చక్రములలో ధ్యానము - రోగ నివారణ



చక్రములలో ధ్యానము - రోగ నివారణ
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము ధనధృవము. మూలాధారచక్రము ఋణ ధృవము.  ఈ ఋణధృవము నుండి ధనధృవము వరకు తిరిగి ధనధృవము నుండి ఋణధృవము వరకు ప్రాణశక్తిని త్రిప్పుటవలన మేరుదండము శక్తివంతమైన ఐస్కాంతమగును.  తద్వారా గుదము వద్దయున్న మూలాధారమునుండి కంఠములోని విశుద్ధచక్ర ము వరకు ఉన్న  విద్యుత్తులన్నీకూడా మేరుదండముద్వారా తలలోని బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రములోనికి చేర్చ బడి సాధకుడు అనంతమైన ఆనందాన్నిపొందుతాడు. దీనికితోడు కొన్నిముద్రలతోబాటుగా క్రియాయోగముచేయుట వలన మేరుదండ ము మరింతశక్తివంతమగును.
శక్తి మరియు జాగృతి రెండూఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక్క శక్తిమాత్రమే ఉన్నది. శుష్కంచిపోయేది శరీరము. దహించిపోయేది దేహము. కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగమువలన శరీరము శుష్కంచదు, దేహము దహించిపోదు, కళేబరము కుళ్ళిపోదు. శరీరము ఆరోగ్యముగా ఉండును.

ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
ఆయా చక్రములో చేయు ధ్యానము వలన కలుగు ఉపయోగములు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడినవి:
చక్రము
రోగ వినాశము
మూలాధారం
సైనసైటిస్, జలుబు, మలబద్దకము, డయోరియా, లిమ్ఫ్ సిస్టంలు, ప్రోస్ట్రేట్ గ్లాన్డ్స్, ఎముకలు, మనస్సు కి సంబంధించిన రోగముల నివారణ. 
స్వాధిష్ఠాన
యూరినో జెనిటల్ సిస్టంలు, వెన్నెముక, అపెండిక్స్,   నాలుకకి సంబంధించిన రోగముల నివారణ, కోప నిర్మూలన
మణిపుర
చక్కెరవ్యాధి, పక్షవాతము, ప్లీహము, కళ్ళు, ముడ్డి, పొట్ట, నెగటివ్ ఆలోచనల నిర్మూలన, శాంతి మరియు సద్భావన. 
అనాహత
ఉబ్బసము, శ్వాస సంబంధిత రుగ్మతలు, పిచ్చి, వ్యాకులత, హృదయమునకు సంబంధించిన రోగముల నివారణ. రోగనివారణశక్తిని పెంచుట, రక్త శుద్ధీకరణ, ద్వేష మరియు నేరపూరిత భావనివారణ, ప్రేమ ఆప్యాతలను పెంచుట 
విశుద్ధ
ఉబ్బసము,శ్వాస సంబంధిత రుగ్మతలు, అల్లెర్జీ, క్షయ, ఆర్థరైటిస్, కి సంబంధించిన రోగముల నివారణ. ఆత్మహత్యచేసికుందామనే భావ నివారణ
ఆజ్ఞానెగటివ్
పీనల్ గ్లాన్డ్స్, కి సంబంధించిన రోగముల నివారణ. మానసిక బలహీనతను తొలగించుట, సప్త ధాతువులను బలోపేతము చేయుట, మంచి సంతాన ప్రాప్తి.
ఆజ్ఞాపాజిటివ్
తలకాయనొప్పులు, టెన్షన్, కాన్సర్, డిప్రెషన్, ద్వేషము, రోగముల నివారణ. జ్ఞాపకశక్తి పెంపొం దించుట, సెంట్రల్ నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, 
సహస్రార
మొత్తం నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, వీర్య వృద్ధి

Comments

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana