దేవాలయము
దేవాలయము
మనుధర్మములో దేవాలయము అనేది ఒక బృహ దేవస్థానము. ఇక్కడ విశ్వాసము వలన ఏది జరగదు. ముఖద్వారంనుండి గర్భగుడివరకు పరివారదేవతలనుండి మూలవిరాట్ వరకు అడుగడుగునా నియమాలు శాస్త్రాంశాలు ఉన్నాయి. దైవశక్తి కేంద్రీకృతమవాలంటే కేవలము నమ్మకము భావుకత ఉంటె సరిపోదు. వాటన్నిటికి ఋషులు ప్రసాదించిన విజ్ఞానము పునాదిగా ఉండాలి. అర్చకుని అనుష్టానము సరిగా ఉందటే ఆలయములోని శిల్పము శివుడవుతాడు. అనుష్టానములో తేడా వస్తే శివుడుకూడా శిల్పము అవుతాడు. లౌకిక ప్రలోభాలకు గురిఅయిన న నీవు వేలాదిసంవత్సరాలు చరిత్రగలిగిన ఈ ఆలయమునకు అర్చక స్థానము ఎలా పొందగలవు?
యశ్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతెకామకారతః
నససిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిం 23
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిబెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్ధసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని, పొందడు.
పతంజలి అష్టాంగయోగము:
1)యమ: అహింస, సత్యం, ఆస్తేయం (దొంగతనముచేయకుండుట), బ్రహ్మచర్యం, అపరిగ్రహం(ఇతరులనుండి ఏమీ ఆశించకుండుట).
2)నియమ: సౌచం(శరీర, మనస్సుల శుభ్రత), సంతోషం(తృప్తి), స్వాధ్యాయము (శాస్త్రపఠనం), ఈశ్వరప్రణిధానము(పరమాత్మకు అంకిత మగుట).
3)ఆసన: స్థిరత్వము
4)ప్రాణాయామ: శ్వాస నియంత్రణ
5)ప్రత్యాహార: ఇంద్రియవిషయములను ఉపసంహరించుకొనుట. 6)ధారణ: వస్తు ఏకాగ్రత.
7)ధ్యాన: కేవలము పరమాత్మపై ఏకాగ్రత.
8)సమాధి: సమ అధి అనగా పరమాత్మతో ఐక్యమగుట.
ధారణ, ధ్యాన మరియు సమాధి, మూడింటినీ కలిపి సమ్యక్ సమాధి అంటారు.
ధ్యానము బీజముతో మొదలయ్యి నిర్బీజం అవ్వాలి.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి 24
కావున నీకు చేయదగినదియు, చేయరానిదియు, నిర్ణయించునపు డు శాస్త్రము ప్రమాణమైయున్నది.
శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దానిననుసరించి నీవీ ప్రపంచమున కర్మముజేయదగును.
క్రియాయోగసాధనతో చక్రములలో ఓంకారోచ్ఛారణ మరియు బీజాక్షర ధ్యానముజేసి చక్రములలోని చీకటిని పోగొట్టటముద్వారా మాత్రమె మనిషిలోని అహంకారమునకు మూలస్తంభాలైన కామ, క్రోధ, లోభములను సమూలముగా నిర్మూలించ వీలగును.
శాస్త్ర నియమములను ఉల్లంఘించకూడదు అనేది దీని సారాంశం.
ఆలయ నిర్మాణానికి కికావలసిన శాస్త్ర ప్రమాణము ఇది: నిగమ—వేదాలు,
ఆగమ – ధర్మశాస్త్రములు,
స్మృతి అంటే మంత్రము, తంత్రము, మరియు విజ్ఞానం ,
ఆలయనిర్మాణము ప్రతిష్టాపన, అర్చన విధి విధానములు. ఆగమ శాస్త్రప్రకారము అనగా ధర్మశాస్త్రప్రకరమే నిర్వర్తించాలి.
నిగమమంత్ర ప్రయోగాలు ఆగమ అనగా ధర్మ శాస్త్రప్రకరమే చేయాలి.
ఏ ఆగమ ధర్మశాస్త్రప్రకారం ఆలయము నిర్మించబడినదో అర్చన ఆ ప్రకారమే అంటే ఆ విధానముగానే చేయాలి.
మన ఆలయము శైవాగమనాలయములో నిర్మించబడినది.
శైవాగమనాలయములో ముఖ్యముగా 28 ప్రాకారాలు ఉన్నవి.
కారణకామిక, యోగంచింత్య, దీప్త, సూక్ష్మ, సహస్ర మొదలగునవి.
మన మందిరం కారణగమ పద్ధతిలో ఉన్నది. అందుకే మన అమ్మ వారి ఆరాధన అలాగే శ్రీచక్రార్చన ఇవన్నీ శ్రీవిద్యా ఉపాసనా సాంప్రదాయ పధ్ధతిలో నేరవేరాలి.
దైవత్వం ప్రకారం శివుడి అయిదు ముఖాలే పంచ బ్రహ్మలు. సత్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశాన.
ఈ అయిదు ముఖాలనుండే న మః శి వా య అనే పంచాక్షరీ మంత్రము ఉద్భవించింది.
ఈ అయిదు ముఖాలకు చైతన్యమిచ్చే ఆ శివుడే పంచముఖ పరమేశ్వరుడు ప్రపంచ నాయకుడు.
అగ్నిమితి భస్మం జలమితి భస్మం స్ధలమితి భస్మం భస్మం వ్వోమేతి భస్మం అనేది వేదమంత్రం యొక్క విభూతి ప్రస్థావన.
అగ్నిసార భస్మం వర్ఛస్సుని, తేజస్సును, ఐశ్వర్యాన్ని, రక్షణను, పవిత్రతను, శాంతిని, ఇస్తుంది.
భస్మభాసణ భసితం ప్రోక్తం భక్తి కిల్మిష భక్షణాత్ అనేది స్మ్రుతి వాక్యం.
ప్రకాశస్వరూపం పాపనాశనం
విభూతి మూడు రేఖలు ఓంకారం అకార, ఉకార, మకార ములకు, ఋక్ యజుర్ సామ వేదములకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు. మరియు వ్యాపకత్వమునకు ప్రతీకలు.
ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు
శివో రక్షితో శంభోశంకరా హరహర మహాదేవ.
.
Comments
Post a Comment