KRIYA

Sunday, 28 September 2014

అవతారములు

యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతి భారత,
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్          4--7
ఓ అర్జునా, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి యగుచుండునో, అప్పుడునన్నునేనే సృష్టించుకొనుచుందును. 
శక్తిని ఎవరూ పుట్టించ లేరు,నాశనముచేయలేరు. ఒక శక్తిని ఇంకొక శక్తిగా మార్చుకోవచ్చు. అనగా విద్యుత్శక్తిని యాంత్రికశక్తిగా మార్చు కొని ఎలెక్ట్రిక్ ఫాన్లను నడుపుకోవచ్చు. అట్లాగే యాంత్రికశక్తితోయున్న టర్బైన్లను త్రిప్పివిద్యుత్శక్తిగా మార్చుకోవచ్చు. బ్రహ్మాండములో జరిగేది అంతా ప్రగతికోసమే. అందువలన ఆ ప్రగతికి అవరోధము ఏర్పడినప్పుడు,అప్పుడు పరమాత్మ తనను తానే సృష్టించుకొనును. 
అవతారములు:
1)మత్స్య: సందేహసాగరమునుండి విజ్ఞానఖనిని గ్రహించు.
2)కూర్మ: వైరాగ్యముతో జీవితాన్ని సాగించు.
3)వరాహ: భక్తి, క్రమశిక్షణలు అనే దంత ద్వయంతో,  వ అనగా వరిష్ఠ మైన,  రాహ అనగా దారి, వరిష్ఠమైన దారిలో నడుస్తూ నీ కర్తవ్యమును నిర్వహించు.
4)నారశింహ: నువ్వు నరరూపములో ఉన్న సింహానివి. సింహము మూడుసంవత్సరములకొకసారి సివంగితో కలుస్తుంది. అదేవిధముగా అహంకారమును  వర్జింఛి, కామమును నియంత్రించి పరమాత్మతో అనుసంథానం పొందు.
5)వామన: వ అనగా వరిష్ఠమైన,మన అనగా మనస్సుతో ఆది భౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక అడ్డంకులను అధిగమించి అంకిత లేక త్యాగాభావముతో పరమాత్మతో అనుసంథానం పొందు.  
6)పరశురామ: జ్ఞానపరశు(గొడ్డలి)తో అజ్ఞానమును నరికి, జ్ఞానమార్గమున వర్తించి పరమాత్మతో అనుసంథానం పొందు.
7)శ్రీరామ: జీవితములో ఎదురయ్యేది విదినిర్ణయం. దానిని పరమాత్మ మనిషికిచ్చిన ఇచ్ఛాశక్తితో స్వయంకృషితో పరమాత్మతో అనుసంథానం పొందు.
8)శ్రీకృష్ణ:  పరమాత్మకి అనుకూలుడవై సాధన చెయ్యి. 
గజేంద్రమోక్షము:
గజము అనగా ఏనుగు. గ అనే అక్షరము జ్ఞానమునకు ప్రతీక. జ అనగా కూడినది. గజ అనగా జ్ఞానముతో కూడినది. గజ తెలివి అనగా గొప్ప తెలివి. గజ ఈతగాడు అంటే గొప్ప ఈతగాడు. గజ ఇంద్రియము అనగా గొప్ప ఇంద్రియము. మనస్సే గొప్ప ఇంద్రియము. 
మన ఏవ మనుష్యాణాం బంధమోక్ష కారణం. 
మనస్సే బంధానికి కాని, మోక్షానికి గాని కారణము. 
మొసలి సంసారమునకు ప్రతీక. 
క్రియాయోగసాధనతో మనస్సును స్థిరపరచి సహస్రారచక్రదర్శనము చేసికొని  సంసారమనే బంధమునుండి బయటపడు. 
సహస్రారచక్రమే సుదర్శనచక్రము. సుదర్శన అనగా చూడదగినది.
అహంకారముతో మగ్గుతున్న మనిషికి నీవు నరుడివి కావు, దివ్యాత్మస్వరూపుడివి, సింహానివి అని తెలియజెప్పుటకు ఉద్దేశించిన ది నరసింహావతారము. నరుడు సింహావతారము ఎత్తి, క్రియాయోగ సాధకుడై, సింహప్రయత్నము అనగా గట్టి ప్రయత్నముజేస్తే, అహం కారమునుండి బయటికి రాగలడు అని ఉద్భోదించటమే హిరణ్యకశిపు వధ. 
వ  వరిష్ఠమైన రాహ  మార్గము, వరాహమనగా  గొప్ప మార్గము. క్రియాయోగసాధనా మార్గము. అని ఉద్భోదించటమే హిరణ్యాక్ష వధ.
వరాహ అవతారములో పృథ్వీని పరమాత్మ రెండు దంతములతో పైకెత్తును. పృథ్వీకి ప్రతీక మనిషి. సంసారము నీటికి ప్రతీక.  మనిషికి రెండుజ్ఞానదంతములుండును. రెండుదంతములు జ్ఞానమునకు ప్రతీ కలు. మనిషికి పెద్దవాడయ్యేసరికి రెండుజ్ఞానదంతములు వచ్చును.  ఓమనిషీ, సంసారమనే నీటిలో మునిగిపోకు. క్రియాయోగాసాధనతో సాధించిన  జ్ఞానముతో సంసారమునుండి బయటపడు. పరమాత్మతో అనుసంధానంపొందు అని. తెలియజెప్పుటకు ఉద్దేశించినది వరాహా వతారము. వరాహ/నరసింహావతారములలో స్థూలశరీరమునకు సంబంధించిన  బ్రహ్మగ్రంది విచ్ఛేద ము జరుగుతుంది.  
సాధకునిలోని అహంకారము మరియు కామము అనే  రావణుని, కుంభము లాగించి నిద్రమత్తుకలగజేయు  కుంభకర్ణుని క్రియా యోగముతో నిర్మూలించి పరమాత్మతో అనుసంధానం పొందు అని. తెలియజెప్పుటకు ఉద్దేశించినది శ్రీరామావతారము. శ్రీరామావ తారములో సూక్ష్మశరీరమున కు సంబంధించిన  రుద్రగ్రంది విచ్ఛేదము జరుగుతుంది. 
శిశు పిల్లతనమును పాలుడు పాలించేవాడు, శిశుపాలుడు.
దంతావక్తృడు దంతములువచ్చే సమయములోయుండే    పిల్ల తనము. 
నీలో శిశువుకున్న అమాయకత్వములాంటి మిగిలి యున్న నేను, నాది అనే కాస్తో కూస్తో అహంకారమనే శిశుపాల మరియు దంతావక్తృలను నిర్మూలించి పరమాత్మతో అనుసంధానం పొందు అని. తెలియజెప్పుటకు ఉద్దేశించినది శ్రీకృష్ణావతారము. శ్రీకృష్ణావతారములో కారణ శరీరమునకు సంబంధించిన  విష్ణుగ్రంది విచ్ఛేదము జరుగుతుంది. 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే              8
సాధు సజ్జనల సంరంక్షించుటకొఱకై, దుర్మార్గులను వినాశమొనర్చు టకొఱకును, ధర్మమును స్థాపించుటకొఱకును, నేను ప్రతియుగమున అవతరించుచుండును. 
మనుజులందరూ పరమాత్మస్వరూపులే. కెరటములన్నిటిలోను మహాసముద్రముయొక్క నీరె ఉన్నట్లుగా, మంచి చెడూ అనే బేధములేకుండా అందరిలోనూ ఉన్నది  ఆపరమాత్మ చైతన్యమే. రాక్షసిబొమ్మ గానీ, దేవతబొమ్మగానీ చేసేది ఆ రాతితోనే లేదా ఆ మట్టి తోనే. శ్రీ కృష్ణ, మహావతర్ బాబాజీ, లాహిరీ మహాశయా, స్వామేశ్రీయుక్తేస్వరజీ, పరమహంస యోగానందజీ లాంటి వారిలో ఉండేది కూడా ఆపరమాత్మ చైతన్యమే. వారందరూ తలచుకుంటే వారి మూడవ నేత్రము తెరచి సర్వనాశనము చేయగలరు.  కానీ అదికాదు కావలసినది. సాధారణ మానవుడు వారినుండి భయపడ వలసిన పనిలేదు.  వారిప్రేమ ద్వారా వారు మనలను ఆకర్షించుకొని పరమాత్మవైపు తిరిగి వెళ్లవలసిన దారిచూపిస్తారు.
తల్లిదండ్రులు వారి వారి పిల్లలు ఎంత చెడ్డవారు అయిననూ వారు మంచిగా మారాలని కోరుకుంటూ తగిన సలహాలు ఇస్తూ ఉంటారు. పిల్లలు ఆపెద్దలమాటలువిని వారి వారి నడవడి మార్చుకుంటే సరే, లేదా వారి ఖర్మ అని వదిలేస్తారు. చంపివేయరు. మన అందరికీ నిజమయిన తల్లి తండ్రీ ఆ పరమాత్మేగదా. ఆయన మనలో మంచి మార్పు రావాలని కోరుకుంటాడు, అంతేగాని, మన చెడ్డతనము చూసి చంపివేయాలని కోరడు ఆ పరమాత్మ.         
జన్మకర్మచమేదివ్యమేవం యోవేత్తి తత్వతః 
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున.               9
అర్జునా, ఎవడు ఈ ప్రకారముగా నాయొక్క దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యథార్థముగా తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మరల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు.
సాధనతో ఈమాయనుండి బయటపడి తిరిగి తన స్వస్థానమైన పరమాత్మలోకి చేరవలయును. 
వీతరాగభయక్రోధామన్మయా మాముపాశ్రితాః
బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః                     10
అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును, నాయందేలగ్నమైన చిత్తముగలవారునూ, నన్నే ఆశ్రయించిన వారును అగు అనేకులు జ్ఞానతపస్సుచే పవిత్రులై నాస్వరూపమును అనగా మోక్షమును పొందియుండిరి. 
సాధనలో ప్రాణశక్తిని లేదా కుండలినిశక్తిని మేరుదండములోని ఇడా(ఎడమవైపు) పోనిస్తే భయము, క్రోధము, పింగళా (కుడి వైపు)  పోనిస్తే అనురాగము, మోహమూ వగైరాలు కలుగుతూ ఉంటాయి. సాధకుడు కేవలము ఇడా పింగళాల మధ్యనున్న సుషుమ్నా ద్వారానే పోనిస్తూ, కూటస్థుడి మీదనే దృష్టి ఉంచి ధ్యానము చేయవలయును. ఆవిధముగా ధ్యానము చేసిన సాధకులు జ్ఞానతపస్సుచే పవిత్రులై పరమాత్మ స్వరూపమును  పొందెదరు.           

No comments:

Post a Comment