యోగా పధ్ధతి--సంక్షిప్త రామాయణం
సంక్షిప్త రామాయణం సాధకుడు అహంకారము వర్జించి , యోగసాధనతో మనస్సును స్థిరము చేసుకొని , మల విక్షేపణ ఆవరణ దోషములను తొలగించుకొని , శుద్ధాత్ముడై , పరమాత్మతో లయమగుటకు ఉన్నదే ఈ మానవజన్మ . ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు , ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు . వీటినే మల , ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు . శారీరక రుగ్మతలనగా జ్వరము , తలకాయనొప్పి , ఒళ్ళు నొప్పులు మొదలగునవి . మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి . అనగా ఆలోచనలు మొదలగునవి . ధ్యానపరమయిన రుగ్మతలనగా నిద్ర , తంద్ర , విసుగు , మరియు బద్ధకము మొదలగునవి . సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును . అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను వైరాగ్యముతో అణగద్రొక్క వలయును . కారణశరీరమునకు తమోగుణ ప్రభావమువలన మల మరియు ఆవరణ దోషములు , రజోగుణమువలన విక్షేపణదోషమ...