
తెరచినంతనేబ్రహ్మాండములను సృష్టించగల లేదా లయచేయగల ఆ దివ్యమాతకి నమస్కారము.
282) ఓంసహస్రశీర్షవదనాయైనమః=సృష్టి అంతా తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
283) ఓంసహస్రాక్ష్యైనమః=సృష్టి అంతా తన కనులే అనగా అందరి దృష్టిశక్తి కారకురాలు
ఆమెయే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
284) ఓంసహస్రపాదేనమః=సృష్టి అంతా తన పాదములే అనగా అందరి గమనశక్తి కారకురాలు ఆమెయే
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
285) ఓంఆబ్రహ్మకీటజనన్యైనమః=సర్వజీవసృష్టి కారకురాలు ఆమెయే అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
286) ఓంవర్ణాశ్రమవిధాయిన్యైనమః=జాగృతి అయిన
కుండలినీ చేరు చక్రమునుబట్టి వర్ణము నిర్ణయించబడును. జాగృతి అయిన కుండలినీ
మూలాధారచక్రము చేరుతే క్షత్రియుడు, స్వాధిష్ఠాన చేరుతేవైశ్యుడు, మణిపుర చేరుతే
విపృడు, అనాహత చేరుతే బ్రాహ్మణుడుగా నిర్ణయించబడును. అట్టి విధానము నిర్ణయించిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
287) ఓంవిజ్ఞానరూపనిగమాయైనమః=విశిష్టమైన నిగమా అనగా వేదాంత జ్ఞానరూప అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
288) ఓంపుణ్యాపుణ్యఫలప్రదాయైనమః=పుణ్యాపుణ్యఫలములను ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
289) ఓంశృతిసీమంతసింధూరీకృతపాదాబ్జిధూళికాయైనమః=వేదాంతము అనగా ఉపనిషత్తుల సారము
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
290) ఓంసకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికాయైనమః=సకల వేదముల సారాంశమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
291) ఓంపురుషార్ధప్రదాయైనమః=ధర్మ, అర్థ, కామ, మరియు మోక్ష అను నాలుగు
పురుషార్ధములను ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
292) ఓంపూర్ణాయైనమః=పూర్ణస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
293) ఓంభోగిన్యైనమః=భోగస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
294) ఓంభువనేశ్వర్యైనమః=సమస్తభువనములకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
295) ఓంఅంబికాయైనమః= సమస్తభువనములకు మాతృస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
296) ఓంఅనాదినిధనాయైనమః=ఆద్యంతములు లేని ఆ దివ్యమాతకి నమస్కారము.
297) ఓంహరిబ్రహ్మేంద్రసేవితాయైనమః=హరించిపోయే ఈసృష్టియొక్క సమిష్టి మనస్సుచే
సేవించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
298) ఓంనారాయణ్యైనమః=సర్వసృష్టిని
వ్యాపించియున్న ఆ దివ్యమాతకి నమస్కారము.
299) ఓంనాదరూపాయైనమః=శబ్దరూపమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
300) ఓంనామరూపవివర్జితాయైనమః=నామరూప అతీతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
301) ఓంహ్రీంకార్యైనమః=మణిపుర చక్రమును స్పందింపజేసి ఆచక్రమును స్వయం ప్రకాశముతో ప్రకాశింపజేయు
ఆ దివ్యమాతకి నమస్కారము.
302) ఓంహ్రీమత్యైనమః=మణిపుర చక్రము జ్ఞానశక్తికి ప్రతీక. అట్టి జ్ఞానశక్తిని
క్రియాయోగసాధకునికి కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
303) ఓంహృద్యాయైనమః=అనాహతచక్రము హృదయమువద్దయుండును. హృదయవాసి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
304) ఓంహేయోపాధేయవర్జితాయైనమః=అన్నిఉపాధులకీ అతీతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
305) ఓంరాజరాజార్జితాయైనమః=అతిరహస్యమయిన క్రియాయోగ ధ్యానమును ఆర్జించిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
306) ఓంరాజ్యైనమః=అతిరహస్యమయిన క్రియాయోగ ధ్యానమును ఆర్జించిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
307) ఓంరమ్యాయైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకుని ఆనందము కలగచేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
308) ఓంరాజీవలోచనాయైనమః=సుందరమయిన నేత్రములుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
309) ఓంరంజన్యైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకునిరంజింప చేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
310) ఓంరమణ్యైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకునిరమింప చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
311) ఓంరస్యాయైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకుని రమింప చేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
312) ఓంరణత్కింకిణిమేఖలాయైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకునికి వివిధ చక్రములలో వివిధ
శబ్దములతో రమింప చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
313) ఓంరమాయైనమః=క్రియాయోగధ్యానముచేయు సాధకునిరమింప చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
314) ఓంరాకేందువదనాయైనమః=పూర్ణచంద్రునివంటివదనముగల ఆ దివ్యమాతకి నమస్కారము.
315) ఓంరతిరూపాయైనమః=ఆనందస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
316) ఓంరతిప్రియాయైనమః=ఆనందప్రియ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
317) ఓంరక్షాకర్యైనమః=రక్షాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
318) ఓంరాక్షసఘ్న్యైనమః=రాక్షసవినాశ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
319) ఓంరామాయైనమః=క్రియాయోగాసాధకులకు ఆనందము కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
320) ఓంరమణలంపటాయైనమః=క్రియాయోగాసాధకులకు ఆనందము కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
321) ఓంకామ్యాయైనమః=క్రియాయోగసాధకులధర్మబద్ధమయిన కోరికలను తీర్చు
ఆ దివ్యమాతకి నమస్కారము.
322) ఓంకామకళారూపాయైనమః=క్రియాయోగసాధకులకు ఆనందము కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
323) ఓంకదంబకుసుమప్రియాయైనమః=క్రియాయోగసాధకులసాధన అనే కదంబ పుష్పములను ఇష్టపడే ఆ దివ్యమాతకి నమస్కారము.
324) ఓంకళ్యాణ్యైనమః=క్రియాయోగసాధకులకు ఆనందము కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
325) ఓంజగతీకందాయైనమః=జగత్తుకు మూలకారణమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
326) ఓంకరుణారససాగరాయైనమః=క్రియాయోగసాధకులకు సాగరమంత కరుణ మరియు రస అనగా ప్రేమ చూపించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
327) ఓంకళావత్యైనమః=సమస్తకళలకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
328) ఓంకళాలాపాయైనమః=సమస్తకళల ఆలాపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
329) ఓంకాంతాయైనమః=మనోహరకాంతి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
330) ఓంకాదంబరీప్రియాయైనమః=క్రియాయోగసాధకులకు తమతమ సాధనామత్తును చూచి ప్రియముతో
ఉప్పొంగు ఆ దివ్యమాతకి నమస్కారము.
331) ఓంవరదాయైనమః=క్రియాయోగసాధకులకు వరములు ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
332) ఓంవామనయనాయైనమః=క్రియాయోగసాధకునికి తీవ్ర సాధనలో కూటస్థములో వరిష్ట
మనస్సు(వామనుడు)గలనేత్రములతో అంగుష్ఠ
ప్రమాణములో కనిపించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
333) ఓంవారుణీమదవిహ్వాలాయైనమః=సృష్టికర్తయినను ప్రకృతికి అతీతమయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
334) ఓంవిశ్వాధికాయైనమః=విశ్వానికి అధికమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
335) ఓంవేదవిద్యాయైనమః=వేదవిద్యతానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
336) ఓంవింధ్యాచలనివాసిన్యైనమః= క్రియాయోగసాధకుని కూటస్థములోనివసించు ఆ దివ్యమాతకి నమస్కారము.
337) ఓంవిధాత్రైనమః=లోకములను పోషించు ఆ దివ్యమాతకి నమస్కారము.
338) ఓంవేదజనన్యైనమః =వేదములకు
తల్లిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
339) ఓంవిష్ణుమాయాయైనమః=విష్ణుమాయా స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
340) ఓంవిలాసిన్యైనమః =ఆనంద స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
341) ఓంక్షేత్రస్వరూపాయైనమః=కూటస్థస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
342) ఓంక్షేత్రేస్యైనమః=కూటస్థస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
343) ఓంక్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యైనమః=కూటస్థస్వరూపిణి అయిన ఆ తల్లిని క్షేత్రజ్ఞ
అంటారు. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఆ రెండిటినీ పాలించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
344) ఓంక్షయవృద్ధివినిర్ముక్తాయైనమః=క్షయ(తరుగుదల)వృద్ధి(పెరుగుదల)లకు అతీతురాలయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
345) ఓంక్షేత్రపాలసమర్చితాయైనమః =క్షేత్రపాలఅనగా క్రియాయోగసాధకునిచే ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
346) ఓంవిజయాయైనమః=విజయా అనగా విశిష్టమయిన జయము అనగా జ్ఞానస్వరూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
347) ఓంవిమలాయైనమః=అవిద్యా లేదా అజ్ఞాన లేదా మలరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
348) ఓంవంద్యాయైనమః=నమస్కరంరించదగిన అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
349) ఓంవందారుజనవత్సలాయైనమః=తనకు నమస్కరంరించి క్రియాయోగ సాధనచేయు సాధకుల పై
వాత్సల్యము కురిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
350) ఓంవాగ్వాదిన్యైనమః=మన వాక్ కు కారణభూతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
351) ఓంవామకేశ్యైనమః=వామభాగమున ఉన్న అతిముఖ్యమయిన హృదయమునకు అధికారిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
352) ఓంవహ్నిమండలవాసిన్యైనమః=సూర్య సవిత అగ్నిమండలముల ని వాసిని అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
353) ఓంభక్తిమత్కల్పలతికాయైనమః=క్రియాయోగసాధనచేయు సాధకులకు కల్పలతవంటి ఆ దివ్యమాతకి
నమస్కారము.
354) ఓంపశుపాశవిమోచన్యైనమః=క్రియాయోగసాధనచేయు సాధకులను మోహమునుండి విముక్తిచేయు ఆ
దివ్యమాతకి నమస్కారము.
355) ఓంసంహృతాశేషపాషండాయైనమః=వేదరహితమయినపూజలను ఆచారముల ను. అట్టివారి అజ్ఞానమును
రూపుమాపు ఆ దివ్యమాతకి నమస్కారము.
356) ఓంసదాచారప్రవర్తికాయైనమః=వేదసహితమయినఆచారములను పాటింజేయునట్టి ఆ దివ్యమాతకి
నమస్కారము.
357) ఓంతాపత్రయాజ్ఞి సంతప్త సమాహ్లాదనచంద్రికాయైనమః=స్థూల సూక్ష్మ కారణ రోగములను
తాపత్రయాజ్ఞిని నిర్మూలించి క్రియాయోగాసాధకునికి హ్లాదము అనగా ఆనందము కలిగించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
358) ఓంతరుణ్యైనమః=నిత్యయౌవన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
359) ఓంతాపసారాధ్యాయైనమః= క్రియాయోగాసాధక తాపసులచే ఆరాధించబడు ఆ దివ్యమాతకి
నమస్కారము.
360) ఓంతనుమధ్యాయైనమః=శరీరమధ్య అయిన ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
361) ఓంతమోపహాయైనమః=అజ్ఞానమును నాశనము చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
362) ఓంచిత్యైనమః=జ్ఞానస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
363) ఓంతత్పదలక్ష్యార్ధాయైనమః=సత్ అనగా పరబ్రహ్మను పొందాలంటే తత్ స్వరూపిణి అయిన ఈ
తల్లిద్వారానే వెళ్ళాలి. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
364) ఓంచిదాకారస్వరూపిణ్యైనమః=జ్ఞానస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
365) ఓంస్వాత్మానందలవీభూతబ్రహ్మద్యానందసంతత్యైనమః=ఆత్మానందములో మునిగిపోయిన క్రియాయోగాసాధకులకు
బ్రహ్మానందమును కలగచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
366) ఓంపరాయైనమః=పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
367) ఓంప్రత్యక్చితీరూపాయైనమః=ఆత్మజ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
368) ఓంపశ్యంత్యైనమః=స్వాధిష్టానచక్రములోపశ్యంతిస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
369) ఓంపరదేవతాయైనమః=పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
370) ఓంమధ్యమాయైనమః=మణిపురచక్రములోమధ్యమాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
371) ఓంవైఖరీరూపాయైనమః=అనాహతచక్రములోవైఖరీస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
372) ఓంభక్తమానసహంసికాయైనమః=క్రియయోగాసాధకుల మనస్సులో హంసిక వలె సంచరించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
373) ఓంకామేశ్వరప్రాణనాడ్యైనమః=క్రియయోగసాధకులధర్మబద్ధమయిన కోరికలకు ప్రాణనాడివంటి
ఆ దివ్యమాతకి నమస్కారము.
374) ఓంకృతజ్ఞాయైనమః=క్రియయోగసాధకుల సాధనకు కృతజ్ఞతగా దివ్యానందమును లభ్యముజేయు ఆ
దివ్యమాతకి నమస్కారము.
375) ఓంకామపూజితాయైనమః=క్రియయోగసాధకులధర్మబద్ధమయిన కోరికలను గౌరవించు ఆ దివ్యమాతకి నమస్కారము.
376) ఓంశృంగారరససంపూర్ణాయైనమః=క్రియయోగసాధకులధర్మబద్ధమయిన ప్రేమను గౌరవించు ఆ దివ్యమాతకి నమస్కారము.
377) ఓంజయాయైనమః=జయస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
378) ఓంజాలంధరస్థితాయైనమః =జాలంధర పీఠమువేసి
క్రియాయోగసాధన చేయు సాధకులకు ఆ స్థానమయిన
మణిపురచక్రస్థితఅయి ఆనందపరచు ఆ దివ్యమాతకి నమస్కారము.
379) ఓంఓడ్యాణపీఠనిలయాయైనమః=ఓడ్యాణపీఠమువేసి క్రియాయోగసాధన చేయు సాధకులకు ఆ స్థానమయిన విశుద్ధచక్రస్థితఅయి
ఆనందపరచు ఆ దివ్యమాతకి నమస్కారము.
380) ఓంబిందుమండలవాసిన్యైనమః= క్రియాయోగసాధన చేయు
సాధకులకు కూటస్థములో మూడవనేత్రములో బిందువుగా కనిపించి ఆనందపరచు ఆ
దివ్యమాతకి నమస్కారము.
381) ఓంరహోయాగక్రమారాధ్యాయైనమః= క్రియాయోగసాధనద్వారా సాధకులచేత అన్నిచక్రములలోను
క్రమముగా ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
382) ఓంరహస్తర్పణతర్పితాయైనమః= క్రియాయోగసాధనద్వారా సాధకులచేత పుణ్యా పుణ్యములను
జ్ఞానాగ్నిలో దగ్ధము చేస్తే ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
383) ఓంసద్యఃప్రసాదిన్యైనమః= క్రియాయోగసాధనచేయు సాధకులశీఘ్రముగా ఫలములను ప్రసాదించు
ఆ దివ్యమాతకి నమస్కారము.
384) ఓంవిశ్వసాక్షిణ్యైనమః=యావద్ విశ్వమునకు సాక్షీభూతురాలయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
385) ఓంసాక్షివర్జితాయైనమః=యావద్ విశ్వమునకు సాక్షీభూతురాలయినను, ఆ తల్లికి సాక్షి
ఎవరూ లేనట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
386) ఓంషడంగదేవతాయుక్తాయైనమః=షట్ చక్రములే అంగములుగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
387) ఓంషాడ్గుణ్యపరిపూరితాయైనమః=షట్ గుణములుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
388) ఓంనిత్యక్లిన్నాయైనమః=నిత్యదయాళు అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
389) ఓంనిరుపమాయైనమః=అసమాన అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
390) ఓంనిర్వాణసుఖదాయిన్యైనమః=నిత్యదయాళు అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
391) ఓంనిత్యాషోడశికారూపాయైనమః=నిత్యము 16కళలతో విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
392) ఓంకంఠార్థశరీరిణ్యైనమః=అర్ధ నారీశ్వరి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
393) ఓంప్రభావత్యైనమః=మహత్ ప్రకాశముతో ప్రకాశించు ఆ దివ్యమాతకి నమస్కారము.
394) ఓంప్రభారూపాయైనమః=మహత్ ప్రభతో ప్రకాశించు
ఆ దివ్యమాతకి నమస్కారము.
395) ఓంప్రసిద్ధాయైనమః=ప్రసిద్ధమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
396) ఓంపరమేశ్వర్యైనమః=పరమాత్మ స్వరూపమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
397) ఓంమూలప్రకృత్యైనమః=మూలప్రకృతి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
398) ఓంఅవ్యక్తాయైనమః=అవ్యక్తమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
399) ఓంవ్యక్తావ్యక్తస్వరూపిణ్యైనమః=వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
400) ఓంవ్యాపిన్యైనమః=సర్వవ్యాపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
401) ఓంవివిధాకారాయైనమః=అనంతాకారస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
402) ఓంవిద్యాయైనమః=జ్ఞానస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
403) ఓంఅవిద్యాస్వరూపిణ్యైనమః=పంచమహాభూతములు మరియు సత్వరజో తమో గుణములను కలిపి
అవిద్య అంటారు. అట్టి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
404) ఓంమహాకామేశనయన కుముదాహ్లాదకౌముద్యైనమః=క్రియాయోగాసాధకుల మహాకోరికఅయినమోక్షమును
తీర్చు నయనములుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
405) ఓంభక్తహార్దతమోభేదభానుమద్భానుసంతత్యైనమః=క్రియాయోగాసాధకుల హృదయంలోని
అజ్ఞానాంధకారాన్నిరూపుమార్పు తేజస్సుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
406) ఓంశివదూత్యైనమః=మంగళ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
407) ఓంశివారాధ్యాయైనమః=మంగళ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
408) ఓంశివమూర్త్యైనమః=మంగళ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
409) ఓంశివంకర్యైనమః=మంగళ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
410) ఓంశివప్రియాయైనమః=మంగళ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
411) ఓంశివపరాయైనమః=మంగళ పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
412) ఓంశిష్ఠాయైనమః=శిష్ఠజనులయిన క్రియాయోగసాధకులచేత ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
413) ఓంఇష్టాయైనమః=క్రియాయోగసాధకులకుఇష్టురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
414) ఓంశిష్ఠపూజితాయైనమః=శిష్ఠజనులయిన క్రియాయోగసాధకులచేత ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
415) ఓంఅప్రమేయాయైనమః=కొలతకుఅందని ఆ దివ్యమాతకి నమస్కారము.
416) ఓంస్వప్రకాశాయైనమః=స్వయం ప్రకాశముతో విరాజిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
417) ఓంమనోవాచామగోచరాయైనమః=మనో వాక్కునకు అతీతమయి విరాజిల్లు ఆ దివ్యమాతకి
నమస్కారము.
418) ఓంఛిచ్ఛక్త్యైనమః= అజ్ఞానమును రూపుమాపు ఆ దివ్యమాతకి నమస్కారము.
419) ఓంచేతనారూపాయైనమః=చేతనాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
420) ఓంజడశక్త్యైనమః=సృష్టిలోని పరమాత్మనుజడశక్తి అందురు. అట్టి స్వరూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
421) ఓంజడాత్మికాయైనమః=సృష్టిలోని పరమాత్మనుజడశక్తి అందురు. అట్టి స్వరూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
422) ఓంగాయత్రైనమః=గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ. 24 అక్షరములు గల గాయత్రీ మంత్రముతో పూరకము, అంతఃకుంభకము, రేచకము, మరియు
బాహ్యకుంభకము చేసినయడల ఆయుష్షు పెరుగును. ఆరోగ్యవృద్ధి జరుగును. అట్టి స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
423) ఓంవ్యాహృత్యైనమః=ఓంకారస్వరూపిణి అయిన
ఆ దివ్యమాతకి నమస్కారము.
424) ఓంసంధ్యాయైనమః=ఉదయము మధ్యాహ్నము మరియు సాయంత్రము సంధ్యలలో ఆరాధింపదగిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
425) ఓంద్విజబృందనిషేవితాయైనమః= క్రియాయోగసాధకులచేత మరియు
క్రియాయోగసాధకులుకానివారిచేత ఆరాధింపదగిన ఆ దివ్యమాతకి నమస్కారము.
426) ఓంతత్వాసనాయైనమః=సృష్టిలోని పరమాత్మని తత్ అంటారు. ఆ తత్ ఆసనముగాగల ఆ
దివ్యమాతకి నమస్కారము.
427) ఓంతత్వంయ్యైనమః=సృష్టిలోని పరమాత్మని తత్ అంటారు. ఆ తత్ ఆలలితయే. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
428) ఓంపంచకోశాంచరస్థితాయైనమః=అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయ
కోశములలో చరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
429) ఓంనిస్సీమమహిమ్నేనమః=అనంతమయిన మహిమలుగల ఆ దివ్యమాతకి నమస్కారము.
430) ఓంనిత్యయౌవనాయైనమః=నిత్యయౌవన అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
431) ఓంమదశాలిన్యైనమః=నిత్యఆనందరూపి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
432) ఓంమదఘూర్ణితరక్తాత్యైనమః=క్రియాయోగసాధకునికి తన సాధనలో నిత్య ఆనందరూపముతో ఎర్రగా కూటస్థముములో కనబడు ఆ
దివ్యమాతకి నమస్కారము.
433) ఓంమదపాటలగండభువేనమః=క్రియాయోగసాధకునికి తన సాధనలో నిత్య ఆనందరూపముతో ఎరుపు తెలుపు రంగులలో
కూటస్థముములో కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
434) ఓంచందనద్రవదిగ్ధాంగ్యైనమః=క్రియాయోగసాధకునికి తన సాధనలో నిత్య ఆనందరూపముతో చందనసుగంధమును వెదజల్లును.
అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
435) ఓంచాంపేయకుసుమప్రియాయైనమః=క్రియాయోగసాధకునికి తన సాధనలో నిత్య ఆనందరూపముతోసంపెంగ పూల సుగంధమును
వెదజల్లును. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
436) ఓంకుశలాయైనమః=సృష్టి స్థితి లయ కార్యములను నిర్వర్తించుటలో కౌశల్యముగల ఆ
దివ్యమాతకి నమస్కారము.
437) ఓంకోమలాకారాయైనమః=సుందరరూపముగల ఆ దివ్యమాతకి నమస్కారము.
438) ఓంకురుకుళ్ళాయైనమః= క్రియాయోగసాధకునికి తన సాధనలో నీలి కాంతులతో కనబడు ఆ
దివ్యమాతకి నమస్కారము.
439) ఓంకుళేస్వర్యైనమః=జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఈ మూడింటినీ కుళము అందురు. వీటికి
అధిష్ఠానంఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
440) ఓంకులకుండాలయాయైనమః=మూలాధార స్వాధిష్ఠాన మణిపుర అనాహత చక్రములను కులము అందురు.
వీటికి అధిష్ఠానం కుండలినీ. అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
441) ఓంకౌళమార్గతత్పరసేవితాయైనమః=క్రియాయోగాసాధకులచే విశేషముగా సేవించబడు ఆ
దివ్యమాతకి నమస్కారము.
442) ఓంకుమారగణనాథాంబాయైనమః=అన్నిచక్రములకు తల్లి అయి క్రియాయోగ సాధకులచే విశేషముగా
సేవించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
443) ఓంతుష్ట్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి తృప్తిబడు ఆ
దివ్యమాతకి నమస్కారము.
444) ఓంపుష్ట్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు పుష్టినొసగు
ఆ దివ్యమాతకి నమస్కారము.
445) ఓంమత్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు సద్బుద్ధి నొసగు
ఆ దివ్యమాతకి నమస్కారము.
446) ఓంధృత్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు ధైర్యమునొసగు ఆ
దివ్యమాతకి నమస్కారము.
447) ఓంశాంత్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు శాంత్యమునొసగు
ఆ దివ్యమాతకి నమస్కారము.
448) ఓంస్వస్తిమత్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు
శుభమునొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
449) ఓంకాంత్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు
బుద్ధిప్రకాశమునొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
450) ఓంనందిన్యైనమః= క్రియాయోగ సాధకులచే విశేషముగా సేవించబడి సాధకులకు ఆనందమునొసగు
ఆ దివ్యమాతకి నమస్కారము.
451) ఓంవిఘ్ననాశిన్యైనమః= క్రియాయోగ సాధకుల సాధనలోవచ్చు విఘ్నములను నాశనమొనర్చు ఆ
దివ్యమాతకి నమస్కారము.
452) ఓంతేజోవత్యైనమః=తేజోవతి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
453) ఓంత్రినయనాయైనమః=చంద్రుడు సూర్యుడు మరియు అగ్ని అనే మూడు కనులుగల తేజోవతి అయిన
ఆ దివ్యమాతకి నమస్కారము.
454) ఓంలోలాక్ష్యైనమః=జగత్తునంతను పర్యవేక్షించు తేజోవతి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
455) ఓంకామరూపిణ్యైనమః= క్రియాయోగ సాధకులకు ధర్మబద్ధమయిన కోరికలను తీర్చు ఆ
దివ్యమాతకి నమస్కారము.
456) ఓంమాలిన్యైనమః=ప్రపంచములను మాలగా ధరించిన ఆ దివ్యమాతకి నమస్కారము.
457) ఓంహంసిన్యైనమః=పరమహంస స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
458) ఓంమాత్రేనమః=తత్ లేదా సృష్టిలోని పరమాత్మ
రూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
459) ఓంమలయాచలవాసిన్యైనమః=కూటస్థనివాసిని అయిన
ఆ దివ్యమాతకి నమస్కారము.
460) ఓంసుముఖ్యైనమః= క్రియాయోగ సాధకులకు కూటస్థములో సుముఖముగా దర్శనమిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
461) ఓంనళిన్యైనమః= క్రియాయోగ సాధకులకు కూటస్థములో సుందరమయిన మూడవ నేత్రముగా
దర్శనమిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
462) ఓంసుభ్రువేనమః= క్రియాయోగ సాధకులకు భ్రుమద్యములో కూటస్థములో సుందరమయిన మూడవ
నేత్రముగా దర్శనమిచ్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
463) ఓంశోభనాయైనమః= క్రియాయోగ సాధకులకు భ్రుమద్యములో కూటస్థములో
దర్శనమిచ్చుశుభప్రదమయిన సుందరమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
464) ఓంసురనాయికాయైనమః=సకల దేవతలకు నాయిక అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
465) ఓంకాలకంఠ్యైనమః=తీవ్రక్రియాయోగసాధన చేయు సాధకులకు విశుద్ధచక్రము నీలముగా
మారును. దానికి ఆ లలితయే కారణము. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
466) ఓంకాంతిమత్యైనమః=తీవ్రక్రియాయోగసాధన చేయు సాధకులకు కూటస్థములో జ్ఞానప్రకాశముతో
దర్శనమిచ్చు అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
467) ఓంక్షోభిణ్యైనమః=లయకారకురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
468) ఓంసూక్ష్మరూపిణ్యైనమః=సూక్ష్మరూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
469) ఓంవజ్రేశ్వర్యై నమః=క్రియాయోగసాధకులకుమేరుదండమే వజ్రాయుధము. దానికి నాయకి అయిన
ఆ దివ్యమాతకి నమస్కారము.
470) ఓంవామదేవ్యైనమః=క్రియాయోగసాధకులవామ
భాగాములోనుండు హృదయంలో అనహతచక్రములోనుండు ఆ దివ్యమాతకి నమస్కారము.
471) ఓంవయోవస్థానివర్జితాయైనమః=బాల్య కౌమార వార్ధక్య వానప్రస్థ అవస్థలకు అతీతమయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
472) ఓంసిద్ధేశ్వర్యైనమః=సిద్ధులకు సిద్ధురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
473) ఓంసిద్ధవిద్యాయైనమః=సిద్ధులను ప్రసాదించునట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
474) ఓంసిద్ధమాత్రేనమః=సిద్ధులకు తల్లిఅయినఆ దివ్యమాతకి నమస్కారము.
475) ఓంయశస్విన్యైనమః=యశోమంతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
476) ఓంవిశుద్ధచక్రనిలయాయైనమః=విశుద్ధచక్రములోనుండుఆ దివ్యమాతకి నమస్కారము.
477) ఓంఆరక్తవర్ణాయైనమః=క్రియాయోగసాధకులకుకూటస్థములోరక్తవర్ణములో కనిపించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
478) ఓంత్రిలోచనాయైనమః=క్రియాయోగసాధకులకుకూటస్థములోమూడవనేత్రము లో కనిపించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
479) ఓంఖట్వాంగాదిప్రహరణాయైనమః= క్రియాయోగసాధకుల సాధనకు అడ్డువచ్చు నకారాత్మక
శక్తులను నాశనముజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
480)ఓంవదనైకసమన్వితాయైనమః=క్రియాయోగసాధకులకుకూటస్థములోమూడవ
నేత్రముగా అందరి సాధకులకు ఒకే విధముగా కనిపించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
481) ఓంపాయసాన్నప్రియాయైనమః=క్రియాయోగసాధకులకుకూటస్థములోమూడవ
నేత్రముగా అందరి సాధకులకు ఒకే విధముగా కనిపించు ఆ దివ్యమాత
దర్శనము పరమాన్నము తిన్నంత ప్రియముగా అనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
482) ఓంత్వక్ స్థాయైనమః=పంచమహాభూతములలో ఒకటైన వాయువు చ్ర్మమునకు ప్రతీక. అదితానే
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
483) ఓంపశులోకభయంకర్యైనమః=క్రియాయోగసాధకుల అజ్ఞానమును రూపుమాపు ఆ దివ్యమాతకి
నమస్కారము.
484) ఓంఅమృతాదిమహాశక్తి సంవృతాయైనమః=క్రియాయోగసాధకుని అమృతమయిన ఆదిమహాశక్తిని
కలగచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
485) ఓంఢాకినీశ్వర్యైనమః=ఆకాశతత్వం, విశుద్ధచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
486) ఓంఅనాహతాబ్జనిలయాయైనమః=క్రియాయోగసాధకుని అనాహతచక్రనిలయ అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
487) ఓంశ్యామాభాయైనమః=శక్తి అనేది నిత్యము. తరగదు పెరగదు నాశనమవదు. ఒక శక్తిని
ఇంకొక శక్తిక్రింద మార్చవచ్చు. నిత్యయౌవన అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
488) ఓంవదనద్వయాయైనమః=ఆజ్ఞాచక్రమునకు రెండుదళములు ఉండును. ఆ దివ్యమాతకి నమస్కారము.
489) ఓందంష్ట్రోజ్వలాయైనమః=లయరూపమయిన
ఆ దివ్యమాతకి నమస్కారము.
490) ఓంఅక్షమాలాదిధరాయైనమః=చరాచరప్రపంచములను మాలగా ధరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
491) ఓంరుధిరసంస్థితాయైనమః=దోషరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
492) ఓంకాళరాత్ర్యాదిశక్తౌఘవృతాయైనమః=సర్వశక్తిమతి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
493) ఓంస్నిగ్ధౌదనప్రియాయైనమః=క్రియాయోగసాధకునికి స్నేహముతో ప్రియముకలిగించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
494) ఓంమహావీరేంద్రవరదాయైనమః=క్రియాయోగసాధకునికి మహావీరమనస్సును అనగా అత్యంతస్థిరమయినమనస్సును
వరముగానిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
495) ఓంరాకిన్యంబాస్వరూపిణ్యైనమః=వాయుతత్వం, అనాహతచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
496) ఓంమణిపూరాబ్జనిలయాయైనమః=అగ్నితత్వం, మణిపూరచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
497) ఓంవదనత్రయసంయుతాయైనమః=సృష్టి స్థితి లయ రూపమయిన అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
498) ఓంవజ్రాదికాయుధోపేతాయైనమః=మేరుదండముఅనే వజ్రాయుధమును సాధకునికి అందజేసిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
499) ఓం డామర్యాదిభిరావృతాయైనమః=అగ్నితత్వం, మణిపురచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
500) ఓంరక్తవర్ణాయైనమః=క్రియాయోగసాధకునికిమణిపురచక్రములోరక్తవర్ణములో కనిపించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
501) ఓంమాంసనిష్ఠాయైనమః=మాంసధాతువు పుష్టికి ప్రతీక. అట్టి మాంసధాతువు నందు
భాసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
502) ఓంగుడాన్నప్రీతమానసాయైనమః=గుడాన్నము తీపిగా ప్రీతికలగజేయును. క్రియాయోగసాధకుని
సాధనకి ప్రసన్నమయి గుడాన్నము తీపిమాదిరిగా ప్రీతికలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
503) ఓంసమస్తభక్తసుఖదాయైనమః= క్రియాయోగముజేయు సమస్త సాధకులకు సుఖము కలగజేయు ఆ
దివ్యమాతకి నమస్కారము.
504) ఓంలాకిన్యంబాస్వరూపిణ్యైయైనమః=అగ్నితత్వం, మణిపురచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
505) ఓంస్వాదిస్ఠానాంబుజగతాయైనమః=జలతత్వం, స్వాధిష్ఠానచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
506) ఓంచతుర్వక్త్రమనోహరాయైనమః=పృథ్వీతత్వం, మూలాధారచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
507) ఓంశూలాధ్యాయుధసంపన్నాయైనమః= క్రియాయోగసాధకుని అరిషడ్వర్గాలను శూలఆయుధముతో నిర్మూలించు ఆ దివ్యమాతకి నమస్కారము.
508) ఓంపీతవర్ణాయైనమః=మూలాధారచక్రములో పసుపువర్ణములో భాసించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
509) ఓంఅతిగర్వితాయైనమః= క్రియాయోగసాధకుని అతిగర్వమును అతని సాధన ద్వారా
నిర్మూలించు ఆ దివ్యమాతకి నమస్కారము.
510) ఓంమేదోనిష్ఠాయైనమః=ఎముకలు మజ్జ అగుటకు 84 దినములు పట్టును. అది కూడా తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
511) ఓంమధుప్రీతాయైనమః=క్రియాయోగసాధకునికి సాధనలో తియ్యటి మత్తు కలిగించి
ప్రీతినొందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
512) ఓంబందిన్యాదిసమన్వితాయైనమః=క్రియాయోగసాధకునికి సాధనలోబంధించి ప్రీతినొందించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
513) ఓందధ్యన్నాసక్తహృదయాయైనమః=క్రియాయోగసాధకునికి సాత్వికమయిన పెరుగుఅన్నమునందు
ఆసక్తి కలిగించి సాధనలోబంధించి ప్రీతినొందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
514) ఓంకాకినీరూపధారిణ్యైనమః=జలతత్వం, స్వాధిష్ఠానచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
515) ఓంమూలాధారాంబుజారూఢాయైనమః=పృథ్వీతత్వం, మూలాధారచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
516) ఓంపంచవక్త్రాయైనమః=పృథ్వీ ఆపః(నీరు) తేజో(అగ్ని) వాయుః మరియు ఆకాశములు అనే
పంచమహాభూతములే పంచముఖములుగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
517) ఓంఅస్థిసంస్థితాయైనమః=నరములు ఎముకలు అగుటకు 64 దినములు పట్టును. అదితానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
518) ఓంఅంకుశాదిప్రహరణాయైనమః=ఏనుగును లొంగదీసికొనుటకు వాడే ఆయుధము అంకుశము. క్రియాయోగసాధకుని నకారాత్మక శక్తులను తన
అంకుశమువంటి ఆయుధముతో తుదముట్టించి
ప్రీతినొందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
519) ఓంవరదాదినిషేవితాయైనమః=క్రియాయోగసాధకునికి ధర్మబద్ధమయిన వరములుప్రసాదించి ప్రీతినొందించు
ఆ దివ్యమాతకి నమస్కారము.
520) ఓంముద్గౌదనాసక్తచిత్తాయైనమః=క్రియాయోగసాధకునికి సాత్వికమయిన
పెసరపప్పుఅన్నమునందు ఆసక్తి కలిగించి సాధనలోబంధించి ప్రీతినొందించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
521) ఓంసాకిన్యంబాస్వరూపిణ్యైనమః=పృథ్వీతత్వం, మూలాధారచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
522) ఓంఆజ్ఞాచక్రాబ్జనిలయాయైనమః=ఆజ్ఞాచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
523) ఓంశుక్లావర్ణాయైనమః=క్రియాయోగసాధకునికి కూటస్థములో తెల్లటి కాంతులతో కనిపించి
ప్రీతినొందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
524) ఓంషడాననాయైనమః= సమిష్టి కారణ సూక్ష్మ మరియు స్థూల అదేవిధముగా వ్యష్టి కారణ
సూక్ష్మ మరియు స్థూల అనే షట్ చేతనలు
ముఖములుగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
525) ఓంమజ్జాసంస్థాయైనమః=ఎముకలు మజ్జ అగుటకు 84దినములు పట్టును. దానియందు స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
526) ఓంహంసవతీముఖ్యశక్తిసమన్వితాయైనమః= నీరు పాలు వేరుచేయు హంస తీరున యుక్తము అ యుక్తము
వేరుచేయగల పరమహంసలముఖ్యశక్తిగా విలసిల్లు ఆ
దివ్యమాతకి నమస్కారము.
527) ఓంహరిద్రాన్నైకరసికాయైనమః=క్రియాయోగసాధకునికి సాత్వికమయిన పసుపుఅన్నమునందు
ఆసక్తి కలిగించి సాధనలోబంధించి ప్రీతినొందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
528) ఓంహాకినీరూపధారిణ్యైనమః=అజ్ఞా పాజిటివ్ చక్ర అనగా భ్రూమధ్యకూటస్థస్థిత అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
529) ఓంసహస్రదళపద్మస్థాయైనమః=సహస్రారచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
530) ఓంసర్వవర్ణోపశోభితాయైనమః=సర్వవర్ణములతో శోభిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
531) ఓంసర్వాయుధధారాయైనమః=క్రియాయోగసాధకునికి సర్వఆయుధములను అనగా క్రియాయోగములోని
అనేక ప్రాణాయామ పద్ధతులద్వారారక్షించి ముక్తిమార్గము నొసగు ఆ దివ్యమాతకి
నమస్కారము.
532) ఓంశుక్లసంస్థితాయైనమః=మజ్జ శుక్లమగుటకు 96 దినములు పట్టును. సాంఖ్యులప్రకారము ఈ శరీరము 96 తత్వములతో కూడినది. దానియందు స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
533) ఓంసర్వతోముఖీయైనమః=సహస్రారచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
534) ఓంసర్వౌదనప్రీతచిత్తాయైనమః=క్రియాయోగికి తన సాధన అవిచ్ఛిన్నముగా కొనసాగుటకు
అన్నిరకములయిన సాత్వికాహారములయందుప్రీతిగల మనస్సును కలిగించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
535) ఓంయాకిన్యంబాస్వరూపిణ్యంనమః= సహస్రారచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
536) ఓంస్వాహాయైనమః=క్రియాయోగసాధకుల హవిస్సులను స్వీకరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
537) ఓంస్వథాయైనమః=క్రియాయోగసాధకుల హవిస్సులను స్వీకరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
538) ఓంమత్యైనమః =జ్ఞాన స్వరూపిణి
అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
539) ఓంమేధాయైనమః=జ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
540) ఓంశ్రుత్యైనమః=వేదజ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
541) ఓంస్మృత్యైనమః=పరాశర మను ఇత్యాది స్మృతి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
542) ఓంఅనుత్తమాయైనమః=అసమాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
543) ఓంపుణ్యకీర్త్యైనమః= క్రియాయోగసాధకులకుపుణ్యమును కీర్తిని ఇచ్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
544) ఓంపుణ్యలభ్యాయైనమః= క్రియాయోగసాధకులకుపుణ్యమునులభింపజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
545) ఓంపుణ్యశ్రవణకీర్తనాయైనమః= క్రియాయోగసాధకులకు పుణ్యమును ఆ తల్లి యొక్క శ్రవణము కీర్తనలను చేయుటద్వారా ఇచ్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
546) ఓంపులోమర్జితాయైనమః=మనస్సుచే ధ్యానించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
547) ఓంబంధమోచన్యైనమః = క్రియాయోగసాధకులను
సంసారబంధములనుండి విముక్తి కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
548) ఓంబంధురాలకాయైనమః=మణిపురచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
549) ఓంవిమర్శారూపిణ్యైనమః=సత్ అనగా పరబ్రహ్మయొక్క
స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
550) ఓంవిద్యాయైనమః=జ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
551) ఓంవియదాదిజగత్ప్రసవేనమః=వియత్ అనగా ఆకాశము. ఆకాశాది పంచామహాభూతములతో జగత్తును
ప్రసవించు ఆ దివ్యమాతకి నమస్కారము.
552) ఓంసర్వవ్యాధిప్రసమన్యైనమః= క్రియాయోగసాధకుల సాధన కొనసాగుటకు సాధకులను
సర్వవ్యాధులనుండి విముక్తి కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
553) ఓంసర్వమృత్యునివారిణ్యైనమః=క్రియాయోగసాధకుల సాధన కొనసాగుటకు సాధకులను
సర్వమృత్యువ్యాధులనుండి విముక్తి కలిగించి ముక్తినొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
554) ఓంఅగ్రగణ్యాయైనమః=ఆదిశక్తిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
555) ఓంఅచింత్యరూపాయైనమః=ఊహకందని ఆ దివ్యమాతకి నమస్కారము.
556) ఓంకలికల్మషనాశిన్యైనమః=క్రియాయోగసాధకుల కల్మషనాశిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
557) ఓంకాత్యాయన్యైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో అద్భుత ప్రకాశముగా కనిపించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
558) ఓంకాలహంత్రైనమః=క్రియాయోగసాధకులకు అమరత్వము ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
559) ఓంకమలాక్షనిషేవితాయైనమః= క్రియాయోగసాధకులకు సంసారతగులములేని నేత్రములుగల అమరత్వము ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
560) ఓంతాంబూలపూరితముఖీయైనమః=క్రియాయోగసాధకులకు పరాశక్తిని ప్రసాదించి పరిపూర్ణత
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
561) ఓందాడిమాకుసుమప్రభాయైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో అద్భుత
దివ్యకుసుమప్రకాశముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
562) ఓంమృగాక్ష్యైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో అద్భుత దివ్యసుందరమయిన జింక
కన్ను మాదిరి మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
563) ఓంమోహిన్యైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో అద్భుత దివ్యసుందరమయిన మోహింపజేయు
మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
564) ఓంముఖ్యాయైనమః= క్రియాయోగసాధకులకు ప్రపంచములోని అన్నింటికంటే ముఖ్యురాలయి
కూటస్థములో అద్భుతమయిన మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
565) ఓంమృడాన్యైనమః= క్రియాయోగసాధకులకు సుఖమునిచ్చు కూటస్థములో అద్భుతమయిన
మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
566) ఓంమిత్రరూపిణ్యైనమః= క్రియాయోగసాధకులకుమిత్రరూపిణిగా కూటస్థములో అద్భుతమయిన
మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
567) ఓంనిత్యతృప్తాయైనమః= క్రియాయోగసాధకులకు కూటస్థములో అద్భుతమయిన మూడవనేత్రముగా
కనిపించి నిత్యతృప్తినొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
568) ఓంభక్తనిధయేనమః= క్రియాయోగసాధకభక్తులకు కూటస్థములో అద్భుతమయిన మూడవనేత్రముగా
కనిపించు నిధిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
569) ఓంనియంత్ర్యైనమః= క్రియాయోగసాధకభక్తులకు సర్వ ఇంద్రియవాంఛలను నియంత్రించి కూటస్థములో అద్భుతమయిన మూడవనేత్రముగా కనిపించు
ఆ దివ్యమాతకి నమస్కారము.
570) ఓంనిఖిలేశ్వర్యైనమః=సమస్త జగత్తుకి నాయకి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
571) ఓంమైత్ర్యాదివాసనాలభ్యాయైనమః= క్రియాయోగసాధకభక్తులకు స్నేహవాసనలను అందించి సర్వ ఇంద్రియవాంఛలను నియంత్రించి కూటస్థములో అద్భుతమయిన మూడవనేత్రముగా కనిపించు
ఆ దివ్యమాతకి నమస్కారము.
572) ఓంమహాప్రళయసాక్షిణ్యైనమః=మహాప్రళయసాక్షిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
573) ఓంపరాశక్త్యైనమః=సృష్టిలోని పరమాత్మను తత్ లేదా పరాశక్తి అందురు. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
574) ఓంపరానిష్ఠాయైనమః=సృష్టిలోని పరమాత్మను తత్ లేదా పరాశక్తి అందురు. అట్టి
నిష్ఠామూర్తిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
575) ఓంప్రజ్ఞానఘనస్వరూపిణ్యైనమః=సృష్టిలోని పరమాత్మను తత్ లేదా పరాశక్తి అందురు. ఆ
తత్ ప్రజ్ఞానఘనస్వరూపిణి. అట్టిది అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
576) ఓంమాధ్వీపానలసాయైనమః=క్రియాయోగసాధకభక్తులకు
ద్రాక్ష ఇత్యాది ఫలములనుండి తయారుచేయు మత్తులకంటే అద్భుతమయిన దివ్యమత్తును కలగజేయు
ఆ దివ్యమాతకి నమస్కారము.
577) ఓంమత్తాయైనమః =క్రియాయోగసాధకులకు
అద్భుతమయిన దివ్యమత్తును కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
578) ఓంమాతృకావర్ణరూపిణ్యైనమః=’అ’ నుండి ఉన్న అన్ని అక్షరములు తానే అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
579) ఓంమహాకైలాసనిలయాయైనమః=బ్రహ్మరంధ్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
580) ఓంమృణాలమృదుదోర్లతాయైనమః= క్రియాయోగసాధకభక్తులకు కూటస్థములో అద్భుతమయిన
సూక్ష్మమయిన మూడవనేత్రముగా కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
581) ఓంమహనీయాయైనమః= క్రియాయోగసాధకభక్తులకు పరమపూజనీయు రాలయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
582) ఓందయామూర్త్యైనమః= క్రియాయోగసాధకులపైన
పరమదయనుకలిగిన ఆ దివ్యమాతకి నమస్కారము.
583) ఓంమహాసామ్రాజ్యశాలిన్యైనమః=మహాశక్తిశాలిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
584) ఓంఆత్మవిద్యాయైనమః= క్రియాయోగసాధకులకు ఆత్మవిద్యనొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
585) ఓంమహావిద్యాయైనమః= క్రియాయోగసాధకులకు మహా ఆత్మవిద్యనొసగు ఆ దివ్యమాతకి
నమస్కారము.
586) ఓంశ్రీవిద్యాయైనమః= క్రియాయోగసాధకులకు పవిత్ర ఆత్మవిద్యనొసగు ఆ దివ్యమాతకి నమస్కారము.
587) ఓంకామసేవితాయైనమః= క్రియాయోగసాధకులచేత సేవించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
588) ఓంశ్రీషోడశాక్షరీవిద్యాయైనమః=విశుద్ధచక్రము16అక్షరములుగలది. ఆ చక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
589) ఓంత్రికూటాయైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ శరీర స్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
590) ఓంకామకోటికాయైనమః=క్రియాయోగసాధకుల అనేక ధర్మబద్ధమయిన కోరికలను తీర్చి ఆనందము
కలుగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
591) ఓంకటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయైనమః= క్రియాయోగసాధకుల అనేక ధర్మబద్ధమయిన
కోరికలను కటాక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
592) ఓంశిరఃస్థితాయైనమః=శిరస్సులోని సహస్రారచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
593) ఓంచంద్రనిభాయైనమః=క్రియాయోగసాధకుల మనస్సులను నియంత్రించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
594) ఓంఫాలస్థాయైనమః= శిరస్సులోని ఆజ్ఞాచక్ర స్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
595) ఓంఇంద్రధనుఃప్రభాయైనమః=ఇంద్రధనుస్సులా ఏడురంగులతో సాధకుల కూటస్థములో విలసిల్లు
ఆ దివ్యమాతకి నమస్కారము.
596) ఓంహృదయస్థాయైనమః=క్రియాయోగ సాధకుల హృదయములో విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
597) ఓంరవిప్రఖ్యాయైనమః= క్రియాయోగ సాధకుల
కూటస్థములో సూర్యతేజస్సుతో విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
598) ఓంత్రికోణాంతరదీపికాయైనమః=క్రియాయోగసాధకుల కూటస్థములోని మూడవనేత్రములో
త్రికోణాకృతిలో విలసిల్లు ఆ దివ్యమాతకి
నమస్కారము.
599) ఓందాక్షాయణ్యైనమః=బ్రహ్మరంధ్రముక్రిందనున్న సహస్రారచక్రము ఉత్తరము.
గుదస్థానమువద్దనున్న మూలాధారచక్రము దక్షిణము. సహస్రారచక్రము ఉత్తరమునుండి
మూలాధారచక్రము దక్షిణ దిక్కుకు ప్రయాణించు ఆ దివ్యమాతకి నమస్కారము.
600) ఓందైత్యహంత్ర్యైనమః= క్రియాయోగ సాధకులకు అడ్డుతగిలే నకారాత్మకశక్తులను
నాశనముచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
601) ఓందక్షయజ్ఞవినాశిన్యైనమః= క్రియాయోగ సాధకులకు అడ్డుతగిలే అహంకారమును
వినాశనముచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
602) ఓందరాందోలితదీర్ఘాక్షైనమః=క్రియాయోగ సాధకులకుకూటస్థములో మూడవ నేత్రముగా
కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
603) ఓందరహాసోజ్వలన్ముఖీయైనమః=క్రియాయోగ సాధకులకుకూటస్థములో మూడవ నేత్రముగా
కనిపించి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
604) ఓంగురుమూర్త్యైనమః=క్రియాయోగ సాధకులకుసద్గురువు అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
605) ఓంగుణనిధయేనమః=క్రియాయోగ సాధకులకు సమస్తసద్గుణములను కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
606) ఓంగోమాత్రేనమః=క్రియాయోగ సాధకులకు కామధేనువులాంటిఆ దివ్యమాతకి నమస్కారము.
607) ఓంగుహజన్మభువేనమః=క్రియాయోగ సాధకులకు తత్ అనే గుహలోనికి ప్రవేశమునిచ్చి మరియొక
జన్మనిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
608) ఓందేవేశ్యైనమః=సమస్త దేవతలకు అధిష్ఠానమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
609) ఓందండనీతిస్థాయైనమః=శ్వాసను అస్త్రముగా ఉపయోగించటమే శ్వాస్త్రము. అది వాడుకలో
శాస్త్రము అయినది క్రియాయోగ సాధకుల మేరుదండములో అర్థవంత శాస్త్రము అనగా అర్థవంత
మయిన శాస్త్రముగా ఉండుటయే ఆ దివ్యమాతకి నమస్కారము.
610) ఓందహరాకాశరూపిణ్యైనమః=క్రియాయోగ సాధకులకు దహరాకాశము అనగా హృదయస్థ అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
611) ఓంప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితాయైనమః=అన్నివేళలా పూజింపదగిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
612) ఓంకళాత్మికాయైనమః=సర్వకళామతల్లి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
613) ఓంకళానాథాయైనమః=సర్వకళలకు నాథఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
614) ఓంకావ్యాలాపవినోదిన్యైనమః=క్రియాయోగసాధన అనే కావ్యాలాపముతో సంతుష్టినొందు ఆ
దివ్యమాతకి నమస్కారము.
615) ఓంసచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయైనమః=పరిపూర్ణ జ్ఞానవతి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
616) ఓంఆదిశక్త్యైనమః=ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
617) ఓంఅమేయాయైనమః=కొలతకు అందని ఆ దివ్యమాతకి నమస్కారము.
618) ఓంఆత్మనేనమః=సమస్తజీవులకుఆత్మరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
619) ఓంపరమాయైనమః=సమస్తజీవులకు ఉత్కృష్టరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
620) ఓంపాపనాకృత్యైనమః=సమస్తజీవులను క్రియాయోగసాధనద్వారా పావనమొనర్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
621) ఓంఅనేకకోటిబ్రహ్మాండజనన్యైనమః=అనేకకోటిబ్రహ్మాండములకు జనని అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
622) ఓందివ్యవిగ్రహాయైనమః=దివ్యమంగళరూపి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
623) ఓంక్లీంకార్యైనమః=స్వాధిష్ఠానచక్రములో క్రియాశక్తిరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
624) ఓంకేవలాయైనమః=కేవలము శుద్ధ జ్ఞానశక్తిస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
625) ఓంగుహ్యాయైనమః=క్రియాయోగసాధన అనేది గుహ్యము అనగా రహస్యమయి నది. (ర)రహితమయిన
(హస్యము) హాస్యము గలది.అట్టి తీవ్రమయిన సాధనకు ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
626) ఓంకైవల్యపదదాయిన్యైనమః=క్రియాయోగసాధన అనేది గుహ్యము అనగా రహస్యమయి నది.
(ర)రహితమయిన (హస్యము) హాస్యము గలది.అట్టి తీవ్రమయిన సాధనకు ఆనందించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
627) ఓంత్రిపురాయైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ అనే త్రిపురములలోనుండు ఆ
దివ్యమాతకి నమస్కారము.
628) ఓంత్రిజగద్వంద్యాయైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ అనే త్రిపురము లలోనూ
పూజింపబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
629) ఓంత్రిమూర్త్యైనమః=సృష్టి స్థితి లయ అనగా బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులు అనే
త్రిమూర్తులు తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
630) ఓందశేశ్వర్యై నమః=పంచకర్మేంద్రియములు మరియు పంచజ్ఞానేంద్రియములకు
అధిష్ఠానంతానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
631) ఓంత్ర్యక్షర్యై నమః=అకార ఉకార మకార సంయుక్తమయిన ఓంకారము తానే అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
632) ఓందివ్యగంధాఢ్యాయైనమః=క్రియాయోగికి తన సాధనలో దివ్యగంధాలను అందజేసి
ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
633) ఓంసింధూరతిలకాంచితాయైనమః=క్రియాయోగికి తన సాధనలో కూటస్థములో సింధూర
తిలకమురంగులో కనబడి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
634) ఓంఉమాయైనమః=సృష్టిలోని పరమాత్మస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
635) ఓంశైలేంద్రతనయాయైనమః=క్రియాయోగికి తన సాధనలో కూటస్థములో మూడవ నేత్రముగా కనబడి
అస్థిరము వేడిఅయిన మనస్సును స్థిరమయిన
చల్లని మనస్సుగా చేసి ఆనందింపజేయు
ఆ దివ్యమాతకి నమస్కారము.
636) ఓంగౌర్యైనమః=క్రియాయోగికి తన సాధనలో కూటస్థమునందు గౌరవర్ణములో మూడవ నేత్రముగా కనబడి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
637) ఓంగంధర్వసేవితాయైనమః=క్రియాయోగసాధకుని ఇంద్రియములు మనస్సుచే సేవించబడు ఆ
దివ్యమాతకి నమస్కారము.
638) ఓంవిశ్వగర్భాయైనమః=విశ్వమే గర్భముగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
639) ఓంస్వర్ణగర్భాయైనమః=అందమయిన విశ్వమే గర్భముగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
640) ఓంవరదాయైనమః =క్రియాయోగసాధకుని
సాధనకి ఆనందించి ధర్మబద్ధమయిన వరములు
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
641) ఓంవాగధీశ్వర్యైనమః=వాక్కుకి అధిష్టానమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
642) ఓంధ్యానగమ్యాయైనమః=క్రియాయోగసాధకుని ధ్యానమునకు గమ్యము అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
643) ఓంఅపరిచ్ఛేధ్యాయైనమః=దేశ కాలములకు అతీతమయి విలసిల్లు ఆ దివ్యమాతకి
నమస్కారము.
644) ఓంజ్ఞానదాయైనమః=క్రియాయోగసాధకునికి జ్ఞానప్రదాయినియైన ఆ దివ్యమాతకి నమస్కారము.
645) ఓంజ్ఞానవిగ్రహాయైనమః=జ్ఞానమూర్తిగా విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
646) ఓంసర్వవేదాంతసంవేద్యాయైనమః=ఉపనిషత్తులచే తెలిసుకోదగిన జ్ఞానమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
647) ఓంసత్యానందస్వరూపిణ్యైనమః=సత్యము మరియు ఆనందస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
648) ఓంలోపాముద్రార్చితాయైనమః=అగస్త్యుని భార్య లోపాముద్రవంటి మహాసతీమణులచే
ధ్యానించబడిన ఆ దివ్యమాతకి నమస్కారము.
649) ఓంలీలాక్లప్తబ్రహ్మాండమండలాయైనమః=తన మాయతో బ్రహ్మాండములను సృష్టించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
650) ఓంఅదృశ్యాయైనమః=క్రియాయోగసాధకుని అజ్ఞానమును అదృశ్యముచేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
651) ఓందృశ్యరహితాయైనమః=క్రియాయోగసాధకుని అజ్ఞానమును దృశ్యరహితము చేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
652) ఓంవిజ్ఞాత్ర్యైనమః=సర్వజ్ఞ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
653) ఓంవేద్యవర్జితాయైనమః=సర్వమునకు అతీతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
654) ఓంయోగిన్యైనమః=క్రియాయోగసాధకుని అజ్ఞానమును అదృశ్యముచేసి యోగినిచేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
655) ఓంయోగదాయైనమః=క్రియాయోగసాధకుని అజ్ఞానమును అదృశ్యముచేసి జ్ఞానము ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
656) ఓంయోగ్యాయైనమః=క్రియాయోగసాధకుని అజ్ఞానమును అదృశ్యముచేసి జ్ఞానము ప్రసాదించి
యోగ్యులను చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
657) ఓంయోగానందాయైనమః=క్రియాయోగసాధకునికి తన యోగములో ఆనందము కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
658) ఓంయుగంధరాయైనమః=యుగములనుధరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
659) ఓంఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యైనమః=ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
660) ఓంసర్వధారాయై నమః=సర్వమునుధరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
661) ఓంసుప్రతిష్ఠాయైనమః=క్రియాయోగసాధకునికి సుప్రతిష్ఠ కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
662) ఓంసదసద్రూపధరిణ్యైనమః=సత్ అసత్తులకు అతీతమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
663) ఓంఅష్టమూర్త్యైనమః=పంచమహాభూతములు మరియు త్రిగుణములు వ్రాసి అష్టమూర్తి
స్వరూపమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
664) ఓంఅజాజైత్రైనమః=క్రియాయోగసాధకునికి సాధనా విజయమును కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము. ఆ దివ్యమాతకి నమస్కారము.
665) ఓంలోకయాత్రావిధాయిన్యైనమః=జనన మరణములతో కూడిన లోకయాత్రా విధాయిని అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
666) ఓంఏకాకిన్యైనమః=ఆమెకంటే ఇతరమయినది లేనిది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
667) ఓంభూమరూపాయైనమః=సర్వాంతర్యామి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
668) ఓంనిర్ద్వైతాయైనమః=అద్వైతరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
669) ఓంద్వైతవర్జితాయైనమః=అద్వైతరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
670) ఓంఅన్నదాయైనమః=జీవకోటికి అన్నప్రసాదరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
671) ఓంవసుదాయైనమః=భూదేవరూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
672) ఓంవృద్ధాయైనమః=క్రియాయోగసాధకునికి సాధనలోఅభివృద్ధి కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
673) ఓంబ్రహ్మాత్మ్యైక్యస్వరూపిణ్యైనమః=పరమాత్మ మరియు ఆత్మకు ఐక్యమును అనగా
అబేధమును చూపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
674) ఓంబృహత్యైనమః=గరిష్టముకంటే గరిష్టమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
675) ఓంబ్రాహ్మణ్యైనమః=క్రియాయోగసాధకునికి సాధనలోఅభివృద్ధి కలగజేసి బ్రహ్మజ్ఞానము
కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
676) ఓంబ్రాహ్మ్యైనమః=సృష్టికర్త అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
677) ఓంబ్రహ్మానందాయైనమః=క్రియాయోగసాధకునికి సాధనలోబ్రహ్మానందము కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
678) ఓంబలిప్రియాయైనమః=సాధనలో కామ క్రోధ లోభ మోహ మద మరియు మాత్సర్యములనే
అరిషడ్వర్గాలను బలియుచ్చు క్రియాయోగసాధకునికి ప్రియము కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
679) ఓంభాషారూపాయైనమః=సత్ అసత్తులకు అతీతమయిన భాషారూపి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
680) ఓంబృహత్సేనాయైనమః=సకారాత్మక మరియు నకారాత్మక శక్తులకు సేనాని అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
681) ఓంభావాభావవివర్జితాయైనమః=సత్ అసత్తులకు అతీతమయిన భాషారూపి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
682) ఓంసుఖారాధ్యాయైనమః= క్రియాయోగసాధకుని ఆరాధనకి సుఖమునిచ్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
683) ఓంశుభకర్యైనమః=క్రియాయోగసాధకుని ఆరాధనకి శుభమునిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
684) ఓంశోభనాసులభాగత్యైనమః=క్రియాయోగసాధకుని ఆరాధనకి సులభగతిఅయిన ఆ దివ్యమాతకి
నమస్కారము
685) ఓంరాజరాజేశ్వర్యైనమః=ఆత్మవిద్యలకెల్ల ఆత్మవిద్య అయిన ఆ దివ్యమాతకి నమస్కారము
686) ఓంరాజ్యదాయిన్యైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యారాజ్య ప్రదాయిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము
687) ఓంరాజ్యవల్లభాయైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యారాజ్య ప్రసాదించటములో ప్రీతిగల ఆ దివ్యమాతకి నమస్కారము
688) ఓంరాజత్కృపాయైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యారాజ్య ప్రసాదించటములో కృపగల ఆ దివ్యమాతకి నమస్కారము.
689) ఓంరాజపీఠనివేశితనిజాశ్రయాయైనమః=క్రియాయోగసాధకునికి అత్యుత్తమ మయిన
ఆత్మవిద్యారాజ్యమునందు ప్రవేశింపజేసి ఆశ్రయమిచ్చు
ఆ దివ్యమాతకి నమస్కారము.
690) ఓంరాజ్యలక్ష్మ్యైనమః=క్రియాయోగసాధకునికి అత్యుత్తమ మయిన ఆత్మవిద్యారాజ్యమునందు
ప్రవేశింపజేసి ఆశ్రయమిచ్చు ఆ దివ్యమాతకి
నమస్కారము.
691) ఓంకోశనాథాయైనమః=అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశములకు
అధీశ్వరి అగు ఆ దివ్యమాతకి నమస్కారము.
692) ఓంచతురంగబలేశ్వర్యైనమః=అవచేతన జాగ్రత అధిచేతన మరియు తురీయాతీత అవస్థలకు
అధీశ్వరి అగు ఆ దివ్యమాతకి నమస్కారము.
693) ఓంసామ్రాజ్యదాయిన్యైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యారాజ్యము ప్రసాదించటములో
కృపగల ఆ దివ్యమాతకి నమస్కారము.
694) ఓంసత్యసంధాయైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యారాజ్యము ప్రసాదించి సత్యసంధత్వము కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము.
695) ఓంసాగరమేఖలాయైనమః=క్రియాయోగసాధకునికి
ఆత్మవిద్యాసాగరము అనే వడ్డాణము
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
696) ఓందీక్షితా యైనమః=క్రియాయోగదీక్షాసాధకునికి
ఆత్మజ్ఞానమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
697) ఓందైత్యశమన్యైనమః=క్రియాయోగదీక్షాసాధకులకు నకారాత్మకశక్తులనుండి ఉపశమనము
కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
698) ఓంసర్వలోకవశంకర్యైనమః=క్రియాయోగదీక్షాసాధకులకు సర్వలోకములను వశమొనర్చు ఆ
దివ్యమాతకి నమస్కారము.
699) ఓంసర్వార్ధదాత్ర్యైనమః=క్రియాయోగదీక్షాసాధకులకు ధర్మబద్ధమైన సర్వకోరిక లను ఆ దివ్యమాతకి నమస్కారము.
700) ఓంసావిత్ర్యైనమః=సృష్టి లోని పరమాత్మ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
701) ఓంసచ్చిదానందరూపిణ్యైనమః=సత్ చిత్ ఆనంద స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
702) ఓందేశకాలాపరిచ్ఛిన్నాయైనమః=దేశ కాలములకు అతీతము అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
703) ఓంసర్వగాయైనమః=సర్వము తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
704) ఓంసర్వమోహిన్యైనమః=సర్వులను మోహింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
705) ఓంసరస్వత్యైనమః=జ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
706) ఓంశాస్త్రమయ్యై నమః=శ్వాసను అస్త్రముగా ఉపయోగించటమే శ్వాస్త్రము. అది వాడుకలో
శాస్త్రము అయినది. క్రియాయోగాసాధకులకు అట్టిశాస్త్రము అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
707) ఓంగుహాంబాయైనమః= క్రియాయోగాసాధకుల కూటస్థము అను గుహలో దర్శనమిచ్చు ఆ
దివ్యమాతకి నమస్కారము.
708) ఓంగుహరూపిణ్యైనమః= క్రియాయోగాసాధకుల కూటస్థము అను గుహలో దర్శనమిచ్చు ఆ
దివ్యమాతకి నమస్కారము.
709) ఓంసర్వోపాధివినిర్ముక్తాయైనమః=క్రియాయోగాసాధకుల సర్వ ఉపాధులనుండి
ముక్తులనుజేసి మోక్షము ప్రసాదించునదియైనఆ దివ్యమాతకి నమస్కారము.
710) ఓంసదాశివపతివ్రతాయైనమః= క్రియాయోగాసాధకులకు సదా శివము అనగా మంగళము కలిగించు
వ్రతము అనగా సాధనయందు నిమగ్నము చేయునదియైనఆ దివ్యమాతకి నమస్కారము.
711) ఓంసంప్రదాయేశ్వర్యైనమః=క్రియాయోగాసాధనా సంప్రదాయమునకు ఈశ్వరి అయినఆ దివ్యమాతకి
నమస్కారము.
712) ఓంసాధ్వ్యైనమః=క్రియాయోగాసాధనా సంప్రదాయసాధ్వీమణులకు లక్ష్యమయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
713) ఓంగురుమండలరూపిణ్యైనమః=క్రియాయోగాసాధనాగురువులకు మండల స్వరూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
714) ఓంకులోత్తీర్ణాయైనమః=క్రియాయోగాసాధకులకు కుల ఉత్తీర్ణత కలగజేయు ఆ దివ్యమాతకి
నమస్కారము. క్రియాయోగాధ్యానముజేయువాడు శూద్రుడు, ఆధ్యానముతో కుండలినిని జాగృతిచేసి,
జాగృతిచెందినకుండలిని మూలాధార చక్రమునుత్రాకితే
క్షత్రియుడు,స్వాధిష్ఠానచక్రమునుత్రాకితే వైశ్యుడు లేదా ద్విజుడు, మణిపురచక్రమునుత్రాకితే విప్రుడు,
అనాహతచక్రమునుత్రాకితే బ్రాహ్మణుడు అగును.
715) ఓంభగారాధ్యాయైనమః=క్రియాయోగాసాధకుల భగారాధ్య అనగా భక్తి జ్ఞానముల తో
ఆరాధించబడునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము
716) ఓంమాయాయైనమః=మాయారూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము
717) ఓంమధుమత్యైనమః= క్రియాయోగాసాధకులకు తియ్యటిమతి అనగా సుబుద్ధిని ప్రసాదించునది అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
718) ఓంమహ్యైనమః=సృష్టిలోని మహి అనగా భూమి ఆమె అనేక రూపములలో ఒకటి. అట్టి ఆ
దివ్యమాతకి నమస్కారము.
719) ఓంగణాంబాయైనమః=సాధకుని శరీరములోని సకారాత్మక మరియు
నకారాత్మక గణములన్నిటికీ తల్లి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
720) ఓంగుహ్యకారాధ్యాయైనమః=క్రియాయోగాసాధకులచే
కూటస్థము అను గుహలో ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
721) ఓంకోమలాంగ్యైనమః=క్రియాయోగాసాధకుల కనుబొమ్మలమధ్యనున్న కూటస్థము అను గుహలోసూక్ష్మాతిసూక్ష్మమయిన
మూడవనేత్రముగా కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
722) ఓంగురుప్రియాయైనమః=క్రియాయోగాసాధకుల కనుబొమ్మలమధ్యనున్న కూటస్థము అను గుహలోసూక్ష్మాతిసూక్ష్మమయిన
మూడవనేత్రముగా గురు రూపములో ప్రియముగా కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
723) ఓంస్వతంత్రాయైనమః=క్రియాయోగాసాధకులకు స్వతంత్రము అనగా మోక్షము మోక్షమునిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
724) ఓంసర్వతంత్రేశ్యైయైనమః=సర్వతంత్రములకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
725) ఓందక్షిణామూర్తిరూపిణ్యైనమః=సహస్రారము ఉత్తరము. మేరుదందములోనున్న మూలాధారచక్రము
దక్షిణము. దక్షిణమున మూర్తించిన ఆ తల్లి రూపిణికి నమస్కారము.
726) ఓంసనకాదిసమారాధ్యాయైనమః=సనక సనందన సనాతన మరియు సనత్కుమారులు బ్రహ్మ
మానసపుత్రులు. వీరు పరమాత్మయొక్క శుద్ధనిర్మాణాత్మక ప్రకృతి. సనక(మొట్టమొదటి), సనందన(సంతోషముతోకూడిన) సనాతన(నిత్యమయిన) మరియు
సనత్కుమారులు(నిత్యయౌవనం). వీరు శుద్ధముగా అమాయకముగా ఉండిపోయి సంతానోత్పత్తికి
ఇష్టపడలేదు. కాని నిత్యసంతోషి అయిన పరమాత్మ మరియు మహాప్రకృతిలోని అంతర్గత ఆనందము
కలిసి సత్వ రజో తమోగుణములకు దారితీసినది. మహాప్రకృతిలోని ఈ మూడుగుణములు
కదలకుండాయున్న చెరువులోని నీరులాగా శాంతముగా యున్నవి. కదిలే లేక కదిలించే
స్పందనగుణముగల రజోగుణము మిగిలిన సత్వ మరియు తమో గుణముల స్పందనలకు దారితీసినది. అందువలన స్పందనాయుత మయిన రజోగుణమును
బ్రహ్మ అందురు. స్థితివంతమయిన సత్వగుణమును విష్ణువు అంటారు. లయకారకమయిన తమో
గుణమును శివుడు అంటారు. మహాప్రకృతిలోని అనేకరూపములలో అనుభూతిచెందటము అనే కోరిక తన
అంతర్గతమయిన ఆనందమును ఈ మూడు గుణములమీద నాలుగు ప్రధానమయిన నిర్మాణాత్మకభావనలను
రుద్దుతుంది. అవి స్పందన(ఓం), కాలము, దేశము మరియు అణువు.
సనకాదులచే ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
727) ఓంశివజ్ఞానప్రదాయిన్యైనమః= క్రియాయోగాసాధకులకుమంగళప్రదమయిన శుద్ధ జ్ఞానమును
ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
728) ఓంచిత్ కళాయైనమః=క్రియాయోగాసాధకులకు జ్ఞానచైతన్యమును ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
729) ఓంఆనందకలికాయైనమః=క్రియాయోగాసాధకులకు జ్ఞానానందమును ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
730) ఓంప్రేమరూపాయైనమః=క్రియాయోగాసాధకులకు
ప్రేమరూపమును ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
731) ఓంప్రియంకర్యైనమః=క్రియాయోగాసాధకులకు ప్రియము కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
732) ఓంనామరూపాయణప్రీతాయైనమః=ఓం అను తన నామమును ఉచ్ఛారణ చేయు క్రియాయోగాసాధకులయందు
ప్రీతియున్న ఆ దివ్యమాతకి నమస్కారము.
733) ఓంనందివిద్యాయైనమః=క్రియాయోగాసాధకులకు ఆనందకరమయిన ఆత్మబోదను ప్రసాదించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
734) ఓంనటేశ్వర్యైనమః=సృష్టిలోని ప్రతిదీ ఒక నటనమే. దానికి అధిపతి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
735) ఓంమిధ్యాజగదధిష్ఠానాయైనమః=జగత్ అనేది మిధ్య. దానికి అధిపతి అయిన ఆ దివ్యమాతకి
నమస్కారము.
736) ఓంముక్తిదాయైనమః=క్రియాయోగాసాధకులకు ముక్తిని ప్రసాదించు ఆ దివ్యమాతకి
నమస్కారము.
737) ఓంముక్తిరూపిణ్యైనమః=క్రియాయోగాసాధకులకు ముక్తిని ప్రసాదించు రూపిణి అయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
738) ఓంలాస్యప్రియాయైనమః=సృష్టిలోని ప్రతిదీ ఒక నటనమే. ఆ నటనము ప్రియమయిన ఆ
దివ్యమాతకి నమస్కారము.
739) ఓంలయకర్యైనమః=లయకారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
740) ఓంలజ్జాయైనమః=క్రియాయోగాసాధన చేయనివారలకు ’అయ్యో మనము చేయలేకపోయామే’ అనే
లజ్జనికలగజేసి క్రియాయోగాసాధనకు ప్రోత్సహించు ఆ దివ్యమాతకి నమస్కారము.
741) ఓంరంభాదివందితాయైనమః=అందరిచేత పూజింపబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
742) ఓంభవదావసుధావృష్ట్యైనమః=సంసారమును భవసాగరముఅంటారు. క్రియాయోగసాధనాపరులను
ఈభవసాగరము దుఃఖమునుండి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
743) ఓంపాపారణ్యదవానలాయైనమః=క్రియాయోగసాధనాపరులను పాపారణ్యము నుండి దావాగ్నిలాగా
దహించి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
744) ఓందౌర్భాగ్యతూలవాతూలాయైనమః= దూదిని ఎగరగొట్టు పెనుగాలిలాగా క్రియాయోగసాధనాపరుల
దౌర్భాగ్యమును ఎగరగొట్టి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
745) ఓంజరాధ్వాంతరవిప్రభాయైనమః=క్రియాయోగసాధనాపరులు వృద్ధులయిననూ వృద్ధాప్యము
అడ్డురాకుండా సాధనకొనసాగించుటకు శక్తినిచ్చిరక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
746) ఓంభాగ్యాబ్ధిచంద్రికాయైనమః=క్రియాయోగసాధనాపరులకు సాధనాభాగ్యమును శుక్లపక్షచంద్రికమాదిరి వృద్ధిపొందించు ఆ
దివ్యమాతకి నమస్కారము.
747) ఓంభక్తచిత్తకేకిఘనాఘనాయైనమః=క్రియాయోగసాధనాపరులమనస్సును నెమలిమాదిరి
ఎగిరిగంతులువేయించి ఆనందపరచు ఆ దివ్యమాతకి నమస్కారము.
748) ఓంరోగపర్వతదంభోళ్యైనమః=క్రియాయోగసాధనాపరులకు అడ్డురాకుండా రోగములు అనే
పర్వతములను వజ్రాయుధములాంటి తన శక్తిచే నిర్మూలించి సాధకుని ఆనందపరచు ఆ దివ్యమాతకి నమస్కారము.
749) ఓంమృత్యుదారుకుఠారికాయైనమః=క్రియాయోగసాధనాపరులకు అడ్డురాకుండా మృత్యువును కూడా
కట్టెలను ఖండించు గొడ్డలిమాదిరి తన శక్తిచే నిర్మూలించి సాధకుని ఆనందపరచు ఆ దివ్యమాతకి నమస్కారము.
750) ఓంమహేశ్వర్యైనమః=మహాశక్తిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
Comments
Post a Comment