దేవీ నవరాత్రులు దసరా
ఈ తొమ్మిది దినములు ఈ విధముగా బీజాక్షర ధ్యానము చేయండి.
తూర్పు లేదా ఉత్తర
దిక్కుకు ఎదురుగా కూర్చోండి. పద్మాసనము, వజ్రాసనము, లేదా సుఖాసనములో
కూర్చోండి. కూటస్థములో మనస్సు దృష్టి పెట్టండి. ఉచ్ఛారణ చేస్తున్న
చక్రమును tense చేయండి. మనస్సు దృష్టి ఆ చక్రములో పెట్టండి. ఈ క్రింద విధముగా చేయండి. మంచిది.
ఆదివారం--- సహస్రారచక్రములో ‘రామ్’ అక్షరము 108 పర్యాములు ఉదయము సాయంత్రం
ఉచ్ఛారణ చేయండి.
సోమవారం—అనాహత
చక్రములో ‘యమ్’ అక్షరము 108 పర్యాములు
ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి. అటుపిమ్మట
‘క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ’ అనే 12 అక్షరములు 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ
చేయండి.
మంగళవారం—మణిపుర చక్రములో ‘రమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ
చేయండి. అటుపిమ్మట ‘డ ఢ ణ త థ ద ధ న ప ఫ ’
అనే 10 అక్షరములు 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి.
బుధవారము—ఆజ్ఞా నెగటివ్ చక్రములో
‘ఓమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి. అటుపిమ్మట ‘హ క్ష’ అనే రెండు అక్షరములు 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ
చేయండి.
ఆజ్ఞా పాజిటివ్ చక్రములో
‘ఓమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి. అటుపిమ్మట ‘హ క్ష’ అనే రెండు అక్షరములు 108 పర్యాములు ఉదయము సాయంత్రం
ఉచ్ఛారణ చేయండి.
గురువారము—స్వాధిష్ఠానచక్రములో ‘వమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ
చేయండి. అటుపిమ్మట ‘బ భ మ య ర ల ’ అనే
ఆరు అక్షరములు 108 పర్యాములు ఉదయము సాయంత్రం
ఉచ్ఛారణ చేయండి.
శుక్రవారము—విశుద్ధచక్రములో ‘హమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ
చేయండి. అటుపిమ్మట ‘అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ బుా అలు ఆలూ ఏ ఐ ఓ ఔ అం అః ’ అనే 16 అక్షరములు 108
పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి.
శనివారము—మూలాధారచక్రములో ‘లమ్’ 108 పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి. అటుపిమ్మట ‘వ శ ష స ’ అనే నాలుగుఅక్షరములు 108
పర్యాములు ఉదయము సాయంత్రం ఉచ్ఛారణ చేయండి.
చాముండీమూలమంత్రం
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం హ్రైం హ్రీం క్రీం
చాముండాయైనమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
హ్రైం(స్వాధిష్ఠాన)- (వరుణ)
హ్రీం(మణిపుర)- (అగ్ని)
క్రీం(అనాహత) – (వాయు)
చాముండాయై(విశుద్ధ)-(శూన్య)
నమః(కూటస్థము)- (జ్ఞాన)
ఈ
మంత్రము ఆయాచక్రములను tense
చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు
దృష్టి పెట్టి 108 సారులు పఠించుట వలన ధైర్యం మరియు
స్థైర్యము లభించును. కార్యసిద్ధి
లభించును. అథవా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు
దృష్టి పెట్టి 108 సారులు చేయవచ్చు.
Comments
Post a Comment