Srisooktam श्रीसूक्तं శ్రీసూక్తం https://youtu.be/tx4xaA1I6Kc
Srisooktam श्रीसूक्तं శ్రీసూక్తం https://youtu.be/tx4xaA1I6Kc
శ్రీ సూక్తము
ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్య యీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
తాం మ ఆవ హ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యశ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీం
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీమీం శరణమహం
ప్రపద్యేஉ లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి
స్తవ వృక్షోஉథ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు
మాయాంతరాయాశ్చ బాహ్యా అ లక్ష్మీః
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతోஉస్మి రాష్ట్రేஉ స్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే
క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామ లక్ష్మీం నాశయామ్యహం
ఆభూతిమసమృద్ధించ
సర్వాంనిర్ణుదమే గృహాత్
గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి
పశూనాగం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం
ఆపః శ్రుజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం హేమమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
తాం మ ఆవ హ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో
దాస్యోஉశ్వాన్ విందేయం పురుషానహం
యఃశుచిః ప్రయతో భూత్వా జుహు యాదాజ్య మన్వహం
శ్రియః పఞ్చ దశర్చంచ శ్రీకామః సతతం జపేత్
***********************
శ్రీ సూక్తము
శ్రీ సూక్తము ఋగ్వేదంలోనిది
ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్య యీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
తాం మ ఆవ హ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యశ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం
ఓ వేదములకు అధికారీ, నన్ను అనుగ్రహించు, నాకు బంగారు రంగులోనున్న, బంగారు వెండి రంగులోనున్న, చంద్రుని వెలుగులాగా అందముగానున్న, ఆ చైతన్యమును అనుగ్రహించు. ఆ చైతన్యము నన్ను వీడకుండా అనుగ్రహించు. ఆ చైతన్యము అధీనములోనున్న ఇంద్రియములను నా అధీనములో నుండునట్లు అనుగ్రహించు. అనగా కూటస్థములోని శ్రీ కృష్ణ చైతన్యము నన్ను వీడకుండా అనుగ్రహించు.
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీం
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం
ఇంద్రియములు అనే ఈ శరీర రథములోనున్న ఏనుగు ఘీంకారములలాంటి ఓంకారము అనే నాదబ్రహ్మను ఆ తత్ అనగా ఆ మాయను నా అధీనములో నుండునట్లు అనుగ్రహించు. ఆవిడే అనగా ఆ శక్తే లక్ష్మీ దేవి.
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
ఓ పరమాత్మా, సుందరమయిన వికసితమయిన సువర్ణ రంగు వలయముతో కూడిన, ఏదీ తనకు అంటకుండా నీటిలోని పద్మము మాదిరి, ఆ పద్మము రంగు కుళ్ళిపోకుండా ఉన్న ఆ లక్ష్మీ శక్తిని నాకు అనుగ్రహించు. పద్మము నీటి లో నున్నను కుల్లిపోదు, దాని వన్నె తగ్గదు.. అదేవిధముగా సంసారము అనే నీటిలోనున్న మనిషి ఆ సంసారము తో తగులము లేకుండా ఉండాలి.
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీమీం శరణమహం
ప్రపద్యేஉ లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఓ పరమాత్మా, వేదాధికారీ, చంద్రుడి వెలుగులాగా ప్రకాశామానమగు ఆ శ్రీ లక్ష్మిని అనగా మాయకు నమస్కారము. అది మా వ్యర్థమయిన మానసిక ఆలోచనలను నాశనము చేసి మమ్ములను అనుగ్రహించనీ.
6.ఆదిత్యవర్ణే తపసోధిజాతో
వనస్పతిస్తవ వృక్షోஉథ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు
మాయాంతరాయాశ్చ బాహ్యా అ లక్ష్మీః
ఓ పరమాత్మ, మాకు మా తపస్సుకు ప్రతిగా సూర్యుని రంగులో ఆ శ్రీ లక్ష్మిని ప్రసాదించు. మాకు బిళ్వము వంటి ఆయుర్వేద వనమూలికలతో గూడిన వృక్షములను ప్రసాదించు. అవి మమ్ములను రోగములనుండి అడ్డుతగలకుండ కాపాడి సాధనకు సహకరించుగాక.
7.ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతోஉస్మి రాష్ట్రేஉ స్మిన్
కీర్తిమృద్ధిం దదాతుమే
ఓ పరమాత్మ, ఆ శ్రీలక్ష్మిని మాకు అనుగ్రహించు. ఆ శ్రీ, మరియు దేవతలు మాకు సహాయకులుగా ఉండి మా అంతః సౌందర్యం మరియు బాహ్య సౌందర్యం ఇనుమడింపచేయుగాక.
8.క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామ లక్ష్మీం నాశయామ్యహం
అభూతిమసమృద్ధించ
సర్వాంనిర్ణుదమే గృహాత్
ఓ పరమాత్మ, ఆ శ్రీలక్ష్మిని మాకు అనుగ్రహించు. ఆ శ్రీ మా క్షుద్బాధను అనగా ఆకలిని నాశనము చేయుగాక. అంతేగాక అలక్ష్మి అనగా ఆ ఆకలితోటి వచ్చే సహోదరివంటి దప్పిక, మరియు అపవిత్రతలను పోగొట్టుగాక.
9.గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
ఓ పరమాత్మ, ఆ శ్రీలక్ష్మిని మాకు అనుగ్రహించు. ఆ శ్రీ, క్రియాయోగ సాధనాపరులను సుగంధపూరితులను, మరియు పుష్టివంతులను చేయుగాక. సాధనలో సుగంధము రావటం మరియు ఆకలి దప్పికలను తీసివేసిపుష్టివంతులను చేయుత అనేది సహజమే. అది నా అనుభవము. సాధకులందరికీ ఆ శ్రీ అనుగ్రహము లభ్యనగుగాక.
10. మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి
పశూనాగం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః
ఓ పరమాత్మ, ఆ శ్రీలక్ష్మిని మాకు అనుగ్రహించు. నా మనస్సు ఆవిడ అనుగ్రహం పొందుటకు ఎంతో ఆత్రుత చెందుచున్నది. ఆవిడ అనుగ్రహముతో ఈ సాధనాపరుడికి సాధనా పుష్టి ప్రసన్నత ఏర్పడి దేనికీ లోటులేనితనము వస్తుంది.
11. కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం
కర్దము అనగా బురద. ఓ భూదేవీ, నీ ఉపరితలమట్టి మానవనివాసమునకు అనుకూలముగా నుండుగాక. ఓ శ్రీలక్ష్మినా హృదయములో నివసించు. నీటిలోని పద్మము మాదిరి, నీరు లాంటి ఈ సంసార తగులము లేకుండాచేయి.
12. ఆపః శ్రుజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే
ఓ భూదేవీ, నీ నీరు మానవనివాసమునకు అనుకూలముగా నుండుగాక. ఓ శ్రీలక్ష్మినా హృదయములో నివసించు. నీటిలోని పద్మము మాదిరి, నీరు లాంటి ఈ సంసార తగులము లేకుండాచేయి.
13.ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం హేమమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
సువర్ణ పద్మములతో చుట్టబడియున్న కాంతులతో పుష్టిగానున్న సరస్సు మాదిరి, ఓ సువర్ణ కాంతులతో ప్రకాశితమయిన శ్రీ లక్ష్మి, నన్ను అనుగ్రహించు. అనగా నన్ను శక్తివంతుణ్ణి చెయ్యి.
14. ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవ హ
సువర్ణ పద్మములతో చుట్టబడియున్న కాంతులతో నన్ను శక్తివంతుణ్ణి చెయ్యి. ఓ సువర్ణ కాంతులతో ప్రకాశితమయిన శ్రీ లక్ష్మి, నన్ను అనుగ్రహించు.
15. తాం మ ఆవ హ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో
దాస్యోஉశ్వాన్ విందేయం పురుషానహం
ఓ సువర్ణ కాంతులతో ప్రకాశితమయిన శ్రీ లక్ష్మి, నన్ను అనుగ్రహించు. నన్ను ఇంద్రియములవశమునుండి తప్పించు. .
యఃశుచిః ప్రయతో భూత్వా జుహు యాదాజ్య మన్వహం
శ్రియః పంచ దశర్చంచ శ్రీకామః సతతం జపేత్
ఏ సాధకుడయితే మనస్సుద్ధితో పట్టువిడవకుండా సాధనా పరుడయిఉంటాడో , వాడికి తప్పక ఆ శ్రీలక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
Comments
Post a Comment