గోమాత
గోమాత:
గోవును గోమాత అని ప్రేమ
గౌరవము మరియు ఆప్యాయతలతో పిలుచు కుంటాము. విష పదార్థములు తినికూడా హరించుకొని మనకు
విషపూరిత మయిన అవశేషముల ఛాయ కూడా కనబడని పాలు పెరుగు పేడ మూత్రములు అందజేస్తుంది.
ప్రాణవాయువును పీల్చుకొని ప్రకృతిలోకి వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమె.
విషమును హరించే గుణము గోవుపాలకు
ఉన్నది. వైద్యశాస్త్రములకు అంతుచిక్కని దీర్ఘకాలిక రోగములను సైతం మాన్పగల శక్తి
కేవలము గోమూత్రములో ఉన్నదన్న అతిశయోక్తి కాదు. అది నా స్వానుభవము కూడా.
గోవునెయ్యి బియ్యము కలిపి
వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్ మరియు ప్రోపలీన్ ఆక్సైడ్ అనే శక్తివంతమయిన వాయువులు విడుదల
అవుతాయి. కృత్రిమ వర్షములు కురిపించడానికి ప్రోపలీన్ ఆక్సైడ్ శ్రేష్ఠ మయినది.
గోమూత్రము సర్వోత్తమమయిన
కీటకనాశిని. గోమూత్రము మరియు పేడలతో ఉదరసంబంధమయిన వ్యాధులకు సంబంధించిన ఔషధములలో
ఉపయోగిస్తారు. ఒక తులము నెయ్యిని అగ్నికి ఆహుతి చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు
ఉత్పత్తి అవుతుంది.
Comments
Post a Comment