ముద్రలు బంధములు part 2


పృథ్వీ ముద్ర.
శరీరంలో స్ఫూర్తి, కాంతి, తేజస్సు, జీవనా వికాసవృద్ధి, శాంతి,  విటమిన్ లోపాలు, దిద్దుతుంది. మొలలకి మంచి ముద్ర.
అనామికల గోరున్న భాగము, గోరున్న అంగుష్ఠముతో కలిపి  నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.


పృష్ఠ ముద్ర.

నడుమునొప్పికి చాలా మంచిముద్ర.
ఎడమ చేయి అంగుష్ఠ మధ్యభాగములోతర్జని  గోరున్న భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి..  కుడిచేయి అంగుష్ఠము, మధ్యమ మరియు కనిష్ఠ  గోరున్న భాగములు భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
జ్ఞాన ముద్ర.
జ్ఞాపకశక్తి పెరుగుదల, బ్రెయిన్ హామెరేజ్, హిస్టీరియా,తలతిరుగుడు, అనిద్ర, క్రోధ నివారణలకు మంచి ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళునిఠారుగా ఉంచాలి.


 

చిన్ముద్ర:
రక్తపోటునివారణ,సకారాత్మక ఆలోచనలు,జ్ఞాపకశక్తి,చూపు పెరుగుదలకు, కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. ఇది ధ్యానముద్ర.
తర్జనిగోరున్నభాగముమరియుఅంగుష్ఠం గోరున్నభాగముకలిపినొక్కిచేతులుత్రిప్పి కాలిముణుకుల పైన ఉంచాలి. మిగిలిన వేళ్ళు  నిఠారుగాఉంచాలి. జ్ఞానముద్రను త్రిప్పిచేస్తే చిన్ముద్ర అవుతుంది.

చిన్మయ ముద్ర.
ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము మరియు అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి చేతులు త్రిప్పి కాలి ముణుకులపైన ఉంచాలి. మిగిలినవేళ్ళు  అరచేతిని నొక్కి మూసి ఉంచాలి.

బ్రహ్మముద్ర.

 ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
అంగుష్ఠం మడిచి దానిని మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పిడికిలిలాగా  మూసి ఉంచాలి. అలా రెండుచేతులు చేసి ఒకదానితో ఇంకొకటి వత్తిపెట్టి వ్రేళ్ళు ఆకాశము వైపు చూసేటట్లుగాఉంచి బొడ్డుక్రింద ఆనించి ఉంచాలి.
భైరవ ముద్ర.
కండరాలకుబలం, నిశ్చలమనస్సు.ఇది ధ్యానముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి.
కుడి అరచేతిపై ఎడమ అరచేతిని ఉంచితే భైరవీ ముద్ర అవుతుంది.

బుద్ధి ముద్ర.
ఇది ధ్యానముద్ర.
తర్జనిని అంగుష్ఠమూలములో ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి..
రెండు చేతులు వెనకనుంచి ఒకదానిని ఒకటి ఒత్తిపెట్టాలి. బొడ్డుక్రింద ఉంచాలి.
ధ్యాన ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి. అంగుష్ఠములు రెండూ కలిపి  ఉంచాలి.

యోని ముద్ర.
ఇది ధ్యానముద్ర.

రెండుచేతుల తర్జని గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. రెండు చేతుల అంగుష్ఠముల గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు ఒకదానితో ఇంకొకటి పెనవేసి ఉంచాలి.. అంగుష్ఠముల గోరున్న భాగములు బొడ్డుకి ఆనించిపెట్టాలి. అంగుష్ఠముల గోరున్న భాగములు దూరంగా ఉంచాలి.
కుండలినీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
రెండుచేతులపిడికళ్లనుగట్టిగామూయాలి. ఒకదానిపైన ఒకటి నాభిక్రింద ఆనించి పెట్టాలి.


గరుడ ముద్ర.

శ్వాసరోగములకు, పక్షవాతమునకు మంచిది.
చేతులు రెండూ తెరిచిఉంచి, అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.
గోముఖ ముద్ర.
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల..ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.

కైలాస ముద్ర.
ఇది ధ్యానముద్ర..నమస్కారస్థితిలోచేతులనుంఛి, పైకిఎత్తి తలని తాకుతూమీదఉంచాలి.
ఖేచరీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.  క్రియాయోగమునకు ఇది చాలా ముఖ్యమైనది. సాధకునికి సాధనలో నిద్ర, ఆకలిదప్పులు బాధించవు.
నాలుక వెనకకి త్రిప్పి అంగుటికి ఆనించిఉంచాలి.
కుంభ
ఇది ధ్యానముద్ర.
రెండు అరచేతులు పెనవేసి అంగుష్ఠములు రెండూపైకి నిఠారుగా నిలబెట్టి ఉంచాలి.
నాగ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతి పైన రెండవ అరచేతి నుంచాలి. ఒక అంగుష్ఠము పైన రెండవ అంగుష్ఠమును కత్తెరలాగా ఉంచాలి. 
ప్రాణ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఇప్పుడు కనిష్ఠ మరియు అనామికల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5నిమిషాలు నొక్కి ఉంచాలి. అనగా ప్రాణ ముద్ర వెయ్యాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
అపాన ముద్ర.
మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది.
అనామిక, మధ్యమల గోరున్న భాగములు  అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.


వాయన/వాతకారక ముద్ర.
విరోచనాలకి, వడదెబ్బలకి మరియు ఊబకాయ నివారణలకి మంచిది.
తర్జని మరియు మధ్యమల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5 నిమిషాలు నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
పూషుని ముద్ర.
ఇది రోగవినాశినీ ముద్ర
అపాన ముద్ర, వాయన  మరియు ప్రాణ ముద్రలు కలిపి  పూషుని ముద్ర అంటారు.. ఈ మూడుముద్రలు కలిపి 10 నిమిషముల చొప్పున మార్చిమార్చివేయాలి.
శాంభవీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
కనుబోమ్మలమధ్యదృష్టి నిలిపి ధ్యానం చేయుట.

జ్ఞాన ముద్ర.
జ్ఞాపకశక్తిపెరుగుదల, బ్రెయిన్హామెరేజ్, హిస్టీరియా, తలతిరుగుడు, అనిద్ర, క్రోధ నివారణలకు మంచి ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళునిఠారుగా ఉంచాలి.
మాండూక ముద్ర..
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల. ఇది ధ్యానముద్ర..
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానిపై ఇంకొకటితాకునట్లుగా  ఉంచాలి.. పద్మాసనంలో ఉన్నప్పుడు, కుడిదికాలుపైన ఉన్నప్పుడు కుడిచెయ్యి పైన ఉండాలి. ఎడమకాలుపైన ఉన్నప్పుడు ఎడమచెయ్యి పైన ఉండాలి.
లింగముద్ర.
శరీరలో ఉష్ణమును పెంచి చలి, దగ్గు, తుమ్ములు, సైనస్, రొంప, పార్శ్వపునొప్పి, పక్షవాతం, దిగువ రక్తపోటు నివారిస్తుంది., కళ్ళెని ఎండగట్టి బ్రోన్కియల్ ఆస్థమా నివారణ. 

భూచరీ ముద్ర.
ఏకాగ్రత వృద్ధి, ఇది ధ్యానముద్ర.
ముక్కు పైన దృష్టి ఉంచాలి.
మూలబంధ.
మలద్వారాన్ని బంధించాలి.
మలబద్ధకం, మూలశంకలబాధితులకు  చాలా మంచిది.. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

అశ్వని ముద్ర.

మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ప్రసవము తేలికగును.
మలద్వారాన్ని బంధించుట, విడుచుట, కనీసం 100 సార్లు చేయాలి.

               



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana