నాలుగు కులాలు


 వేదాంతం
శరీరములు మూడు. స్థూలము, సూక్ష్మము, మరియు కారణము అని.
గుణములు మూడు.  సత్వం  అనగా జ్ఞానం, రజస్సు అనగా శక్తి , మరియు తమస్సు అనగా ద్రవ్యరాశి.
నాలుగు కులాలు:  తమస్సు అనగా అజ్ఞానం,  తమస్సురజస్సు అనగా  అజ్ఞానం + క్రియాశీలత,  రజస్సుసత్వం అనగా సత్కర్మ +  జ్ఞానం,  మరియు సత్వం అనగా  జ్ఞానం.
పుట్టుకతో నిమిత్తములేకుండానే ఏదో ఒక కులములో చేరవచ్చు. జీవితములో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజశక్తులమీద ఆధారపడిఉంటుంది. 
కామం అనగా కోరిక అనగా ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం శూద్రదశ.
అర్థం అనగా లాభార్జనం చేస్తూనే కోరికలను అదుపులో ఉంచుకొనే వైశ్యదశ.
ధర్మం అనగా స్వయంశిక్షణతోనూ , బాధ్యతతోనూ , సత్కర్మతోనూ గడిపే క్షత్రియదశ.
మోక్షం అనగా విడుదల, మతధర్మ బోధనలతో కూడిన జీవితము బ్రాహ్మణదశ.
ఈ నాలుగు కులాల మానవులకు సేవచేయడానికిఉపకరించే సాధనములు శరీరము, మనస్సు, సంకల్పశక్తి మరియు ఆత్మ. 
సనాతనఋషులు చెప్పిన మాయను ఆధునిక కాలము లోని గొప్ప ఆవిష్కరణలు ధృవీకరణ చేశాయి. 
ఉదాహరణకు ఒకే ఒక చర్యను చూడటం అసంభవం అని మన ఋషులు చెప్పినదే సమానంగానూ, వ్యతిరేకంగాను రెండు బలాలు ఉంటాయి అని న్యూటన్ సిద్ధాంతము దీనికి ఉదాహరణ.
కారణ విశ్వం  భావముల ఆనందమయ లోకం. ఇది సూక్ష్మ విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది.
దానితరువాతది హిరణ్యలోకం. ధ్యానశక్తిగల  సాధకుల లోకమే  హిరణ్యలోకం.  ఈ హిరణ్యలోకములో సద్భక్తులు , మంచి సాధకులు తమతమ కర్మబీజములను దగ్ధము చేసికుంటారు. 
దానితరువాతది సూక్ష్మలోకం.  ఈ సూక్ష్మలోకంలో భూమి మీద అంతకు క్రితమువి మరియు అప్పుడే మరణించిన జీవులన్నీ ఉంటాయి. అవి తమతమ గుణకర్మలననుసరించి వివిధ క్షేత్రాలలో నివసిస్తారు, వివిధ క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ వారు వారు చేసికున్న పుణ్యము ప్రకారము ఉంటుంది.  ఎక్కువ పుణ్యం చేసికున్న వారు  తక్కువ  పుణ్యం చేసికున్న వారి క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ ఉంటుంది. సూక్ష్మలోకవాసులు కాంతి మీద ఆధారపడిజీవిస్తారు.  జీవులు వారి వారి కర్మఫలమునుబట్టి భూమి మీదకి రావడానికిరెండు నుండి ఐదువేల సంవత్సరాల సమయము పడుతుంది.  భూమిమీద జీవులు ప్రాణశక్తి మీద ఆధారపడిజీవిస్తారు.       ఈ సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది. అనగా భౌతిక విశ్వంలో కనిపించే వాటికన్నా అనేకమైన సౌర, నక్షత్ర మండలములు ఎన్నో ఉంటాయి. సూక్ష్మలోకవాసులు పాతవారైనా కొత్త వారైనా, ఒకరినొకరిని గుర్తుపట్టగలరు.  అనగా పాతవారు అనగా క్రితం జన్మలోనివారు. కొత్తవారు అనగా అప్పుడే స్తూలశరీరము భూమిమీద వదలినవారు.   సూక్ష్మలోక రాత్రులు పగలులు మనము నివసించే భూమిమీద కంటే దీర్ఘముగా ఉంటాయి.     
పరమాత్మ  ఈ భూమిని ఒక భావముగా రూపొందించాడు.  దాన్ని త్వరితము చేశాడు.  పరమాణుశక్తి,   ఆ తరువాత పదార్ధము పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఈ విధమైన ఘన గోళముగా రూపొందించినాడు.  కేవలం పరమాత్మ సంకల్పం చేత కూడియుంటాయి, వికల్పము చేత విడిపోయి శక్తిగా పరివర్తన చెందుతాయి.  అణుశక్తి తన మూలచైతన్యము లోనికి వెళ్ళిపోతుంది, భూభావం స్తూల(త)త్వము లోంచి అదృశ్యం ఔతుంది. 
మనిషి స్వప్నంలో సృష్టించే విశ్వములు కూడా దేవుని మౌళిక ఆదర్శాన్ని అనుసరించి అప్రయత్నముగానే కరిగిస్తాడు.
పరిపూర్ణసిద్ధిని పొందినవాడు సిద్ధుడు. 
జీవించిఉండగానే ముక్తిని పొందినవాడు జీవన్ముక్తుడు.
సర్వోత్కృష్ట  స్వతంత్రుడు అనగా మృత్యుంజయుడుని పరాముక్త అంటారు. 


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana