శివ పంచాక్షరీ మరియు నవగ్రహమంత్రము యోగార్థము


శివ పంచాక్షరీ మరియు నవగ్రహమంత్రము యోగార్థము

శివ పంచాక్షరీ మంత్రము:
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై శ్రీ నకారాయ నమః శివాయ
నాగేంద్రుని అనగా ఇంద్రియములను హారముగా ధరించినవాడు, మూడుకనులవాడు అనగా మూడవ నేత్రము కలవాడు, భస్మము ఒంటినిండా పూసుకున్నవాడు అనగా మాయకు అతీతుడు, మహేశ్వరుడు అనగా తీక్షణమయిన  ఈక్షణములను లేదా చూపులను శ్వరము లేదా బాణములుగా ధరించినవాడు,  నిత్యమైనవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు అనగా సర్వ దిక్కులను వ్యాపించినవాడు, న అక్షరమైన అనగా ఏ ఆకారమునకు పరిమితి కానివాడు అయిన శివునకు (శుద్ధ మనస్సుకు)నమస్కారము. 

మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై శ్రీ మకారాయ నమః శివాయ

ఆకాశగంగా జలము అనే చందనము పూయబడినవాడు అనగా ప్రకృతియే చందనముగా  పూయబడినవాడు, నందీశ్వరుడు అనగా మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అనే   ప్రమథ గణములకు నాయకుడు, మందారము అనగా మనస్సు  మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అనే అనేకమైన పుష్పములచే పూజింపబడినవాడు,    అక్షరమైన అనగా ఏ ఆకారమునకు పరిమితి కానివాడు అయిన శివునకు(శుద్ధ మనస్సుకు) నమస్కారము.

శివాయ గౌరీవదనాబ్జ వింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ 
శ్రీ నీలకంఠావృషధ్వజాయ తస్మై శ్రీ శికారాయ నమః శివాయ
మంగళకరుడు, పార్వతీముఖము అనగా పరాశక్తి అనే పద్మసముదాయమును వికసింపజేయు సూర్యుడు, దక్షుని అనగా అహంకారముతో కూడిన యజ్ఞము నాశనముజేసినవాడు, నీలకంఠుడు అనగా క్రియాయోగాసాధనతో కూడిన యజ్ఞము వలన కంఠము నీలవర్ణముగా మార్పుచెందినవాడు, జండాపై ఆంబోతెద్దు  మాదిరి  అనగా మేరుదండము నిఠారుగా ఉన్నవాడు, శి అను అక్షరమైన అనగా మంగళకరమైన శివునకు(శుద్ధ మనస్సుకు) నమస్కారము.

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై శ్రీ వకారాయ నమః శివాయ
వశిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు, మొదలగు మునీంద్రులచేత పూజింపబడు జటాజూటము అనగా మనస్సు కలవాడు,  చంద్రుడు (శుద్ధ మనస్సు), సూర్యుడు (పరాశక్తి), అగ్ని(శుద్ధ మానవచేతన), మూడు కనులుగా కలవాడు, వ అను అక్షరమైన అనగా వరిష్ట మయిన  శివునకు (శుద్ధ మనస్సుకు) నమస్కారము.

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై శ్రీ యకారాయ నమః శివాయ
యక్షస్వరూపుడు (కంటికి కనబడనివాడు), జటలను(శుద్ధ మనస్సులను) ధరించినవాడు,  పినాకము అను మేరుదండ  ధనుస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశామునందు ఉండు  దేవుడు, దిగంబరుడు,    అను అక్షరమైన అనగా పవిత్రమయిన శివునకు(శుద్ధ మనస్సుకు) నమస్కారము.
నవగ్రహ మంత్రం యోగార్థము
బుధ(Mercury)—శుక్ర(Venus)—పృథ్వీకుజ(Mars)—గురు(Jupiter)— శని(Saturn)—Uranus—Neptune—Pluto. ఇది క్రమము.

బుధరాజకుమారుడు.
గురుమంత్రి
శుక్రమంత్రి
సూర్య ఆత్మరాజు
చంద్ర మనస్సు రాజు
కుజ సేనాధిపతి ధైర్యము, మరియు స్థైర్యము 
శని సేవకుడు క్రూరుడు, దుఃఖ హేతువు
గురు జ్ఞానము సుఖము, విద్య, మరియు ఆద్యాత్మికత
శుక్ర వీరత్వము, వీర్యము
రాహు, కేతు సిపాయిలు 
సూర్య మంత్రం :
సప్తాశ్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 
ఈ శరీరము రథము. దీనిని స్థితివంతము చేయుటకు పరమాత్మ శక్తి ఏడురకముల ప్రాణశక్తిగా రూపొందుతుంది.
అవి: 1) ఆవాహ, 2) ప్రవాహ, 3) వివహ, 4) పరావహ, 5) ఉద్వహ, 6) సంవహ, మరియు 7) పరివహ
సూర్యుడు ఈ పృథ్వీకి ముఖ్యమయిన పరమాత్మశక్తికి మూలము. ఆ సూర్యుడు ఒక తెల్లటి పద్మము మాదిరి ఉన్నాడు. ఆ సూర్యునికి నమస్కారము. సహస్రార చక్రము దీని స్థానము.
ఆయన మమ్ములను విద్య, ఆద్యాత్మికత, మరియు ఆర్ధిక విషయములలో దారి చూపించుగాక.  
చంద్ర మంత్రం :
శ్వేతాశ్వ సమారూఢం కేయూర మకుటోజ్వలం
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహం  
చంద్రుడు మనస్సును నియంత్రిన్చును. శుద్ధమనస్సు తెల్లటి అశ్వ రథసారథి లాంటివాడు. తెల్లటి అశ్వము స్వచ్చమైన ఇంద్రియములాంటిది. శుద్ధమనస్సు అనేది రత్నములతో అలంకరించబడిన కిరీటములాంటిది. శివుడు శుద్ధ మనస్సులతో అలంకరించబడిన దేవుడులాంటిది. ఆ సూర్యునికి నమస్కారము. ఈ అనాహతచక్రము దీని స్థానము. ఇది నీలి రంగులో ఉందును.
ఆయన మమ్ములను వ్యాపారము, మరియు మానసిక విషయములలో దారి చూపించుగాక.
మంగళమంత్రం :
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమాప్రభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం  
ఒక మెరుపు మాదిరి ఉండే ఆయన కాంతి, ఆయన చేతిలో శక్తి అనే ఆయుధము ధరించి మహా శక్తివంతుడు అయిన కుమారుడు అని పిలవబడుతున్నాడు, అంతః బాహ్య శత్రువులను జయించగల సమర్థుడు.  అట్టి పృథ్వీ పుత్రుడయిన కుజుడుకి నమస్కారము.  కుంకుమ రంగులో ఉండే  మణిపురచక్రము ఆయన స్థానము.
ఆయన మమ్ములను అంతః బాహ్య శత్రువులను జయించగల సమర్థులను చేయు గాక. మమ్ములను తప్పులుచేయకుండా కాపాడుగాక.  

బుధమంత్రం :
త్రయంగు కళికా శ్యామం రూపేన ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్యం గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం
బుధుడు తెలివి, మంచి వక్త, వ్యాపారవేత్త, మరియు బుద్ధిమంతుడు. ఆయనకు నమస్కారము.
ఆయన స్థానము ఆజ్ఞాచక్రము. తెల్లటి పాలమాదిరిఉండే చక్రము ఇది.  

గురుమంత్రం :
దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం
బుద్ధిపూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహం  
బృహస్పతి దేవతలకు, ఋషులకు, మునుల కు, మరియు సాధకులకు, దారిచూపించు గురువు.  ఆయన మూర్తీభవించిన బుద్ధి రూపుడు. ఆయన మూడు లోకములలోనూ, భౌతిక, సూక్ష్మ, మరియు కారణ, పూజనీయుడు.
ఆయనకు నమస్కారము.
ఆయన స్థానము స్వాదిష్టానచక్రము. ఆయన పసుపు – కాషాయ మిశ్రమ రంగు. ఆయన మమ్ములను వివాహము, మరియు విద్యా విషయముల యందు దార్శనికత ఇచ్చుగాక.  

శుక్రమంత్రం :
హిమకుండ మృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తానాం తం శుక్రం ప్రణమామ్యహం
శుక్రుడు నకారాత్మక శక్తుల నాయకుడు. ఆయన వాటిని ప్రకోపింప నీయకుండా చేసి, మాకు లాభము చేకూర్చుగాక.  ఆయన శాస్త్రములకు అధికారి. అట్టి శుక్రునకు నమస్కారము. ఆయన మాకు సుఖ సంతోసములను కలుగచేయుగాక. ఆయన స్థానము విశుద్ధచక్రము. స్వచ్ఛమయిన తెలుపు రంగు కలది ఈవిశుద్ధ చక్రము.
శనిమంత్రం :
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహం
సూర్యుడు అనగా పరమాత్మ చేతనా పుత్రుడు శని. పరమాత్మ శక్తి మరియు ప్రకృతిల కలయికే శని. అట్టి శనిదేవునకు నమస్కారము.
ఆయన స్థానము మూలాధారచక్రము. పసుపు రంగులో ఉండే చక్రము ఇది.  
ఆయన మమ్ములను ఐశ్వర్యము, గృహ సంబంధ విషయములు, మరియు రోజువారీ కార్యక్రమములలోను, మమ్ములను తప్పులుచేయకుండా కాపాడుగాక.
రాహుమంత్రం :
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్ధనం  
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
రాహువు అనేది ఛాయాగ్రహము. చంద్రుడు అనగా మనస్సు, మరియు సూర్యుడు అనగా పరమాత్మ శక్తులయొక్క కలయిక వలన కలిగిన పుత్రుడు. ఆయన అర్థ శరీరముతో మహాశక్తివంతుడు. ఆయన శక్తివంతమయిన జ్ఞానవంతమయిన మనస్సుకు పుట్టినవాడు. రాహువు నల్లరంగు గలవాడు. అట్టి రాహువునకు నమస్కారము.
కేతుమంత్రం :
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మంటకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
కేతువు అనేది ఛాయాగ్రహము. పలాశ పుష్పం మాదిరి ఉండే ముదురు ఎరుపు రంగులో ఉండే గ్రహము కేతువు. ఆయన మనకు ఆధ్యాత్మికత వయిపు దార్శనికత్వము చూపుతాడు. అందువలన ఆయన చాలా కఠినముగా, గంభీరము, మరియు జాగ్రత్తగా ఉంటాడు.
అట్టి రాహువునకు నమస్కారము. 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana