KRIYA

Monday, 15 September 2014

మాంసభక్షణ విడనాడవలయును

మానవుడు భుజించు అన్నపానములు జఠరాగ్నిచే మూడువిధము లైన మార్పుచెందును. 
1) స్థూలభాగము మలమూత్రములుగాను,  2)మధ్యభాగము రసమై రక్తమై మాంసాది సప్తదాతువులుగాను, 3) కనిష్ఠభాగము మనస్సుగాను మారును. కనుక ఆహారాన్నిబట్టి మనస్సు ఉండును. 
పంచీకరణరీతిగ చూసినా ఆహారములోగల ఆకాశసూక్ష్మంశము అంతః కరణగాను, వాయుర్వాంశము మనస్సుగాను, అగ్నాంశము బుద్ధి గాను, జలాంశము చిత్తముగాను, పృథ్వంశము అహంకారముగాను మారును. 
1)శుక్ల శోణిితములు, రక్తముగల పశుపక్ష్యాదులను, వాటి బిడ్డలను, గ్రుడ్లను వధించు హింసను ఆమోదించువాడు, 2)మాంసభక్షణము ఉత్తమమని బోధించువాడు, 3) వధించు వాడు,  4)అమ్మువాడు, 5)కొనువాడు, 6)వండువాడు, 7)తెచ్చువాడు,  8)తినువాడు అయిన ఈ ఎనిమిదిమంది ఘాతుకులే. 
మనిషికి మేరుడండములో 33వెన్నుపూసలున్నవి. 32 అడుగుల పొడవైన ప్రేగులున్నవి. 32 దంతములున్నవి. ఈరోజుతిన్న శాఖా హార భోజనము అరుగుటకు మనిషికి 24గంటలుపట్టును. కనీసము 8మారులు ఆహారము నమిలితినవలయును. పశువుకు 11 పూసలుంటవి. 10 అడుగుల పొడవైన ప్రేగులుంటవి. 10 దంతము  లుంటవి. అనగా మనిషికంటె మూడువంతులుపూసలు, ప్రేగులు మరియు దంతములు తక్కువగా ఉంటవి. తిన్న ఆహారము అరుగుటకు పశువు రోజుమొత్తమునెమరువేస్తూఉంటుంది. 
మనిషితిన్న మాంసాహారం అరుగుటకు 72 గంటలు పట్టును. పశువును నరుకుతున్నప్పుడు భయము, పిరికితనము, కోపముతో పేడవేస్తూ నన్ను ఈవిధముగా నరుకువానికి రేపు ఇదేగతిపట్టుగాక అని ఆక్రోశముతోజచ్చును. మనిషి దంతముల కూడా మాంసభక్షణకు యోగ్యముకావు. కనుక మాంసభక్షణ వెంటనే విడనాడవలయును.
          ఒక చెట్టును నరికితే చిగురించి ఆయా జాతికి సంబంధించిన కొమ్మలు, ఆకులు, పుష్పములు మరియు ఫలములే వచ్చును. ఇంకొక చెట్టువి రావు. వేదములో పరమాత్మ పరమదయాళువుగా చెప్పబడ్డాడు. అవసరమువచ్చినపుడు అవతారముయెత్తి  రాక్షసుల ను సంహరించి శిష్టులను కాపాడినాడు. అటువంటి పరమాత్మ మాంసభక్షణను ప్రోత్సహించునా? యజ్ఞములలో బలి ఇవ్వవలసినది పశువులనుకాదు. కామ, క్రోధ, లోభ, మోహ మద, మాత్సర్యములు అనే పశువులను బలి ఇవ్వవలెను. 
12 ఉత్తమ ప్రాణాయామములవలన ప్రత్యాహారము అ ఇంద్రియ విషయములనుండి దూరము, 
144 ఉత్తమ ప్రాణాయామములవలన ధారణ అనగా చిత్త ఏకాగ్రత,   20,736 ఉత్తమ ప్రాణాయామములవలన సమాధిస్థితి అనగా పరమాత్మతో అనుసంధానం కలుగును. కనుకపరమాత్మతో అనుసంధానం కలుగుటకు మూగపశువులను బలిచేయటము అన్యాయము.                   

No comments:

Post a Comment