శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రము-కాలసర్పదోషముSrikalahastiswara kshetram-KalasarpaDosha श्रीकाळहस्तीश्वर क्षेत्र-- कालसर्पदोष-
శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రము శ్రీ అనగా సాలెపురుగు , కాళము అనగా పాము. హస్తి అనగా ఏనుగు. ఏనుగుదృష్టి నిశిత దృష్టి. చిన్న రేగి పండునుకూడా తన చిన్న చిన్న నేత్రములతో చూడగలదు. తీయగలదు. ఈశ్వర అనగా ఈక్షణములను శ్వరములు అనగా బాణములుగా ఉపయోగించుట. క్షేత్రము అనగా ఈ శరీరము. కన్నడు అనగా కనటము లేక చూడటము. సాలెపురుగు (శ్రీ) తన గూడును తన చొంగతో తనే నిర్మించుకొనును. దానిలోనే నివసిస్తుంది. అలాగే ప్రతిజీవి తన సంసారాన్నితన లింగములోని చొంగతో తనే నిర్మించుకొనును. ఇదేసాలెగూడు. కాళము అనగా పాము ఇంద్రియముల వంటిది. ఇంద్రియములను వశపరచుకోవటము పామును వశములో ఉంచుకోవటమంత కష్టము. హస్తి అనగా ఏనుగు. ఏనుగు దృష్టి నిశిత దృష్టి. శివలింగం సహస్రారచక్రము. కనుక సాధకుడు తన నిశిత దృష్టితో ఈశరీరములోని ఇంద్రియములను వశపరచుకొని క్రియా యోగ ధ్యానముతో ఈ సంసార బంధమునుండి బయటపడి సహస్రారచక్రములో లయమని ఉద్బోధించుటయే శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రము లోని భక్త కన్నప్ప కథ యొక్క సందేశము. రెండుకన్నులను ఒక కన్నుగా మలచుకొనుము. అనగా కూటస్థములో మూడవ కన...