ఓనం

                              ఓనం
మహావిష్ణువు బలిచక్రవర్తిని వామనుని అవతారములో వచ్చి మూడు అడుగుల భూమిని దానముగా ఇవ్వమని అడుగుతాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినక  మూడు అడుగుల భూమిని దానము ఇస్తాడు బలిచక్రవర్తి. 
ఇక్కడ వా అనగా వరిష్ఠ అని అర్థము. మన అనగా మనస్సు అని అర్థము. వామన అనగా వరిష్ఠ.  మనస్సు అని అర్థము. అనగా స్థిరమైన మనస్సు అని అర్థము..  స్థిరమైన మనస్సుకి మూడు అడుగులు అవసరము. సాధకునికి మూడు విధములయిన ఆటంకములు వస్తుంటాయి. అవి ఆది 
భౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక ఆటంకములు. 
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు,  ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి. అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా  నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను  వైరాగ్యముతో అణగ త్రొక్కవలయును.  పరమాత్మని ప్రార్థించి  మూడు అడగటములు చేయవలయును. అవే ఈ  మూడు అడుగులు. ఏది చేసినా పరమాత్మే. కనుక ఆయనే ఈ మూడు అడుగులు సాధకుడిని అడుగుతాడు. సాధకుడు తీవ్రధ్యానములో ఉన్నప్పుడు ఆంగుష్ఠ ప్రమాణములో కూటస్థములో సూక్ష్మరూపములో వామనుడిగా  తన స్వస్వరూపము కనబడుటే దీనికితార్కాణం. 
బలి అనగా వైరాగ్యముతో అణగ త్రొక్కుట. చక్రవర్తి అనగా ఆలోచనా వృత్తులు వర్తులాకారముతో చక్రములాగా వస్తూ ఉంటాయి. బలి చక్రవర్తి అనగా వర్తులాకారములో వస్తున్న ఆలోచనలను వైరాగ్యముతో అణగ త్రొక్కుట.. శుక్రాచార్యుడు అనగా అహంకారమును ఆచరించేవాడు.  కామ, క్రోధ, లోభ, మోహ,మద మరియు మాత్సర్యములకు కారణభూతమయిన అహంకారమును త్యజించుటే బలి.  వీటిని మనలోనే ఉంచుకొని వాటికి అతీతముగా సాధకుడు ఎదగ వలయును. మనలోనే ఉంచుకొనటమే పాతాళానికి అణగ త్రొక్కుట.  పాతాళము అనగా ఎక్కడోలేదు., మనలోనే ఉన్నది. అతీతము అనగా అవి మనలోనే ఉంటాయి. కానీ వైరాగ్యముతోవాటిని అధిగమించి వాటికి అతీతముగా సాధకుడు ఎదుగుట.

   కౌతా మార్కండేయశాస్త్రి, క్రియాయోగి., ద్యానమందిరం, సికిందరాబాద్.

  


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana