Kriyayoga interpretation of Balaji charitra and Mahabharata with Telugu commentary


Kriyayoga interpretation of Balaji charitra and Mahabharata with Telugu commentary




బాలాజీ మందిరము తిరుపతిలో ఉన్నది. నేను ఇక్కడ ఆ మందిరమునకు యోగార్థము చెప్పుచున్నాను. అంతేకాదు మహాభారతమునకు, మరియు సమాధిల గురించి కూడా యోగార్థము చెప్పుచున్నాను.
In Balaji charitra Kundalinee is called Padmavati,   in Mahabharat it is Draupadi, and in Ramayana it is Sita.

 Let us start.   చక్రములలో ధ్యానము.:
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
పృధ్వీముద్ర వేసికోవాలి. మూలాధారచక్రము టెన్స్(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
మూలాధార చక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో  96 నిమిషములలో  600 హంసలు జరుగును.
ఖేచరీ ముద్రలో నాలుగు దీర్ఘహంసలు చేయండి.
సాధకుడు కలియుగములో, ఋగ్వేదకాలములో  ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుని క్షత్రియుడు అంటారు, అనగా నెగటివ్ శక్తుల్ని ఎదుర్కొనేవాడు అని అర్ధము. వాడి హృదయము అప్పుడు స్పందించటము మొదలు అవుతుంది.  దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహము 20% నివృత్తి అవుతుంది. 
మూలాధారము పృధ్వీతత్వమునకు ప్రతీక. గంధ అనగా వాసనకు ప్రతీక. ముక్కువద్దయున్న కర్రెంట్లు ఉపసంహరించబడి సుషుమ్నా ద్వారా సహస్రారమునకు పంపబడుతుంది.
పసుపు రంగు, తియ్యటి ఫలముల రుచి, ఝం అని భ్రమరము శబ్దముల అనుభూతి కలుగును.
ముడ్డిక్రింద మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న కుండలినీశక్తియే ద్రౌపది. కుండలినీశక్తిని సమిష్టిలో మాయ, వ్యష్టిలో కుండలినీ అంటారు.
మూలాధారచక్రమును వ్యష్టిలో పాతాళలోకము, సమిష్టిలో భూలోకము అంటారు.  మేరుదండములో శేషనాగుమాదిరిగానున్న జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో మూలాధారచక్రమును తాకటము వలన ఆచక్రమును శేషాద్రి అంటారు. మూలాధారచక్రము మహాభారతములో సహదేవునికి ప్రతీక. సహదేవుడు అంతః శత్రువులను ప్రతిఘటించుటకు తోడ్పడతాడు.
ఇక్కడి సాధన ఇచ్ఛాశక్తిని బలోపేతము చేస్తుంది. ధ్యానఫలమును ఓం శ్రీ విఘ్నేస్వరార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.
మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర మరియు అనాహత చక్రములలో లభ్యమగు సమాధిలను సంప్రజ్ఞాత సమాధి అంటారు.   
విశుద్ధ, ఆజ్ఞా(కూటస్థ) మరియు సహస్రారచక్రములలో లభ్యమగు సమాధిలను అసంప్రజ్ఞాత సమాధి అంటారు.
సాధనలో కుండలిని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర మరియు అనాహత చక్రములలో జాగృతి కలిగినప్పుడులభ్యమగు సమాధి పరమాత్మ ఉన్నాడా లేదా అనే సందేహమును పూర్తిగా తొలగించదు. అందువలన అటువంటి సందేహాస్పద సమాధిలను సంప్రజ్ఞాత సమాధి అంటారు.  
సాధనలో కుండలిని విశుద్ధ, ఆజ్ఞా(కూటస్థ) మరియు సహస్రారచక్రములలో జాగృతి కలిగినప్పుడులభ్యమగు సమాధి .సందేహమును పూర్తిగా తొలగించును. పరమాత్మ ఉన్నాడు అని ధృవపరచును. అందువలన అటువంటి సందేహరహిత  సమాధిలను అసంప్రజ్ఞాత సమాధి అంటారు.


ఇప్పుడు స్వాధిష్ఠానచక్రము(Tense)చేసి దానిమీద మనస్సు ఉంచాలి. వరుణముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో ఆరు దీర్ఘహంసలు చేయండి.
స్వాధిష్ఠానచక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 144 నిమిషములలో  6000 హంసలు జరుగును.
 స్వాధిష్ఠానము రసతత్వమునకు ప్రతీక. అనగా రుచికి ప్రతీక. నాలుక వద్దయున్న కర్రెంట్లు ఉపసంహరించబడి సుషుమ్నా ద్వారా సహస్రారమునకు పంపబడుతుంది.
స్వాధిష్ఠానచక్రమును వ్యష్టిలో మహాతలలోకము, సమిష్టిలో భువర్ లోకము అంటారు. 
సాధకుడు ద్వాపరయుగములో, యజుర్వేదకాలములో  ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుని వైశ్యుడు అంటారు, ద్విజుడు అనగా ఇంకొక జన్మనెత్తినవాడుగా, వ్యవసాయాత్మిక బుద్ధి కలుగుతుంది  అని అర్ధము. వాడి హృదయము అప్పుడు స్థిరత్వముతో కూడికొని  ఉంటుంది.  దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహము 40% నివృత్తి అవుతుంది. 
తెలుపు రంగు, మాదిరి చేదు రుచి, పిల్లనగ్రోవి శబ్దముల అనుభూతి కలుగును. వేద అనగా వినటము.
జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో స్వాధిష్ఠానచక్రమును తాకటము వలననూ, పవిత్రమయిన పిల్లనగ్రోవి శబ్దము వినిపించుటవలననూ, ఆచక్రమును వేదాద్రి అంటారు. స్వాధిష్ఠానచక్రముమహాభారతములో నకులునికి ప్రతీక. నకులుడు ఆధ్యాత్మికతకు అతుక్కునేటందులకు తోడ్పడతాడు.
ఇక్కడి సాధన క్రియాశక్తిని బలోపేతము చేస్తుంది.  ధ్యానఫలమును ఓం శ్రీబ్రహ్మార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.


ఇప్పుడు మణిపురచక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
మణిపురచక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 240 నిమిషములలో  6000 హంసలు జరుగును.  
అగ్నిముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో పది దీర్ఘహంసలు చేయండి. మణిపురచక్రము అగ్ని తత్వమునకు ప్రతీక. అనగా రూప(చూచుట)కు ప్రతీక. కన్నువద్ద యున్న కర్రెంట్లు ఉపసంహరించబడి సుషుమ్నా ద్వారా సహస్రారమునకు పంపబడుతుంది.
మణిపురచక్రమును వ్యష్టిలో తలాతలలోకము, సమిష్టిలో స్వర్ లోకము అంటారు. 
ఎరుపు రంగు, చేదు రుచి, వీణశబ్దముల అనుభూతి కలుగును.  
జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో మణిపురచక్రమును తాకటము వలననూ,జ్ఞానా(గ) రూఢుడు అగుటవలననూ, ఆచక్రమునుగరుడాద్రి  అంటారు. మణిపురచక్రము మహాభారతము లో అర్జునుడికి  ప్రతీక. అర్జునుడు ఆత్మ నిగ్రహశక్తికి   తోడ్పడతాడు.
సాధకుడు త్రేతాయుగములో, సామవేదకాలములో  ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుని విపృడు అంటారు, భక్తిపూర్వక బుద్ధి కలుగుతుంది  అని అర్ధము. వాడి హృదయము అప్పుడు భక్తితత్వముతో కూడికొని  ఉంటుంది.  దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహము 60% నివృత్తి అవుతుంది. 
ఇక్కడి సాధన జ్ఞానశక్తిని బలోపేతము చేస్తుంది.  ధ్యానఫలమును ఓం శ్రీవిష్ణు దేవార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.


ఇప్పుడు అనాహతచక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
అనాహతచక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 288 నిమిషములలో  6000 హంసలు జరుగును. 
వాయుముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో పన్నెండు దీర్ఘహంసలు చేయండి. అనాహతచక్రము వాయుతత్వమునకు ప్రతీక. అనగా స్పర్శకు ప్రతీక. చర్మముయొక్క కర్రెంట్లు ఉపసంహరించబడి సుషుమ్నా ద్వారా సహస్రారమునకు పంపబడుతుంది.
అనాహతచక్రమును వ్యష్టిలో రసాతలలోకము, సమిష్టిలో మహర్ లోకము అంటారు. 
నీలంరంగు, పులుపు రుచి, గుడిగంటశబ్దముల అనుభూతి కలుగును.  
జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో అనాహతచక్రమును తాకటము వలననూ, శరీరము తేలిక అగుటవలననూ, ఆచక్రమును అంజనాద్రి అంటారు.
సాధకుడు కృతయుగములో, అథర్వణవేదకాలములో  ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుని బ్రాహ్మణుడు అంటారు, దోషరహిత బుద్ధి కలుగుతుంది  అని అర్ధము. వాడి హృదయము అప్పుడు దోషరహితముతో కూడికొని  ఉంటుంది.  దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహము 80% నివృత్తి అవుతుంది. 
అనాహతచక్రము మహాభారతము లో భీమునికి  ప్రతీక. ప్రాణశక్తి నియంత్రణకి   తోడ్పడతాడు.
ఇక్కడి సాధన బీజశక్తిని బలోపేతము చేస్తుంది.  ధ్యానఫలమును ఓం శ్రీరుద్రార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.


ఇప్పుడు విశుద్ధచక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
విశుద్ధచక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 384 నిమిషములలో  1000 హంసలు జరుగును.  ఆకాశ లేక శూన్యముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో పదహారు దీర్ఘహంసలు చేయండి. విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు ప్రతీక. ఆకాశ అనగా శబ్దమునకు ప్రతీక. చెవివద్దయున్న కర్రెంట్లు ఉపసంహరించబడి సుషుమ్నా ద్వారా సహస్రారమునకు పంపబడుతుంది. 
విశుద్ధచక్రమును వ్యష్టిలో సుతలలోకము, సమిష్టిలో జన లోకము అంటారు.  పాలనురుగురంగు, కాలకూట విషములాంటి చేదురుచి, జలపాతము యొక్క ప్రవాహమువంటిశబ్దముల అనుభూతి కలుగును.  
జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో విశుద్ధచక్రమును తాకటము వలననూ, సంసార చక్రములనుండి విముక్తి పొంది బాధ్యతలేని వృషభము మాదిరి పరమాత్మవైపు పరిగెత్తుటవలననూ, ఆచక్రమును వృషభాద్రి అంటారు.
విశుద్ధచక్రము మహాభారతములో ధర్మరాజుకి  ప్రతీక. ధర్మరాజు శాంతి, ప్రశాంతికి   తోడ్పడతాడు.
ఇక్కడి సాధన ఆదిశక్తిని బలోపేతము చేస్తుంది.  ధ్యానఫలమును ఓం శ్రీఆత్మార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.
సాధకుడు యుగములకు అనగా కాలమునకు అతీతముగా, మరియు శబ్దము అనగా వేదమునకు అతీతముగా ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుడు కులములకు అతీతముగా ఉన్నట్లు లెక్క అని అర్ధము. వాడి హృదయ సందేహము 100% నివృత్తి అవుతుంది. 

ద్రౌపది(కుండలినీ శక్తి) ఈ పై అయిదు చక్రములను దాటటమే పంచపాండవులను వివాహమాడుట.


ఇప్పుడు ఆజ్ఞా నెగటివ్ చక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి. జ్ఞానముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో పదునెనిమిది దీర్ఘహంసలు చేయండి.  


ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
ఆజ్ఞా పాజిటివ్ చక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 48 నిమిషములలో  1000 హంసలు జరుగును.   జ్ఞానముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో ఇరువది దీర్ఘహంసలు చేయండి.  
ఆజ్ఞా పాజిటివ్ చక్రమును వ్యష్టిలో వితలలోకము, సమిష్టిలో తపో లోకము అంటారు. 
పాలసముద్రములాంటికాంతి అనుభూతి కలుగును.  
జాగృతిచెందిన కుండలినీ శక్తి  సాధనలో ఆజ్ఞా పాజిటివ్ చక్రమును తాకటము వలననూ,  పరమాత్మకి ఒక్క అడుగు వెనక ఉండుటవలననూ  ఆచక్రమును వెనకటిఅద్రి వెంకటాద్రి అంటారు.
ఆజ్ఞాచక్రము మహాభారతములో శ్రీకృష్ణునికి  ప్రతీక. శ్రీకృష్ణుడు మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషతుల్యమైన అరిషడ్వర్గాలయొక్క విషమును తీయుటకు   తోడ్పడతాడు.
ఇక్కడి సాధన పరాశక్తిని బలోపేతము చేస్తుంది.  ధ్యానఫలమును ఓం శ్రీఈశ్వరార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.


ఇప్పుడు సహస్రారచక్రము(Tense)చేసి దాని మీద మనస్సు ఉంచాలి.
సహస్రారచక్రము లో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 240 నిమిషములలో  1000 హంసలు జరుగును.   
లింగముద్ర వేసికోవాలి. ఖేచరీ ముద్రలో ఇరువదిఒకటి దీర్ఘహంసలు చేయండి.  
సహస్రారచక్రమును వ్యష్టిలో అతలలోకము, సమిష్టిలో సత్య లోకము అంటారు. 
మిక్కిలి పాలసముద్రములాంటికాంతి అనుభూతి కలుగును.  
జాగృతిచెందిన కుండలినీశక్తి  సాధనలో సహస్రారచక్రమును తాకటము వలననూ,  పరమాత్మస్థానమగుటవలననూ  ఆచక్రమును నారాయణాద్రి అంటారు.
సాధకుడు ఇక్కడ కేవలము సాక్షీభూతుడగుతాడు. 
ధ్యానఫలమును ఓం సద్గురు శ్రీయోగానందస్వామిదేవార్పణమస్తు అని ఆ అధిదేవతకు అర్పించాలి.
ఈక్రింద పొందుపరచిన పట్టికని చూడండి.
మహాభారతం
చక్రము
  తిరుపతి
బాలాజీచరిత్ర
    సమాధి
సహదేవ
మూలాధార
శేషాద్రి
సవితర్క సంప్రజ్ఞాత
నకుల
స్వాధిష్ఠాన
వేదాద్రి
సవిచార సంప్రజ్ఞాత
     (సామీప్య)
అర్జున
మణిపుర
గరుడాద్రి
సానంద సంప్రజ్ఞాత
     (సాలోక్య )
భీమ
అనాహత
అంజనాద్రి
సస్మిత  సంప్రజ్ఞాత
     (సాయుజ్య )
యుధిష్ఠిరుడు
విశుద్ధ 
వృషభాద్రి
 అసంప్రజ్ఞాత
  (సారూప్య)
శ్రీకృష్ణ
ఆజ్ఞా (కూటస్థ)
వేంకటాద్రి
       సవికల్ప
       (స్రష్ట)
పరమాత్మ
సహస్రార
నారాయణాద్రి
    నిర్వికల్ప
 ఆ పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి  లింగ ముద్ర లేక జ్ఞానముద్ర వేసికొని     ఖేచరీముద్రలో లేదా నోరు మూసుకొని  ధ్యానం చేయాలి.
అప్పుడు సాధకుడే విమాన వేంకటేశ్వరుడు అవుతాడు.
వి= విశిష్ట లేక అనంతమయిన    మాన= కొలత గలవాడు అయిన పరమాత్మ అవుతాడు.




Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana