ఓంకారము:
ఓంకారము:
ఓం అనేది శబ్దము
మరియు దాని ప్రతీక కూడా. ఆకారా, ఉకార మరియు మకారములతో కూడియున్న ఓంకారము విశ్వజనీన
లక్షణములను కలిగియున్నది. సమస్త
భౌతికజగత్తు స్ఫోటము అనగా శబ్దమునుండి ఏర్పడినదే. ఇది వ్యక్తబ్రహమము. దాని వాచకము
అన్ని స్వరములను తనలో ఇముడ్చుకున్న ఓంకారము.
ఓంకారములో ‘అ’ బిందురూపములో సృష్టి(బ్రహ్మ), ‘ఉ’ స్థితి(విష్ణు), ‘మ’ లయ(మహేశ్వర) లకు ప్రతీకలు. ఆత్మ అణువుకంటే సూక్ష్మము, బ్రహ్మాండముకంటే
పెద్దది.
ధ్యానికి తన
ధ్యానములో వినబడే నాదబ్రహ్మఓంకారమేసాధకుని పరమాత్మతో అనుసంథానము చేస్తుంది.
సకలవేదముల లక్ష్యము ఓంకారమే.
విశ్వ, తైజస,
ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత మరియు పరమాత్మ అనే ఎనిమిది
అంగములు, అకార, ఉకార, మకార మరియు అర్థమాత్ర అనే నాలుగు పాదములు, జాగ్రత, స్వప్న మరియు
సుషుప్తి అనే మూడు అవస్థలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ మరియు మహేశ్వర అనే అనే
ఐదు దేవతలుగలఓంకారము ను గురించి తెలియనివాడు బ్రహ్మపదమును పొందలేడు.
హ్రస్వో దహతి
పాపాని దీర్ఘో మోక్షప్రదాయకః
అధ్యాయనః
ప్లుతోవాపి త్రివిధోచ్ఛారణేనతుః
హ్రస్వం
పొట్టిగాను, ప్లుతం కొంచెం దీర్ఘముగాను, దీర్ఘముగానూ
ఓంకారాన్ని ఉచ్ఛరించవచ్చు.
హ్రస్వం పాపములను తొలగించు నదిగాను, ప్లుతం ఇష్టసిద్ధి నొసంగునదిగాను, దీర్ఘము
ముక్తిప్రదాయిని గానూ ఓంకారము వెలసిల్లుతున్నది.
ఓంకారాన్నిస్థూలము
అనగా వినబడునట్లుగా ఉచ్ఛరిస్తే వాచకము (నాదం) అని, సూక్ష్మం అనగా నోరు తెరవకుండా
గొంతులోనే ఉచ్ఛరిస్తే ఉపాంశు(బిందు) అని, మరియు కారణము అనగా వినబడనట్లుగా
ఉచ్ఛరిస్తే మానసికము(కళ) అని అంటారు.
ఉత్తమః తత్వచింతనం
మధ్యమా శాస్త్రచింతనం
అథమా మంత్రచింతనం
తీర్థభ్రాంతి అథమాథమమ్
బ్రహ్మచింతనం ఉత్తమము,
శాస్త్రచింతనం మధ్యమము, మంత్ర చింతనం అథమము, తీర్థయాత్రలు అథమాథమము.
క్రియాయోగి
శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి
శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గ్రంథములు.:
సృష్టి జన్మ సాధన (ఇంగ్లీషు, తెలుగు మరియు హింది)
కృష్ణ క్రియ కైవల్య
సమాధి సర్వరోగ నివారిణీ క్రియలు(ఇంగ్లీషు, తెలుగు మరియు హింది)
జ్యోతిష్యము వాస్తు రుద్రాక్ష స్ఫటికం కుండలినీ క్రియాయోగం (ఇంగ్లీషు మరియు తెలుగు)
మరియు గీతా అంతరార్థము( తెలుగు)
Comments
Post a Comment