ముద్రలు బంధములు వాటి ఉపయోగములు



     ముద్రలు  బంధములు  వాటి ఉపయోగములు
                    
వేలు
ప్రతీక, తత్వము
రుగ్మతనివారణ
బొటన /అంగుష్ఠం
పరమాత్మ మరియు అగ్ని (చూపు లేక రూపం)
దుర్బల జీర్ణశక్తి, ఊబకాయం 
చూపుడు/తర్జని
ఆత్మ మరియు వాయు (స్పర్శ)
చర్మ, పార్కిన్సన్, వ్యాధులు
మధ్య/ మధ్యమ
ఆకాశ (శబ్దం)
చెవివ్యాధులు
ఉంగరం/అనామిక
పృథ్వీ(గంధ)
వ్యాదినిరోధకశక్తి తగ్గుదల, బలహీనత, ముక్కు వ్యాధులు
చిటికిన/కనిష్ఠ
జల (రస)
రక్తహీనత, అరుచి
ఒక్క అభయ ముద్ర తప్ప మిగిలిన ముద్రలన్నీ 20నిమిషాలకు తక్కువకాకుండా చేయండి. ప్రయోజనం పొందండి. 
ధ్యానముద్రలు మానసికప్రశాంతిని, శాంతిని, ముఖములోవర్ఛస్సు, కుండలినీశక్తిని జాగృతిపరచటము  కలగచేస్తాయి.

ముద్ర
ప్రయోజనము, విధానము
అభయ ముద్ర
ముద్రతో శాంతి సౌఖ్యాలకై పెద్దలు తమ ఆశీస్సులు తెలుపుతారు.
కుడిచెయ్యిఛాతి దగ్గిర పెట్టి తెరిచి ఉంచాలి.
మేరుదండ ముద్ర
వెన్నెముక దృఢంగాఉంచి నడుము నొప్పి తగ్గించును.
ఇది ధ్యానముద్ర.
నాలుగువ్రేళ్ళు మడిచి, అంగుష్ఠం నిఠారుగా ఉంచాలి.
ఆది ముద్ర
ఊపిరితిత్తులలో శ్వాస బాగానింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది.
అంగుష్ఠం మడిచి దానిని మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పిడికిలిలాగా  మూసి ఉంచాలి.

  అంజలి ముద్ర.
గొంతు బాధలు తగ్గిస్తుంది.


చెవులను నొక్కునట్లుగా చేతులు నిఠారుగా పైకెత్తి నమ్మస్కారము చేయాలి.

అంకుశ ముద్ర.
ఏకాగ్రతకు, కంటివ్యాధులకు మంచిది.
చేతి వ్రేళ్ళని మడిచి ఒక్క మధ్యవ్రేలుని మాత్రము నిఠారుగా ఉంచాలి.
అపానవాయు ముద్ర.

హృదయదుర్బలత, పొట్టలోనివాయువు, వాతరోగములు, అధికరక్తపోటు
ఉన్నవారు, అవశ్యం ముద్ర వీలయినన్నిసార్లు, వీలయినంత సమయము
 వేయాలి. మెట్లు ఎక్కునప్పుడు ముద్ర అందరికీ మంచిది. బ్రైన్ హామరేజ్
 నివారిస్తుంది.
తర్జనిని అంగుష్ఠమూలములో  నొక్కి ఉంచాలి. అనామిక, మధ్యమల గోరున్న భాగములు  అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినకనిష్ఠ  నిఠారుగా ఉంచాలి.
జలధారానాశక ముద్ర.
ముక్కు కారుట, డయోరియా, ఊబకాయం నివారణ, నివారిస్తుంది.
కనిష్ఠ అంగుష్ఠమూలముతో నొక్కి పెట్టి ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.
మకర ముద్ర.
మూత్రపిండములు, కాలేయ వ్యాధి పీడితు లకు మంచి ఉపశనము.
ఒక అరచేతి అనామిక మరియు కనిష్ఠల మధ్య రెండవ అరచేతి అంగుష్ఠమునుంచాలి. ఇప్పుడు మొదటి అరచేతి అంగుష్ఠమును రెండవ అరచేతి అనామికను కలిపి నొక్కి ఉంచవలయును.
శక్తి ముద్ర.
పొత్తికడుపు కండరాలను బలోపేతము చేస్తుంది. స్త్రీల ఋతుబాధలను తొలగిస్తుంది.
కనిష్ఠ మరియు అనామికలను వంచి కలపాలి. గోరున్న అంగుష్ఠ, మధ్యమ. మరియు తర్జనిలను నిలువుగాకలపాలి.
శూన్య/ఆకాశ ముద్ర.
అన్నిరకాల చెవ్వు,ముక్కు,గొంతు బాధలు, థైరాయిడ్,మెడనొప్పులు,
తగ్గిస్తుంది. పంటి చిగుళ్ళు బలపరుస్తుంది.
అనామికను అంగుష్ఠ మూలములో నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
అగ్ని ముద్ర.
ఊబకాయం, మధుమేహం,కాలేయం, మేహవాత నొప్పులకు, టెన్షన్ లకు మంచి ముద్ర.
తర్జనిని అంగుష్ఠ మూలములో నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.

వాయు ముద్ర.
పొడిచర్మాన్నిమృదువుగాచేయుట, చర్మవ్యాధులనివారణ,పచ్చకామెర్లు, టైఫాయిడ్, మూత్రపిండాలలో రాళ్ళు, అతి మూత్రం, లాంటి వ్యాధుల,
మొటిమల,ఊబకాయం నివారణ.

వరుణ ముద్ర.
కనిష్ఠ గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళు నిఠారుగా ఉంచాలి.
కనిష్ఠ గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళు నిఠారుగా ఉంచాలి.
pruthvi
పృథ్వీ ముద్ర.
శరీరంలో స్ఫూర్తి, కాంతి, తేజస్సు, జీవనా వికాసవృద్ధి, శాంతి,  విటమిన్ లోపాలు, దిద్దుతుంది. మొలలకి మంచి ముద్ర.
అనామికల గోరున్న భాగము, గోరున్న అంగుష్ఠముతో కలిపి  నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.

veepu

పృష్ఠ ముద్ర.

నడుమునొప్పికి చాలా మంచిముద్ర.
ఎడమ చేయి అంగుష్ఠ మధ్యభాగములోతర్జని  గోరున్న భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి..  కుడిచేయి అంగుష్ఠము, మధ్యమ మరియు కనిష్ఠ  గోరున్న భాగములు భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
gnana
జ్ఞాన ముద్ర.
జ్ఞాపకశక్తి పెరుగుదల, బ్రెయిన్ హామెరేజ్, హిస్టీరియా,తలతిరుగుడు, అనిద్ర, క్రోధ నివారణలకు మంచి ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళునిఠారుగా ఉంచాలి.

chin


చిన్ముద్ర:
రక్తపోటునివారణ,సకారాత్మక ఆలోచనలు,జ్ఞాపకశక్తి,చూపు పెరుగుదలకు, కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. ఇది ధ్యానముద్ర.
తర్జనిగోరున్నభాగముమరియుఅంగుష్ఠం గోరున్నభాగముకలిపినొక్కిచేతులుత్రిప్పి కాలిముణుకుల పైన ఉంచాలి. మిగిలిన వేళ్ళు  నిఠారుగాఉంచాలి. జ్ఞానముద్రను త్రిప్పిచేస్తే చిన్ముద్ర అవుతుంది.
chinmaya

చిన్మయ ముద్ర.
ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము మరియు అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి చేతులు త్రిప్పి కాలి ముణుకులపైన ఉంచాలి. మిగిలినవేళ్ళు  అరచేతిని నొక్కి మూసి ఉంచాలి.
brahma
బ్రహ్మ ముద్ర.

 ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
అంగుష్ఠం మడిచి దానిని మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పిడికిలిలాగా  మూసి ఉంచాలి. అలా రెండుచేతులు చేసి ఒకదానితో ఇంకొకటి వత్తిపెట్టి వ్రేళ్ళు ఆకాశము వైపు చూసేటట్లుగాఉంచి బొడ్డుక్రింద ఆనించి ఉంచాలి.
bhairava
భైరవ ముద్ర.
కండరాలకుబలం, నిశ్చలమనస్సు.ఇది ధ్యానముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి.
కుడి అరచేతిపై ఎడమ అరచేతిని ఉంచితే భైరవీ ముద్ర అవుతుంది.

buddhi
బుద్ధి ముద్ర.
ఇది ధ్యానముద్ర.
తర్జనిని అంగుష్ఠమూలములో ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి..
రెండు చేతులు వెనకనుంచి ఒకదానిని ఒకటి ఒత్తిపెట్టాలి. బొడ్డుక్రింద ఉంచాలి.
dhyana
ధ్యాన ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి. అంగుష్ఠములు రెండూ కలిపి  ఉంచాలి.

yoni
యోని ముద్ర.
ఇది ధ్యానముద్ర.

రెండుచేతుల తర్జని గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. రెండు చేతుల అంగుష్ఠముల గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు ఒకదానితో ఇంకొకటి పెనవేసి ఉంచాలి.. అంగుష్ఠముల గోరున్న భాగములు బొడ్డుకి ఆనించిపెట్టాలి. అంగుష్ఠముల గోరున్న భాగములు దూరంగా ఉంచాలి.

kundalini
కుండలినీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
రెండుచేతులపిడికళ్లనుగట్టిగామూయాలి. ఒకదానిపైన ఒకటి నాభిక్రింద ఆనించి పెట్టాలి.

garuda

గరుడ ముద్ర.

శ్వాసరోగములకు, పక్షవాతమునకు మంచిది.
చేతులు రెండూ తెరిచిఉంచి, అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.
gomukha
గోముఖ ముద్ర.
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల..ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.
kailasa

కైలాస ముద్ర.
ఇది ధ్యానముద్ర..
నమస్కారస్థితిలోచేతులనుంఛి,  పైకిఎత్తి తలని తాకుతూమీదఉంచాలి.
khechari
ఖేచరీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.  క్రియాయోగమునకు ఇది చాలా ముఖ్యమైనది. సాధకునికి సాధనలో నిద్ర, ఆకలిదప్పులు బాధించవు.
నాలుక వెనకకి త్రిప్పి అంగుటికి ఆనించిఉంచాలి.

kumbha
కుంభ
ఇది ధ్యానముద్ర.
రెండు అరచేతులు పెనవేసి అంగుష్ఠములు రెండూపైకి నిఠారుగా నిలబెట్టి ఉంచాలి.

naga
నాగ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతి పైన రెండవ అరచేతి నుంచాలి. ఒక అంగుష్ఠము పైన రెండవ అంగుష్ఠమును కత్తెరలాగా ఉంచాలి. 
prana
ప్రాణ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఇప్పుడు కనిష్ఠ మరియు అనామికల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5నిమిషాలు నొక్కి ఉంచాలి. అనగా ప్రాణ ముద్ర వెయ్యాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
apaana
అపాన ముద్ర.
మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది.
అనామిక, మధ్యమల గోరున్న భాగములు  అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.


pooshuni
వాయన/వాతకారక ముద్ర.
విరోచనాలకి, వడదెబ్బలకి మరియు ఊబకాయ నివారణలకి మంచిది.
తర్జని మరియు మధ్యమల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5 నిమిషాలు నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.

పూషుని ముద్ర.
ఇది సర్వరోగవినాశినీ ముద్ర

అపాన ముద్ర, వాయన  మరియు ప్రాణ ముద్రలు కలిపి  పూషుని ముద్ర అంటారు.. మూడుముద్రలు కలిపి 10 నిమిషముల చొప్పున మార్చిమార్చివేయాలి.
shambhavi
శాంభవీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
కనుబోమ్మలమధ్యదృష్టి నిలిపి ధ్యానం చేయుట.

gnana
జ్ఞాన ముద్ర.
జ్ఞాపకశక్తిపెరుగుదల, బ్రెయిన్హామెరేజ్, హిస్టీరియా, తలతిరుగుడు, అనిద్ర, క్రోధ
 నివారణలకు మంచి ధ్యానముద్ర.
తర్జని గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళునిఠారుగా ఉంచాలి.

kappa
మాండూక ముద్ర..
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల. ఇది ధ్యానముద్ర..
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానిపై ఇంకొకటితాకునట్లుగా  ఉంచాలి.. పద్మాసనంలో ఉన్నప్పుడు, కుడిదికాలుపైన ఉన్నప్పుడు కుడిచెయ్యి పైన ఉండాలి. ఎడమకాలుపైన ఉన్నప్పుడు ఎడమచెయ్యి పైన ఉండాలి.
linga
లింగముద్ర.
శరీరలో ఉష్ణమును పెంచి చలి, దగ్గు, తుమ్ములు, సైనస్, రొంప, పార్శ్వపునొప్పి, పక్షవాతం, దిగువ రక్తపోటు నివారిస్తుంది., కళ్ళెని ఎండగట్టి బ్రోన్కియల్ ఆస్థమా నివారణ. 

భూచరీ ముద్ర.
ఏకాగ్రత వృద్ధి, ఇది ధ్యానముద్ర.
ముక్కు పైన దృష్టి ఉంచాలి.
మూలబంధ.
మలద్వారాన్ని బంధించాలి.

మలబద్ధకం, మూలశంకలబాధితులకు  చాలా మంచిది.. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

అశ్వని ముద్ర.

మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ప్రసవము తేలికగును.
మలద్వారాన్ని బంధించుట, విడుచుట, కనీసం 100 సార్లు చేయాలి.
                  




Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana