2. పతంజలి సాధన పాదము 2.1.to 2.55
2. సాధన పాదము
2.1. తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః
తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ మూడును కలిసినదే క్రియాయోగము.
2.2. సమాధి భావనార్థః క్లేశతనూకరణార్ధశ్చ
సమాధి భావనార్థః = సమాధి
సిద్ధి, క్లేశతనూకరణార్ధశ్చ= అవిద్యాదిక్లేశములను,
సమాధి సిద్ధి
కలిగించునది, అవిద్యాదిక్లేశములన
క్షీణింపజేయును. ,
2.3.
అవిద్యాస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః
అవిద్యా=అవిద్య,
అస్మిత=అస్మిత లేదా నేను నాది అనే తత్వము, రాగ=రాగము, ద్వేషా=ద్వేషము, అభినివేశాః=
అభినివేశము లేదా పట్టు, అనేవి పంచక్లేశములు.
అవిద్య, అస్మిత లేదా నేను
నాది అనే తత్వము, రాగము, ద్వేషము, అభినివేశము
లేదా జీవితము మీద పట్టు, అనేవి పంచక్లేశములు.
2.4. అవిద్యాక్షేత్రముత్తరేషాం
ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణాం
ప్రసుప్త=అస్మితకు
ప్రసుప్త (దాగియున్న), తను=రాగమునకు తనువు అని,
విచ్ఛిన్నో=విచ్ఛిన్న అనేది ద్వేషమునకు, నుదారము అనగా ప్రేరేపణ అనునది అభినివే శమునకు, అవిద్యాక్షేత్రముత్తరేషాం=ఇంతకుముందు
చెప్పిన అవిద్యకు మూలకారణ ము అగుచున్నవి.
అస్మితకు ప్రసుప్త
(దాగియున్న), రాగమునకు తనువు అనగా శరీరము
అని, విచ్ఛిన్న అనేది
ద్వేషమునకు, నుదారము అనగా ప్రేరేపణ అనునది
అభినివేశమునకు, కారణము. ఇంతకుముందు
చెప్పిన అవిద్యకు ఇవియే మూలకారణము అగుచున్నవి.
2.5. అనిత్యా శుచి దుఃఖా
నాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా
అనిత్యా శుచి దుఃఖా నాత్మసు= అనిత్యవస్తువును
నిత్యవస్తువు అనుకొనుట, అపరిశుభ్ర వస్తువును పరిశుభ్ర వస్తువుగా అనుకొనుట, దుఃఖకర
వస్తువును సుఖకర వస్తువు గా అనుకొనుట, అనాత్మ వస్తువును ఆత్మ వస్తువు గా అనుకొనుట,
నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్యా= ఈ
విపర్యభావమే అవిద్య.
అనిత్యవస్తువును
నిత్యవస్తువు అనుకొనుట, అపరిశుభ్ర వస్తువును పరిశుభ్ర వస్తువుగా అనుకొనుట, దుఃఖకర
వస్తువును సుఖకర వస్తువు గా అనుకొనుట, అనాత్మ వస్తువును ఆత్మ వస్తువు గా అనుకొనుట,
ఈ విపర్యభావమే అవిద్య.
2.6. దృగ్దర్శన
శక్త్యోరేకాత్మ తేవాస్మితా
దృగ్దర్శన శక్త్యోః= సర్వమును దర్శించువాడు
గాన పురుషునకు దృచ్ఛక్తియనియు, దర్శనశక్తి అను బుద్ధికిని, ఏకాత్మతా ఇవ=అభేదమువలెనుంఢుట,
అస్మితా= అస్మితా అను క్లేశము.
సర్వమును దర్శించువాడు
గాన పురుషునకు దృచ్ఛక్తి యని పేరు. విషయాకారముగా పరిణమించి దృశ్యమునొందును. అందువలనబుద్ధికి
దర్శనశక్తిఅనిపేరు. ఈ రెండునువేరు. కాని
ఒక్కటిగాన్నట్లుగా కనబడుటయే దుఖమునకు కారణము.
2.7. సుఖానుశయీ రాగః
సుఖానుశయీ= సుఖమును అనుసరించునది, రాగః= మోహము
సుఖమును అనుసరించునది
మోహము
2.8. దుఃఖానుశయీ ద్వేషః
దుఃఖానుశయీ=దుఃఖాన్ని అనుసరించేది,
ద్వేషః= ద్వేషము
దుఃఖాన్ని అనుసరించేది ద్వేషము.
2.9. స్వరసవాహీ విదుషోపి తథా రూఢోభినివేశః
స్వరసవాహీ=స్వభావసిద్ధముగానే, విదుషఃఅపి=విద్వాంసునకుగూడ (మనస్సున), తథా=మూర్ఖుల
మనస్సునకలుగునట్లుగానే, ఆరూఢః=నాటుకొనిన (మరణభయము), అభినివేశః=
అభినివేశము(జీవితము మీద పట్టు) అనబడును.
స్వభావసిద్ధముగానే విద్వాంసునకుగూడ(మనస్సున) మూర్ఖుల మనస్సున కలుగునట్లు గానేనాటుకొనిన(మరణభయము)
అభినివేశము(జీవితముమీదపట్టు) అనబడును.
2.10. తే ప్రతి ప్రసవ హేయాః సూక్ష్మాః
తే=అనంతక్లేశములు,
సూక్ష్మాః=క్రియాయోగముచే సూక్ష్మతనొందిన క్లేశములు లేదా దుఖములు, ప్రతి ప్రసవ
హేయాః= చిత్తనాశనమునకు కారణమగు అసంప్రజ్ఞాత సమాధిచే త్యజింపబడును.
క్రియాయోగముచే సూక్ష్మతనొందిన
క్లేశములు లేదా దుఖములు, అనంతక్లేశములు, చిత్తనాశనమునకు కారణమగు అసంప్రజ్ఞాత సమాధిచే
త్యజింపబడును.
2.11. ధ్యానహేయాస్తద్వృత్తయః
తద్వృత్తయః =క్లేశవృత్తులు, ధ్యానహేయాః=ధ్యానముచే
నిరాకరించవలయును.
క్లేశవృత్తులు ధ్యానముచే
నిరాకరించవలయును.
2.12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్ట జన్మ వేదనీయః
కర్మాశయః=కర్మ
సంస్కారములు, క్లేశమూలః=అవిద్యాది క్లేశములు మూలకారణము, దృష్టాదృష్ట జన్మ వేదనీయః= ఈ జన్మమునందే
దేహత్యాగానంతరము ఫలమునిచ్చును.
కర్మసంస్కారములు కామ అనగా
రాగము, లోభము అనగా అభినివేశము లేదా జీవితముమీదపట్టు, మోహము, క్రోధము అనగా ద్వేషముల
వలననే కలుగును. ఈ కర్మసంస్కారములే అవిద్యాది క్లేశములు అనగా దుఖములకు మూలకారణము.
వీటి త్యాగము దేహత్యాగానంతరముకూడా ఫలమునిచ్చును.
2.13. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః
మూలే=ధర్మాధర్మములకు
మూలకారణమయిన అవిద్యా క్లేశములు, సతి= ఉంటాయి, జాత్యాయుర్భోగాః = జన్మ ఆయు భోగములు,
తద్విపాకః= కర్మ ఫలమునొసగును.
అవిద్యాక్లేశములు ధర్మాధర్మములకు మూలకారణము.
అవిద్యాదులే కర్మఫలమునొసగును. అవిలేక ధర్మాధర్మములు ఫలింపజాలవు.
2.14. తే హ్లాద పరితాప
ఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్
తే= జన్మము, ఆయువు, భోగము
అనునవి మూడు విపాకములు. పుణ్యాపుణ్య హేతుత్వాత్= ఇవి పుణ్యాపుణ్యములవలన కలుగును,
హ్లాద పరితాప ఫలాః= సంతోష దుఖములే ఫలములు.
జన్మము, ఆయువు, భోగము
అనునవి మూడు విపాకములు. ఇవి పుణ్యా పుణ్యముల వలన కలుగును. సంతోష దుఖములే ఫలములు.
2.15. పరిణామ తాపసంస్కార దుఃఖైర్గుణవృత్తి విరోధాచ్చ దుఖమేవ సర్వం
వివేకినః
వివేకినః = ప్రకృతి పురుషుడు అనే
వివేకముగల యోగికి, పరిణామ తాపసంస్కార దుఃఖైః= పరిణామ దుఃఖముచేతను, తాప దుఃఖముచేతను, సంస్కార దుఃఖముచేతను, గుణవృత్తి విరోధాచ్చ=సత్వాదిగుణవృత్తులకు
పరస్పరవిరోధము వలన, దుఖమేవ సర్వం= విషయసుఖములన్నీ వివేకవంతుడు దుఃఖముగానే
తలచును.
ప్రకృతి పురుషుడు అనే
వివేకముగల యోగికి, మంచి చెడులతోకూడిన పరిణామ దుఃఖము,
తాపదుఃఖము,
సంస్కారదుఃఖము, సత్వాదిగుణవృత్తులు, మరియు విషయ సుఖ ములు
అన్నీ వివేకవంతుడు దుఃఖముగానే తలచును.
2.16. హేయం దుఃఖమనాగతమ్
అనాగతమ్= రాబోవు, దుఃఖం= దుఃఖము,
హేయం= వదలి పెట్టదగినది
రాబోవు, దుఃఖము, వదలి
పెట్టదగినది. భూత కాలములోని దుఖము అనుభవించినది. వర్తమానము
అనుభవిస్తున్నాము. ఈ రెండు దుఖములు బాధించవు.
2.17. ద్రష్టృ దృశ్యయోః సంయోగో హేయహేతుః
ద్రష్టృ దృశ్యయోః=ద్రష్టయగు
పురుషునియొక్కయు, దృశ్యమగు ప్రక్రుతియొక్కయు,
సంయోగః= సంబంధము, హేయహేతుః = హేయమగు సంసారమునకు హేతువు.
ప్రకృతి పురుషుల పరస్పర సంబంధమే
సంసారము. అదే దుఖమునకు కారణము.
2.18. ప్రకాశ క్రియాస్థితి శీలం
భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం
ప్రకాశ క్రియాస్థితి శీలం=
ప్రకాశశీలమయిన సత్వగుణము, క్రియాశీలమయిన రజో గుణము, స్థితిశీలమయిన తమోగుణము, భూతేంద్రియాత్మకం=భూతములు ఇంద్రియములు
కార్యముగాగాలదియు, భోగాపవర్గార్థం దృశ్యం=
భోగ మోక్షములు వీటి ఫలములు.
ప్రకాశశీలమయిన సత్వగుణము,
క్రియాశీలమయిన రజో గుణము, స్థితిశీలమయిన తమో గుణము. వీటిని గుణత్రయము అందురు. పురుషునకు భోగ మోక్షములుకలిగించును.
2.19. విశేషా విశేష లింగ మాత్రా
లింగాని గుణ పర్వాణి
విశేషా విశేష లింగ మాత్రా
లింగాని= 1. విశేషము, 2. అవిశేష, 3. లింగమాత్రము,
4. ఆలింగము. ఇవి చెఱగణుపుల వలె, గుణ
పర్వాణి= గుణముల అవస్థా పర్వములు.
1.
విశేషము, 2. అవిశేష, 3. లింగమాత్రము,
4. ఆలింగము. ఇవి చెఱగణుపుల వలె, గుణముల అవస్థా పర్వములు.
1.
విశేషము—ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. వీటిని
పంచభూతములు అంటారు. శ్రోత్రము, త్వక్కు,
చక్షువు, జిహ్వ, ఘ్రాణము. వీటిని పంచజ్ఞానేంద్రియములు అంటారు. వాక్కు, పాణి,
పాదము, పాయువు, ఉపస్థ వీటిని పంచకర్మేంద్రియములు అంటారు.
2.
అవిశేషములు—శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ. వీటిని పంచజ్ఞానతన్మాత్రలు
అంటారు. వీటికి అస్మిత అనగా అహంకారము కారణము. పంచజ్ఞానతన్మాత్రలు మరియు అస్మిత
అనగా అహంకారము కలిపి అవిశేషములు అంటారు.
3.
లింగమాత్రము—పంచజ్ఞానతన్మాత్రలు మరియు అహంకారమునకు కారణము
మూల ప్రకృతి. దీని మొదటి పరిణామము లేక మార్పు మహత్తత్వము. దీనినే లింగమాత్రము
అంటారు.
4.
ఆలింగము—మహత్తత్వముయొక్క పరిణామము లేక మార్పునే ఆలింగము అంటారు.
ఈ పైన చెప్పినవన్నీ గుణముల
అవస్థా పర్వములే. వీటిలో నిజానికి గుణములు నశించవు. జనించవు.
2.20. ద్రష్టాదృశిమాత్రః
శుద్ధోపి ప్రత్యయానుపశ్యః
దృశిమాత్రః= జ్ఞానస్వరూపుడగు
పురుషుడు, ద్రష్టా= ద్రష్టఅనబడును. శుద్ధోపి=శుద్ధుడే అయినాను, ప్రత్యయానుపశ్యః=జ్ఞానాధారుడు
జ్ఞానస్వరూపుడగు పురుషుడు
ద్రష్టఅనబడును. శుద్ధుడే అయినను మనస్సును అనుసరించి పనిచేయు పురుషుడు
జ్ఞానాధారుడు.
2.21. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా
దృశ్యస్యాత్మా = కనబడుచున్న, తదర్థ ఏవ= ఆ
కనబడని పరమాత్మకొఱకే.
కనబడుచున్నఈ సృష్టి ఆ
కనబడని పరమాత్మకొఱకే అనగా ఆ సత్యము వ్యక్తపఱచుటకే.
2.22. కృతార్థం ప్రతి నష్ట మప్య
నష్టం తదన్య సాధారణత్వాత్
కృతార్థం ప్రతి= వివేకము కలిగిన పురుషుని,
తద్ నష్టమపి= అదృశ్యము నాశము
నొందినదేయైనను, అన్య సాధారణత్వాత్=
అవివేకులందరికీ సాధారణమైనదిగాన, అనష్టం=అవివేకికి ఉండియే తీరును.
వివేకము కలిగిన పురుషునికి
దృశ్యములేదు. అవివేకులందరికీ దృశ్యము సాధారణ మైనది. కావున అవివేకికి దృశ్యము ఉండియే తీరును.
2.23. స్వస్వామి శక్త్యోః
స్వరూపోపలబ్ధిహేతుస్సంయోగః
స్వస్వామి శక్త్యోః=తన బుద్ధికి, పరమాత్మ
అయిన ఆదిపురుషునకు, స్వరూపోపలబ్ధి హేతు=
దృష్ట దృశ్యముల స్వరూపము సిద్ధించుటకు, కారణముఅయిన సంబంధమును, సంయోగః= సంయోగము
అంటారు.
తన బుద్ధికి, పరమాత్మ
అయిన ఆదిపురుషునకు దృష్ట దృశ్యముల స్వరూపము సిద్ధించుటకు, కారణముఅయిన సంబంధమును
సంయోగము అంటారు.
దృశ్యము పరమాత్మ అ
ధీనములో ఉండును. కనుక ఆ దృశ్యము పరమాత్మ యొక్క స్వశక్తి అని చెప్పబడును. భోగము వాటి వర్గములకు పురుషుడు పాత్రుడు.
అందువలన పురుషుని శక్తి ఆ పరమాత్మశక్తి అందురు. దానినే స్వామిశక్తి అందురు.
2.24. తస్య హేతురవిద్యా
తస్య= ప్రకృతి పురుష సంయోగము
అనే ఆ దుఃఖమునకు, హేతు= హేతు, అవిద్యా= అవిద్యయే.
2.25. తదభావాత్ సంయోగాభావో హానం
తత్ ద్రుశేః కైవల్యం
తదభావాత్=ఆ అజ్ఞానము
లేకుండుటవలన, సంయోగాభావః= సంయోగాభావము, హానం= లేదు.
తత్= అట్టి హానమే అనగా లేకుండుటయే, ద్రుశేః= జ్ఞాన స్వరూపి పురుషు నకు,
కైవల్యం=మోక్షము.
ఆ అజ్ఞానము లేకుండుటవలన సంయోగాభావము లేదు అట్టి
హానమే అనగా లేకుండుటయే, జ్ఞానస్వరూపి పురుషునకు మోక్షము.
2.26. వివేకఖ్యాతిరవిప్లవాహానోపాయః
అవిప్లవా=జ్ఞానరూపమగు,కష్టములేని,
వివేకఖ్యాతిః=పరమాత్మునిపొందుట, హానోపాయః =
హానిచేయు అవిద్యానివృత్తికి ఉపాయము.
జ్ఞానరూపమగు,
కష్టముకలుగచేయని పరమాత్ముని పొందుట, హానిచేయు అవిద్యా నివృత్తికి ఉపాయము.
2.27. తస్య సప్తధా ప్రాంతభూమిః
ప్రజ్ఞా
తస్య= అట్టి యోగికి, సప్తధా=
ఏడువిధములయిన, ప్రాంతభూమిః= సర్వాదికమయిన, ప్రజ్ఞా= ప్రజ్ఞలబించును.
అట్టి యోగికి
ఏడువిధములయిన సర్వాదికమయిన ప్రజ్ఞలబించును. అనగా సప్తచక్రములలోను కుండలినీ శక్తి
జాగృతి పొందవలయును.
2.28. యోగాంగానుష్ఠానా
దశుద్ధిక్షయే జ్ఞాన దీప్తిరా వివేకఖ్యాతేః
యోగాంగానుష్ఠానాత్= యోగమునకు
అంగములయిన యమ నియమాదులను అనుష్ఠించుట వలన, అశుద్ధిక్షయే= అజ్ఞానము నశించును.,
జ్ఞాన దీప్తిరా వివేకఖ్యాతేః= పరమాత్మ దర్శనము అగునంతవరకు జ్ఞాన దీప్తి కలుగును.
యోగమునకు అంగములయిన యమ
నియమాదులను అనుష్ఠించుట వలన, అజ్ఞానము
నశించును. పరమాత్మ దర్శనము అగునంతవరకు
జ్ఞాన దీప్తి కలుగును.
2.29. యమ నియమ ఆసన ప్రాణాయామ
ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధయోః అష్టాంగాని
యమ నియమ ఆసన ప్రాణాయామ
ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి అను యోగములోని ఎనిమిది అంగములను వరుసక్రమములో తప్పక అనుష్టించవలయును.
2.30. అహింసా సత్యమస్తేయ
బ్రహ్మచర్యా పరిగ్రహాయమాః
అహింస= అహింస (ఏ
ప్రాణికైనను హానిచేయకుండుట), సత్యం= సత్యం, అస్తేయ= ఇతరులనుండి శాస్త్రసమ్మతముగాని
లేదా ధర్మబద్ధముగాని ద్రవ్యము గ్రహించకుండుట, బ్రహ్మచర్యా= బ్రహ్మమార్గములో చరించుట అనగా నడచుట, అపరిగ్రహ=విషయోప భోగములనుత్యజించుట, యమాః=వీటిని యమములందురు.
అహింస (ఏ ప్రాణికైనను
హానిచేయకుండుట), సత్యం, ఇతరులనుండి
శాస్త్రసమ్మతము గాని లేదా ధర్మబద్ధముగాని ద్రవ్యము గ్రహించకుండుట, బ్రహ్మమార్గములో
చరించుట అనగా నడచుట, విషయోప
భోగములనుత్యజించుట, వీటిని యమములందురు.
2.31. జాతిదేశ కాల సమయా
నవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతం
తేతు= ఆ యమములు, జాతిదేశ
కాల సమయా నవచ్ఛిన్నాః= జాతి, దేశ, కాలము,
సమయము, నవచ్ఛిన్నాః= అపరిమితి
గలవి, సార్వభౌమా= సర్వావస్థలయందును, మహావ్రతం= గొప్ప వ్రతము.
ఆ యమములు, జాతి, దేశము,
కాలము, సమయము, అపరిమితి గలవి, సర్వ అవస్థ యందును గొప్ప వ్రతము అనగా
పాటించదగినవి.
2.32.శౌచ సంతోష
తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః
శౌచ సంతోష
తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని= శౌచము సంతోషము తపము స్స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, నియమాః= నియమములు.
శౌచము, సంతోషము, తపము,
స్స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానము, అనునవి నియమములు.
శౌచము—బాహ్యాంభ్యంతర
శౌచము లేక శుభ్రత, సంతోషము—శరీరము నిలబడుటకు ఉపయోకకరమైన వస్తువులను ఉపయోగించుట, తపము—తపస్సు,
స్స్వాధ్యాయము—తనను తాను చదువుట అనగా శ్వాసను చూచుట, ఈశ్వరప్రణిధానము —ఈక్షణములను (చూపులను)
శ్వరములుగా (బాణములుగా) ఉపయోగించి
పరమాత్మని ధ్యానము చేయుట.
2.33. వితర్క బాధనే ప్రతిపక్ష
భావనం
వితర్క బాధనే=ఈ
యమనియమములకు విరుద్ధమయిన ఆలోచనలు కలిగినప్పుడు, ప్రతిపక్ష భావనం= వాటికి ప్రతికూలములయిన
ఆలోచనలుచేసి వాటిని పారద్రోలవలయును.
ఈ యమనియమములకు
విరుద్ధమయిన ఆలోచనలు కలిగినప్పుడు, వాటికి ప్రతికూలములయిన ఆలోచనలుచేసి వాటిని
పారద్రోలవలయును.
2.34. వితర్కా హింసాదయః
కృతకారితానుమోదితాలోభ క్రోధ మోహ పూర్వకా మృదు మధ్యాధి మాత్రా దుఃఖా జ్ఞానానంత ఫలా
ఇతి ప్రతిపక్షభావనం
వితర్కా హింసాదయః= హింస మొదలగునవి, అహింసాది విరుద్ధములు. కృతకారితానుమోదితాః=తనచే చేయబడినవి, ఇతరులచే చేయింపబడినవి,
ఇతరులు చేయుటనుజూచి మెచ్చుకున్నవాడు, లోభ
క్రోధ మోహ పూర్వకాః= లోభ, క్రోధ, మరియు మోహ పూర్వక, మృదు మధ్యాధి మాత్రాః= మృదు,
మధ్యము, మరియు తీవ్ర భేదము గలదై, దుఃఖా జ్ఞానానంత ఫలాః= దుఃఖము, అజ్ఞానము
అనుసరించి ఫలము అనుస రించునది, ప్రతిపక్షభావనం=
ప్రతిపక్షభావనము అంటారు.
హింస మొదలగునవి,
అహింసాది విరుద్ధములు. ఇవి: తనచే చేయబడినవి, ఇతరులచే చేయింపబడినవి, ఇతరులు
చేయుటనుజూచి మెచ్చుకున్నవాడు, లోభ, క్రోధ, మరియు మోహ పూర్వక, మృదు, మధ్యము, మరియు
తీవ్ర భేదము గలదై, దుఃఖము, అజ్ఞానము అనుసరించి ఫలము అనుసరించును. దీనిని
ప్రతిపక్షభావనము అంటారు.
2.35. అహింసా ప్రతిష్ఠాయాం
తత్సనిధౌ వైరత్యాగః
అహింసా ప్రతిష్ఠాయాం= అహింసలో ప్రతిష్ఠితమైన యోగి, తత్సనిధౌ వైరత్యాగః= ఆయన
సన్నిధానమున విరోధికిగూడ వైరము ఉండదు.
అహింసలో ప్రతిష్ఠితమైన యోగికి, ఆయన సన్నిధానమున
విరోధికిగూడ వైరము ఉండదు.
2.36.సత్య ప్రతిష్ఠాయాం
క్రియాఫలాశ్రయత్వం
సత్య ప్రతిష్ఠాయాం=
సత్యము ప్రతిష్ఠించెనేని, క్రియాఫలాశ్రయత్వం= ప్రతి పనిలోనూ సత్యమే కనబడుతుంది.
సత్యము
ప్రతిష్ఠించెనేని, ప్రతిపనిలోనూ, ఆ పనిఫలితములోను, సత్యమే కనబడుతుంది.
2.37. అస్తేయ ప్రతిష్ఠాయాం
సర్వరత్నోపస్థానం
అస్తేయ ప్రతిష్ఠాయాం=
యమములోని ఒక భాగమయిన అస్తేయములో ప్రతిష్ఠితమయిన
సర్వరత్నోపస్థానం=సర్వరత్నములు ప్రాప్తించును.
యమములోని ఒక భాగమయిన అస్తేయములో
ప్రతిష్ఠితమయిన సర్వరత్నములు ప్రాప్తించును. అన్తెయము అనగా శాస్త్రసమ్మతముగాని లేదా
ధర్మబద్ధముగాని ద్రవ్యము గ్రహించకుండుట. అట్టివానికి వస్తువులు వాటంతట అవే
లభ్యమగును.
2.38. బ్రహ్మచర్య
ప్రతిష్ఠాయాం వీర్యలాభః
బ్రహ్మచర్య
ప్రతిష్ఠాయాం= బ్రహ్మములోసంచరించి ఆ
బ్రహ్మములోనే ప్రతిష్ఠితమయిన యోగికి, వీర్యలాభః=
వీర్యము లాభించును.
బ్రహ్మములోసంచరించి ఆ
బ్రహ్మములోనే ప్రతిష్ఠితమయిన యోగికి, వీర్యము లాభించును.
2.39.అపరిగ్రహ స్థైర్యే
జన్మ కథన్తాసంబోధః
అపరిగ్రహ స్థైర్యే= అపరిగ్రహము
(విషయోప
భోగములనుత్యజించుట) స్థిరాభ్యాసము ఏర్పడెనేని, జన్మ కథన్తాసంబోధః=ఏ జన్మ
ఎట్టిది అనునది చక్కగా తెలియును.
అపరిగ్రహము (విషయోప భోగములనుత్యజించుట) స్థిరాభ్యాసము
ఏర్పడెనేని, ఏ జన్మ ఎట్టిది అనునది చక్కగా తెలియును.
2.40. శౌచాత్ స్వాంగ
జుగుప్సాపరైర సంసర్గః
శౌచాత్=శౌచము అనగా
శుభ్రము వలన, స్వాంగ= తనశరీరము మీదను, జుగుప్సా= అయిష్టము, పరైః= ఇతర శరీరము మీదను, అసంసర్గః=
అయిష్టము ఏర్పడును.
శౌచముఅనగా శుభ్రము
వలన, తనశరీరము మీదను మరియు ఇతరుల శరీరము మీదను, అయిష్టము ఏర్పడును.
2.41. సత్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్యేన్ద్రియజయాత్మ దర్శన యోగ్యత్వానిచ
సత్వ= సత్వము, శుద్ధి= నిర్మలత్వము, సౌమనస్య=స్వచ్ఛత్వము,
ఏకాగ్ర్య= ఏకాగ్రత్వము, ఇంద్రియజయ= ఇంద్రియములను
వశములోనుంచుకొనుట, ఆత్మ దర్శన
యోగ్యత్వానిచ=ఆత్మసాక్షాత్కారయోగము
సత్వగుణము నిర్మలత్వమును,
దానిచే చిత్త స్వచ్ఛత్వము, దానిచే ఏకాగ్రత్వము, దానిచే ఇంద్రియ
వశము, దానిచే ఆత్మసాక్షాత్కారయోగము కలుగును.
2.42. సంతోషాదనుత్తమః సుఖలాభః
సంతోషాత్=సంతోషము లేక
సంతృప్తివలన, అనుత్తమః= అత్యుత్తమమయిన, సుఖలాభః= సుఖము లభించును
సంతోషము లేక
సంతృప్తివలన అత్యుత్తమమయిన సుఖము లభించును.
2.43. కాయేంద్రియ సిద్ధి రసుద్ధి క్షయాత్తపసః
కాయేంద్రియ సిద్ధి
రసుద్ధి క్షయాత్తపసః
తపసః= తపస్సువలన, అసుద్ధి క్షయాత్= మాలిన్యము నశించుటవలన,
కాయేంద్రియ సిద్ధిః= ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమగును.
తపస్సువలన శారీరము
లోపల బయట మాలిన్యము నశించును. అందువలన ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమగును.
2.44. స్వాధ్యాయా దిష్టదేవతా సుప్రయోగః
స్వాధ్యాయాత్= స్వాధ్యాయము
అనగా తన శ్వాసను తను చూస్తె, ఇష్టదేవతా సుప్రయోగః = ఇష్టదేవతా ప్రాప్తి కలుగును.
స్వాధ్యాయము అనగా తన
శ్వాసను తను చూస్తె లేదా గమనిస్తే, ఇష్టదేవతా ప్రాప్తి కలుగును.
2.45. సమాధి సిద్ధిః
ఈశ్వరప్రణిధానాత్
ఈశ్వరప్రణిధానాత్=
ఈక్షణములను అనగా చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానము చేయవలయును, సమాధి
సిద్ధిః= అప్పుడు ఆ తీక్షణనమయిన ధ్యానమునకు సమాధితప్పక సిద్ధించును.
ఈక్షణములను అనగా
చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానము చేయవలయును. అప్పుడు ఆ
తీణనమయిన ధ్యానమునకు సమాధితప్పక
సిద్ధించును.
2.46. స్థిరసుఖమాసనం
స్థిరసుఖమ్=
నిశ్చలమయినది, సుఖమయినది, ఆసనం= ఆసనం
నిశ్చలమయినది,
సుఖమయినది, ఆసనము.
వస్త్రము, దర్భ, కంబళి
ఆసనమునకు ఉపయోగించ వలయును. కొన్ని ఆసనములు:
పద్మాసనము, వీరాసనము,
భద్రాసనము, గోరక్షాసనము, సిద్దాసనము, కపాలాసనము, స్థిరసుఖాసనము,
పశ్చిమతాసనము, మయూరాసనము, శవాసనము, సర్వాంగాసనము,
2.47.ప్రయత్నశైథిల్యానంత
సమాపత్తిభ్యాం
ప్రయత్న= శరీర స్వాభావిక ప్రయత్నము, శైథిల్య= తగ్గినంతనే, అనంత
సమాపత్తిభ్యాం=కూటస్థమునందు ఏకాగ్రత చెందును.
శరీర స్వాభావిక
ప్రయత్నము తగ్గినంతనే కూటస్థమునందు మనస్సు
ఏకాగ్రత చెందును.
2.48. తతో ద్వన్ద్వానభిఘాతః
తతః= ఆ ఆసనసిద్ధి వలన,
ద్వన్ద్వానభిఘాతః= శీతోష్ణ ద్వంద్వములు బాధ కలుగకుండును
ఆ ఆసనసిద్ధి వలన,
శీతోష్ణ ద్వంద్వముల బాధ కలుగకుండును.
2.49. తస్మిన్ సతి శ్వాస
ప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః
తస్మిన్= ఆ ఆసనసిద్ధి, సతి= కలుగగా, శ్వాస ప్రశ్వాసయోః= శ్వాస ప్రశ్వాసలయొక్క, గతివిచ్ఛేదః=
రాకపోకలు, ప్రాణాయామః= ప్రాణాయామము.
ఆ ఆసనసిద్ధి కలుగిన
శ్వాస ప్రశ్వాసలయొక్క రాకపోకలే, ప్రాణాయామము.
2.50. బాహ్యాభ్యంతర
స్తంభవృత్తి ర్దేశకాల సంఖ్యాభిః పరి దృష్టో దీర్ఘ సూక్ష్మః
బాహ్యాభ్యంతర= బాహ్యాభ్యంతరవృత్తులు రెండు, స్తంభవృత్తిః=నిలిచిపోవును,
దేశకాల సంఖ్యాభిః= దేశము, కాలము, జ్ఞానము,ఈ మూడింటిని అభ్యాసము ద్వారా, పరిదృష్టో= గమనించబడినదై, దీర్ఘ సూక్ష్మః= దీర్ఘము,
సూక్ష్మము, అగును.
దేశము, కాలము,
జ్ఞానము, ఈ మూడింటిని అభ్యాసము ద్వారా గమనించబడినదై, శ్వాస దీర్ఘము సూక్ష్మము
అగును. శ్వాస యొక్క బాహ్యాభ్యంతరవృత్తులు రెండు నిలిచిపోవును.
2.51.బాహ్యాభ్యంతర విషయా
క్షేపీ చతుర్థః
బాహ్య=రేచకమును, అభ్యంతరవిషయ=పూరకప్రాణాయామమును,
అక్షేపీ= అడ్డగింపని ది, చతుర్థః= నాలుగవది. అనగా కేవల కుంభకము.
ఆత్మసాక్షాత్కారము
దగ్గిరవుతున్నకొలది, రేచకము, పూరకమునకుమధ్య దూరము పెరుగును. దానినే కేవల కుంభకము అంటారు.
2.52.తతః క్షీయతే
ప్రకాశావరణం
తతః= ఈ ప్రాణాయామ
అనుష్ఠానము వలన, క్షీయతే= నశించును, ప్రకాశావరణం=అజ్ఞానము
ఈ ప్రాణాయామ
అనుష్ఠానము వలన అజ్ఞానము
2.53.ధారణాసుచ యోగ్యతా మనసః
ధారణాసుచ = ఏకాగ్రతతో, యోగ్యతా మనసః = మనస్సుకి సామర్థ్యము
పెరుగును.
ఏకాగ్రతతో మనస్సుకి
సామర్థ్యము పెరుగును.
2.54.స్వవిషయా సంప్రయోగే
చిత్తస్య స్వరూపానుకార ఇవెంద్రియాణాం ప్రత్యాహారః
స్వవిషయా సంప్రయోగే
చిత్తస్య స్వరూపానుకార ఇవెంద్రియాణాం ప్రత్యాహారః
ఇంద్రియాణాం= ఇంద్రియములకు,
స్వవిషయా= తమ తమ విషయములలో అసంప్రయోగే=ఉపయోగము
లేకపోవుటచే, చిత్తస్య= మనస్సుయొక్క, స్వరూపానుకార ఇవ= స్వరూపము వలె, ప్రత్యాహారః= ప్రత్యాహారము
అంటారు.
ఇంద్రియములకు, తమ తమ
విషయములలో ఉపయోగము లేకపోవుటచే మనస్సు
యొక్క స్వరూపము గలవి వలెనుండుటను, ప్రత్యాహారము అంటారు.
2.55.తతః పరమా వశ్య
తేన్ద్రియాణాః
తతః=ఆ
ప్రత్యాహారమువలన, పరమా వశ్య తేన్ద్రియాణాః= ఇంద్రియములు వశమగును.
ఆ ప్రత్యాహారమువలన,
పనిలేని ఇంద్రియములు సాధకుని వశమగును.
Comments
Post a Comment