వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి
కుంఠ అనగా మనస్సు. వైకుంఠ
అనగా వైవిధ్యమయిన మనస్సు. అనగా స్థిరమయిన మనస్సు. కూటస్థమును ఉత్తర ద్వారము
అంటారు. ఏకము అనగా ఒకటి. దశి అనగా దర్శించుకొనుట.
మాసానాం మార్గశీర్షోహం---గీత
10-35
మార్గశిరమాసములో వచ్చే
శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు.
మార్గశిరమాసములోని చల్లని
శీతలవాతావరణములో శుక్ల పక్షములో పది దినములు ఖేచరీముద్రలో తీవ్రక్రియాయోగ
ధ్యానము చేసిన తదుపరి పదకొండవ దినమున మనస్సు స్థిరమగును. కూటస్థము
అనగా ఉత్తర ద్వారము తెరచు కొనును. అప్పుడు పరమాత్మను అనేకముగా గాక, ఏకముగా అనగా ఒక్కటిగా దర్శించుకొంటాడు సాధకుడు. దీనినే వైకుంఠ
ఏకాదశి అంటారు.
Comments
Post a Comment