యోగాయనమ్

యోగాయనమ్

శ్రీరాముడు (పరమాత్మ చైతన్యం) దూరంగా ఉన్నప్పుడు, చివరకు ఆదిశెషు (మూలాధారశక్తి) లక్ష్మణుడు కూడా దూరమై, పెద్దనోట్లు ఖర్చు అయిన తరువాత చిల్లర డబ్బులమీద ఆధారపడే వ్యక్తి లాగా, కుండలినీశక్తిని (సీతాదేవి) జటాయువు (జటలు శిరస్సులో ఉంటాయి అనగా శిరస్సులోఉండే ఓజఃశక్తి) రక్షింపజూస్తుంది.  ఆ ఓజఃశక్తి కూడా ఖర్చు అయి నిస్సహాయంగా అనగా రెక్కలు విరిగిన పక్షిలాగా కూలిపోతుంది. అనగా ఆ ఓజఃశక్తి కూడా క్షీణిస్తుంది.  అప్పుడు కుండలినీశక్తి (సీతాదేవి) అహంకారానికి ప్రతీక అయిన రావణుని అధీనంలో ఉండి పరమాత్మకై (శ్రీరామునికై) నిరీక్షించటం సీతాపహరణం కథ.
మంథర (మన్ ధర) అనగా అనిశ్చయాత్మకమైన మనస్సుని ధరించిన కైకేయి (కోరికలు, సు(మంచి) మిత్ర (స్నేహితుడు) మరియు కౌశల్య (మంచి సలహాలు ఇచ్చే)ల సాహచర్యము వలన (కోరికలు అదుపులో ఉంటూ వచ్చాయి.  కాని అనిశ్చయాత్మకమైన మనస్సు (మంథర) వలన నిశ్చయాత్మకమైన బుద్ధి (దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాట వినక పరిపూర్ణ పక్వతచెందని సాధకునికి (భరతునికి) పట్టం అనగా అధికారము ఇవ్వమంటుంది. పరమాత్మ శ్రీరాముడు త్రేతాయుగ ధర్మాన్ని అనుసరించి 14 సంవత్సరముల యోగాభ్యాసధ్యానము తరువాత (భరతునికి) దర్శనము ఇస్తానంటాడు. అదే శ్రీరామ అరణ్యవాసము.  బుద్ధి (దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాట వినకపోవటమే దశరథ (బుద్ధి) నిర్యాణము.
మాయ (ప్రకృతి/సీతాదేవి) సాధారణ మానవునికి చావదు. ఇది చూపటమే సీతాదేవి (మాయ/ప్రకృతి) అగ్నిప్రవెశ ఘట్టం.  అగ్ని యథాతథంగా  అయోనిజని (సీతాదేవి/మాయ/ప్రకృతి) అగ్నినుండి బయటికి తీసుకురావటము. ఏ యోనినుండి పుట్టినది కానిది అయోనిజ. అయోనిజ కేవలము పరమాత్మ అధీనము.  పరమాత్మ అధీనములో మాత్రమే మాయ పనిజేస్తుంది.

హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్ష వధలలో ఉద్దేశ్యం    అహంకారంతో మ్రగ్గుతున్న సాధకునికి నీవు నరుడివికావు, సింహానివి అని తెలియజెప్పటం. నరుడు సింహావతారమెత్తి అనగా నరసింహావతారం ఎత్తి, సింహ (గట్టి) ప్రయత్నం చేస్తే అహంకారంనుండి బయటికి రాగలవు అని ఉద్భోధించటము హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్షవధలలో (స్థూలశరీర  నిర్మూలనము/బ్రహ్మగ్రంథి ఛేదన) ఉద్దేశ్యం. సంసారంలో (నీటిలో) మునిగిపోయి ధ్యానసాధనలో సాధకుని పృథ్వీతత్వాన్ని (మూలాధారం) అనగా ప్రారంభప్రయత్నాన్ని జ్ఞానదంతములతో సంసారం (నీరు) లో నుండి పైకి తీసుకువచ్చి వ(వరిష్ఠమైన) రాహ (రాస్తా లేదా త్రోవ) లోకి తీసుకు వెళ్ళటమే వరాహ అవతార ఉద్దేశ్యం మరియు హిరణ్యాక్ష (సంసారకన్ను) వధ.  
అహంకార కామ మత్తులో ఉన్నరావణుని, కుంభం లాగించి నిద్రమత్తుతో ఉన్న కుంభకర్ణుల (సూక్ష్మశరీర నిర్మూలన/రుద్రగ్రంథి ఛేదన) వధ గావించి ధ్యానసాధనలో ముందుకి పంపించుటయే శ్రీరామావతార ఉద్దేశ్యం. 
మిగిలిన శిశువు లాంటి అమాయకత్వం) ఉన్న శిశుపాలుడు (శిశు అనగా చిన్నపిల్లవాడు), మరియు దంతావక్తృడు (దంతా అనగా దంతాలువచ్చే శిశు అనగా చిన్నపిల్లవాడు) యొక్క వధ (కారణశరీర నిర్మూలన/విష్ణుగ్రంథిఛేదన) లలో శ్రీకృష్ణావతారం ఉద్దేశ్యం.  

ఆఖరి మాట

మానవజన్మ, ముముక్షత్వం, మహాపురుష దర్శనం దుర్లభమైనవి. ఈరోజు కాకపోయినా రేపైనా మనం ఎంత తిరిగినా స్వంత ఇంటికి చేరితేనే హాయి. మన స్వంత ఇల్లు పరమాత్మ. ఇంకొక శరీరంలో అనగా పశు, పక్ష్యాదులలో ఇది సాధ్యము కాదు. దేవతలైనా మానవజన్మ ఎత్తవలసినదే ముక్తికొఱకై. కనుక ధ్యానంచెయ్యండి. ధ్యానంచేయండి.



                           హరి ఓం తత్ సత్

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana