గోమాతకు వందనం

 మీకో విషయం తెలుసా? ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? ..... మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవువుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాలలో చెప్పారు.మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడంతో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతులపై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలికి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడిలు చేసిన జాతి అయిననూ ఆన్ని వాతావరణాలకు తట్టుకోలేకపోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాలు మన గోవును ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.ఇక గోమూత్రంలో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాలలో చెప్పిన పంచాకవ్యం లోని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధనతో గోమూత్రం మరియు గోవుపేడతో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాలు కనుగొన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల ఔషదాలు కూడా కనుగొన్నారు. ఈ ఔషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.అందుకే మాన భారతీయ సంస్కృతిని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాలలో ఎప్పుడో చెప్పారు.అందుకే మన గోవుని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మనసొంతం.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana