ఆత్మ
ఆత్మ:
అహంకారం అనేది కృత్రిమ
ఆత్మ. మనిషి అనేవాడు మార్పురహితమయిన ఎరిక. అనగా మార్పురహితమయిన ఎరిక. ఈ ఆత్మలోనే
అన్ని కార్యక్రమము లు చోటు చేసికుంటాయి. ఈ
ఆత్మయే జీవితానికి ప్రాణప్రదాత. ఆత్మ వేరెచటనో లేదు అది మన హృదయములోనే ఉన్నది. నీ
సత్యాన్వేషణ ఈ నీ ఆత్మ ద్వారానే జరగాలి. నీవు వెతుకుతున్న ఆ ఆత్మ నీవే. ఆ ఆత్మ
సర్వమూ నీవే. నీకు చరిత్ర అంటూ ఏమీ లేదు. ఆ ఆత్మలోనే అనుభవములు, మరియు భావములు
అగుపడతాయి. ఆత్మ స్వయం ప్రకాశము.
నిశ్చలమయిన మనసే శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, మరియు శుద్ధ ఆత్మ
అన్నీ ఒక్కటే. ఒక వ్రేలు కదిలించినా నిశ్చలమయిన మనస్సు చంచల మనస్సు అవుతుంది. స్థిరముగా
ఉండు. మోక్షప్రాప్తి పొందు. సమస్త తగులములను వదిలించుకో. అప్పుడు మనస్సు స్థిరము అగును.
ఆలోచనారహిత స్థితియే మోక్షము. ఆత్మ లేనిదీ
ఏవ్యక్తీకరణయూ ఉండదు.
క్రియాయోగాధ్యానము
ద్వారా ఆశక్తిని లభ్యము చేసికో. నీవు ఇప్పటికే ముక్తుడవు. నేనుముక్తుడను కాననే
అజ్ఞానములో ఆ ముక్తికై ప్రయాణము చేస్తున్నావు. త్రాగిన మత్తులో రాజకుమారుడవని మరచి
దరిద్ర బిచ్చగాడినని వాపోతున్నావు. నీవువేరు నీ ఆత్మవేరు కాదు. మనస్సు మూలమును
శోధిస్తే ఆ మనస్సు మాయమవుతుంది. ఆలోచనారహితస్థితి, మరియు మనోరహిత స్థితియే శుద్ధ
మనస్సు. అదియే చేతన. అదియే ఆత్మ. నీవు ఆత్మస్వరూపము అనిగ్రహించుటకు అడ్డుకట్టయే
ఆలోచనలు. శరీరము మరియు మనస్సు దేశ కాలములకు పరిమితమయి ఉంటాయి. కాని నీ ఎరిక అట్టిదికాదు.
నీ ఎరికకు క్రియాశీలత్వమును ఆపాదించు మనస్సుకు కాదు. నీ ఎరిక దేశ రహితము మరియు కాల రహితము. నీ ఎరికకి భూత వర్తమాన మరియు
భవిష్యత్ కాలములు ఉండవు. అంతా వర్తమానమే. ఎరికయే ఆత్మ.
Comments
Post a Comment